గజ్వేల్‌రూరల్: నిర్మాణంలో ఉన్న కోర్టు భవన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా న్యాయమూర్తి జి.సుదర్శన్ పేర్కొన్నారు. శనివారం గజ్వేల్ పట్టణంలో నిర్మాణంలో కోర్టు భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ తో పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా న్యాయమూర్తి సుదర్శన్ మాట్లాడుతూ...కోర్టు భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలని, మార్చిలోగా పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జీ స్వాతి, గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కిరణ్‌సాగర్‌రావు, సీఐ రవికుమార్‌తోపాటు బార్ అసోసియేసన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: ఆరోగ్య మహిళ క్లినిక్ సెంటర్‌లో మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌ఓ ధనరాజ్ ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సూపర్‌వైజర్లతో డీఎంహెచ్‌ఓ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో గర్భిణీలు, చిన్న పిల్లలకు వ్యాధి నిరోధక టీకాల పంపిణీ, అసంక్రమిత వ్యాధులు, కుష్టు, టీబీ వ్యాధుల కార్యక్రమాల అమలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. గర్భిణీలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాల కోసం ప్రోత్సహించాలన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, గజ్వేల్ పాలియేటివ్ కేర్ సెంటర్ల ద్వారా పెషంట్లకు వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలని, సమష్టిగా ప్లాస్టిక్ పదార్థాలను నిర్మూలిద్దామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. చిన్నకోడూరు మండల పరిధిలోని విఠలాపురం గ్రామంలో శనివారం లయన్స్ క్లబ్, సింధు ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ...గ్రామంలో ఇలాంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. రాబోయే కొద్దిరోజుల్లో మండలంలో మిగతా గ్రామాల్లో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలియజేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అందువలన అందరూ ఆరోగ్యంగా ఉండే విధంగా పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగరాణి, ఎల్లయ్య ఉపసర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సర్పంచులు సురేందర్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, లయన్స్ క్లబ్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేటకమాన్: పట్టణంలో నేడు వందవ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ..యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచి, క్రీడలు, వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.


