breaking news
Siddipet District Latest News
-
పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం
గజ్వేల్: పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యమని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. బుధవారం జగదేవ్‌పూర్ మండలం తీగుల్ గ్రామంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాల అమలుపైనే ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. రుణమాఫీ, సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ రాయితీ, 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ తదితర పథకాలతో గ్రామీణ సమాజంలో గొప్ప పరివర్తన వస్తోందని చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్‌లో చేరుతు న్నారని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ జగదేవ్‌పూర్ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ‘ఉపాధి’ని ఎత్తివేసేందుకు కుట్ర: సీఐటీయూగజ్వేల్: పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి మండిపడ్డారు. బుధవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకువస్తున్నారని చెప్పారు. పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. వామపక్షాల పోరాటాల ఫలితంగా 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఈ పథకం వల్ల నిరుపేద కూలీలకు భారీ ప్రయోజనం కలిగిందన్నారు. 2014నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా ఈ పథకాన్ని నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉపాధిహామీ బిల్లును మార్చే నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. సీఎం దృష్టికి బీడీ కార్మికుల సమస్యలు దుబ్బాక: బీడీ కార్మికుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. బుధవారం తెలంగాణ ఆల్ బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు(ఐఎన్టీయూసీ) తుమ్మ శంకర్ ఆధ్వర్యంలో మైనంపల్లిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా బీడీ కార్మికుల సమస్యలను తెలుసుకున్న యన తప్పకుండా న్యాయం చేస్తామని హామీనిచ్చినట్లు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. -
ఫుల్లుగా తాగించారు
● ‘స్థానిక ’ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం ● జిల్లాలో రూ.69.95కోట్ల మద్యం అమ్మకాలు ● గత నెలతో పోలిస్తే ఈ నెలలో భారీగా విక్రయాలు సిద్దిపేటకమాన్: జిల్లాలో మూడు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు మద్యానికే భారీగా డబ్బు వెచ్చించినట్లు సమాచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. కుల, యువజన సంఘాలను ఏకం చేస్తూ వారికి పలు విధాలుగా హామీలు ఇచ్చారు. అభ్యర్థులు, వారి మద్దతుదారులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఓటర్లకు రోజూ బిర్యానీ, మద్యంతో దావత్‌లు ఏర్పాటు చేశారు. కొన్ని గ్రామాల్లో పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేశారు. కొన్నిచోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన, రవాణా చేస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. పెరిగిన అమ్మకాలు జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో 93 వైన్ షాపులు, 16 బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నూతన మద్యం పాలసీ (2025–27) ప్రకారం ఇటీవల మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఈ నెల 1వ తేదీ నుంచి అమ్మకాలు జరుపుతున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైన్ షాపుల నుంచి 15రోజులుగా భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఇటీవల నూతన పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన విజయ్‌కుమార్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ కట్టడి చేసినప్పటికీ రకరకాల పద్ధతుల ద్వారా మద్యం సరఫరా చేశారు. జిల్లాలో గత నెల నవంబర్‌లో రూ.53.44కోట్ల విలువగల 68,682 కేసుల లిక్కర్, 84,037 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.69.95కోట్ల విలువగల 74,678 కేసుల లిక్కర్, 79,828 కేసుల బీర్లను విక్రయించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మద్యంపై భారీగా ఖర్చు చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. భారీగా మద్యం విక్రయాలు మద్యం దుకాణాల ద్వారా ఈ నెలలో భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. నూతన షాప్‌లు కావడంతో ఈ నెలలో ఇప్పటి వరకు 74,678 కేసుల లిక్కర్, 79,828 కేసుల బీర్లు విక్రయించారు. మొత్తం రూ.69.95 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో చివరి వారంలో విక్రయాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. లైసెన్స్‌దారులు నిబంధనలకు అనుగుణంగా విక్రయాలు జరపాలి. – శ్రీనివాసమూర్తి, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
ఓటుకు 74 వేల మంది దూరం
సాక్షి, సిద్దిపేట: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే. ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను శాసిస్తోంది. ఎంతో మంది అభ్యర్థుల తలరాతను మార్చి పదవులు వచ్చేలా చేయడంతో పాటు పరాజితులను సైతం చేసి ఇంటికి పరిమితం చేసేది ఓటే.. అలాంటిది జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో పల్లె ఓటర్లు 74,527 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. ఈ నెల 11, 14, 17వ తేదీలలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 88.30శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని చైతన్య కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ చాలా మందిలో మార్పు రాకపోవడం గమనార్హం. చాలా చోట్ల అభ్యర్థులే నేరుగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. 5,62,518 మంది ఓటేశారు.. జిల్లా వ్యాప్తంగా 508 సర్పంచ్‌లు, 4,508 వార్డు సభ్యులకు ఎన్నికల నామినేషన్లు స్వీకరించగా 39 సర్పంచ్ స్థానాలకు, 729 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 469 సర్పంచ్ స్థానాలకు 1,653 మంది, 3,779 వార్డులకు 9,835 మంది పోటీ చేశారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించిన సర్పంచ్, వార్డు లలో మొత్తం 6,37,045 ఓటర్లు ఉండగా అందులో 5,62,518 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులే అధికం పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో మహిళల కంటే పురుషులే అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులు 3,12,530 మంది ఓటర్లుండగా 2,78,265 (89.03 శాతం), మహిళలు 3,24,509 మంది ఓటర్లుండగా 2,84,250 (87.59 శాతం) మంది ఓటు వేశారు. జిల్లాలో అత్యధికంగా మూడో విడతలో జరిగిన కుకునూరుపల్లి మండలంలో 91.08శాతం మంది, అత్యల్పంగా మొదటి విడతలో జరిగిన జగదేవ్‌పూర్‌లో 84.27శాతం మంది ఓటు వేశారు. విడతల వారీగా ఇలా.. విడత పురుషులు మహిళలు ఇతరులు మొత్తం మొదటి 80,413 81,557 01 1,61,253 రెండో 1,06,360 1,09,934 0 2,16,294 మూడో 91,492 92,759 02 1,84,253ఓటరు జాబితా తప్పుల తడక మృతి చెందిన, డబుల్ ఓటర్ల పేర్లను గ్రామీణ ఓటరు జాబితాలో నుంచి తొలగించలేదు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మృతిచెందిన ఓటర్లను ఓటరు జాబితా సవరణల సమయంలో బీఎల్ఓలు, పంచాయతీ కార్యదర్శులు తొలగించాలి. కానీ చేయలేదు. ఉదాహరణకు కొమురవెల్లి మండలం గౌరాయపల్లిలో 1,325 ఓటర్లు ఉండగా అందులో దాదాపు 110 వరకు ఓటర్లు మృతి చెందినవారి, డబుల్, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారి పేర్లను తొలగించలేదు. దీంతో ఆ గ్రామంలో 74శాతం మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలింది. ఇప్పటికై నా చనిపోయిన ఓటర్లు, డబుల్ ఉన్న వారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయండి
హుస్నాబాద్: నూతనంగా గెలిచిన సర్పంచ్‌లు గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, సైదాపూర్ మండలాల్లో కాంగ్రెస్ మద్దతు దారులు సర్పంచ్‌లుగా గెలిచిన వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై ప్రజలకు అండగా ఉన్న నాయకులకు పట్టం కట్టారన్నారు. -
ఓటర్లను తరలించిన అభ్యర్థులు
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. చలిని సైతం లెక్క చేయకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వలసవెల్లిన పల్లె వాసులు తమ సొంత గ్రామానికి చేరుకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను సర్పంచ్, వార్డు అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించి ఓట్లు వేయించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. ఒంటి గంటకు పోలింగ్ కేంద్రం గేటు తాళం వేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు. -
పోటెత్తి.. ఓటెత్తి
● 150 సర్పంచ్, 1,182 వార్డుల్లో ఎన్నికలు ● భారీగా తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు తుది విడత పోలింగ్ 88.45 శాతం నమోదుసాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రజలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధ వారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరిగింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొండపాక, కుకునూరుపల్లి, జనగామ నియోజకవర్గం పరిధిలోని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మిట్ట, హుస్నాబాద్ పరిధిలో హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవం అయిన సర్పంచ్ స్థానాలు13 మినహాయిస్తే 150 సర్పంచ్ పదవులకు, 574 అలాగే ఏకగ్రీంగా ఎన్నికై న 249 వార్డు సభ్యుల స్థానాలను మినహాయించి 1,182వార్డు స్థానాలకు 3,059 పోటీ చేశారు. తుది విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కుకునూరుపల్లిలో అత్యధికం మూడో(చివరి) విడతలో 88.45శాతం పోలింగ్ నమోదైంది. కుకునూరుపల్లి మండలంలో అత్యధికంగా 91.08 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. అత్యల్పంగా చేర్యాలలో 86.87 శాతం ఓట్లు పోలయ్యాయి. పురుషులే అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడు విడతల్లో ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లు మండలాల వారీగా.. అక్కన్నపేట 29,441(88.06 శాతం) చేర్యాల 28,911(86.87 శాతం) దూల్మిట్ట 11,975(89.70 శాతం) హుస్నాబాద్ 14,976(89.46 శాతం) కోహెడ 33,002(88.38 శాతం) కొమురవెల్లి 13,842(87.49 శాతం) కొండపాక 23,488(89.05 శాతం) కుకునూరుపల్లి 12,976(91.08 శాతం) మద్దూరు 15,642(88.24 శాతం)తొమ్మిది మండలాల్లో.. మొత్తం ఓటర్లు: 2,08,314 పురుషులు: 1,02,716 మహిళలు: 1,05,595 ఇతరులు: 03 ఓటు హక్కు వినియోగించుకున్న వారు పురుషులు 91,492 (89.07%) మహిళలు 92,759 (87.84%) ఇతరులు 02 మొత్తం 1,84,253 (88.45%) ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్లు: 50,727 (24.35%) ఉదయం 11 గంటల వరకు.. : 1,25,311 (60.15%) మధ్యాహ్నం 1 గంట వరకు.. : 1,80,692 (86.74%) పోలింగ్ ముగిసే సమయం వరకు: 1,84,253 (88.45%) -
ఫార్మర్ ఐడీ తప్పనిసరి
● రైతులు నమోదు చేసుకోవాలి ● జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాల ద్వారా లభించే రాయితీలు, సబ్సిడీలు పొందాలంటే ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి మంగళవారం తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారిని, సమీపంలోని మీ సేవ కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు. అగ్రిస్టాక్ తెలంగాణ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ పథకాల లబ్ధిని సులభంగా పొందవచ్చన్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం సహాయం పొందేందుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని తెలిపారు. రైతుల వివరాలు కచ్చితంగా నమోదు కావడం వల్ల పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. బీమా, సబ్సిడీలు, రుణాలు తదితర ప్రభుత్వ పథకాలు త్వరితగతిన అందుతాయని తెలిపారు. ఒకే ఫార్మర్ ఐడి ద్వారా లబ్ధి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుందని, భవిష్యత్తు పథకాల ప్రయోజనాలు సులభంగా పొందే అవకాశం ఉంటుందన్నారు. సరైనా గుర్తింపు ఉండటం వల్ల మోసాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్‌కు ఆధార్ కార్డు నంబర్, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. సమీపంలోని మీ సేవ కేంద్రాలలో కేవలం రూ.15 చెల్లించి నమోదు చేసుకునే అవకాశం కల్పించామని, అలాగే రైతు వేదికలలో వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా ఉచితంగా ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. -
‘గిరి’ ప్రదక్షిణం
● ధనుర్మాసోత్సవ సంరంభం ● వైభవంగా స్వాతి నక్షత్ర మహోత్సవం ● నాచగిరిలో ఆధ్యాత్మిక వైభవం వర్గల్(గజ్వేల్): ‘స్వాతి’ నక్షత్రం.. నృసింహుడి జన్మనక్షత్రం.. ధనుర్మాసోత్సవ ప్రారంభ వేళ.. హరిహరుల నెలవు సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాచగిరి భక్తజన సందోహమైంది. భక్తజన సామూహిక విజయాచల గిరి ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. రంగం పేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి దిశానిర్దేశం చేశారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా పర్యవేక్షణ, ధర్మకర్తలు, అర్చక వేదపండితులు, సిబ్బంది, భక్తజన పరివారం తోడుగా మంగళవారం స్వాతి నక్షత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7.30 గంటలకు పీఠాధిపతి కార్యక్రమం ప్రారంభించగా, భక్తజన హర్షధ్వానాలు, భజనలు, నారసింహ స్మరణల మధ్య గిరి ప్రదక్షిణ సంరంభం ఆద్యంతం నేత్రపర్వం చేసింది. ధనుర్మాసోత్సవంలో గిరి ప్రదక్షిణ అత్యంత శుభకరమని పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి అన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం అనుగ్రహ భాషణం చేశారు. భక్తులు నృసింహుని దర్శించుకుని తరించారు. మహాప్రసాదం స్వీకరించారు. -
అధిక కేసులు రాజీ కుదర్చండి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవిసిద్దిపేటకమాన్: జాతీయ లోక్ అదాలత్ ఈ నెల 21న జరగనున్న దృష్ట్యా అధిక కేసులు రాజీకుదిర్చేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి తెలిపారు. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక కోర్టు న్యాయమూర్తులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో క్రిమినల్, సివిల్, ఎకై ్సజ్, మోటారు వాహనాల కేసులు అధిక మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు రాజీపడేలా చర్యలు చేపట్టాలని న్యాయమూర్తులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, న్యాయమూర్తులు తరణి, రేవతి, ప్రమీద, స్వాతిగౌడ్, జితేందర్, న్యాయసేవ సిబ్బంది పాల్గొన్నారు. -
కావేరి యూనివర్సిటీకి బెస్ట్ అవార్డు
వర్గల్(గజ్వేల్): మండల పరిధి గౌరారం కావేరీ యూనివర్సిటీకి ‘తెలంగాణ బెస్ట్ యూనివర్సిటీ’ అవార్డు లభించినట్లు వర్సిటీ ఛాన్స్లర్ జీవీ భాస్కర్‌రావు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని వెటరన్స్ ఇండియా, ఏఐసీటీఈ, ఎన్బీఏ, ఏఐయూ, ఈపీఎస్ఐ సంయుక్తంగా దేశభక్తి తదితర అంశాలు ప్రాతిపదికన నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డ్స్– 2025లో కావేరీ యూనివర్సిటీ ‘తెలంగాణ బెస్ట్ యూనివర్సిటీ’గా ఎంపికైందన్నారు. విజయ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ ప్రవీణ్‌రావు ఈ అవార్డును అందుకున్నట్లు పేర్కొన్నా రు. అవార్డు రావడంపై రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు, డైరెక్టర్ హర్ష పొలసాని, డీన్లు డాక్టర్ కొండా శ్రీనివాస్, డాక్టర్ ప్రతాప్ కుమార్‌రెడ్డి, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అజ్ఞానం వీడితేనే ప్రశాంతత మిరుదొడ్డి(దుబ్బాక): మన చుట్టూ ఆవరించిన అజ్ఞాన పొరలను తొలగించినప్పుడే మనసుకు ప్రశాంత లభిస్తుందని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి తెలిపారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో నిర్వహిస్తున్న గీతా పారాయణం 16వ అధ్యాయం ముగింపు సందర్భంగా మంగళవారం భక్తులకు ఆయన అనుగ్రహభాషణం చేశారు. పారాయణంలో పాల్గొన్న మహిళా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి భావం కలిగిన పల్లెలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా వర్ధిల్లుతాయన్నారు. దైవ చింతన కలిగి ఉండటంతో పాటు, సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు: సీపీ విజయ్‌కుమార్ సిద్దిపేటకమాన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడం వంటివి చేయకూడదన్నారు. మొదటి దశ ఎన్నికల రోజు ఉల్లంఘన కేసులు 20, రెండో దశలో 13 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో ఎన్నికల నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. వ్యాధిగ్రస్తుల గుర్తింపు పకడ్బందీగా చేపట్టాలి డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జిల్లాలో ఈ నెల 18 నుంచి 31వరకు నిర్వహించనున్న కుష్ఠు వ్యాధిగ్రస్థుల గుర్తింపు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14రోజుల పాటు 273మంది ఆరోగ్య పర్యవేక్షకుల ఆధ్వర్యంలో, 822మంది ఆశా కార్యకర్తలు ఇంటింటి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. శరీరంపై స్పర్శ లేని మచ్చలు, తిమ్మిర్లు, వంటి సమస్యలు గుర్తించి నమోదు చేసుకుంటారని తెలిపారు. వ్యాధి నిర్ధారణ మేరకు మందులు పంపిణీ చేస్తామన్నారు. చికిత్స ద్వారా ఈ వ్యాధి ఆరు నెలల నుంచి 12 నెలల్లో నయమవుతుందన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాస్థాయి అబాకస్ పోటీలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విశ్వం ఎడ్యుకేషనల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలో అబాకస్ వేదిక్ మ్యాథ్స్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లాలోని 30 పాఠశాలలకు చెందిన 650 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 26 మంది విద్యా ర్థులకు బహుమతులు అందించారు. వారంతా జనవరిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీ లలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. -
అధికారుల బృందం సీఓఈ సందర్శన
ములుగు(గజ్వేల్): మండల కేంద్రంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీఓఈ), అచ్చాయిపల్లి ఏటీజీసీని ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి, ఆయా రాష్ట్రాలకు చెందిన ఉద్యాన అధికారుల బృందం మంగళవారం సందర్శించింది. ఈ సందర్భంగా వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతున్న వివిధ రకాల కూరగాయలు, నర్సరీల పెంపకం తీరును పరిశీలించారు. మొక్కల ఉత్పత్తి విధానంలో సాగుచేస్తున్న మామిడి, జామ, సీతాఫలం, నిమ్మలో పాటించాల్సిన మెలకువల గురించి జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి బృందానికి వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. -
గెలుపెవరిదో?
హుస్నాబాద్: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపు ఎవరిని వరిస్తుందోనన్న చర్చ గ్రామాల్లో జోరుగా జరుగుతోంది. మొదటి, రెండో విడత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. దీంతో మూడో విడత ఎన్నికల్లోనూ ఆ పార్టీలు బలపర్చిన అభ్యర్థులే గెలుస్తారన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూడో విడత గ్రామాల్లో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఇప్పటికే మందు, నగదు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పల్లె ఎవరికి పట్టం కడుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓ వైపు గజగజ వణికే చలి, మరో వైపు నరాలు తేగే ఉత్కంఠ నెలకొంది. గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నా మద్యం, డబ్బు పంపిణీకి అడ్డుకట్ట పడకపోవడం గమనార్హం. హుస్నాబాద్ మండలం కూచనపల్లిలోని ఓ తోటలో పంపిణీకి సిద్ధం చేసిన డబ్బులు, మద్యం బాటిళ్లను సిద్దిపేట టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా పట్టుకున్నారు. పోలీసులు డేగ కన్ను వేసినా.. ఆయా గ్రామాల అభ్యర్థులు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు డబ్బులు అందజేస్తున్నట్లు వినికిడి. ఏది ఏమైనా మరి కొన్ని గంటల్లో అభ్యర్థుల భవిత్యం తేలనుంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదు కొండపాక(గజ్వేల్): ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. కొండపాక, కుకునూరుపల్లి మండలంలో జరిగే మూడో విడత సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా మంగళవారం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల డ్యూటీ నిర్వహణలో ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. పోలింగ్‌కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ చెక్చేసుకోవాలన్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఏడు గంటలకే ప్రారంభం కావాలన్నారు. ప్రతీ రెండు గంటలకోమారు పోలింగ్ శాతాన్ని అందించాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌటింగ్ ప్రక్రియకు మొదలు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ప్రక్రియ నిర్వహించాలి మద్దూరు(హుస్నాబాద్): మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం మద్దూరు మండల కేంద్రంలోని తాజ్ ఫంక్షన్హాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేస్తూ ఎన్నికల నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పోలింగ్ ముగిశాక మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ మొదలు పెట్టాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాగానే అబ్జర్వర్ అనుమతితో మాత్రమే ఫలితాలు విడుదల చేయ్యాలని తెలిపారు. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం కావాలి
ములుగు(గజ్వేల్): గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచ్‌లు కృషి చేయాలని డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సా రెడ్డి సూచించారు. ములుగు మండలం బండనర్సంపల్లిలో మొదటి విడత గ్రామపంచాయ తీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. సర్పంచ్ ఆర్ఆర్. లహరీశ్రీధర్రెడ్డి, ఉపసర్పంచ్ జహంగీర్, వార్డు సభ్యులను మంగళవారం వారు అభినందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో సర్పంచ్‌లు గ్రామాలలో పలు అభివృద్ధి పనులు చేపట్టి ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీధర్‌రెడ్డి, భిక్షపతిరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, మురళి, రమణారెడ్డి, స్వామిగౌడ్, చంద్రయ్య, యాదగిరి, హన్మంతరెడ్డి, నర్సింలు, నర్సింహ్మారెడ్డి, సునీల్‌రెడ్డి పాల్గొన్నారు. -
తుది విడత సంగ్రామం నేడే
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మూడో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సామగ్రిని ఆయా మండల కేంద్రాల్లో మంగళవారం పంపిణీ చేశారు. హుస్నాబాద్‌కు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో, అక్కన్నపేటకు జెడ్పీహెచ్ ఎస్‌లో, కోహెడకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, చేర్యాలకు మండల పరిషత్ కార్యాలయంలో, మద్దూరుకు తాజ్ ఫంక్షన్ హాలులో, దూల్మిట్టకు రైతు వేదికలో, కొమురవెల్లికి జెడ్పీహెచ్ఎస్లో, కొండపాకకు ఐఎంఓసీ, కుకునూరుపల్లికి కోల అంజయ్య ఫంక్షన్ హాలులో ఎన్నికల సామగ్రిని అందజేశారు. సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని అందించి దిశానిర్దేశం చేశారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ప్రత్యేక బస్సుల తరలివెళ్లారు. ఆ వెంటనే కౌంటింగ్.. గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. లెక్కింపు సజావుగా, పారదర్శకంగా జరిగేలా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సీసీ కెమెరాలు అమర్చారు. పోలింగ్ పూర్తి కాగానే బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చి రెండు గంటల నుంచి ఓట్లు లెక్కిస్తూ, ఫలితాలను ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్స్‌ల్లో సర్పంచ్ ఓట్లను వేరు చేస్తూనే , తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. పంచాయతీ చివరి వార్డు ఫలితం వెల్లడించిన తర్వాత సర్పంచ్ ఓట్లను గుర్తుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు. జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం తొమ్మిది మండలాల్లో పోలింగ్ జరగనుంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, మద్దూరు, చేర్యాల, దుల్మిట్ట, కొమురవెల్లి, కొండపాక, కుకునూర్‌పల్లి మండలాల్లో పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. మొత్తం 163 పంచాయతీలకు గాను 13 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, 150 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 1,432 వార్డు స్థానాల్లో 249 ఏకగ్రీవం కాగా, 1,182 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 3,895 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. – హుస్నాబాద్ పోలింగ్ అధికారులు ఇలా.. మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాలకు అధికారులను నియమించారు. పోలింగ్ కేంద్రాలు 1,432, సమస్యాత్మక కేంద్రాలు 46, రిటర్నింగ్ అధికారులు 195 మంది, పీఓలు 1,718 మంది, అసిస్టెంట్ పీఓలు 2,123 మంది, మైక్రో అబ్జర్వర్స్ 37 మంది, వెబ్ కాస్టింగ్ 9, జోనల్ ఆఫీసర్స్ 24 మంది, రూట్ ఆఫీసర్స్ 56 మందిని కేటాయించారు. -
సమష్టిగా గ్రామాభివృద్ధికి కృషి చేయండి
● మీకు సంపూర్ణ సహకారం అందిస్తా ● మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: నియోజకవర్గ పరిధిలోని 91 గ్రామాలకు 77 గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుందని, గొప్ప విజయమని, మీకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ బలపర్చిన వారు తమ పాలకవర్గ సభ్యులతో కలిసి ఆదివారం క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించి సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి చెందగా, కాంగ్రెస్ హయాంలో నిర్వీర్యం అయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్లుగా మన తెలంగాణ రాష్టానికి ఒక్క అవార్డు రాలేదన్నారు. మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమని దైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే క్రమంలో ఐక్యతతో పనిచేయాలని సూచించారు. కోలాహలంగా క్యాంపు కార్యాలయం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించి క్లీన్ స్వీప్ చేశారు. ఈ నేపథ్యంలో గెలిచిన వారంతా పెద్ద ఎత్తున అనుచరులతో క్యాంపు కార్యాలయానికి రావడంతో పెద్ద ఎత్తున కోలాహలంగా మారింది. తెల్లవారుజామున నుంచి మధ్యాహ్నం వరకు వచ్చిన వారికి ఆప్యాయంగా పలకరించి, అభినందించారు. పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు స్వీట్స్ పంపిణీ చేసుకొని సంబరాలు చేసుకున్నారు. -
ఆఖరి పోరు.. పంపకాల జోరు
ముగిసిన మూడో విడత ప్రచారంఎన్నికల ప్రచారం ముగిసింది. మైక్‌లు మూగబోయాయి. ఇక మిగిలింది బేరసారాలు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మందు, విందులకు గ్రామాలు వేదికగా మారుతున్నాయి. ప్రతి గడప తడుతూ ‘మీ ఓటు మాకే వేయాలంటూ..’ డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వినికిడి. కుల సంఘాలను గంపగుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతి ఇంటికి కిలో మాంసం, క్వార్టర్ మందు సీసా చేతిలో పెట్టి వేడుకుంటున్నారు. సమయానికి అభ్యర్థుల వద్ద పెద్ద మొత్తంలో డబ్బు లేక పోవడంతో వ్యవసాయ భూములు, ప్లాట్లు అమ్ముతున్నట్లు సమాచారం. తమకు ఉన్న పరపతితో వడ్డీలకు డబ్బులు తెచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.2వేలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ప్రయాణ ఖర్చులు ఇచ్చి కుటుంబ సభ్యులతో రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లు ఏది అడిగితే అది కాదనకుండా ఇంటి ముంగిటకే తెచ్చి పెడుతున్నారు. మరో వైపు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుండటంతో మద్యం, డబ్బులు పంపిణీ గుట్టుగా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. అభ్యర్థుల బల ప్రదర్శన ప్రచారం చివరి రోజు సోమవారం అభ్యర్థులు బల ప్రదర్శన చేశారు. గ్రామాల్లో సమావేశాలు పెట్టి తాము గెలిస్తే ఏమేమి అభివృద్ధి పనులు చేస్తామో ఎల్ఈడీల ద్వారా హామీలు గుప్పిస్తూ ప్రచారాన్ని హోరెత్తించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారానికి ఊపు తెచ్చారు. ‘ఒక్కసారి అవకాశం ఇవ్వండి సమస్యలు తీరుస్తా’మని హామీల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ పార్టీలు బలపరిచిన అభ్యర్థులతో పాటుగా మిగతా అభ్యర్థులు కూడా తమ గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పార్టీలకతీతంగా అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే, మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. మూడో విడత ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఏర్పాట్లల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, ఇతర సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. జోరందుకున్న ప్రలోభాల పర్వం ప్రధాన పార్టీల ర్యాలీలుచేర్యాల(సిద్దిపేట): ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని హోరెత్తించాయి. సోమవారం ప్రచారానికి చివరి రోజు కావడంతో గ్రామాల్లో ఎవరికి వారు వారివారి మద్దతు దారులతో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డుల స్థానాల్లో అభ్యర్థులు తమ గుర్తులతో కూడిన నమూనా బ్యాలెట్ పత్రాలతో ఓటర్ల వద్దకు వెళ్లి తమకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్నాయి. మూడో విడత ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం ఒక్క రోజే కీలకం. దీంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపారు. ఓటర్లకు డబ్బు, మద్యం జోరుగా పంపిణీ చేస్తున్నట్లు ప్రచారం. బుధవారం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మూడో విడతలో 9 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డు స్థానాలున్నాయి. వీటిలో 13 మంది సర్పంచ్‌లు, 249 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 సర్పంచ్‌లకు 587 మంది, 1,182 వార్డు స్థానాలకు 3,308 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. –హుస్నాబాద్ -
నేడు నాచ‘గిరి’ ప్రదక్షిణ
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రంలో మంగళవారం స్వాతి నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రవీందర్ గుప్త, ఈఓ విజయరామారావు తెలిపారు. లక్ష్మీనృసింహుని జన్మ నక్షత్ర వేళ ఉదయం 7.30 గంటలకు నాచగిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని తరించాలని వారు కోరారు. గురు మదనానంద క్షేత్రం పీఠాధిపతి మాధవానంద సరస్వతి పర్యవేక్షణలో గిరి ప్రదక్షిణ కొనసాగనుంది. ప్రతిభ చాటినప్పుడే గుర్తింపు గజ్వేల్‌రూరల్: విద్యార్థులు తమలోని ప్రతిభను చాటినప్పుడే గుర్తింపు లభిస్తుందని మాజీ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రామచంద్రమూర్తి అన్నారు. వరంగల్ జిల్లా ప్లాటినం జూబ్లీ హైస్కూల్లో నిర్వహించిన ఫెస్ట్ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి 260 మంది విద్యార్థులు, గైడ్ టీచర్లు 120 ప్రాజెక్టులతో హాజరు కాగా ప్రజ్ఞాపూర్‌లోగల సేయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్స్పెక్టర్ వైష్ణవి, గైడ్ టీచర్ నాగలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైన్స్ కేవలం తరగతి గదిలో నేర్చుకునేది కాదని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతుందన్నారు. సేయింట్ మేరీస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టుల పట్ల అభినందిస్తూ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఇన్నారెడ్డి ఏటీఎల్ ఇన్స్పెక్టర్ వైష్ణవి, గైడ్ టీచర్ నాగలక్ష్మితో పాటు విద్యార్థులను అభినందించారు. కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి గజ్వేల్: కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతర పోరాటాలను కొనసాగిస్తుందని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి అన్నారు. ప్రతి కార్మికుని ఇంటిపై సీఐటీయూ జెండా ఎగురవేయాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు గజ్వేల్‌లోని తన ఇంటిపై సోమవారం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బండ్ల స్వామి మాట్లాడుతూ సీఐటీయూ అఖిలభారత మహాసభలు విశాఖపట్టణంలో ఈ నెల 31 నుంచి జనవరి 4వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాట కార్యాచరణ రూపొందించడానికి మహాసభల్లో తీర్మానాలుంటాయన్నారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను వెంట నే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం నెలకు రూ. 26 వేలు అందేలా జీఓలు సవరణ చేయాలన్నారు. పాఠశాలలో మాక్ పోలింగ్ కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం లకుడారం గ్రామంలోని హైస్కూల్లో సోమ వారం మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణతోపాటు ఓటు హక్కు వినియోగంపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. విద్యార్థులచే ఓటు వేయించారు. నమూనా ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా వంకని శివమణి, ఉపసర్పంచ్‌గా వంకని లోకేష్‌లు విజయం సాధించారు. ఎన్నికల నిర్వహణ అధికారిగా హెచ్ఎం జానకీరెడ్డి, ఇతర అధికారులుగా సత్యంతో పాటు తదితరులు పాల్గొన్నారు. -
మూడో విడతకు పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ హైమావతి ● జూమ్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం సిద్దిపేటరూరల్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సోమవారం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 17న అక్కన్నపేట, హుస్నాబాద్, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొండపాక, కుకునూరుపల్లి, మండలాల్లోని 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. మొత్తంగా 3,841 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 1,432 పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత, డీపీఓ రవీందర్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఈడీఎం ఆనంద్, జెడ్సీ సీఈఓ రమేశ్, ట్రైనీ డీపీఓ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వసతులు కల్పించండి చేర్యాల(సిద్దిపేట): మూడో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలన్నారు. సోమవారం చేర్యాల మండలం గుర్జకుంట, వేచరేణి, కడవేర్గు, నాగపురి, ముస్త్యాల, ఆకునూరు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపేందుకు అధికారులు పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్‌కు పెట్టేందుకు సౌకర్యంగా ఉండాలన్నారు. లైవ్ వెబ్ కాస్టింగ్ కోసం నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలన్నారు. అలాగే కౌంటింగ్ కోసం సౌకర్యంగా ఉండేలా పెద్ద గదిని ఎంచుకోవాలని ఆయా ఎంపీడీఓలను ఆదేశించారు. ఓటర్ స్లిప్‌ల పంపిణీ 100 శాతం చేయాలని బీఎల్ఓలను ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో ఎవరికి ఫోన్ అనుమతి లేదని, చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ, ఎంపీఓ, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు. -
లోకల్ ఫైట్..గులాబీ హిట్
రెండో విడతలో బీఆర్ఎస్ 119.. కాంగ్రెస్ 33 స్థానాల్లో గెలుపుసిద్దిపేటజోన్: గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులదే హవా కొనసాగింది. ఆదివారం పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. బీఆర్ఎస్ 119 స్థానాల్లో.. కాంగ్రెస్ 33 స్థానాల్లో, బీజేపీ 13 స్థానాల్లో, ఇండిపెండెంట్లు 17 స్థానాల్లో విజయం సాధించారు. గులాబీకి పట్టు న్న సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. బెజ్జంకి మండలంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించారు. మరోవైపు బీజేపీ నామమాత్రంగా ప్రభావం చూపగా, స్వతంత్ర అభ్యర్ధులు డబుల్ డిజిట్లో గెలుపొందారు. సిద్దిపేట పట్టణ సరిహద్దులోని కొన్ని మేజర్ గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. సిద్దిపేటలో కొనసాగిన హవా.. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో బీఆర్ఎస్ ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పించింది. కొన్ని రోజులుగా గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. పోటీల్లో బీఆర్ఎస్ పార్టీ అనుచరులు అధిక సంఖ్యలో ఉండడంతో పోటీ రసవత్తరంగా మారింది. చివరకు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. చిన్నకోడూరు, నంగునూరు, సిద్దిపేట రూరల్, అర్బన్, నారాయణరావుపేట మండలాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్కు 76 స్థానాలు రాగా కాంగ్రెస్, బీజేపీలకు డబుల్ డిజిట్ కూడా దక్కలేదు. బెజ్జంకిలో కాంగ్రెస్ ప్రభావం.. మానకోడూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో కాంగ్రెస్ ఆధిపత్యం కనిపించింది. పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధికంగా విజయం సాధించారు. 13స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 8స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడ మూడు చోట్లా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. వికసించని కమలం ప్రజాప్రతినిధుల పట్టు రెండో విడత ఓట్ల లెక్కింపులో ప్రజాప్రతినిధులు సొంత గ్రామాల్లో పట్టు సాధించారు. మాజీ సీఎం కేసీఆర్ స్వగ్రామమైన చింత మడకలో బీఆర్ఎస్, ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వగ్రామం తోటపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఎంపీ రఘునందన్ రావు స్వగ్రామంలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. -
సర్పంచ్‌లు ప్రజల మన్ననలు పొందాలి
మాజీ మంత్రి హరీశ్రావుగజ్వేల్: సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు ప్రజల మన్ననలు పొందాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలివిడత ఎన్నికల్లో గజ్వేల్ మండలం ఆహ్మదీపూర్ సర్పంచ్‌గా ఎన్నికై న ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ నాయకులు మద్ది రాజిరెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, పాల రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాజీపూర్‌లో ఉద్రిక్తత
పోలీసులకు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం మిరుదొడ్డి(దుబ్బాక): అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రానికి సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరు అభ్యర్థులను పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. దీంతో అభ్యర్థులు, పోలీసులకు మధ్య మాటా మాటా పెరిగి చివరికి వాగ్వాదానికి దారి తీసింది. ఘటనా స్థలంలో జనాలు గుమిగూడటంతో ఉద్రిక్తతంగా మారింది. పరిస్థితి చేయి దాటక ముందే పోలీసులు.. అభ్యర్థులను, గ్రామస్తులను చెదర గొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మిరుదొడ్డిలో పోలీసుల అత్యుత్సాహం మండల కేంద్రమైన మిరుదొడ్డిలో వార్తా సేకరణకు వెళ్లిన విలేకరులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలింగ్ కేంద్రానికి సుమారు వెయ్యి మీటర్ల దూరంలో ఫొటోలు తీస్తున్న విలేకరులను వారిస్తూ వారి నుంచి అక్రిడిటేషన్ కార్డులు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని ఫొటోలను డిలేట్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన విలేకరులపై విరుచుపడ్డారు. చివరికి ఎస్ఐ సమత జోక్యంతో సమస్య సద్దుమణిగింది. సమస్య ఉత్పన్నం కాకుండా చూడాల్సిన పోలీసులే సమస్యలకు కారణమవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
కొమురవెల్లి ఆలయ అభివృద్ధికి కృషి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంతి కొండా సురేఖ తెలిపారు. బ్రహ్మోత్సవాల నాటికి మేడాలమ్మ, కేతమ్మలకు సుమారు 2 కిలోల బంగారు కిరీటాలు, స్వామి వారి పల్లకీకి వెండి తాపడం చేయిస్తామన్నారు. ఆదివారం స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ మల్లన ఆలయ అభివృద్ధికి త్వరలోనే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క –సారక్క జాతర ఏర్పాట్లకు ప్రభుత్వం కనివిని ఎరుగని రీతిలో నిధులు మాంజూరు చేసినట్లు తెలిపారు. -
కమనీయం.. మల్లన్న కల్యాణం
కొమురవెల్లి(సిద్దిపేట): మేళతాళాలు.. మంగళవాయిద్యాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య కొమురవెల్లి కోరమీసాల మల్లన్న కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆదివారం క్షేత్రంలోని తోట బావి వద్ద సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న స్వామి.. మేడలాదేవి, కేతమ్మలను సరిగ్గా మధ్యాహ్నం 12.01గంటలకు వివాహమాడారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణ క్రతువును కనుల పండువగా నిర్వహించారు. కల్యాణ వేడుకను వీక్షించేందుకు రాష్ట్రం నుంచే కాక వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ గర్భగుడిలో ఉదయం 9 గంటలకు మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించారు. అనంతరం స్వామి. అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకీలో ఊరేగింపుగా మేళాతాళలతో తోటబావి వద్ద గల మల్లన్న కళ్యాణవేదికకు చేర్చి కల్యాణ క్రతువు చేపట్టారు. ప్రభుత్వం తరపున మల్లికార్జున స్వామికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించారు. మాజీ ఎమ్మెల్సీ రాజలింగం, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తదితరులు స్వామివారిని, అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పీఠాధిపతుల పర్యవేక్షణలో .. మల్లికార్జున స్వామి కల్యాణాన్ని పీఠాధిపతి మహమండలేశ్వర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ పర్యవేక్షణలో కొనసాగగా.. కల్యాణ వ్యాఖ్యతలుగా డాక్టర్ మహంతయ్య, సాంబశివశర్మ, శశిభూషణ సిద్దాంతిలు వ్యవహరించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన స్వామి వారి కల్యాణ వేడుకను భక్తులు భక్తి శ్రద్ధలతో తిలకించారు.భారీగా హాజరైన భక్తజనం -
ఊళ్లు.. ఓటెత్తాయ్..
సిద్దిపేటజోన్: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2,44,776 ఓట్లకు గాను 2,16,294 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 88.36 పోలింగ్ శాతం నమోదైంది. ఏకగ్రీవమైన స్థానాలను మినహాయించి 172 సర్పంచ్ స్థానాలకు, 1,371 వార్డులకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, నంగనూరు, చిన్నకోడూరు మండలాలతో పాటు దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూపల్లి, మానకోడూరు నియోజకవర్గ పరిధిలోని బెజ్జంకి మండలాల్లో పోలింగ్ నిర్వహించారు. ఆదివారం జరిగిన రెండో విడత పోలింగ్ ప్రక్రియ మెల్లమెల్లగా పుంజుకుంది. నిర్ణీత సమయం 7గంటలకు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి గంట పోలింగ్ శాతం కొద్దిగా నెమ్మదించిన తర్వాత పుంజుకుంది. 9గంటల వరకు సగటున 23శాతం చేరుకుంది. వీకెండ్ కావడంతో పాటు రెండో శనివారం రావడం ఓటర్లకు కలిసి వచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు సైతం ఓటు వేసేందుకు స్వగ్రామాలకు చేరుకుని ఓటు వేశారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయం గడువు దాటినా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ కట్టారు. వారందరికీ అధికారులు అవకాశం కల్పించారు. షెడ్యూల్ మేరకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోలింగ్ సరళిని కలెక్టర్ హైమావతి, పోలీసు కమిషనర్ విజయ్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రశాంతంగా రెండో విడత పోలింగ్పది మండలాల్లో ఓటర్ల సంఖ్య: 2,44,776 పురుషులు: 1,19,471 మహిళలు: 1,25,304 ఇతరులు: 01 పోలింగ్ శాతం సరళి.. ఉదయం 9 వరకు పోలైన ఓట్లు: 56,905 (23.25) 11 గంటల వరకు.. 1,43,027 (58.43) ఒంటి గంట వరకు పోలైన మొత్తం ఓట్లు: 2,16,294 (88.36)జిల్లాలో 88.36 శాతం నమోదు మండలాల వారీగా పోలింగ్ శాతం.. అక్బర్ పేట–భూపల్లి: 87.63 బెజ్జంకి: 85.89చిన్నకోడూరు: 87.99 దుబ్బాక: 86.91మిరుదొడ్డి: 87.70 నంగునూరు: 90.16 నారాయణరావు పేట: 89.78 సిద్దిపేట రూరల్: 89.52 సిద్దిపేట అర్బన్: 89.30తొగుట: 89.74 -
ఎన్నికల కూలీలు
● ప్రచారానికి పైసలిచ్చి తీసుకెళ్తున్న నేతలు ● నేడు ఒక అభ్యర్థికి.. రేపు మరొకరికి జైవెల్దుర్తి(తూప్రాన్): ఒకప్పుడు పల్లెకో, పట్టణానికో నాయకుడు వస్తే జనం స్వచ్ఛందంగా కదలివచ్చేవారు. ర్యాలీల్లో నేతలతో కలిసి పాదం పాదం కలిపేందుకు, సభల్లో వారి ప్రసంగాలు వినేందుకు పోటీ పడేవారు. కానీ ప్రస్తుత రాజకీయాలు మారిపోయాయి. ముఖ్య కార్యకర్తలు తప్ప పని వదిలి ప్రచారానికి తరలివచ్చేవారు.. నేతల మాటలు వినడానికి కదిలే వారు కరువయ్యారు. దీంతో అభ్యర్థులు, ఆశావహులు సభలు, ప్రచారాల కోసం కూలీలను ఆశ్రయిస్తున్నారు. ఇవాళ ఇక్కడ.. రేపు అక్కడ.. కూలీలు సైతం ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ రోజు వారికే ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఒక పార్టీకి జై కొడితే.. రేపు మరో పార్టీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో తమ పార్టీలోకి ఎక్కువ చేరికలు జరిగాయని చెప్పుకునేందుకు కూలీలకు సైతం కండువాలు కప్పుతున్న నేతలకు లెక్కేలేదు. ఈ వ్యవహారాన్ని చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామాలు, పట్టణాల్లో కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రచారానికి వస్తే రోజుకు రూ. 300 కూలీ ఇస్తూ టిఫిన్, భోజనం ఉచితంగా అందిస్తున్నారు. ఒకే రోజు రెండు పార్టీల మీటింగ్‌లు, ప్రచారాలు ఉంటే మాత్రం కూలీల రేటు రెండింతలు అవుతుంది. పైపెచ్చు ప్రచారం పూర్తికాగానే మగవారికి మద్యం బాటిల్ చేతిలో పెట్టి రేపటి ప్రచారానికి మళ్లీ రావాలని మురిపిస్తున్నారు. -
ఇవేం ఏర్పాట్లు
అధికారులపై కలెక్టర్ ఆగ్రహంబెజ్జంకి(సిద్దిపేట): ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో ఏర్పాట్లపై కలెక్టర్ హైమావతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బెజ్జంకిలోని సత్యసాయి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి పరిశీలించారు. భోజన, తదితర వసతులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సెంటర్లోని మైక్ పని చేయకపోవడంతో ఎంపీడీఓ ప్రవీణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విధులు నిర్వహించడం కష్టమని, బెజ్జంకి కేంద్రంపై దృష్టి సారించాలని ఆర్డీఓకు సూచించారు. ఎన్నికల విధులకు అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కావాలన్నారు. పోలింగ్ సిబ్బందికి రాత్రి వేళ సంబంధిత పోలింగ్ కేంద్రాలలో భోజనవసతి కల్పించాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు. ఓటు హక్కు మరవొద్దు సిద్దిపేటరూరల్: ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని, ఓటు హక్కు మరవద్దని కలెక్టర్ హైమావతి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ అవకాశాన్ని ఆయా మండలాల్లోని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, జెడ్పీ సీఈఓ రమేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
విచ్చలవిడిగా డబ్బు, మద్యం
దుబ్బాక: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. ఈ క్రమంలో విచ్చలవిడిగా డబ్బులు, మద్యం పంపిణీ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం. మండల కేంద్రాలతో పాటు, ప్రధాన గ్రామాల్లో పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు దేనికి వెనుకాడకుండా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు వినికిడి. ఓటుకు రూ.2 నుంచి 4 వేలు కొన్ని ప్రధాన గ్రామాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి 4 వేల వరకు ఇంటింటికీ పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అయితే పలనా వారు రూ.2 వేలు ఇచ్చినట్లు తెలిస్తే.. కొందరు ఓటుకు రూ.3 వేలు సైతం ఇచ్చిటన్లు సమాచారం. ఓ వైపు పోలీసులు గ్రామాల్లో నిఘా పెట్టినప్పటికీ అభ్యర్థులు మాత్రం యథేచ్ఛగా డబ్బులు, మద్యం పంపిణీ చేయడం గమనార్హం. -
రెండో విడత.. పోరు
జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం 172 సర్పంచ్, 1,371 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ నిర్వహణతోపాటు కౌంటింగ్ కోసం 4,763 మంది సిబ్బందిని నియమించారు. రెండో విడతలో 38 గ్రామాలు సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. రెండో విడతలో 4,328 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి పర్యవేక్షించారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో మూడు విడతలలో 508 సర్పంచ్‌లు, 4,508 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు మొదటి విడత ఈ నెల 11న ముగియగా, ఆదివారం రెండో విడతలో 10 మండలాల్లో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో 182 సర్పంచ్‌లు, 1,644 వార్డులకు గాను 10 సర్పంచ్‌లు, 273 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 172 సర్పంచ్ స్థానాలకు 684 మంది, 1,371 వార్డు స్థానాలకు 3,644 మంది పోటీ చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఓటర్లకు డబ్బులు, మద్యం, వివిధ రకాల గిఫ్ట్‌లను అందజేసినట్లు తెలిసింది. పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది పది మండలాల్లో పది చోట్ల ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు, పేపర్లు, ఇతర మెటీరియల్‌ను పంపిణీ చేశారు. అక్బర్పేట – భూంపల్లిలో శ్రీనివాస ఐటీఐ, చిన్నకోడూరులో ఎంపీడీఓ కార్యాలయం, దుబ్బాకలో ఎంపీడీఓ కార్యాలయం, మిరుదొడ్డిలో మోడల్ స్కూల్, నంగునూరులో ఎంపీడీఓ కార్యాలయం, నారాయణరావు పేటలో జెడ్పీహెచ్ఎస్, సిద్దిపేట రూరల్‌లో మైనార్టీ కాలేజీ, సిద్దిపేట అర్బన్‌లో మెరీడియన్ స్కూల్, తొగుటలో ఎంపీడీఓ కార్యాలయం, బెజ్జంకిలో శ్రీసత్యసాయి గురుకుల విద్యానికేతన్‌లో పోలింగ్ సామగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పోలింగ్ తర్వాత మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. మొదట వార్డు ఓట్ల లెక్కింపు బ్యాలెట్ బాక్స్‌లో సర్పంచ్ ఓట్లను వేరు చేస్తూనే.. తొలుత వార్డుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. పంచాయతీ చివరి వార్డు ఫలితం వెల్లడించాక.. సర్పంచ్ ఓట్లను గుర్తుల వారీగా వేరు చేసి లెక్కిస్తారు. చిన్న గ్రామ పంచాయతీలు సాయంత్రం 5గంటలలోగా ఫలితాలు వెల్లడికానున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీల ఫలితాలు రాత్రి 7గంటల తర్వాతే వచ్చే అవకాశం ఉంది.విధుల్లో 4 వేల మంది.. ఎన్నికల నిర్వహణకు 4,763 మంది సిబ్బందిని నియమించారు. పోలింగ్ అధికారులు1,973, పోలింగ్ సిబ్బంది 2,436 మందిని నియమించగా ప్రత్యేక వాహనాల ద్వారా పోలింగ్ కేంద్రాలకు తరలించారు. -
మల్లన్న కల్యాణానికి రారండీ
కొమురవెల్లిలో నేటి ఉదయం 10:45 గంటలకు.. కొమురవెల్లి(సిద్దిపేట): భక్తుల కొంగుబంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నారు. మల్లన్న క్షేత్రంలోని జరిగే కల్యాణోత్సవానికి రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ మహోత్సవాన్ని వైభవంగా జరిపేందుకు ఆలయవర్గాలు విస్తృత ఏర్పాట్లు చేశాయి. తోటబావి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కల్యాణ మండలపంలో మల్లికార్జున స్వామి, కేతలమ్మ, మేడలదేవిని ఉదయం 10.45నిమిషాలకు వివాహమాడనున్నారు. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిర్వహించే కల్యాణోత్సవంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మల్లన్న కల్యాణానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు ప్రముఖులు, అధికారులు హాజరుకానున్నారు. శనివారం పీఠాధిపతులు మహమండలేశ్వర్, డాక్టర్ మహంత్ సిద్ధేశ్వరానందగిరి మహంత్ మహస్వామి కొమురవెల్లికి చేరుకున్నారు. స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు.. ఆలయ గర్భగుడిలో మల్లన్న మూల విరాట్ వద్ద మొదట కల్యాణ తంతును ప్రారంభించి అదే సమయంలో తోట బావి వద్ద ఉత్సవ విగ్రహాలకు కల్యాణం జరిపిస్తారు. వధువులు బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ తరపున మహదేవుని వంశస్తులు, వరుడు మల్లికార్జున స్వామి తరపున పడిగన్నగారి వంశస్తులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. సర్వాంగసుందరంగా కల్యాణ వేదిక స్వామివారి కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చలువపందిళ్లు వేశారు. స్వామి వారి రథం పనులు, గుట్టపైన ఎల్లమ్మ ఆలయ అలంకరణ పనులు పూర్తీ చేశారు. పటిష్ట బందోబస్తు మల్లన్న కల్యాణానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అదనపు డీసీపీ చంద్రబోస్ తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ విధులను పకడ్బందీగా నిర్వహించాలని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. బందోబస్తులో అదనపు డీసీపీ, ఏసీపీలు ఇద్దరు, సీఐలు 10మంది , ఎస్ఐలు12, కానిస్టేబుల్లు మొత్తం 361 సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని, పార్కింగ్ ప్రదేశాలలోనే వాహనాలను పార్కు చేయాలని సూచించారు. ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ స్వామి వారి కల్యాణం ఏర్పాట్లను కలెక్టర్ హైమావతి పరిశీలించారు. ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యంపై అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులను ఆదేశించారు. అనంతరం బండ గుట్టపై చేపడుతున్న 50 గదుల నిర్మాణపనులను పరిశీలించారు. -
కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యం
● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ● నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు సన్మానం దుబ్బాక: కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడమే లక్ష్యంగా కృషి చేద్దామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మొదటి విడత ఎన్నికల్లో గెలుపొందిన నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో లేకున్నా మెజార్టీ సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలుచుకోవడం చాలా సంతోషకరమన్నారు. ఇదే స్ఫూర్తితో రెండో విడత ఎన్నికల్లో సైతం పెద్ద ఎత్తున సర్పంచ్‌లను గెలిపించుకుందామన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధికి నిధుల కోసం పోరాడుతానన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
మిరుదొడ్డి(దుబ్బాక): రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంతో పాటు, అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమావళి నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో కరెంటు, విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, ర్యాంపులు, మరుగుదొడ్లు, తాగు నీటి వసతి కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నెట్ కనెక్షన్ ఉండే విధంగా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఇన్చార్జి ఎంపీఓ ఫహీం, ఆయా గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలలో సౌకర్యాలు కల్పించాలి పోలింగ్ కేంద్రాల పరిశీలన తొగుట(దుబ్బాక): ఓటర్లకు ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి హైమావతి అధికారులను ఆదేశించారు. మండలంలోని గుడికందుల, పెద్ద మాసాన్‌పల్లి గ్రామాల్లో శుక్రవారం పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. -
రేపే మల్లన్న కల్యాణం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి కొండా సురేఖ స్వామివారి కల్యాణం సందర్భంగా స్వామివారికి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు మంత్రి తీసుకువచ్చేందుకు దేవాదాయ శాఖ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● నేడు దిష్టి కుంభానికి బియ్యం సేకరణకొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వార్షిక కల్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆదివారం ఆలయ తోట బావి వద్ద కల్యాణమండపంలో ఉదయం 10.45 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. వీర శైవ ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఉజ్జయిని పీఠాధిపతులు సిద్ధిలింగరాజశికేంద్రశివాచార్య మహాస్వామి పర్యవేక్షణలో కల్యాణం నిర్వహిస్తారు. మొదట ఆలయ గర్భగుడిలో మూల విరాట్‌కు కల్యాణం నిర్వహించేందుకు వధువు (బలిజమేడలమ్మ, గొల్ల కేతమ్మ) తరఫున మహాదేవుని వంశస్తులు, వరుడు మల్లికార్జున స్వామి తరఫున పడిగన్నగారి వంశస్తులు పెండ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అదే సమయంలో తోట బావి వద్ద కల్యాణోత్సవంలోనూ వీరే పెళ్లి పెద్దలుగా వ్యవహరించనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 6 గంటలకు స్వామి వారి ఆలయంలో దిష్టి కుంభం నిర్వహిస్తారు. శనివారం గ్రామంలో అందరి ఇళ్లలోంచి రతి బియ్యాన్ని తీసుకువస్తారు. దీంతో మల్లన్న కల్యాణ వేడుకల తంతు ప్రారంభమవుతుంది. మల్లన్న కల్యాణంతో జాతర షురూ.. మల్లన్న బ్రహ్మోత్సవాలు మార్గశిర మాసం చివరి ఆదివారంతో మొదలై ఫాల్గున మాసం చివరి ఆదివారం అగ్ని గుండాలతో జాతర ముగుస్తుంది. పూజా సామగ్రి సిద్ధం కల్యాణోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు శుక్రవారం సిద్ధం చేశారు. స్వర్ణకిరీటం, కోరమీసాలు, ఖడ్గం, రుద్రాక్షమాల, స్వామి వారి నామాలు, పంచహారతి, రుద్రపాదం, తదితర సామగ్రిని సిద్ధం చేశారు. వైభవంగా నిర్వహిస్తాం కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కల్యాణోత్సవానికి సుమారు 50 వేల మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఏర్పాటు పూర్తి చేశాం. – వెంకటేశ్, ఆలయ ఈఓ -
ఉద్యాన డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం
ములుగు(గజ్వేల్): ఉద్యాన విశ్వవిద్యాలయంలోని డిగ్రీలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ భగవాన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న ఉదయం 10:30 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కంబైన్డ్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు సమర్పించాలన్నారు. ఎప్‌సెట్ –2025లో ర్యాంకు పొందిన విద్యార్థులు ఈ కౌన్సెలింగ్ కు హాజరు కావచ్చన్నారు. విశ్వవిద్యాలయం పరీక్షా కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. మరిన్ని వివరాలకు 96524 56779 నంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించండి: జడ్జి రేవతి హుస్నాబాద్: ప్రభుత్వం అమలు చేస్తున్న హెల్త్ స్కీంలు ప్రజలకు తెలిసే విధంగా అవగాహన కల్పించాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి కోరారు. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. వైద్య పరికరాలు, మందులు పరిశీలించారు. అనంతరం జడ్జి రేవతి మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. గ్రామాల్లో, పాఠశాలల్లో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించి వైద్యం అందించాలని కోరారు. అనంతరం కోర్టు హాల్లో ఈ నెల 21న నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమం సందర్భంగా పోలీస్, ఎకై ్సజ్ అధికారులతో కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రమిద, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి, న్యాయవాదులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువుతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్ విద్యార్థులకు సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత వసతి గృహం ఆవరణలో విద్యార్థులను కలిసి మాట్లాడారు. వసతి గృహంలో అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. విద్యార్థి దశ నుంచే మంచి అలవాట్లను, క్రమశిక్షణ, సమయపాలనను అలవర్చుకోవాలన్నారు. పీఓ, ఏపీఓలకు శిక్షణ హుస్నాబాద్‌రూరల్: డివిజన్లో 3వ విడత పంచాయతీ ఎన్నికలు జరగనుండగా పీఓ, ఏపీఓ అధికారులకు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేశ్ మాట్లాడుతూ గ్రామాల్లో వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ బాక్స్‌లు సీల్ వేయడం, ఓట్ల లెక్కింపునకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు త్వరగా బ్యాలెట్ పేపర్ ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. మద్దూరులో.. మద్దూరు(హుస్నాబాద్): ఉమ్మడి మద్దూరు మండల పరిధిలో శుక్రవారం ప్రొసీడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్ రోజున నిర్వహించాల్సిన విధులపై శిక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మద్దూరు, ధూళ్మిట్ట మండలాల ఎంపీడీఓలు, ఎంఈవోలు పాల్గొన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమం రద్దుసిద్దిపేటకమాన్: సామాన్య ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి శనివారం సీపీతో నిర్వహించే ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించడం లేదని సీపీ విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఫోన్ ఇన్ కార్యక్రమం రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 20న యథావిధిగా తిరిగి నిర్వహించనున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
సంకుల సమరమే
● పార్టీల ప్రభావం అంతంతే.. ● అభ్యర్థి కేంద్రంగానే ఎన్నికలు వెల్దుర్తి(తూప్రాన్): గత అనుభవాలు, క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే పంచాయతీ ఎన్నికల పోరు, సం‘కుల’ సమరంగా మా రింది. పల్లెల్లో కులాలు, వర్గాల ప్రాతిపదికనే సమీకరణలు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. మెజారిటీ పంచాయతీల్లో ఇదే పరిస్థితి ఉండగా, కులాలవారీగా సమావేశాలు, విందులు జోరందుకున్నాయి. పార్టీల ప్రభావం అంతంత మాత్రంగానే ఉండగా, అభ్యర్థి కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. గెలిచాక ఏదో ఒక పార్టీ వంచన చేరే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల గుర్తులతో అభ్యర్తులు ప్రజలను కలుస్తూ తనకు ఓటువేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. పార్టీల ప్రభావం అంతంతే.. అసెంబ్లీ ఎన్నికలు పార్టీ కేంద్రంగా జరిగితే పంచాయతీ ఎన్నికలు ప్రధానంగా అభ్యర్థి కేంద్రంగా జరగుతున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తి కూడా ఇదే. పచ్చని పల్లెల్లో రాజకీయాలకు అతీతంగా ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో పార్టీలకు సంబంధం లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేని గుర్తులనే కేటాయిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండానే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లోనైతే పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కులాల వారీగా అభ్యర్థులు సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఖరారైన వెంటనే ఆయా గ్రామాల్లో కులాలవారీగా పెద్దలు రంగంలోకి దిగారు. ఎక్కువ మంది సంఘ సభ్యులున్నచోట తమ అభ్యర్థిని బరిలో నిలిపారు. పోటీ అధికంగా ఉన్న చోట ఆశావహుల నడుమ రాజీ కుదుర్చి ఒక్కరే బరిలో ఉండేలా చూసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అవకాశం రానివారికి రాబోయే మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అవకా శం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వగా కొందరూ పోటీకి దూరంగా ఉన్నారు. మరికొందరు మాత్రం బరిలో నిలిచారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే కాకుండా జనరల్ స్థానాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. -
భారీ రోడ్‌షోలు.. ర్యాలీలు
మిరుదొడ్డి(దుబ్బాక): ప్రచారానికి శుక్రవారం ఆఖరి రోజు కావడంతో అయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు భారీ రోడ్డు షోలు నిర్వహించారు. తమకు కేటాయించిన గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారంలో సర్పంచ్ అభ్యర్థిగా బరీలో నిలిచిన కాముని మంజుల ఎన్నికల ప్రచారంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్లబండి శశిధర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాల స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, శిరీష తదితరులు పాల్గొన్నారు. కాముని మంజులను గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థించారు. -
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
హుస్నాబాద్: ‘నా రాజకీయ పరపతిని హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి వినియోగిస్తా.. ప్రగతే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నా’ నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సన్మానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 మంది సర్పంచ్‌లకు త్వరలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధిపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గణనీయమైన స్థానాలు గెలుచుకున్నారన్నారు. రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని కోరారు. గాంధీజీ కలలు కన్న విధంగా గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలన్నారు. ఇంజనీరింగ్ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, బాసర ట్రిపుల్ ఐటీ బ్రాంచ్, కరీంనగర్, జనగామ, అక్కన్నపేట నాలుగు లేన్ల రోడ్, 250 పడకల ఆస్పత్రి, ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.నాగారం గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దుతా.. హుస్నాబాద్‌రూరల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం నాగారంలో కుమారస్వామికి మద్ధతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగారం గ్రామానికి కావల్సిన అభివృద్ధికి నిధులను ఇస్తామన్నారు. గ్రామానికి మౌలిక వసతులు కల్పనకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. మహ్మదాపూర్లో కాంగ్రెస్ నాయకుడు తౌటు రాజయ్య ఇటీవల మరణించి వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా ఇచ్చారు. వీరి వెంట మార్కెట్ వైస్ చైర్మన్ బంక చందు, బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు ఉన్నారు. రాజకీయ పరపతిని వినియోగిస్తా త్వరలో నూతన సర్పంచ్‌లకు శిక్షణ మంత్రి పొన్నం ప్రభాకర్ -
పటిష్ట బందోబస్తు
సీపీ విజయ్‌కుమార్ సిద్దిపేటకమాన్: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్, రూరల్, అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, తొగుట మండలాల్లో ఈ నెల 14న పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 100మీటర్ల లోపల, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని తెలిపారు. -
కార్యకర్తల్లో నయా జోష్
ఎక్కువ చోట్ల బీఆర్ఎస్ గెలుపు ● గతం కంటే ఎక్కువ స్థానాలు సాధించిన కాంగ్రెస్సాక్షి, సిద్దిపేట: ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అధిక సర్పంచ్ స్థానాలు గెలుపొందామని బీఆర్ఎస్ శ్రేణులు.. గతం కంటే ఎక్కువ సర్పంచ్‌లు గెలిచామని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జోష్‌లో ఉన్నారు. గురువారం జరిగిన మొదటి విడత ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల బలపర్చిన అభ్యర్థులు నువ్వా నేనా? అన్నట్లుగా పోటీ రసవత్తరంగా సాగింది. గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, వర్గల్, ములుగు, మర్కూక్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని రాయపోలు, దౌల్తాబాద్ మండలాల్లోని 163 సర్పంచ్‌లు, 1,432 వార్డులకు ఎన్నికలు మొదటి విడతలో నిర్వహించారు. అందులో 16 సర్పంచ్‌లు, 224 వార్డులు ఏకగ్రీవం కాగా గురువారం147 సర్పంచ్, 1,208 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో బీఆర్ఎస్ బలపర్చినవారు సర్పంచ్‌లుగా 68 మంది, కాంగ్రెస్‌కు చెందిన వారు 59 మంది, బీజేపీ వారు 8, ఇతరులు 12 మంది గెలుపొందారు. నేతల విస్తృత ప్రచారం బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల మద్దతుగా ముఖ్యనాయకులు అంతగా ఎవరూ ప్రచారం చేయనప్పటికీ ఆ పార్టీ నాయకులే ఎక్కువగా సర్పంచ్‌లుగా గెలుపొందారు. మండల నాయకుల సహకారంతో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఒక్క ఓటరును కలిసి గ్రామ అభివృద్ధి ఎజెండాను వివరించి తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 46 మంది , దుబ్బాక నియోజకవర్గంలో రెండు మండలాల్లో 22 మంది బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లుగా విజయం సాదించారు. రెండు, మూడో విడతలపై ప్రభావం మొదటి విడతలో వచ్చిన ఫలితాలు రెండవ, మూడవ విడతలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల పై ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలు ప్రచార వేగం పెంచారు. జిల్లాలో అత్యధికంగా సర్పంచ్‌లు గెలుపొందాలని లక్ష్యంగా రెండు పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 14న, 17న ఆయా గ్రామ పంచాయతీల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలు ఏ గ్రామ పంచాయతీలో ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.గజ్వేల్‌లో 46 చోట్ల కాంగ్రెస్ గెలుపు జిల్లా కాంగ్రెస్ పార్టీ(డీసీసీ) అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిలు ఇద్దరు గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన వారే కావడంతో పలు గ్రామాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఐదు మండలాల్లో 46 సర్పంచ్‌లు గెలుపొందారు. దుబ్బాక నియోజకవర్గంలో రెండు మండలాల్లో 13 కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు సర్పంచ్ పదవులు దక్కాయి. ఈ ఇద్దరు నేతలు వర్గల్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందడం గమనార్హం. -
గౌరవెల్లి ప్రాజెక్టుకు ‘బొమ్మ’ పేరు పెట్టాలి
హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టుకు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు పేరు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తి చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బొమ్మ వెంకటేశ్వర్లు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు బీజం పడింది వెంకటేశ్వర్లు కృషి వల్లేనని కొనియాడారు. ఈ ప్రాంతంలో బస్ డిపో, కోర్టు, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు విశేషంగా కృషి చేశారన్నారు. పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పాటును అందించారన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హౌస్ ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు. -
బీఆర్ఎస్ 73కాంగ్రెస్ 64
మొదటి విడత పల్లె పోరులో పోటాపోటీగా ఫలితాలు సాక్షి, సిద్దిపేట: పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా సాగింది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కౌంటింగ్ జరిగింది. హోరాహోరీగా సాగిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా సర్పంచ్‌లను దక్కించుకున్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా విజయం సాధించారు. అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల మద్దతుదారులు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజుల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. బీఆర్ఎస్ బలంగా ఉన్న చోట.. తొలి విడతలో గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, వర్గల్, ములుగు, దౌల్తాబాద్, రాయపోలు మండలాల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 163 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా బీఆర్ఎస్ పార్టీ 73 సర్పంచ్ స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 64 సర్పంచ్‌లు, బీజేపీ 10 సర్పంచ్ స్థానాలు, ఇండిపెండెంట్లు 16 సర్పంచ్‌లు దక్కించుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీల బలంగా ఉన్న చోట కాంగ్రెస్ సర్పంచ్‌లు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. వికసించని కమలం కమలం పార్టీ మద్దతు దారులు ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటలేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన కమలం పార్టీ పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయిలో సత్తా చాటలేకపోయింది. మరోవైపు స్వతంత్రుల కంటే బీజేపీ సర్పంచ్‌లు తక్కువ మంది గెలుపొందారు.. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా స్వతంత్య్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం. తూంకుంట ఇలాకాలో బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డిది వర్గల్ మండల కేంద్రం.. అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జయభారతి గెలుపొందారు. డీసీసీ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డి నియమితులైన తర్వాత తొలి ఎన్నికల్లోనే పార్టీ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందారు. డ్రాతో సర్పంచ్‌గా గెలిచి.. మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్‌ఖాన్‌పల్లి సర్పంచ్‌గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్ఎస్కు చెందిన వారే.. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మికి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచ్చిందో పూర్తిగా చూపించ కుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు. -
పల్లెకు పైసలెట్ల వస్తాయంటే..!
● సొంత వనరులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు ● ఆయా నిధులతోనే మౌలిక, సామాజిక వసతుల కల్పన ● మూడు రకాలుగా సమకూరనున్న ఆదాయం జహీరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలో కొత్త పాలక మండలి ఏర్పడనుంది. ఈ క్రమంలో గ్రామాభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల అవసరం ఎంతో ఉంటుంది. ఇందు కోసం గ్రామ పంచాయతీలు ముఖ్యంగా సొంత వనరులను సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ల రూపంలో నిధులు పొందుతాయి. కర్మాగారాల నుంచి సీఎస్ఆర్ నిధులు కూడా కేటాయింపులు జరుగుతాయి. పంచాయతీలు విధించే పన్నులు, రుసుముల ద్వారా ఆదాయం పొందుతాయి. ఇంటి, నల్లా, వృత్తి, వ్యాపార పన్నులు, వారపు సంతలు, మార్కెట్ల నిర్వహణ, పంచాయతీకి చెందిన భవనాలు, ఖాళీ స్థలాల వంటి ఆస్తులు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు ఐదు సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోకి కేంద్ర ఆర్థిక సంఘం గ్రాంట్లు బదిలీ అవుతాయి. ఇవి పారిశుద్ధ్యం మౌలిక వసతుల కల్పనకు ఉపయోగపడతాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులకు, కూలీల వేతనాలకు నిధులు అందుతాయి. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామ పారిశుద్ధ్య, ఘన వ్యర్థాల నిర్వహణకు నిధులు కేటాయిస్తారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతాయి. కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన జల్ జీవన్ మిషన్ ద్వారా శుద్ధమైన తాగునీటి సరఫరాకు నిధులు విడుదల చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. రాష్ట్ర ప్రభుత్వం స్టాంపు డ్యూటీ వాటా చెల్లిస్తుంది. భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే స్టాంపు డ్యూటీలో కొంత వాటాను పంచాయతీలకు అందిస్తుంది. రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు అభివృద్ధి, నిర్వహణ ఖర్చుల కోసం ప్రభుత్వం సాధారణ గ్రాంట్లు విడుదల అవుతాయి. ప్రత్యేక అవసరాల కోసం ముఖ్యమంత్రి హామీల అమలుకు, ఇతర కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. గ్రామ పంచాయతీ ఖర్చులను మూడు రకాలుగా పరిశీలించవచ్చు. కార్యాలయ నిర్వహణ, పాలనా వ్యయాలు, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పచ్చదనం నిర్వహణ, సామాజిక కార్యక్రమాలకు నిధులు వ్యయం చేస్తారు. ప్రజలు కేంద్ర ప్రభుత్వ ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్ ద్వారా పంచాయతీకి కేటాయించిన బడ్జెట్, ఖర్చుల వివరాలు, ఆడిట్ నివేదికను సులభంగా పరిశీలించవచ్చు. ఇది గ్రామాభివృద్ధిలో జవాబుదారీ తనాన్ని పెంచుతుంది. -
‘బొమ్మ’ ఆశయాలను కొనసాగిస్తాం
● మంత్రి పొన్నం ప్రభాకర్ ● ఏకగ్రీవంగా ఎన్నికై న సర్పంచ్ భూక్య రాజేశ్వరికి సన్మానం హుస్నాబాద్: ఇందుర్తి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బొమ్మ వెంకటేశ్వర్లు జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన విగ్రహానికి మంత్రి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే బలహీన వర్గాల ఉద్యమం, సామాజిక న్యాయం కోసం పోరాడిన వ్యక్తి వెంకటేశ్వర్లు అని కొనియాడారు. ఈ ప్రాంతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సందర్బంగా ప్రజల ఆకాంక్ష గౌరవెల్లి ప్రాజెక్టు సాధన కోసం పని చేశారన్నారు. మార్గదర్శిగా ఉన్న బొమ్మ వెంకటేశ్వర్లు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్, ఎండీ హస్సెన్ తదితరులు ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మానం హుస్నాబాద్ మండలం వంగ రామయ్య పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై న భూక్య రాజేశ్వరి తిరుపతిని మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించి అభినందించారు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికై న ఉప సర్పంచ్ దండుగుల రాజుతో పాటుగా వార్డు సభ్యులను సన్మానించారు. -
ఓటెత్తిన పల్లె
88.05 శాతం పోలింగ్ నమోదు.. తొలి విడత 147 సర్పంచ్, 1,208 వార్డుల్లో ఎన్నికలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేసిన పల్లె వాసులు సాక్షి, సిద్దిపేట: జిల్లాలో పల్లె ఓటరు ఓటెత్తారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని ఏడు మండలాల్లో పోలింగ్ జరిగింది. గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గజ్వేల్, మర్కూక్, జగదేవ్‌పూర్, ములుగు, వర్గల్, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోలు మండలాలల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి 147 సర్పంచ్, 1,208వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చలి తీవ్రత కారణంగా... ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో తొలి గంట సేపు పోలింగ్ నెమ్మదిగా సాగింది. 8 గంటల నుంచి ఊపందుకుంది. పోలింగ్‌కు ఆరు గంటల సమయం ఉండటంతో పోలింగ్ కేంద్రాలకు త్వరగా వచ్చారు. హైదరాబాద్‌కు ఉపాధికి, ఉద్యోగ కోసం వెళ్లిన పల్లె ఓటర్లు తమ సొంత గ్రామానికి చేరకుని ఓటు వేశారు. చాలా మంది ఓటర్లను అభ్యర్థులు తమ సొంత వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు. చివరి అరగంట పోలింగ్ కేంద్రాల వద్ద హడావుడి కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతి, సీపీ విజయ్ కుమార్ పర్యవేక్షించారు. భారీగా పోలింగ్.. తొలివిడత పోలింగ్ భారీగానే నమోదైంది. ఏకంగా 88.05 శాతం నమోదైంది. రాయపోలు మండలంలో అత్యధికంగా 89.59 శాతం పోలింగ్ నమో దైంది. అత్యల్పంగా జగదేవ్‌పూర్‌లో 84.27 శాతం ఓట్లు పోలయ్యాయి. మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటింగ్ సరళి ఇలా.. ఉదయం 9 గంటల వరకు పోలైన ఓట్లు: 44,995 (24.46 శాతం) 11 గంటల వరకు ఇలా: 1,10,488 (60.06 శాతం) మధ్యాహ్నం 1 గంట వరకు : 1,47,348 (80.10 శాతం) పోలింగ్ ముగిసే సమయం వరకు : 1,61,971 (88.05 శాతం) -
జాలిగామలో ఉద్రిక్తత
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ మండలం జాలిగామలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటర్లను ప్రలోభ పెడుతూ ప్రచా రం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి తాళ్ల లావణ్య భర్త నవీన్‌గౌడ్‌ను, 4వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కరుణాకర్ భార్య అనసూయలను అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా పోలింగ్ కేంద్రం సమీపంలో గుంపులుగుంపులుగా వస్తుండటంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బహిలంపూర్లో.. ములుగు(గజ్వేల్): మండల పరిధి బహిలంపూర్లో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో అధికారులు నిర్దేశించిన ప్రదేశంలో వేచిఉన్న వారిని పోలీసులు అక్కడినుంచి పంపించే క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు తలెత్తొద్దు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లిలో ఈనెల 14న జరిగే మల్లన్న కల్యాణ ఏర్పాట్లను దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు గురువారం ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు. స్వామి వారి కల్యాణం జరిగే తోటబావి ప్రాంగణం, క్యూకాంప్లెక్స్, ఆలయ పరిసరాలను సందర్శించారు. అనంతరం ఆలయ కార్యాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి తగు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలలో శానిటేషన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఏసీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఓం ప్రకాశ్, ఆలయ ఈఓ వెంకటేశ్, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు చంద్రశేఖర్‌లు ఉన్నారు. వెండి వస్తువుల బహూకరణ మల్లన్న స్వామికి అమీన్‌పూర్‌కు చెందిన భక్తులు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి 500 గ్రాములు వెండి వస్తువులను విరాళంగా గురువారం ఆలయ ఈఓ టంకసాల వెంకటేశ్‌కు అందిచారు. స్వామివారికి నైవేద్యం సమర్పించేందుకు ఉపయోగించే వెండి బాక్స్‌లను బహూకరించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ముఖ్య అర్చకులు చిన్న మల్లికార్జున్, మనోహర్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్ పకడ్బందీగా చేపట్టాలి
● అధికారుల అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించాలి ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హైమావతిములుగు(గజ్వేల్): గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని, పై అధికారుల అనుమతితో ఫలితాలను విడుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి సూచించారు. ములుగు మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లను ఆమె బుధవారం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పీఓ, ఓపీఓలకు బ్యాలెట్ బ్యాక్స్ ఉపయోగించే ప్రక్రియ గురించి ఎలాంటి సందేహాలున్నా మాస్టర్ ట్రైనర్లను అడిగి పరిష్కరించుకోవాలని తెలిపారు. పోలింగ్ మెటీరియల్‌తో పోలింగ్ స్టేషన్లకు వెళ్లిన సిబ్బంది ఫర్నిఛర్, బ్యాలెట్ బాక్స్‌లు, ఆయా మెటీరియల్‌ను సరిచేసుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ తప్పనిసరిగా ఉదయం 7 గంటలకు మొదలు పెట్టాలన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతాన్ని తెలపాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లకు ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని, ఆతరువాతే బ్యాలెట్ బాక్స్‌లకు సీల్ వేయాలన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిచాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలలోకి ఏజెంట్లు, పోలింగ్ సిబ్బందికి ఫోన్ల అనుమతి లేదన్నారు. ఎన్నికల సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలు పంచాయతీ కార్యదర్శులు సమకూరుస్తారని తెలిపారు. ఎన్నికల విధులకు గైర్హాజరు అయిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరూ సహకరించాలి గజ్వేల్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. బుధవారం గజ్వేల్ ఐఓసీ (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. గజ్వేల్, దుబ్బాక నియోజకర్గాల్లోని 147 సర్పంచ్ స్థానాలు, మరో 1208 వార్డు సభ్యుల స్థానాలకు మొదటి విడత పోలింగ్ జరుగుతోందని చెప్పారు. 33 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామని, ఇందులో 5 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, మిగిలిన చోట మైక్రోఅబ్జర్వర్ల నిఘా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలన్నారు. ఓటర్లు ఓటు వేయడానికి వచ్చే సందర్భాల్లో తమ వెంట తప్పనిసరిగా గుర్తింపుకార్డును తెచ్చుకోవాలన్నారు. నిబంధనలు పాటించకతప్పకపోతే చర్యలు తప్పవన్నారు. -
ఏమవుతుందో ఏమో..?
దుబ్బాక/వర్గల్: పంచాయతీ ఎన్నికల పర్వం తుదిఅంకానికి చేరుకోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. గెలుపే లక్ష్యంగా ముమ్మర ప్రచారం కొనసాగించిన అభ్యర్థులు బుధవారం ఓటరు దేవుని ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నం వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా కొన్ని గ్రామాల్లో ఓటర్లకు తాయిళాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తొలి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల కుటుంబాల్లో తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతుండటం.. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కానుండటంతో పోటీలో ఉన్న అభ్యర్థుల గుండెల్లో గుబులు నెలకొంది. ఇన్ని రోజులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారాలు.. ప్రలోభాలు చేపట్టాం.. ఇప్పుడు ఏం జరుగుతుందో? తీర్పు ఎలా ఉంటుందో? నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. గెలవకుంటే ఎట్లా..? ‘ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం.. అమ్ముకున్నాం.. అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో..’ అంటూ పోటీలో ఉన్న అభ్యర్థులు తీవ్ర కలవరం చెందుతున్నారు. గెలవకుంటే ఎట్లా అన్న సందిగ్ధం వారిలో నెలకొంది. ఏదేమైనా ఈ పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో కొన్ని గంటల్లో తేలనుంది. అభ్యర్థుల్లో టెన్షన్ నేడు తేలనున్న భవితవ్యం -
అభ్యర్థులు ఖర్చుల వివరాలివ్వాలి
ఎన్నికల పరిశీలకురాలు నిశాంతి చేర్యాల(సిద్దిపేట): సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఎన్నికల ఖర్చుల వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని వ్యయ పరిశీలకురాలు నిశాంతి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మండల పరిధిలోని ముస్త్యాల రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఖర్చుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో వ్యయ పరిశీలకురాలు నిశాంతి మాట్లాడుతూ అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులకు సంబంధించిన లెక్కలు రాసి సమర్పించాలన్నారు. ఎంపీడీఓ ప్రణయ్ మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నియమావలి పాటించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ దిలీప్ నాయక్, సహాయ పరిశీలకులు శ్రీనివాస్‌రెడ్డి, పోలీసు అదికారులు, బరిలో నిలిచిన అభ్యర్థులు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. -
బీజేపీతోనే పల్లెల అభివృద్ధి
మిరుదొడ్డి(దుబ్బాక): బీజేపీతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మిరుదొడ్డి సర్పంచ్‌గా బీజేపీ బలపర్చిన కానుగంటి స్వప్న శ్రీనివాస్ గెలుపు కోపం మిరుదొడ్డిలో బుధవారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం లేని అభ్యర్థులకు ఓటేస్తే అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు నిధులు లేవన్న సాకుతో పాలన చేతకాక చేతులెత్తేశారని మండిపడ్డారు. కేంద్రంలో ఉన్న బీజేపీతోనే పల్లెల అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో టెలికం బోర్డు మెంబర్ మొగుళ్ల మల్లేశం, నాయకులు ఎల్లం, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.ఎంపీ రఘునందన్‌రావు -
మానవ హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): మానవ హక్కుల పరిరక్షణ బాధ్యత అందరిపై ఉందని అదనపు సీనియర్ జడ్జి సంతోష్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అదనపు సీనియర్ జడ్జి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందన్నారు. మానవ హక్కులకు భంగం వాటిల్లకుండా చేసుకునే హక్కు అందరికీ ఉందన్నారు. భంగం వాటిల్లితే మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ శరత్‌బాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 010 ఖాతా ద్వారా జీతాలు చెల్లించాలి గజ్వేల్‌రూరల్: ఉద్యోగుల వేతనాలను 010 ఖాతా ద్వారా చెల్లించాలని గజ్వేల్ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ అన్నపూర్ణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రధాన ఖాతా (010) ద్వారా వేతనాలు చెల్లించడం ద్వారా పారదర్శకత, ఉద్యోగ భద్రత అంశాల్లో స్పష్టత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎంఓలు, వైద్యు లు, నర్సింగ్ అధికారులు, పారా వైద్య సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఆన్‌డ్యూటీగా పరిగణించండి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గ్రామ పంచాయతీ ఎన్నిలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పోలింగ్ మరుసటి రోజు ఓడీ (ఆన్ డ్యూటీ)గా పరిగణించాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతల్లో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు పోలింగ్ డే మరుసటి రోజున విధులకు రావడం సాధ్యం కాదన్నారు. అందువలన పోలింగ్ మరుసటి రోజున ఓడీ ఇవ్వాలన్నారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి, జిల్లా కార్యదర్శి గ్యార ప్రవీణ్ కుమార్, జిల్లా కమిటీ సభ్యులు తలారి కనకయ్య, కిషన్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. నేడు పత్తి కొనుగోళ్లు బంద్ గజ్వేల్‌రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ మండలం పిడిచెడ్ సమీపంలోని ఈశ్వరసాయి కాటన్ ఇండస్ట్రీస్, సాయి బాలాజీ కాటన్ ఇండస్ట్రీస్, శివగంగా కాటన్ ఇండస్ట్రీస్(బయ్యారం)తో పాటు పట్టణ శివారులోని శ్రీ వాసవి కాటన్ ఇండస్ట్రీస్(జిన్నింగ్ మిల్)లలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు జరగవని తెలిపారు. ఎన్నికలు జరిగే రోజున కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుకింగ్ ఉండదని, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మూసి ఉంటుందని తెలిపారు. రైతులు విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు. -
పల్లె తీర్పు నేడే
మొదటి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధంపోలింగ్ సామగ్రితో సిబ్బందిగజ్వేల్: జిల్లాలో గురువారం జరగనున్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, మర్కూక్తోపాటు దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో 163 పంచాయతీలున్నాయి. ఇందులో 16 సర్పంచ్, 224 వార్డులు ఏకగ్రీవం కాగా మిగిలిన 147 సర్పంచ్, 1208వార్డుల్లో పోలింగ్ జరగనున్నది. ఎన్నికల సామగ్రి పంపిణీ.. ఎన్నికల సిబ్బందికి అధికారులు సామగ్రి అందజేశారు. గజ్వేల్ మండలానికి సంబంధించి పట్టణంలోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్)లో, మర్కూక్ మండలానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ములుగు మండలానికి రైతు వేదిక, వర్గల్ మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, జగదేవ్‌పూర్ మండలానికి ఎస్వీ ఫంక్షన్ హాల్లో, దౌల్తాబాద్ మండలానికి తెలంగాణ మోడల్ స్కూల్లో, రాయపోల్ మండలానికి జీఎల్ఆర్ ఫంక్షన్‌హాలులో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. గజ్వేల్, ములుగు, రాయపోల్, దౌల్తాబాద్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ హైమావతి, అధికారులు పోలింగ్ నిర్వహణపై సూచనలు చేశారు. సాయంత్రం పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకుసామగ్రితో తరలివెళ్లారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టింది. ఇందులోభాగంగా ఇద్దరు అదనపు ఎస్పీలు, ముగ్గురు ఏసీపీలు, 15మంది సీఐలు, 35మంది ఎస్ఐలు, రెండు ఫ్లటూన్లు, 900మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు కలుపుకొని 1010 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు గజ్వేల్ ఏసీపీ నర్సింహులు తెలిపారు. మండలాల వారీగా ఓటర్ల వివరాలు.. గజ్వేల్ మండలంలో 34,006మంది ఓటర్లు ఉండగా, ఇందులో 16,544 మంది పురుషులు, 17,460మంది మహిళలు, మరో ఇద్దరు ఇతరులు ఉన్నారు. ములుగు మండలంలో 31,055మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 15,450మంది పురుషులు, 15,605మంది మహిళలు ఉన్నారు. మర్కూక్ మండలంలో 19,493 మంది ఓటర్లుకుగానూ 9,575మంది పురుషులు, 9,918మంది మహిళలు ఉన్నారు. వర్గల్ మండలంలో 29,241ఓటర్లు ఉన్నారు. ఇందులో 14,458మంది పురుషులు, 14,783 మంది మహిళలు ఉన్నారు. జగదేవ్‌పూర్ మండలంలో 31,298మంది ఓటర్లకుగానూ 15,305మంది పురుషులు, 15,993మంది మహిళలు ఉన్నారు. దౌల్తాబాద్ మండలంలో 24,484మంది ఓటర్లకుగానూ 11,974మంది పురుషులు, 12,510మంది మహిళలు ఉన్నారు. రాయపోల్ మండలంలో 21,529మంది ఓటర్లకుగానూ 10,524మంది పురుషులు, 11,005మంది మహిళలు ఉన్నారు. పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు, జోనల్ అధికారులు, రూట్ అధికారులు కలుపుకొని మొత్తంగా 3,600మందికిపైగా నియమించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భద్రత కట్టుదిట్టం 147 సర్పంచ్, 1208 వార్డుల స్థానాల్లో ఎన్నికలు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు ఇవే.. రంగంపేట(గజ్వేల్), ఎర్రవల్లి, నర్సన్నపేట(మర్కూక్), జప్తి సింగాయపల్లి(ములుగు), పలుగుగడ్డ, బీజీ వెంకటాపూర్, నిర్మల్‌నగర్, అనంతసాగర్, కొండాపూర్(జగదేవ్‌పూర్), గుంటిపల్లి, చాంద్‌ఖాన్‌మక్త, తునికి మక్త(వర్గల్) ఆరేపల్లి, కొత్తపల్లి(రాయపోల్), నర్సంపల్లి, లింగాయపల్లి తండా(దౌల్తాబాద్)లు ఉన్నాయి. -
ఎన్నికల నియమావళి తప్పనిసరి
దుబ్బాకటౌన్: ఎన్నికలో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్, రాయపోల్ మండల కేంద్రాల్లో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, 100 నుంచి 200 మీటర్ల పరిధిలో ప్రత్యేక నిబంధనలు ఉండటంతో ప్రజలు అనవసరంగా గుమిగూడకూడదని తెలిపారు. ఓటర్లు క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారి పై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు. గొడవలు, అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, గజ్వేల్ ఏసీపీ నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్బి ఇన్‌స్పెపక్టర్ రామకృష్ణ, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ -
ఆఖరి మోఖా..
సెంటిమెంట్ రగిలిస్తూ.. కాళ్లపై మోకరిల్లుతూ.. గజ్వేల్: జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నిన్నమొన్నటి వరకు నిత్యం ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు.. పోలింగ్‌కు ఇక ఒకే ఒక్క రోజు మిగిలి ఉండటంతో అఖరి ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఎలాగైనా గెలిచి తీరాలని, అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తున్నారు. కుల సంఘాల ఓట్లను ఇప్పటికే గంపగుత్తగా కొనుగోలు చేసిన అభ్యర్థులు ఈనెల 10 రాత్రి ఓటరు వారీగా పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ చేపట్టడానికి వ్యుహాల్లో ఉన్నారు. కొన్ని ప్రధాన గ్రామాల్లో ఒక్కో ఓటుకు రూ.1000–3000 ఇవ్వడానికి సిద్ధమవుతున్న ట్లు ప్రచారం. ఇకపోతే మద్యం కూడా నాణ్య మైన బ్రాండ్లను అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు.. ఓటర్లను వివిధ రూపాల్లో ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. చివరగా సెంటిమెంట్ అస్త్రాన్ని ఓటర్లపై ప్రయోగిస్తున్నారు. ‘అన్ని శక్తులొడ్డి ఎన్నికల్లో దిగినం.. ఇక మీ దయ’ అని కొందరు, ‘మాపై కుట్రలు జరుగుతున్నయ్.. సాదుకున్న మీరే సంపుకున్న మీరే’ అంటూ మరికొందరు, ‘గెలిపిస్తే మిమల్ని కళ్లల్లో పెట్టి చూసుకుంటా’ మని ఇంకొందరు సెంటిమెంట్ రగిలిస్తున్నారు. ఇవన్నీ పక్కనబెడితే కొందరు అభ్యర్థుల తమకు ఈ ఎన్నికలు చావో.. రేవో అంటూ ప్రతి ఓటరు కాళ్లపై మోకరిల్లుతున్నారు. ఈ సమయంలో కన్నీరు పెడుతూ ఓటు వేయాలని అడుగుతున్నారు. వినూత్న హామీలపై ఆశలు... మొదటి విడత ఎన్నికల్లో అభ్యర్థుల వినూత్న హామీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆడపిల్ల పుడితే.. రూ.5000 డిపాజిట్ చేస్తామని, పెళ్లిల్లో ఆడపిల్లకు రూ.5వేల నజరానా ఇస్తామని తదితర వినూత్న హామీలు పనిచేస్తాయని అభ్యర్థులు భావిస్తున్నారు. మరికొందరు ఇంకొ అడుగు ముందుకేసి సమస్యల పరిష్కారానికి బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. చివరి రోజు బలప్రదర్శన.. మంగళవారం చివరి రోజు ప్రచారంలో అభ్యర్థులు బలాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. భారీ ర్యాలీలు, మైక్ ప్రచారాలు, సభలు, సమావేశాలు నిర్వహించారు. పార్టీలకు సంబంధించిన రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి నాయకులను ఈ ప్రచారాల్లో భాగస్వాములను చేశారు. మొత్తానికి గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో మొదటి విడత ఎన్నికల పర్వం సర్వత్రా ఆసక్తిని రేకిత్తించింది.ఎల్లయ్య.. ఎవ్వలకు ఓటేద్దాం.. దుబ్బాకరూరల్: గ్రామాల్లో రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఎక్కడ చూసినా పంచాయతీ ఎన్పికలపైనే చర్చ జరుగుతోంది. సర్పంచ్ల ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఎక్కడ చూసినా గ్రామ ప్రజలంతా గ్రామ చావిడి, హోటళ్ల వద్ద గుమిగూడి ముచ్చట్లు పెడుతున్నారు. ‘అవురా.. ఎల్లయ్య మన ఊళ్లో ఎవ్వలకు ఓటు వేద్దాం? ముగ్గురు నిలబడిరి. ఎవ్వలైతే మంచిగుంటదరా’ అంటూ వృద్ధులు ముచ్చటిస్తున్నారు. ‘అరేయ్ మల్లయ్య.. గ్రామాన్ని ఎవ్వలైతే అభివృద్ధి చేస్తారో వారికే ఓటు వేద్దాం రా..’ అంటూ ముచ్చట పెడుతున్నారు. వృద్ధులు ముచ్చట పెడుతున్న ఈ దృశ్యం మండలంలోని అచ్చుమాయిపల్లి గ్రామంలోనిది.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు రేపు సెలవు సిద్దిపేటరూరల్: మొదటి విడతలో భాగంగా ఈనెల 11న జరిగే ఎన్నికల ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హైమావతి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గజ్వేల్, మర్కూక్, వర్గల్, జగదేవపూర్, ములుగు, దౌల్తాబాద్, రాయపోల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనున్న పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు హరిత, వ్యయ పరిశీలకులు నిశాంతి, అదనపు డీసీపీ కుశాల్కర్, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమీపిస్తున్న పరీక్షలు.. ఎన్నికల విధుల్లో టీచర్లు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల్లో ఎన్నికల గుబులు పట్టుకుంది. ఒకవైపు పరీక్షలు సమీపిస్తుండగా.. మరోవైపు ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు ఉండటంతో గడువులోగా సిలబస్ పూర్తికావడంపై సందిగ్ధం నెలకొంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలంటే నాణ్యమైన విద్యను అందించాలి. అలాగే వారిలో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టాలి. దీంతో వారు పరీక్షలకు సన్నద్ధమై పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అందుకు ముందుగానే పాఠ్యాంశాలు పూర్తి చేసి, విద్యార్థులకు పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను వినియోగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయులే కీలకం. వీరికి ముందుగానే ఎన్నికల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అలాగే ఓటింగ్, కౌంటింగ్ విధులు నిర్వహించనున్నారు. దీంతో పాఠశాలల్లో ఉండాల్సిన ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉంటున్నారు. గడువులోగా సిలబస్ పూర్తయ్యేనా -
సొంతూరు.. పోరు జోరు
వర్గల్(గజ్వేల్): హేమాహేమీల నెలవైన వర్గల్ మండల కేంద్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సొంత గ్రామం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతుతో ముగ్గురు అభ్యర్థులు పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొన్నది. వర్గల్ పంచాయతీ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో దీటైన అభ్యర్థి కోసం ఆయా పార్టీలు తీవ్ర కసరత్తు చేశాయి. కాంగ్రెస్ మద్దతుతో వర్గల్ మాజీ జెడ్పీటీసీ తాళ్ల సుధారాణి, బీఆర్ఎస్ మద్దతుతో ఆ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షుడు నాగరాజు తల్లి దేవగణిక జయభారతి, బీజేపీ మద్దతుతో వర్గల్ మాజీ ఉపసర్పంచ్ రమేశ్ సతీమణి పసుల రజిత పోటీలో నిలిచారు. ప్రతిష్టాత్మకమైన ఈ స్థానం కైవసం చేసుకునేందుకు ముగ్గురూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆంక్షారెడ్డి, నర్సారెడ్డి పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నర్సారెడ్డి సమక్షంలో ఇటీవల తాజా మాజీ జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ప్రతిష్టాత్మకమైన వర్గల్ తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి జిల్లా వ్యాప్తంగా నెలకొంది. -
మల్లన్న కల్యాణానికి ఏర్పాట్లు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం ఈనెల 14న జరగనుండటంతో ఆల య అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మంగళవారం రాతిగీరలు, కోనేరు లోని విగ్రహాలు, రాజగోపురం, కొడెల స్తంభం, స్వామివారి రథానికి రంగులు వేశారు.సోనియా చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం హుస్నాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిన సందర్భంగా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పులు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, తదితరులు ఉన్నారు. తెలంగాణ తల్లికి క్షీరాభిషేకం సిద్దిపేటజోన్: బీఆర్ఎస్ రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం డిసెంబర్ 9 పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక కోటిలింగాల దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, రాష్ట్ర కార్యదర్శి శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు వేణుగోపాల్ రెడ్డి, సాయిరాం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 2, 8, 13, 16, 32, వార్డుల్లో సమస్యలపై ఆరా తీశారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త వేయరాదని వార్డులో ప్రజలకు సూచించారు. యూజీడీ సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఇటీవల వేసిన సీసీ రోడ్లను పరిశీలించారు. మురికి కాల్వలో సిల్ట్ తొలగించాలని, చెత్త చెదారం లేకుండా చూడాలని ఆదేశించారు. రోడ్డు పక్కన మాంస విక్రయాలు జరుగుతున్న నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మాంస విక్రయాలు కేవలం మార్కెట్లలో మాత్రమే చేయాలని సూచించారు. అదేవిధంగా ఇరుకోడ్ శివారులో ఉన్న స్లాటర్ హౌస్‌ను సద్వినియోగం చేసుకోవాలని, అక్కడే మేకలను వధించాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్లు సురేష్, రాజేశం, చంద్రం, మల్లికార్జున్, పృథ్వి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల ‘సిత్రం’
గుర్తు చేతపట్టి.. మిరుదొడ్డి(దుబ్బాక): గ్రామ పంచాయతీ అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ఆయా గుర్తులతో అభ్యర్థులు ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. గుర్తుల కరపత్రాలు, వాల్ పోస్టర్లతోనే కాకుండా తమకు కేటాయించిన గుర్తులను చేతబూని ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ‘గుర్తు’ను గీసి.. ప్రచారం చేసిపంచాయతీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. మిరుదొడ్డిలోని 6వ వార్డులో ఓ చిన్నారి వినూత్న రీతిలో ప్రచారం చేయడం ఆలోచింపజేసింది. వార్డు మెంబర్‌గా బరిలో ఉన్న అంజయ్య కూతురు రియా ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేసింది. తన తండ్రికి కేటాయించిన గౌను గుర్తును తానే స్వయంగా గీసి ప్రచారం చేయడం ఆకట్టుకుంది. మా నాన్నకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తూ ఇలా కనిపించింది. -
ఓట్ల బేరం!
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జోరుగా ప్రలోభాల పర్వం ● ముగిసిన మొదటి విడత ప్రచారం ● 147 సర్పంచ్ పదవులకు 481 మంది పోటీ ● 1,208 వార్డులకు 2,972 మంది బరిలో.. ● రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలు నేరుగా ఓటరును కలిసి.. గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. మొదటి విడతలో జరిగే పంచాయతీల్లో ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలతో ముగిసింది. ఇక పోటీ చేసే అభ్యర్థులు.. ప్రలోభాలకు తెరలేపారు. మద్యం, డబ్బుల పంపిణీకి ముమ్మరంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. గురువారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. – సాక్షి, సిద్దిపేట మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు నవంబర్ 27 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. ఈ నెల 3న నామినేషన్ల విత్‌డ్రా, మధ్యాహ్నం 3గంటలకు అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. మొదటి విడతలో జరిగే వాటిలో 16 సర్పంచ్‌లు, 224 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 147 సర్పంచ్‌లకు గాను 481 అభ్యర్థులు, 1,208 వార్డు సభ్యులకు 2,972 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. హోరాహోరీగా ప్రచారం మొదటి విడత గ్రామ పంచాయతీల్లో ప్రచారం మంగళవారం చివరి రోజు హోరెత్తించారు. అసెంబ్లీ ఎన్నికలు తలెదన్నేలా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా నిర్వహించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు గెలుపు కోసం ఇంటింటికీ ఓట్లను అభ్యర్థించారు. ఉన్న సమయంలో ఓటర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒక అవకాశాన్ని ఇవ్వాలని కోరారు. తమను గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులే కాకుండా మిగతా పోటీలో ఉన్న అభ్యర్థులు కూడా గెలుపు కోసం ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.పోలింగ్ ఏర్పాట్లు మొదటి విడత గ్రామాల్లో పోలింగ్ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలింగ్ అధికారులకు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.ఓటరును నేరుగా కలిసి డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. పెద్ద గ్రామ పంచాయతీలలో ఓటుకు రూ.500 నుంచి రూ.2,000 వరకు అందజేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల పై నిఘా ఉండటంతో తమకు దగ్గరగా ఉన్న బంధువులు, స్నేహితుల ద్వారా డబ్బులను సర్దుబాటు చేసుకుంటున్నారు. పోలీసులు నిత్యం తనిఖీలు చేస్తుండటంతో మద్యం, డబ్బులు ఎలా పంపిణీ చేయాలని తర్జనభర్జన చెందుతున్నారు. -
‘గుర్తు’ంచుకో
హలో తమ్మి.. ● అభ్యర్థుల మంతనాలు ● నేటితో ముగియనున్న మొదటి దశ ప్రచారం ● యువ ఓటర్ల పైనే ఆశలు‘ఏం తమ్మి అంతా మంచిదేనా.. కుటుంబ సభ్యులందరూ బాగున్నారా.. ఈ మధ్య ఊరికి వచ్చుడే బంద్జేసినవ్.. ఓటేసేందుకు తప్పక రావాలి.. నేను పలానా గుర్తుకు నిలబడినా.. ’ అంటూ కొందరు సర్పంచ్ అభ్యర్థులు కనిపించిన యువకులతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మరోవైపు ఫోన్ల ద్వారా సంప్రదిస్తున్నారు. ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని, ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రాధేయపడుతుండటంతో సర్వత్రా ఆసక్తికరంగా మారింది. – దుబ్బాకటౌన్ జిల్లాలో మొదటి విడత జరిగే పంచాయతీ ఎన్నికలల్లో భాగంగా గజ్వేల్ డివిజన్లో మంగళవారంతో ప్రచారం ముగియనుంది. దీంతో సోమవారం ప్రచారం జోరందుకుంది. కోడికూత కూయగానే అభ్యర్థులు చలిని సైతం లెక్క చేయకుండా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజు సమయం ఉండటంతో ముమ్మరంగా ప్రచారం చేశారు. అటు సోషల్ మీడియాలో సైతం పలానా గుర్తుకు ఓటేయాలని స్టేటస్లు పెడుతూ..సమీప బంధువులు, స్నేహితులతో సైతం స్టేటస్లు పెట్టిస్తుండటం గమనార్హం. జర ఓటేయమని చెప్పవా.. బాపు కొడుకుకి ఫోన్ చేసినా ఎత్తడం లేదు. జర ఫోన్ చేసినపుడు జర ఓటేయమని చెప్పు. గెలుస్తే తప్పక ఏ సమస్య వచ్చినా తీరుస్తా.. అని ఇంటింటికీ ప్రచారం చేస్తూ పట్టణంలోని యువకుల ఓట్ల కోసం బతిమాలుతున్నారు. -
ప్రచార హోరు.. ఆఫర్ల జోరు
మంగళవారం శ్రీ 9 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఏకగ్రీవాల కోసం ప్రలోభాలుగ్రామాల్లో సర్పంచ్ పదవుల ఏకగ్రీవానికి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా ఈ నెల 11, 14, 17వ తేదీల్లో జరగనున్నాయి. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణ పూర్తి అయ్యింది. రెండు విడతల్లో ఉప సంహరణలు ముగిశాయి. మూడో విడత మంగళవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. ఏకగ్రీవాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటూ ప్రజా ప్రతినిధులు.. గ్రామాభివృద్ధికి సొంత నిధులను వెచ్చిస్తామంటూ అభ్యర్థులు ముందుగానే ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 26 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు ఏకగ్రీవం కాగా, పలు చోట్ల ఆఫర్లు బహిరంగంగా జరగడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. వీటిపై క్షేత్రస్థాయి అధికారులు విచారణ చేపడుతున్నారు. – సాక్షి, సిద్దిపేట -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించండి
● కలెక్టర్ హైమావతి ● సమస్యాత్మక గ్రామాల సందర్శనగజ్వేల్: పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనపై అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం గజ్వేల్ మండలంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన శ్రీగిరిపల్లి, సింగాటం, జాలిగామ గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిపేలా కృషి చేయాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రాల వద్ద విద్యుత్ సరఫరా, లైట్లు, ఫ్యాన్లు, ర్యాంపు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, మంచినీరు తదితర కనీస వసతులను కల్పించాలని చెప్పారు. లైవ్ వెబ్‌కాస్టింగ్ కోసం నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటరు స్లిప్పులను వందశాతం పంపిణీ చేయాలని ఆదేశించారు. -
తోటి కోడళ్ల ‘పంచాయతీ’
తొగుట(దుబ్బాక): సర్పంచ్ పదవి కోసం తోటి కోడళ్ల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. రిజర్వేషన్లలో భాగంగా లింగంపేట సర్పంచ్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. స్వయాన అన్నదమ్ములైన గొడుగు ఐలయ్య, గొడుగు నర్సింహులు తమ సతీమణులు యాదమ్మ, జయమ్మలను బరిలో దింపారు. దీంతో వారు ఇంటింటికీ తిరుగుతూ సర్పంచ్‌గా గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మద్దతుగా నిలవాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు అన్నదమ్ముల మధ్య పోరు రసవత్తరంగా మారిందని పలువురు అంటున్నారు. గొడుగు యాదమ్మ 2006లో సర్పంచ్‌గా పనిచేశారు. గ్రామంలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా నిర్మల్ గ్రామ పురస్కార్‌ను అందుకున్నారు. ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి తీరుతానంటూ జయమ్మ సైతం ఓటర్లను కోరుతున్నారు. -
గొప్ప దార్శనికుడు రాజేశ్వరరావు
సిద్దిపేటఎడ్యుకేషన్: సిద్దిపేట ప్రాంతానికి విద్యుత్ కాంతులతో పాటు విద్యాకాంతులను పంచిన మహనీయుడు, మాజీ ఎమ్మెల్యే పండరి వెంకట రాజేశ్వరరావు అని ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, సురభివాణీ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో సోమవారం రాజేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో సిద్దిపేటకు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించిన గొప్పవ్యక్తి రాజేశ్వరరావు అని అన్నారు. వేల మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన కళాశాల మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాయకులను అందించిందని చెప్పారు. దార్శనికతతో చేసిన గొప్ప పనులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. సిద్దిపేట ప్రాంతానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ 1956లో 36 మంది విద్యార్థులో ప్రారంభమైన కళాశాల ప్రస్తుతం 22 యూజీ కోర్సులు, 12 పీజీ కోర్సులతో 4,500ల మంది విద్యార్థులతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా ఎదిగిందన్నారు. నాటి నుంచి కళాశాల ఎంతో మంది ఐఏఎస్‌లను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను, రాజకీయనాయకులను, సామాజికవేత్తలను, ఉద్యోగులను, కళాకారులను అందించిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్, దేవీప్రసాద్, డాక్టర్ నందిని సిధారెడ్డి, డాక్టర్ పాపయ్య, రాఘవేందర్రావు, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డితో పాటు రాజేశ్వర్‌రావు కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
వంచన ముందు ఓడాడు!
పీపడ్పల్లి సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యరాయికోడ్(అందోల్): కొడుకు సర్పంచ్ బరిలో దిగితే ఆ మాతృమూర్తి మురిసిపోయింది. ఊరికి రా‘రాజు’అవుతాడని కలలు కన్నది. అయితే.. ఎన్నికల్లో అన్నీ ప్రతికూల పరిస్థితులు ఎదురవడం.. నమ్మిన వారే నట్టేట ముంచడం.. చేతిలో ఉన్న డబ్బు చూస్తుండగానే కర్పూరంలా కరిగిపోవడం.. ఆఖరుకు తల్లి ధైర్యం చెప్పినా కోలుకోలేని నిస్సహాయస్థితి దాపురించడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. రాయికల్ మండలంలోని పీపడ్పల్లికి చెందిన రాజు (35) చురుకై న కాంగ్రెస్ కార్యకర్త. ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచాడు. ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న క్రమంలో ఎన్నికల ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. నమ్ముకున్న పార్టీ నాయకులు ఒక్కొక్కరు పక్కకు జారుకుంటున్నారు. బరిలో దింపిన సీనియర్లే తనకు సహకరించడం లేదని సన్నిహితులు, కుటుంబ సభ్యుల వద్ద రాజు ఆవేదన వ్యక్తం చేశాడు. చేతిలో ఉన్న డబ్బు అయిపోయింది. తోటి నాయకుల సహకారం లభించడం లేదు. బిడ్డా.. పొలం అమ్ముకో.. ఇక తాను ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కోలేనని తల్లికి చెప్పాడు. ఒక్కగానొక్క కొడుకు పడుతున్న బాధలు భరించలేని ఆ తల్లి.. ‘ఎకరం పొలం అమ్ముకో బిడ్డా.. ధైర్యంగా ఉండు’అని చెప్పింది. అన్ని వైపుల నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుండడంతో రాజు ధైర్యం కోల్పోయాడు. అయ్యప్ప మాల ధరించిన అతను .. ఉపవాస దీక్షతో పాటు ప్రచారం చేస్తుండటం సరైన నిద్ర లేదే. దీంతో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో స్నేహితులు రాయికోడ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అనంతరం ఎప్పటిలాగానే శంషొద్దీన్పూర్ గ్రామ శివారులోని అయ్యప్ప సన్నిధానానికి చేరుకున్నాడు. అక్కడే తోటి స్వాములతో కలసి నిద్రించాడు. వేకువజామున ఐదు గంటలకు కాలకృత్యాలకని వెళ్లి సన్నిధానానికి కొంతదూరంలోని చెట్టుకు మెడలోని మాల టవల్‌తో ఉరివేసుకున్నాడు. ఎంతకూ తిరిగి రాకపోవడంతో తోటి స్వాములు వెతకగా అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలం వద్ద, మృతదేహాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సహకరించని తోటి నాయకులు చూస్తుండగానే కర్పూరంలా కరిగిన డబ్బు తల్లి ధైర్యం చెప్పినా ఆగని దారుణం మృతుడు అయ్యప్ప మాలధారుడు రాయికల్ మండలంలో కలకలం మృధుస్వభావి అయిన రాజు ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తల్లికి ఒక్కడే కుమారుడు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మృతుడి తల్లి, భార్య బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద ఛాయలు -
ఎన్నికల విధులు వద్దు
టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ ఉపాధ్యాయులకు మినహాయించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి సోమవారం సిద్దిపేటలో అన్నారు. రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు వేయడం తగదన్నారు. కొంతమంది ఉపాధ్యాయులను అసలే తీసుకోలేదని, వచ్చినవారికి మూడు డ్యూటీలు వేశారని ఆరోపించారు. ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నేరుగా శిక్షణలకు పంపించడం, సుదూర ప్రాంతాల్లో ఎన్నికల విధులు కేటాయించడం వలన ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మానవతా దృక్పథంతో ఎన్నికల విధులనుంచి మినహాయించాలని ఆయన కోరారు. నాడు పతులు.. నేడు సతులుచేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని వీరన్నపేట సర్పంచ్‌గా గత ఎన్నికల్లో భర్తలు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. నేటి ఎన్నికల్లో వారి భార్యలు ప్రధాన పార్టీల మద్దతుతో పోటీలో నిలిచారు. నాడు కొండపాక భిక్షపతి, ఎలికట్టె శివశంకర్ పోటీ పడగా భిక్షపతి సర్పంచ్‌గా గెలిచారు. తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలికట్టె శివశంకర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందారు. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అధికార పార్టీ మద్దతుతో భిక్షపతి భార్య కనకలక్ష్మి, బీఆర్ఎస్ మద్దతుతో ఎలికట్టె శివశంకర్ భార్య శైలజ బరిలో నిలిచారు. దరఖాస్తుల ఆహ్వానం హుస్నాబాద్: రేణుకా ఎల్లమ్మ దేవాలయ కమిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్లమ్మ జాతర సందర్భంగా నెల రోజుల పాటు ఉత్సవ కమిటీ వేశారు. ఆ గడవు ముగిసింది. ప్రస్తుతం కొత్తగా ఆసక్తి గల అభ్యర్థులు సంగారెడ్డి సహాయ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆలయ కమిటీ కార్యనిర్వాహణ అధికారి కిషన్‌రావు పేర్కొన్నారు. నేడు విజయోత్సవ వేడుకలు సిద్దిపేటజోన్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ విజయోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉదయం 10గంటలకు కోటిలింగాల దేవాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ, మోడల్ బస్టాండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. మద్యం కొనొద్దని వినూత్న నిరసన సిద్దిపేటజోన్: మద్యం కొనొద్దని బీజేపీ నేతలు వినూత్న నిరసనకు దిగారు. పట్టణ శివారులో దేవాలయం సమీపంలో వైన్స్ ఏర్పాటు చేశారని, వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ అధ్యక్షుడు వెంకట్ ఆధ్వర్యంలో మద్యం దుకాణం ఎదుట మద్యం కొనొద్దని ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని శాంతిపజేశారు. పనిచేసిన చోటే ప్రజాప్రతినిధిని కావాలని.. సిద్దిపేటఅర్బన్: మండలంలోని మిట్టపల్లి గ్రామంలో ఏడే ఎల్లవ్వ 7వ వార్డ్ సభ్యురాలిగా పోటీ చేస్తున్నారు. భర్త మరణించడంతో ఎల్లవ్వ గతంలో గ్రామ సేవకురాలిగా పనిచేశారు. ఇప్పుడు తమ వార్డు రిజర్వేషన్ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో వార్డు మెంబర్‌గా పోటీలో నిలిచారు. తాను గెలిచి చిరుద్యోగిగా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సేవలందిస్తానని చెప్తున్నారు. సర్పంచ్ బరిలో ముగ్గురు రేషన్ డీలర్లు బెజ్జంకి(సిద్దిపేట): ముగ్గురు రేషన్ డీలర్లు సర్పంచ్‌లుగా పోటీ చేస్తున్నారు. బెజ్జంకి సర్పంచ్‌గా బొల్లం శ్రీధర్(పెద్దన్న), రేగులపల్లెలో దుంబాల పద్మ, దేవక్కపల్లెలో పడాల సత్యనారాయణ బరిలో ఉన్నారు. ప్రజలతో ఉన్న సత్సంబంధాలే తమకు విజయం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
బహుళజాతి ప్రయోజనాల కోసమే విత్తనచట్టం
దుబ్బాక: బహుళజాతి కంపెనీల ప్రయోజనాల కోసమే కేంద్రం కొత్తగా విత్తనచట్టం తెచ్చిందని రైతు కూలిసంఘం నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో విత్తన చట్టం ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు కూలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి, జిల్లా అధ్యక్షుడు ఎల్లన్న, ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ సంతోష్ మాట్లాడుతూ ఇది పూర్తిగా రైతు వ్యతిరేక చట్టమన్నారు. ఈ చట్టంతో విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, ఆహార భద్రత లేకపోగా బహుళ జాతి, ప్రైవేట్ కంపెనీల నియంత్రణలో కొనసాగే విధంగా ఉందన్నారు. రైతు కేంద్రీకృత వ్యవస్థను బలహీనపర్చడమే కాకుండా జీవవైవిధ్య పరిరక్షణ, రైతుల హక్కుల కు సంబంధించిన భారత న్యాయనిర్మాణాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఇది పూర్తిగా కార్పొరేట్ సంస్థల లాభం కోసం పనిచేసే చట్టం అన్నారు. కార్యక్రమంలో రైతు కూలిసంఘం జిల్లా నాయకులు మేకల రాములు, శ్రామికశక్తి బీడీవర్కర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు శ్రీదేవి, లక్ష్మణ్, రాజేష్, శేఖర్ ఉన్నారు. -
కాంగ్రెస్ పాలనలోనే సమ న్యాయం
దుబ్బాక: కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఆదివారం భూంపల్లి–అక్బర్పేట మండలం పోతారెడ్డిపేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఏపీ గీతాపారిశ్రామిక సంఘం మాజీ చైర్మన్ దివంగత బండి నర్సాగౌడ్ సతీమణి భాగ్యలక్ష్మి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలన విజయవంతంగా చేపడుతున్నామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని వాటిని సరిచేస్తూ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. మంచి వారినే ఎన్నుకోవాలి సర్పంచ్ల ఎన్నికల్లో సమర్థులైన మంచి నాయకులను ఎన్నుకోవాలని ఆయన సూచించారు. అధికారపార్టీకి చెందిన వారిని ఎన్నుకుంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లు వేయాలన్నారు. గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లే కీలకమన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాతూరి శ్రీనివాస్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ సంయుక్త శ్రీధర్, నాయకులు కమలాకర్, మంద చంద్రసాగర్, బాల్యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, మధు, ప్రతాప్, బాల్తె వెంకటేశం తదితరులు ఉన్నారు. గ్రామాభివృద్ధికి పాటుపడేవారినేఎన్నుకోండి విజయవంతంగా ప్రజాపాలన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ -
అంతటా మనోళ్లే గెలవాలి
గజ్వేల్: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తాను చాటాలని జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డుల కోసం, ఇళ్ల కోసం పేదలకు ఎదురుచూపులే మిగిలాయన్నారు. నేడు ఆ పరిస్థితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో విభేదాలను పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడమే కార్యకర్తలు, నాయకుల లక్ష్యం కావాలన్నారు. ఏకగ్రీవ సర్పంచ్‌లకు సన్మానం ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్‌లను మంత్రి సన్మానించారు. జగదేవ్‌పూర్ మండలం నిర్మల్‌నగర్ సర్పంచ్ కత్తి పద్మారావు, కొండాపూర్ సర్పంచ్ పుష్ప, పలుగుగడ్డ సర్పంచ్ కనకయ్య, వర్గల్ మండలం తున్కిమక్త సర్పంచ్ స్వామి, కుకునూర్‌పల్లి మండలం పీటీ వెంకటాపూర్ సర్పంచ్ భాస్కర్ తదితరులు సన్మానం పొందిన వారిలో ఉన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలు విభేదాలను పక్కనబెట్టి పనిచేయండి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ‘స్థానిక’ంగా కాంగ్రెస్ జోష్.. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి జోష్ వచ్చిందని మంత్రి వివేక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలుచేస్తున్న పథకాలపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్లా కాంగ్రెస్ మద్దతు దారులే విజయం సాధిస్తారన్నారు. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అత్తు ఇమామ్, సాకి ఆనంద్, కలీముద్దీన్, బొమ్మల యాదగిరి, భిక్షపతి గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లన్నా.. పల్లకీ సేవ ఏమాయె!
ఏళ్లుగా భక్తుల ఎదురుచూపులు ● మూడేళ్లక్రితం అనుమతిచ్చినా నేటికీ అమలు కాని దుస్థితి ● ఆలయ వర్గాల జాప్యమే కారణమా? కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న భక్తులు పల్లకీ సేవ భాగ్యం కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో కొనసాగిన ఉత్సవ మూర్తుల సేవను పునరుద్ధరించేందుకు దేవాదాయ శాఖ అనుమతి ఇవ్వడంతో తిరిగి ప్రారంభించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించి మూడేళ్లవుతున్నా.. నేటికీ అమలుకునోచుకోవడంలేదు. వాస్తవానికి ఆలయాల్లో ప్రతిష్ఠించిన మూల విరాట్‌ను కదిలించే అవకాశం ఉండదు. ఉత్సవ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉత్సవాలకు వినియోగిస్తారు. స్వామి వారి పూజలకు సంబంధించి పల్లకీ సేవ కూడా ఉపాచారంగా భావించి ఉత్సవ మూర్తులతో ఉత్సవాలు నిర్వహిస్తారు. తద్వారా పల్లకీ మోసిన వారికి, దేవతామూర్తులను చూసిన వారికి సంపూర్ణం అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. గతంలో నిత్యం సాయంత్రం వేళ ఆలయ మండపం నుంచి రాతిగీరల వరకు పల్లకీ సేవ నిర్వహించేవారు. అందుకు టికెట్ ధర రూ.65 ఉండేది. సుమారు 26 ఏళ్ల క్రితం ఈసేవను ఆలయంలో నిలిపేశారు. తదనంతరం ఎవరూ పట్టించుకోలేదు. ఇతర ఆలయాల్లో పల్లకీ సేవా కొనసాగుతుండడంతో ఇక్కడ కూడా పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే విన్నపంతో.. ఈవిషయమై మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి నాలుగేళ్ల క్రితం సూచనలు చేయడంతో ఆలయ వర్గాలు సమీక్షించి టికెట్ ధర రూ.500 నిర్ణయిస్తూ దేవాదాయశాఖకు ప్రతి పాదనలు పంపించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనమతినివ్వడంతో 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. గతంతో గ్రామంలోని పద్మశాలీ కులస్తులు పల్లకీని మోసేవారు. అందుకు వారికి టికెట్ ధరలో కొంత భాగం ఆలయ వర్గాలు చెల్లించేవారు. ప్రస్తుతం టికెట్ తీసకున్న భక్తులే నేరుగా పల్లకీ మోసేందకు అనుమతి నివ్వాలని భక్తులు కోరుతున్నారు. ఏదీ ఎమైనా ఆలయంలో పల్లకీ సేవా ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు. మరి ఆలయ అధికారులు ఎప్పుడు ప్రారంభిస్తారో వేచిచూడాల్సిందే ఆలయంలో భక్తుల రద్దీ.. కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భక్తులు ఆదివారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ మల్లన్న నామస్మరణంతో మారుమోగాయి. వేకువజామునుంచే కోనేరులో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. అభిషేకాలు, పట్నాలు, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేణిచెట్టువద్ద ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుకళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఆనవాయితీ కొనసాగించాలి ఆలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాల పల్లకీ సేవను గతంలో పద్మశాలీ కులస్తులే నిర్వహించేవారు. ప్రస్తుతం ఉత్సవాల సమయంలో కూడా పద్మశాలీలే పల్లకీని మోస్తున్నారు. అదే సంప్రదాయాన్ని ఆలయ అధికారులు కొనసాగించాలి. – కొండ శ్రీధర్, పద్మశాలీ కులస్తుడు త్వరలోనే నిర్ణయిస్తాం ఆలయ ఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. దేవాదాయ శాఖ అధికారులు పల్లకీ సేవ పునరుద్ధరణకు అనుమతినిచ్చిన విషయం వాస్తవమే. తిరిగి ప్రారంభించేందుకు ఆలయ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం – టంకసాల వెంకటేశ్, ఆలయ ఈఓ రాజగోపురం ఎదుట భక్తుల సందడి -
ఏకగ్రీవ స్ఫూర్తితో అభివృద్ధి చేయండి
సిద్దిపేటజోన్: గ్రామంలో ఏకగ్రీవంగా ఆమోదం ఎలా సాధించారో అదే తరహాలో ఐక్యతతో గ్రామాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బొగ్గులోనిబండ, రామంచ గ్రామాల ఏకగ్రీవ సర్పంచ్‌లు, గ్రామస్తులు మర్యాదపూర్వకంగా హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాలు ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్నారని, ఇదే స్ఫూర్తితో అభివృద్ధికి అందరూ సమష్టిగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్నారు. గ్రామాలు ఆదర్శంగా నిలిచేలా పాలక వర్గాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల మన్ననలు పొందాలన్నారు. రామంచలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. 20 ఏళ్ల క్రితం తొలిసారిగా రామంచలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. నిండు మనసుతో ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారి ఆకాంక్షలు నిజం చేయాలని సూచించారు. అనంతరం బొగ్గులోనిబండ ఏకగ్రీవ సర్పంచ్ అందే శంకర్, రామంచ ఏకగ్రీవ సర్పంచ్ భవానిలను ఆయన అభినందించారు. విద్యార్థినికి చేయూత సిద్దిపేటజోన్: పేద దళిత విద్యార్థిని వైద్యవిద్య కోసం ఎమ్మెల్యే హరీశ్‌రావు అండగా నిలిచారు. పట్టణానికి చెందిన పెరక శ్రీజకు కరీంనగర్ చలమేడ ఆనందరావు మెడికల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని తెలుసుకున్న హరీశ్‌రావు ఈ ఏడాది కళాశాల ఫీజు కోసం ఆమెకు రూ.60 వేలు అందించారు. వైద్య విద్య పూర్తయ్యేవరకు ఫీజు చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీజ కుటుంబ సభ్యులు హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ సహకారం అందిస్తా ఏకగ్రీవ గ్రామాల ప్రతినిధులకు భరోసా -
ఎన్నికల సిత్రం
ఇటు ప్రచారం.. అటు ఏకగ్రీవంవర్గల్(గజ్వేల్): ఇంటి పక్కన ఇళ్లు.. కలిసిపోయినట్లున్న ఊర్లు.. చెట్టే గెట్టు అన్నట్లు ఆవలవైపు చాంద్‌ఖాన్ మక్త (మక్త మైలారం), చెట్టు ఈవలి వైపు చౌదరిపల్లి పరిధిలోకి వస్తుంది. వర్గల్ మండల పరిధిలోని ఈ రెండు గ్రామాలలో చాంద్‌ఖాన్ మక్త పంచాయతీ ఏకగ్రీవమైంది. దీంతో ఇక్కడ ఎన్నికల ప్రచారార్భాటం లేకుండాపోయింది. పక్కనే ఆనుకుని ఉన్న చౌదరిపల్లిలో పోటీ నెలకొన్నది. ఇక్కడ అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. దీంతో మీకు ఓట్ల పండుగ, మాకు ఏమిలేకుండా పాయె అంటూ ఇరుగు, పొరుగు సరిహద్దు ఇళ్లవారు చర్చించుకుంటున్నారు. -
ఏకగ్రీవం@ 26
సిద్దిపేటరూరల్: జిల్లాలో మొదటి, రెండో విడతల్లో మొత్తం 26 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతలో 16, రెండో విడతలో 10 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయినట్లు అధికారికంగా ప్రకటించారు. మూడో విడత లెక్క మరో మూడు రోజుల్లో తేలనుంది. ఎన్నికల షెడ్యూల్ మేరకు మొదటి విడతలో 7 మండలాల్లో 163 గ్రామాల్లో, 1,432 వార్డుల్లో, అదేవిధంగా రెండో విడతలో 182 గ్రామాలు, 1,644 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. షెడ్యూల్ మేరకు ఆయా విడతల్లో 26 గ్రామాల్లో ఏకగ్రీవం కాగా మిగతా స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ లెక్కన మొదటి విడత సర్పంచ్ స్థానానికి 481మంది, వార్డు సభ్యుల స్థానాలకు 2,972మంది పోటీలో నిలిచారు. అలాగే రెండో విడతలో జరిగే ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు 694 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 3,917 మంది పోటీలో ఉన్నారు. మొదటి విడత పోలింగ్ ఈనెల 11, రెండో విడతకు ఈనెల 14 పోలింగ్ ఉండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఆ దిశగా దృష్టి సారిస్తూ ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. రెండు విడతల్లో తేలిన లెక్క సర్పంచ్ బరిలో 1,175మంది మరో మూడు రోజుల్లో క్లారిటీ -
గెలుపే ముఖ్యం
అధిక స్థానాలే లక్ష్యంపంచాయతీ ఎన్నికలపై పార్టీలు సీరియస్‌గా దృష్టి పెట్టాయి. మెజార్టీ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నాయి. మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో మరింతగా అప్రమత్తమయ్యాయి. కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నాయి. – గజ్వేల్మొదటి విడత పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, వర్గల్ మండలాలు, దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, రాయపోల్ మండలాల్లో మొదటి విడత జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈనెల 11న పోలింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చే ఫలితాలే రెండు, మూడు విడతల్లో జరగనున్న ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందునా.. ప్రధాన పార్టీలు ఛాలెంజ్‌గా తీసుకొని ముందుకెళ్తున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ఈ ఎన్నికలు బీఆర్ఎస్తోపాటు అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం 148 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 12 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 136 స్థానాల ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా ఈ నియోజకవర్గంలో తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ మెజార్టీ స్థానాల సాధనపై గురి పెట్టింది. ఈ క్రమంలోనే రెండు పార్టీలు అప్రమత్తమై ఎత్తుకు పైఎత్తులతో ముందుకుసాగుతున్నాయి. కాంగ్రెస్‌కు సంబంధించి ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మొదటి ఎన్నికలు జరిగే గ్రామాల పరిస్థితిపై సమీక్షించారు. ఎలాగైనా మెజార్టీ స్థానాలను సాధించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడగాలని పిలుపునిచ్చారు. మొత్తానికి ఈ సమావేశం ద్వారా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేతల సమీక్షలు.. ఇకపోతే బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సమన్వయంతో నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులతో ఎన్నికలపై నిత్యం సమీక్షిస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో విస్త్రతంగా పాల్గొంటున్నారు. అభ్యర్థులు బలహీనంగా ఉన్న గ్రామాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణను ఎప్పటికప్పుడు కార్యకర్తలకు సూచనలు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సైతం తమ అభ్యర్థులు బరిలో ఉన్న గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించే గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. దుబ్బాక నియోజకర్గంలో.. దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని 25 పంచాయతీలు, రాయపోల్ మండలంలోని 19 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతుండగా అధిక స్థానాలను దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్లు పోటీపడుతున్నాయి. బీజేపీ సైతం తనదైన శైలిలో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మొత్తానికి మొదటి విడత ఎన్నికల ఫలితాలు మూడు రోజుల తర్వాత తేలనుండగా, సర్వత్రా ఆసక్తి నెలకొంది. పంచాయతీ ఎన్నికలపైపార్టీల ప్రత్యేక నజర్ మొదటి విడత పోలింగ్సమీపిస్తుండటంతో అప్రమత్తం కార్యకర్తలు, మద్దతుదారులతో జోరుగా సమీక్షలు -
ఎరుపెక్కిన మెతుకుసీమ
మెదక్‌జోన్/మెదక్ కలెక్టరేట్: సీఐటీయూ రాష్ట్ర మహాసభలు ఆదివారం మెదక్ పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, అఖిల భారత ఉపాధ్యక్షురాలు హేమలత మాట్లాడుతూ.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని విధులు నిర్వరించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిన విధులు నిర్వహించే లక్షలాది మందికి కార్మిక చట్టం ప్రకారం వేతనాలు అందటం లేదన్నారు. కార్మిక చట్టం (వెజ్‌బోర్డు) ప్రకారం ప్రతి కార్మికుడిని పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో యాజమాన్యాలు తప్పు చేస్తే వెజ్‌బోర్డు ఆధారంగా వారిని జైలుకు పంపే అధికారం కార్మిక చట్టాల్లో ఉండేదని, ప్రస్తుతం వాటిని తొలగించి కార్మికులు హక్కుల కోసం ప్రశ్నిస్తే శిక్షించే విధంగా నూతన కార్మిక చట్టాలను తెచ్చారని వాపోయారు. కార్మికులు రోజుకు 8 గంటల కన్నా ఎక్కువగా పనిచేయరాదనే నిబంధన ఉండేదని, ప్రస్తుతం నూతన చట్టాల్లో దాన్ని తొలగించారన్నారు. వీటిని సాధించుకోవటానికి అంతా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయ కోషాధికారి సాయిబాబ, రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరయ్య, రమణ, జిల్లా నేతలు మల్లేశం, బాలమణి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కేసు
కోహెడరూరల్(హుస్నాబాద్): ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అభిలాష్ తెలిపారు. గురువారం రాత్రి వాహన తనిఖీలు చేస్తుండగా ద్విచక్ర వాహనంపై భారీగా మద్యం తరలిస్తున్న మైసంపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రమేశ్, ఎట్టబోయిన శ్రీకాంత్ పట్టుపడ్డారు. వారిని విచారించగా గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యురాలిగా పోటీచేస్తున్న అభ్యర్థి తీసుకురమ్మన్నట్టు తెలిపారు. దీంతో వారిపై పంచాయతీ రాజ్, ఎకై ్సజ్, ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మరో ముగ్గురిపై.. హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లక్ష్మారెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లెలగడ్డలో పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రవీందర్ ఎలాంటి అనుమతి లేకుండా తన వాహనాన్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించారు. అలాగే హుస్నాబాద్ నుంచి మల్లంపల్లికి అక్రమంగా మద్యం తరలిస్తున్న పబ్బ సంపత్‌పైనా, భల్లునాయక్తండాలో అక్రమంగా బీర్లు విక్రయించిన మహిళపైనా కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అనుమతి లేకుండా ప్రచారంలో వాహనాలు వినియోగించినా.. అక్రమంగా మద్యం తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
సామాజిక సేవలో భాగస్వాములు కావాలి
గజ్వేల్‌రూరల్: విద్యార్థులు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహం పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కళాశాలలో శుక్రవారం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సహకారం అందించి ఆదుకోవాలన్నారు. క్రమశిక్షణ, ఐక్యత, నైతికత, బాధ్యతతో వ్యవహరించడం లాంటి విలువల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు స్వచ్ఛంద సేవ ప్రతిజ్ఞ చేశారు. కళాశాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సౌజన్య, డాక్టర్ సరోజ, అధ్యాపకులు కస్తూరిబాయి, వీఆర్ అర్చన, డాక్టర్ శోభారాణి పాల్గొన్నారు. -
కందికి సస్య రక్షణ కీలకం
● జిల్లాఓ 15 వేల ఎకరాలలో సాగు ● చీడపీడలతో అప్రమత్తం ● శాస్త్రవేత్త పల్లవిదుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లాలో వర్షాధారంగా సాగుచేస్తున్న పప్పుదినుసుల పంటలో కంది కీలంగా ఉంది. దాదాపు 15 వేల ఎకరాలలో కంది సాగు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ యేడు విత్తుకున్న పంట ప్రస్తుతం పూతదశలో ఉంది. ఈ సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు పొందవచ్చునని సిద్దిపేట రైతు విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త పల్లవి రైతులకు సూచించారు. పూత దశలో.. వర్షపాతం లేని చోట పూతకు ముందు 19:19:19 ను 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పూతదశలో నీటి ఎద్దడికి గురైనా, పూతదశలో నీరు ఎక్కువైనా పూత రాలిపోతుంది. సరైన సమయంలో నీటి తడులు పెట్టుకోవాలి. ఇసుక నేలల్లో సాగుచేసిన పంటలో ఎక్కువ శాతం పూత రాలిపోయే సమస్య కనిపిస్తుంది. దానిని నివారించడానికి ప్లానోఫిక్స్ 0.2 మి.లీ. లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకుంటే పూత, పిందె రాలడాన్ని అరికట్టవచ్చు. కాత ఏర్పడే దశలో పరిస్థితులను అధిగమించేందుకు ఒకసారి (13–0–45) పొటాషియం నైట్రేట్ 5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచే ఈగ: ఈ ఈగ పూత, లేత కాయలు లేదా పిందెలలో గుడ్లు పెడుతుంది. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు గింజలను తినేస్తాయి. గింజల మీద తెల్లని చారలను ఏర్పరుస్తాయి. ఆశించిన కాయలను బయట నుంచి గుర్తించలేం. ఫ్యుజేరియం ఎండు తెగులు: కందిలో ప్రధానమైన సమస్య ఫ్యుజేరియం ఎండు తెగులు. ఇది భూమి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు మొలక దశ నుంచి పూత, కాత దశ వరకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ తెగులు లక్షణాలు మొక్కల చిగుర్లు లేదా కొమ్మలు కిందికి వంగి వాడిపోతాయి. క్రమేణా ఆకులన్నీ పండుబారి, మొక్కలు ఎండిపోతాయి.శనగపచ్చ పురుగు: దీని తల్లి పురుగు మొగ్గలపై లేత పసుపు, తెలుపు రంగు గుడ్లను పెడుతుంది. దీని నివారణకు తొలిదశలోనే వేప నూనె/ వేపగింజల కషాయాన్ని 5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎకరాకు 5 లింగాకర్షక బుట్టలనుఅమర్చాలి.మారుకా మచ్చల పురుగు: ముఖ్యంగా పూతదశలో మారుకా మచ్చల పురుగు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగు ఆశిస్తే మొక్కలలో ఎదుగుదల లోపిస్తుంది. నివారణకు వేప గింజల కషాయం 5శాతం లేదా వేపనూనె (అజాడిరాక్టిన్ 1500 పి.పి.యం.) 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. -
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
● 15 కిలోల కణతి తొలగింపు ● సూపరింటెండెంట్ సంగీత, డాక్టర్ చందర్సిద్దిపేటకమాన్: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి ఓ మహిళ కడుపులో నుంచి 15 కిలోల కణతిని తొలగించారు. ఈ ఘటన ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. రామాయంపేటకు చెందిన 59 యేళ్ల మహిళ కొన్ని నెలలుగా కడుపు నొప్పి, ఉబ్బసంతో బాధపడుతోంది. ఆర్ఎంపీల వద్ద చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో పది రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. పలు రకాల పరీక్షలు నిర్వహించి ఆమె కడుపులో పెద్ద కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో శుక్రవారం వైద్యులు చందర్, అనుపమ, సహస, రవిమోహన్, దేవేందర్, అభిషేక్ మూడు గంటల పాటు శస్త్ర చికిత్స నిర్వహించి 15 కిలోల కణతిని తొలగించారు. ప్రస్తుతం ఆ మహిళ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో చికిత్స పొందుతోందని వారు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, సూపరింటెండెంట్ సంగీత సర్జరీ చేసిన వైద్య బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంఓ జ్యోతి, ఆర్‌ఎంఓలు శ్రావణి, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
డ్రంకెన్ డ్రైవ్‌లో ఇద్దరికి జైలు
గజ్వేల్‌రూరల్: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుపడిన ఇద్దరికి న్యాయమూర్తి స్వాతిగౌడ్ నాలుగు రోజుల జైలుశిక్ష విధించారు. ట్రాఫిక్ సీఐ మురళి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ పలు ప్రాంతాల్లో ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో ఏడుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుపడ్డారన్నారు. వారిని శుక్రవారం కోర్టులో హాజరు పర్చామని, న్యాయమూర్తి వారిలో ఐదుగురికి రూ.50 వేలు, మరో ఇద్దరికి నాలుగు రోజుల జైలుశిక్ష విధించినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారముందని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేడు విద్యుత్ నిలిపివేత దుబ్బాక: మండల పరిధిలోని హబ్సీపూర్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనులు నిర్వహిస్తున్న కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని దుబ్బాక సబ్‌డివిజన్ ఏడీ గంగాధర్ పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు దుబ్బాక మున్సిపాలిటీ, భూంపల్లి–అక్బర్పేట మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు మిరుదొడ్డి మండలంలోని ధర్మారం, అందె, కొండాపూర్, కాసులాబాద్ గ్రామాల్లో విద్యుత్ నిలిపివేయనున్నట్టు తెలిపారు. సిద్దిపేటలో.. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పట్టణంలోని 11కేవీ వన్‌టౌన్ ఫీడర్ మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పట్టణ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగమ్మతోట, చర్వాదాన్, బారాహిమామ్, నాసర్‌పుర, చేపల మార్కెట్ ప్రాంతాలలో శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న గణిత పీజీటీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని, అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సోమవారంలోగా పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలని, మంగళవారం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 73823 25007నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లోకి.. సిద్దిపేటజోన్: సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ మాజీ ఎంపీటీసీ నర్సింహులు తిరిగి సొంత గూటికి చేరారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్యెల్యే హరీశ్‌రావు సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. హరీశ్‌రావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. -
కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి
జనగామ ఎమ్మెల్యే పల్లామద్దూరు(హుస్నాబాద్): స్థానిక సంస్థ ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీల కోసం నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని గాగ్గిళ్లాపూర్ గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలన్నారు. అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి పంచాయతీలపై గులాబీ జెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో సంతోష్‌కుమార్, చంద్రమౌళి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కథల పోటీల్లో విద్యార్థి ప్రతిభ
కొండపాక(గజ్వేల్): కొండపాక హైస్కూల్ 8వ తరగతి విద్యార్థి రిత్విక్ తేజ రాష్ట్ర స్థాయి కథల పోటీల్లో తృతీయ బహుమతికి ఎంపికయ్యాడని హెచ్ఎం విఠల్ నాయక్ శుక్రవారం తెలిపారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవల హైదారాబాద్‌లో రాష్ట్రస్థాయి సాహిత్య పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొనగా శుక్రవారం వెలువడిన విజేతల జాబితాలో రిత్విక్ తేజ తృతీయ బహుమతికి ఎంపికయ్యారన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సాహిత్య అకాడమీ పోటీలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. రిత్విక్ తేజ రాష్ట్రస్థాయిలో రాణిస్తూ పాఠశాల, గ్రామం పేరు ప్రతిష్టతలను పెంచాడన్నారు. ఈ సందర్భంగా తెలుగు టీచర్ సత్యలక్ష్మికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
ఓటు కొనొద్దు.. అమ్మొద్దు..
సిటిజన్స్ క్లబ్ప్రదర్శనగజ్వేల్: ‘అభ్యర్థులారా ఓటును కొనకండి – గ్రామస్తులారా ఓటును అమ్మకండి’ అనే నినాదంతో జగదేవ్‌పూర్ మండలం తిగుల్ గ్రామంలో సిటిజన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ప్రలోభాల ప్రభావం వల్ల ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు ఎల్లు రాంరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు ప్రజల హక్కు, శక్తి, గౌరవం అని అభివర్ణించారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు బట్టు దయానందరెడ్డి, రామకృష్ణారెడ్డి, కొన్యాల కిష్టారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, భిక్షపతి, వెంకట్‌రెడ్డి, యువజన సంఘాల నాయకులు రంగ వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు. -
ఎన్నికల విధులు వద్దు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల విధుల నుంచి దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్త ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ కోరారు. డీఈఓ శ్రీనివాస్‌రెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, ఆరు నెలలోపు ఉద్యోగ విరమణ కలిగిన వారికి, గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధులు అప్పగించడం సరికాదన్నారు. రాష్ట్రస్థాయి ‘కబడ్డీ’కి ఎంపిక హుస్నాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు హుస్నాబాద్ క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ మడక కృష్ణ శుక్రవారం తెలిపారు. జిల్లాస్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు గడిపె సిద్ధు, నన్నె సాయి, రణిల్, అభిలాష్ 7వ వరకు మహబూబ్‌నగర్‌లో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడల్లో పాల్గొంటారని కోచ్ తెలిపారు. ఆటపాటలతో విద్యాబోధన హుస్నాబాద్: విద్యార్థులకు ఇంటిని మరిపించే విధంగా ఆటపాటలతో విద్యాబోధనకు సిద్ధం చేస్తున్నామని, అందులో భాగంగా ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ ఇస్తున్నట్టు ఎంఈఓ బండారి మనీల చెప్పారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రి ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడతూ హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాలకు చెందిన ఇన్స్ట్రక్టర్లకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ 8 వరకు కొనసాగుతుందన్నారు. పరిమితిని మించొద్దు బెజ్జంకి(సిద్దిపేట): పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు పదవులకు పోటీచేసే అభ్యర్థులు పరిమితికి అనుగుణంగా ఖర్చు చేయా లని ఎంపీడీఓ ప్రవీణ్ సూచించారు. బెజ్జంకిలో శుక్రవారం అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 వేలలోపు జనాభా ఉన్న గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30 వేలు వరకు ఖర్చు చేయవచ్చన్నారు. ఎక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో రూ.2.50 లక్షలు. రూ.50 వేలు వరకు ఖర్చు చేయవచ్చని చెప్పారు. ప్రతి రూపాయి జీరో అకౌంట్ నుంచి వెచ్చించాలని సూచించారు. సమావేశంలో ఎన్నికల వ్యయ పరిశీలకుడు రాజమౌళి, రూర ల్ సీఐ శ్రీను, తహసీల్దార్ శ్రీకాంత్, ఎస్ఐ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి: ట్రాఫిక్ ఎస్ఐ సిద్దిపేటజోన్: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ సూచించారు. ఓ స్థానిక స్కూల్లో విద్యార్థులకు శుక్రవారం ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడపడం నేరమన్నారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా, మైనర్ డ్రైవింగ్ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ హన్మంతారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మద్యం పట్టివేత మిరుదొడ్డి(దుబ్బాక): అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మిరుదొడ్డి ఎస్ఐ సమత తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ మండల పరిధిలోని మల్లుపల్లిలో గరిపల్లి లక్ష్మణ్ ఇంటిలో సోదా నిర్వహించగా 12.39 లీటర్ల మద్యం బాటిళ్ళను పట్టుకొన్నామన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
బీసీలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
బీఆర్ఎస్ బీసీ సంఘం నేతనర్సిహంగరావుగజ్వేల్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మాయమాటలతో మభ్యపెడుతోందని, ఇప్పటికై నా మేల్కొని బీసీలు రిజర్వేషన్ల కోసం పోరాడాలని బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘం నాయకుడు కల్యాణ్కర్ నర్సింగరావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు బీసీలను రిజర్వేషన్ల పేరుతో మోసం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన వసతులు, సమస్యల పరిష్కారంపై దృష్టి సారించకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పాలనలో ఈశ్వర సాయిచారి బలిదానానికి సిద్ధపడి గాంధీ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని వాపోయారు. కార్యక్రమంలో బీసీ నేత ఆర్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
హోరాహోరీగా సంగ్రామం
జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గుర్తుల కేటాయింపుతో ప్రచార ప్రణాళికలను రూపొందించుకున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 163 సర్పంచ్, 1,432 వార్డు స్థానాలకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతలో జరిగే వాటిలో 16 సర్పంచ్‌లు, 224 వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 147 సర్పంచ్‌లకు గాను 497 మంది అభ్యర్థులు, 1,208 వార్డు సభ్యులకు 3,196 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – సాక్షి, సిద్దిపేటమొదటి విడత జరిగే ఎన్నికలు పోటాపోటీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏడు మండలాల్లోని.. మూడు గ్రామ పంచాయతీలలో పోటీ తీవ్రంగా ఉంది. ఆయా గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులుగా 8 మంది చొప్పున బరిలో నిలిచారు. ములుగు మండలం కొత్తూరు, మునిగడప(జగదేవ్‌పూర్), సూరంపల్లి(దౌల్తాబాద్)లో అత్యధికంగా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వర్గల్ మండలం మాదారంలో ఏడుగురు, గజ్వేల్ మండలం బేజుగాం, రాయపోలులో ఆరుగురు, కాశిరెడ్డిపల్లి(మర్కూక్)లో ఐదుగురు సర్పంచ్‌కు పోటీ చేస్తున్నారు. మిగతా చోట్ల ఐదు కంటే తక్కువ మంది పోటీలో ఉన్నారు. ఎక్కువగా త్రిముఖ పోటీ ఉంది. ప్రత్యేకంగా పాటల రూపకల్పన సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసే అభ్యర్థులు ప్రత్యేకంగా పాటలను తయారు చేసుకుని ప్రచారం ప్రారంభించారు. అలాగే కరపత్రాలు, వాల్ పోస్టర్లను వినియోగిస్తున్నారు. కేటాయించిన గుర్తులతో సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి బంధువులు, స్నేహితులు వారి వారికి తెలిసిన వాళ్లకు ఫోన్లు చేసి ‘గుర్తు’ంచుకోండి..’ అంటూ చెబుతున్నారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనుండటంతో 9వ తేదీతో ప్రచారం ముగియనుంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రచార వేగం పెంచారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే కొందరు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల అవసరాల కోసం ముందస్తుగానే భారీగా డబ్బులు, మధ్యాన్ని సమకూర్చుకున్నట్లు సమాచారం.ప్రచారం.. ముమ్మరం తొలివిడతలో 147 సర్పంచ్‌లు,1,208 వార్డులకు ఎన్నికలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న1,705 మంది అభ్యర్థులు మూడు చోట్ల.. 8 మంది చొప్పున పోటీ ‘గుర్తు’ంచుకోండి.. అంటూ అభ్యర్థుల విన్నపాలు మొదటి విడతలో 16 సర్పంచ్‌లు,224 వార్డు సభ్యులు ఏకగ్రీవం13 జీపీలలో మొత్తం ఏకగ్రీవం మొదటి విడతలో జరిగే 13 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. లింగాయపల్లి తండా, నర్సంపల్లి(దౌల్తాబాద్), రంగంపేట(గజ్వేల్), నిర్మల్‌నగర్, బీజీ వెంకటాపూర్, పలుగుగడ్డ, అనంతసాగర్, కొండాపూర్ (జగదేవ్‌పూర్), ఎర్రవల్లి(మర్కూక్), ఆరేపల్లి (రాయపోల్), చాంద్కాన్మక్తా, గుంటిపల్లి, తునికిమక్తా(వర్గల్) గ్రామాల్లో అన్ని స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. -
దాడులను అరికట్టడంలో విఫలం
గజ్వేల్: జిల్లాలో జరుగుతున్న ఎస్సీ, ఎస్టీ దాడులను అరికట్టడంలో పోలీసు, రెవెన్యూశాఖల అధికారులు విఫలమవుతున్నారని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ ఆరోపించారు. గురువారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ భవన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయం కోసం బాధితులు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తే.. సరైన న్యాయం జరగడం లేదన్నారు. పోలీసు కమిషనర్ జోక్యం చేసుకుంటే తప్పా నిందితులను అరెస్ట్ చేయడం లేదన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 81మంది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులు ఉన్నారని చెప్పారు. వీరికి రూ.1.5కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉన్నదన్నారు. సమావేశంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండస్వామి, జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక రాష్ట్ర నాయకులు జాన్ మైకేల్, సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు అపర్ణ, హేమలత, దళిత ఉద్యోగుల సంఘం నాయకులు పి. ఎల్లయ్య, డీబీఎఫ్ జిల్లా కార్యదర్శి వేణు, ముస్లిం హక్కుల సంఘం నాయకుడు కాశీం, న్యాయవాది బత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు.డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 63 మందిపై కేసు
దుబ్బాకరూరల్: ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన 63 మందిపైపోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. అక్బర్పేట–భూంపల్లి మండలం తాళ్లపల్లి సర్పంచ్ అభ్యర్థి జనరల్ కావడంతో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరంతా బీసీ ముదిరాజ్ కులానికి చెందిన వారు కావడం.. గ్రామంలో వారి ఓట్లు ఎక్కువగా ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో ఒకే అభ్యర్థి పోటీలో ఉండాలనే కులస్తుంతా నిర్ణయానికి వచ్చారు. కులదేవత పెద్దమ్మ గుడి నిర్మాణానికి ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారే సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉండాలని వారికే ఓటు వేయాలని నిర్ణయించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హరీశ్ తన సిబ్బందితో చేరుకుని విచారించారు. విషయం నిజం కావడంతో ఎన్నికలకోడ్ ఉల్లంఘించారని సుమోటో పిటిషన్‌పై ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, 56మందితో సహా మొత్తం 63మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గురువారం 63 మందిని భూంపల్లి పోలీస్ స్టేషన్లో హాజరు పరిచారు. ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్లను ప్రలోభ పెడితే ఎంతటి వారైనా చట్ట పరంగా చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు. -
భారీ జనసందోహంతో వచ్చి..
కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి, కొండపాక మండలాల్లో మూడో విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం అభ్యర్థులు మద్దుతు దారులు, ప్రజలు, నాయకులతో భారీ సంఖ్యలో తరలివచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మంగోల్, తిప్పారం సర్పంచ్, వార్డు స్థానాల్లో అభ్యర్థులు కొందరు పెద్ద సంఖ్యలో ప్రజల, నాయకులతో తరలివచ్చి నిమినేషన్లను వేశారు. మండల వ్యాప్తంగా సర్పంచ్‌లకు.. 37, వార్డు స్థానాల కోసం 184 నామినేషన్న్లు దాఖలయ్యాయి. కుకునూరుపల్లి మండల వ్యాప్తంగా సర్పంచ్‌లకు 17, వార్డు సభ్యుల కోసం 58 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీఓలు వెంకటేశ్వర్లు, రాంప్రసాద్‌లు పేర్కొన్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ప్రతీ వాహనం తనిఖీ చేయాల్సిందే..
చేర్యాల(సిద్దిపేట): ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో ప్రతీ వాహనం తనిఖీ చేయాలని, టైమ్‌తో సహా వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం మండల పరిధిలోని ముస్త్యాలలో జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన ఎస్ఎస్టి శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రిజిస్టర్‌ను పరిశీలించారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ మొత్తం వీడియో తీయాలని సిబ్బందిని ఆదేశించారు. మండల పరిధిలోని ముస్యాల క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు గుంపులు గుంపులుగా వచ్చి నామినేషన్ వేయకూడదని, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టైంతో సహా వివరాలు నమోదు చేయాలి కలెక్టర్ హైమావతి -
కుల సంఘాలకు తాయిలాల ఎర
జిల్లాలో మొదటి విడత ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. నామినేషన్ల ఉసంహరణ తర్వాత దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, రాయపోల్, వర్గల్ మండలాల్లోని 163 సర్పంచ్ పదవులకుగానూ 480మంది బరిలో ఉన్నారు. 1,432 వార్డు సభ్యుల పదవుల కోసం.. 2,797మంది పోటీలో ఉన్న సంగతి తెల్సిందే. ఎన్నికల రంగంలో తమ సత్తాను నిరూపించుకోవడానికి సిద్ధమైన వీరంతా ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే గెలుపు కోసం అనువైన మార్గాలపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో గెలుపోటములను ప్రభావితం చేసేదీ కుల సంఘాలే. ఈ క్రమంలో సంఘాలకు చెందిన పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. కొందరైతే భారీగా నజరానాలను ప్రకటించి అందజేస్తున్నారు. ప్రధానంగా కుల సంఘాలకు చెందిన ఆలయాలకు పెద్ద మొత్తంలో విరాళాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా వంట, టెంట్ సామగ్రిని సైతం అందజేస్తున్నారు. ఇవేకాకుండా కుల సంఘాల్లోని సభ్యుల లెక్క మేరకు ఒక్కొక్కరికీ కొంత నగదును ముట్టజెప్పుతున్నారు. పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో ఈ తంతూ చాలా వేగంగా సాగుతోంది. ములుగు, వర్గల్, మర్కూక్, గజ్వేల్ మండలాల్లో తాయిలాల ప్రభావం అధికంగా కనిపిస్తున్నది. ఓ అభ్యర్థి తన గ్రామంలో ఓ సంఘానికి అత్యధికంగా రూ.10లక్షల వరకు ముట్టజెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. భిన్నంగా ప్రచార పర్వం.. పంచాయతీ ఎన్నికల్లో ప్రచార పర్వం భిన్నంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్టీల కంటే వ్యక్తులకే ప్రాధాన్యత ఉండటం వల్ల మెజార్టీ అభ్యర్థులు తమ వ్యక్తిగత ప్రచారంతోనే ముందుకుసాగుతున్నారు. కొందరు మందీమార్బలంతో హడావిడి చేస్తుండగా, చాలామంది ఒక్కరుగా రాత్రి, తెల్లవారుజాముల్లో ఓటర్లను ఇళ్ల వద్దకు వెళ్లి తమకు ఓటు వేయాలని మాట తీసుకుంటున్నారు. మరికొందరు సోషల్ మీడియా ప్రచారానికే ప్రాధాన్యతనిస్తున్నట్లు కనపడుతోంది. వాట్సాప్ సందేశాలు, టెక్ట్స్ మేసేజ్‌లు, ఫెస్బుక్, ఇన్‌స్టా ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. మరోముఖ్యమైన అంశమేమీటంటే జానపద బాణీల్లో పాటలు తయారు చేయించి మైక్ ప్రచారాన్ని విస్త్రతంగా నిర్వహిస్తున్నారు.సోషల్ మీడియాలో జోరుగా చర్చ ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది? అనే అంశంపై గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చర్చలను లేవదీస్తున్నారు. ఈ చర్చల్లో యువత పాల్గొంటున్నారు. కానీ చర్చలు వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలకు దారితీస్తుండగా.. ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. చాలా గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్టవేయడానికి పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.భారీగా ఆఫర్లు చేస్తున్న అభ్యర్థులు ఆలయాలకు విరాళాలు, వంట,టెంట్ సామగ్రి తదితరాల అప్పగింత రసకందాయంలో ‘పంచాయతీ’ పోరు -
న్యాయం చేయకుంటే ఓట్లు వెయ్యం
సిద్దిపేటరూరల్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఎన్నికల్లో ఓట్లు వేసే ప్రసక్తే లేదని ఇబ్రహీంపూర్ గ్రామ ఎస్సీ కులస్తులు నిరసన తెలిపారు. గురువారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్లో ఎస్సీ కులస్తులు విలేకరులతో మాట్లాడుతూ బీసీ దాసరి కులానికి చెందిన కొందరు వ్యక్తులు తప్పుడు ఆధారాలు చూపి ఎస్సీ వర్గానికి చెందిన వారీగా కుల ధ్రువీకరణ పత్రాలు పొందారు. గతంలో వారిని బీసీగా పరిగణించి వార్డు స్థానాలకు పోటీ చేశారు. కానీ ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో రిజర్వేషన్ల వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారన్నారు. అర్హులైన మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను వినియోగించుకోకుండా బీసీ కులానికి చెందిన వ్యక్తులు నామినేషన్ వేయడం సరికాదని, ఈ విషయంపై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. సమస్య పరిష్కరించకపోతే గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ వర్గం ఓట్లు బహిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సుమన్, మాజీ సర్పంచ్ దేవయ్య, కనకయ్య, నర్సింహులు, చిన్న దేవయ్య, లక్ష్మి, సాయవ్వ, పుష్పలత, లత,ఎల్లవ్వ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్తో నామినేషన్ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి ఇబ్రహీంపూర్లో ఎస్సీ కుల సభ్యుల నిరసన -
పాఠశాలల సమస్యలపై ఆరా
విద్యాపరిరక్షణ కమిటీ పరిశీలనగజ్వేల్: పాఠశాలల్లో నెలకొన్న సమస్యలపై విద్యాపరిరక్షణ కమిటీ ఆరా తీస్తోంది. టీపీటీఎఫ్(తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్)కు చెందిన విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర బాధ్యులు ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వై.అశోక్‌కుమార్, ప్రకాశ్రావులు గజ్వేల్ మండలం బంగ్లావెంకటాపూర్లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పాఠశాలను బైఫర్కేషన్ చేసి ఖాళీగా ఉన్న తెలుగు, హిందీ ఉపాధ్యాయుల పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వేణుగోపాల్, టీపీటీఎఫ్ రాష్ట్ర బాధ్యులు రాజయ్య, రాష్ట్ర కౌన్సిలర్ రాజులు, నాయకులు ఎల్లయ్య, మధుమోహన్, గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు తాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 208 ప్రీ ప్రైమరీ పాఠశాలలు
హుస్నాబాద్‌రూరల్: జిల్లాలో 208 ప్రీ ప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు హాజరై మాట్లాడారు. మొదటి విడత సిద్దిపేట డివిజన్లో 110 మంది ఇన్స్ట్రక్చర్స్కు శిక్షణ ఇచ్చామని, రెండో విడుత గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్లో వంద మందికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ప్రీ ప్రైమరీ పాఠశాలలను అందంగా అలంకరించి విద్యార్థులను ఆకట్టుకునేలా తయారు చేయాలని చెప్పారు. ఆట పాటలతో విద్యా బోధన చేస్తే పిల్లలకు సులభంగా అర్థమవుతుందన్నారు. -
7 నుంచి ‘మల్లన్న’ మూలవిరాట్ దర్శనం నిలిపివేత
కొమురవెల్లి(సిద్దిపేట):మల్లన్న స్వామి మూల విరాట్ దర్శనాన్ని ఈనెల 7వతేదీ రాత్రి 8:30 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈఓ టంకసాల వెంకటేశ్ బుధవారం తెలిపారు. ఈనెల 14న స్వామి వారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి, అమ్మవార్ల మూల విరాట్ల అలంకరణ నిమిత్తం దర్శనం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 14న ఉద యం ఆరు గంటల నుంచి పునఃదర్శనం కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూల విరాట్ దర్శనం నిలిపివేసిన రోజులలో అర్ధమండపంలో ఉత్సవ విగ్రహాల దర్శనం, పూజలు ఉంటాయన్నారు. కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి పంచాయతీ కార్యదర్శి హరిప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు ఎంపీడీఓ లక్ష్మప్ప బుధవారం తెలిపారు. గతంలో కొండపాక మండలం అంకిరెడ్డిపల్లిలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీఓ చెప్పారు. నంగునూరు(సిద్దిపేట): అగ్నివీర్‌గా ఎంపికై ఆరు నెలల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న నంగునూరు మండల యువకులు బుధవారం ఉద్యోగ నియామక పత్రం అందుకున్నారు. పాలమాకులకు చెందిన తోకల సంతోష్, కొండంరాజ్పల్లికి చెందిన బండి శ్రీనివాస్, మగ్దుంపూర్‌కు చెందిన ఓరిగంటి రాహుల్ శిక్షణా కాలం పూర్తయింది. బుధవారం బెంగళూర్‌లోని ఆర్మీసర్వీస్ క్యాంప్ సెంటర్లో అధికారుల చేతుల మీదుగా పథక్ పట్టా అందజేశారు. హరియాణాలోని ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న మోర్ సూపర్ మార్కెట్ నిర్వాహకులకు మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ రూ.20వేల జరిమానా విధించారు. బుధవారం మోర్ సూపర్ మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు ఆహార పదార్థాలు గడువు దాటిపోయి ఉండటాన్ని గమనించి నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే పట్టణంలోని మిలన్ గార్డెన్ వైపు చెత్త వేస్తున్న వారిని గుర్తించి శ్రీకాంత్‌కు రూ.1000, రాజుకు రూ.1000, ప్రసాద్‌కు రూ.500, ఆర్ఆర్ పాలడెయిరీ నిర్వాహకులకు రూ.500 జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం అయితే భారీ జరిమానా విధిస్తామని హెచ్చిరించారు. దుబ్బాకటౌన్: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తోందని జిల్లా మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ గౌతమి అన్నారు. బుధవారం మత్స్య శాఖ ఆధ్వర్యంలో దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు దొమ్మాట, గాజులపల్లి, సూరంపల్లి, ముత్యంపేట గ్రామాల సొసైటీ సంఘాల సభ్యులతో కలిసి చెరువులలో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సొసైటీ సభ్యులు తలారి నర్సింహులు, సత్యం, రాజు, నాగులు, చంద్రం దశరథం, తదితరులు పాల్గొన్నారు. -
మురుగుకు స్వస్తి.. శుద్ధీకరణకు కుస్తీ
గుర్రపుడెక్కతో నర్సాపూర్ చెరువుసిద్దిపేటజోన్: బల్దియాను పట్టిపీడిస్తున్న గుర్రపు డెక్క, కలుషితమైన చెరువుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కింద ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువులను ఎంపిక చేసింది. అందుకు అనుగుణంగా ఒక్కో చెరువుకు రూ.3కోట్ల16లక్షల చొప్పున రూ.6 కోట్ల 32లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం చెరువులకు సంబంధించిన సర్వే ప్రక్రియ సాగుతోంది. వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి అనంతరం పనులు మొదలుకానున్నాయి. దీంతో భవిష్యత్తులో చెరువుల్లో గుర్రపు డెక్క సమస్య లేకుండా పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదకరమైన వాతావరణం ముంగిట్లోకి రానుంది. జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేట. బల్దియా రికార్డుల ప్రకారం 1.67లక్షల జనాభా ఉంది. కొనేళ్ల క్రితమే ఆయా నివాసాలకు సంబంధించిన మురుగు నీటిని అండర్ గ్రౌండ్ వ్యవస్థ (యూజీడీ) ద్వారా తరలించి రెండు మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్ లకు అనుసంధానం చేశారు. పట్టణంలో పూర్తి స్థాయిలో యూజీడీ అమలుకు నోచుకోలేదు. దీంతో మురికి నీరు, వరదనీరు కాల్వల ద్వారా పట్టణ శివార్లలోని ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లో కలుస్తోంది. ఈ క్రమంలో మురికి నీటితో చెరువులు కలుషితమవుతున్నాయి. శుద్ధీకరణే లక్ష్యంగా.. కేంద్ర ప్రభుత్వ నిధులతో చెరువుల శుద్ధీకరణ, సుందరీకరణకు బల్దియా ప్రతిపాదనలను రూపకల్పన చేసింది. చెరువుల్లోకి మురుగు నీరు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురికి నీటిని చెరువుల్లో విలీనం కాకుండా మళ్లింపు ప్రక్రియ జరగనుంది. కొనసాగుతున్న సర్వే ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువు విస్తీర్ణం, మురికి నీటి విలీన ప్రాంతాలు, డైవర్షన్ కెనాల్ నిర్మాణాలు, ఎస్టీపీకి అనుసంధానంగా ప్రత్యేక కెనాల్ ఏర్పాటు తదితర అంశాలపై సర్వే సాగుతోంది. రెండు చెరువుల సమీపంలో ఉన్న మురికి నీటి శుద్ధీకరణ ప్లాంట్, చెరువుల స్థితిగతులను అధికారులు పరిశీలించారు. మరో వారం రోజుల్లో సర్వే పూర్తి చేసేలా యంత్రాంగం నిమగ్నమైంది.రూ.6.32కోట్లతోచెరువుల సుందరీకరణ -
మంచోళ్లనే ఎన్నుకోండి
గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలివి.. హుస్నాబాద్‌లో నూతన బస్సును ప్రారంభిస్తున్న రేవంత్విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసిన సీఎంహుస్నాబాద్లో జరిగిన సభకు హాజరైన మహిళలు (ఇన్సెట్లో) అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిహుస్నాబాద్: ‘మన గ్రామాల్లో వెలుగులు నింపే ఎన్నికలివి.. పంచాయతీ ఎన్నికల్లో మంచివాళ్లను ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి అభివృద్ధికి బాటలు వేసే వాళ్లను ఎన్నుకుందాం.. అభివృద్ధికి అడ్డుపడెటోళ్లను, కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే మునిగేది మనమే’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో బుధవారం విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సీఎం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హుస్నాబాద్‌ను నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. తాము హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి తీరుతామని సీఎం స్పష్టం చేశారు. రూ.262.78 కోట్లతో శంకుస్థాపనలు హుస్నాబాద్ పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు సభా ప్రాంగణంలోనే సీఎం శంకుస్థాపనలు చేశారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు సీఎం చేతుల మీదుగా 70 సైకిళ్లు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్‌ను ప్రారంభించారు. హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సును జెండా ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం విధ్వంసం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి వికాసమైన పాలన అందిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. సభలో మంత్రి మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల తర్వాత నర్మేట ఆయిల్ పామ్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. వ్యవసాయ రంగానికి రూ.లక్ష కోట్లు మంజూరు చేసిన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాడు కరెంట్ తీస్తే.. నేడు జీరో బిల్లు ఇస్తుండ్రు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కరెంట్ చార్జీలు పెంచి కరెంట్‌ను తీసేసిన అధికారులే నేడు జోరో బిల్లు ఇస్తున్నారని ఐటీ శాఖ మంత్రి ధర్ బాబు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. సన్న బియ్యం తీసుకున్న వాళ్లంతా కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్‌లను ఎన్నుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలకు అనుగుణంగా హుస్నాబాద్‌లో రూ.65 కోట్లతో ఏటీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఖజానా ఖాళీ చేసిండ్రు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఖజానాను ఖాళీ చేసి కుటుంబమంతా ఆస్తులను పెంచుకున్నారని మంత్రి వివేక్ అన్నారు. ప్రజాసంక్షేమానికే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాళ్లల్లో కట్టెలు పెట్టెటోళ్లను ఎన్నుకుంటే మునిగేది మనమే హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ నిధులు ప్రకటించని సీఎంహుస్నాబాద్: ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్‌కు వస్తున్నారని, ఈ ప్రాంతానికి వరాల జల్లులు కురిపిస్తారని ఇక్కడి ప్రజలు సంబరపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో పలు పనుల నిమిత్తం చాంతాడంతా జాబితా ఇచ్చి నిధులు ఇవ్వాలని విన్నవించారు. తీరా చూస్తే నిధుల ప్రకటన చేయకుండానే సీఎం వెళ్లిపోవడంతో జనం నిరాశ చెందారు. సిద్దిపేట జిల్లాలో సభ పెడితే సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట పదాన్ని ఉచ్చరించకుండా అంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జపమే చేశారు. సీఎం హైదరాబాద్ నుంచి హుస్నాబాద్‌కు హెలికాప్టర్లో రాగా, తిరుగు ప్రయాణం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పాడిపరిశ్రమంలో అభివృద్ధి చెందేలా ఒక మంచి పథకానికి శ్రీకారం చుడుతామన్నారు. సభలో మంత్రి పొన్నం మాట్లాడుతూ నాలుగు జిల్లాలకు కేంద్రబిందువుగా మారిన హుస్నాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలని సీఎంకు విన్నవించారు. పట్టణంలో వరద నీటి సమస్య తలెత్తకుండా అండర్ డ్రైనేజే సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాలువల నిర్మాణాలు నిర్మించుకుంటున్నామన్నారు. వచ్చే సీజన్లో ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందిస్తామన్నారు. -
ప్రక్రియ సాగుతోంది..
పునరుద్ధరణ ప్రక్రియ కింద ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువులను ఎంపిక చేశాం. ప్రస్తుతం సర్వే జరుగుతోంది. మురికి నీరు చెరువుల్లో కలవకుండా భవిష్యత్తు ప్రణాళికలు తయారు చేశాం. చెరువుల్లో గుర్రపు డెక్క కు శాశ్వత పరిష్కారం అందుతుంది. – ఆశ్రిత్, మున్సిపల్ కమిషనర్ ద్విముఖ లక్ష్యంగా.. ఇప్పటికే కోమటి చెరువు ఒక పర్యాటక స్థలంగా మారింది. ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువుల్లో మురికి నీటి విలీనం కాకుండా, స్వచ్ఛమైన నీటితో లేక్ ఉండేలా, ప్రజలకు ఆహ్లదకరం పంచేలా ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో చెరువులు పర్యాటక ప్రాంతాలుగా మారనున్నాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. – హరీశ్‌రావు, ఎమ్మెల్యే -
కాంగ్రెస్‌లోకి వర్గల్ మాజీ జెడ్పీటీసీ
వర్గల్(గజ్వేల్): బీఆర్ఎస్కు చెందిన వర్గల్ తాజా మాజీ జెడ్పీటీసీ మెంబర్ బాలమల్లు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. బీఆర్ఎస్లో విలువలేకుండా పోయిందని, ఒంటెత్తుపోకడలతో విసిగి వేసారి తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ఈ సందర్భంగా బాలమల్లు యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగారెడ్డి, ప్రభుదాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు. -
దుబ్బాకపై సీఎం రేవంత్ వివక్ష
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి వివక్ష చూపడం సమంజసం కాదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం దుబ్బాక మున్సిపాలిటీలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్‌లో జరిగిన సభలో సీఎం.. దుబ్బాక అభివృద్ధిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గం అన్ని రకాలుగా అన్యాయానికి గురవుతోందన్నారు. రెవెన్యూ డివిజన్‌తో పాటు మల్లన్నసాగర్ కాల్వలు పూర్తి చేయాలని ఎన్నోమార్లు సీఎంకు విన్నవించినా ఫలితం లేదన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని సీఎం, మంత్రులను కలిసినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
శివపార్వతుల ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తజనంప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని సుందర సత్సంగ్ భవన్లో బుధవారం శివపార్వతుల కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. లాల్‌కమాన్ ఆర్యవైశ్య ఫ్యామిలీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతోష్ మాత ఆలయం నుంచి శివపార్వతుల ఉత్సవ మూర్తులను పట్టణంలోని ప్రధాన వీధులగుండా సుందర సత్సంగం వరకు ఊరేగించారు. మహిళలు కోలాటాలతో దేవ దేవతలకు స్వాగతం పలికారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయి ద్యాల మధ్య కల్యాణం కమనీయంగా సాగింది. శివనామస్మరణతో కల్యాణమండపం మార్మోగింది. -
సీఎం సారూ.. ఇటు చూడరూ...
అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు నిధుల వరద పారేనా? ● కోటి ఆశలతో ప్రజలు నేడు జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి రాకప్రాజెక్టులు పూర్తిచేయరూ..గౌరవెల్లి, గండిపెల్లిపై రైతుల కోటి ఆశలుహుస్నాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మొదటి సారిగా హుస్నాబాద్‌కు వస్తుండటంతో రైతులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లు కురిపిస్తారన్న ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ఈ ప్రాంతంలో పాదయాత్ర చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టులు 70 శాతం మేర పనులు పూర్తి చేశారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాజెక్టుల రీ డిజైన్‌లో భాగంగా గౌరవెల్లి ప్రాజెక్టు 8.23 టీఎంసీలు, గండిపల్లి ప్రాజెక్టు 1.15 టీఎంసీల సామర్థ్యానికి పెంచారు. ప్రస్తుతం గౌరవెల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయి ట్రయల్ రన్ చేశారు. కాలువలు నిర్మించాల్సి ఉంది. దశాబ్ధ కాలంగా సాగునీటి ప్రాజెక్టుల కోసం ఈ ప్రాంత ప్రజలు కళ్లల్లో వత్తులు వేసుకొని ఎదురు చేస్తున్నారు.సిద్దిపేటలో చేపట్టిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రోగులకు పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి శివారులో రూ.324కోట్ల వ్యయంతో 2020 డిసెంబర్లో అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వంలో పనులు జోరుగా సాగినా.. రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దాదాపు 90శాతం పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. ఆస్పత్రి పూర్తి అయితే సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. అలాగే మరిన్ని మెడికల్ పీజీ సీట్లు, అలాగే ఎంబీబీఎస్ సీట్లు సైతం పెరగనున్నాయి. దాదాపు మరో రూ.50కోట్లకు పైగా నిధులు కేటాయించి అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే కరీంనగర్ రోడ్లో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాల పనులు సైతం నిధులు లేక నిలిచిపోయాయి. తలాపున నీళ్లున్నా.. తలాపునే రిజర్వాయర్ ఉన్నా.. దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని గ్రామాలకు నీరు అందడంలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా తొగుటలో 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్ పూరై నాలుగేళ్లు గడుస్తున్నా ఇంకా కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. డిస్ట్రిబ్యూషన్ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో దుబ్బాక నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందక ఇబ్బంది పడుతున్నారు.సిద్దిపేటలో వెయ్యి పడకల ఆస్పత్రి నిర్మాణంప్రజాపాలన విజయోత్సవ సభకు సర్వం సిద్ధం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మొదటి సారిగా బుధవారం హుస్నాబాద్‌కు వస్తుండటంతో మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీఐపీలకు, మహిళలకు, దివ్యాంగులకు ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. సభా వేదిక వెనుక భాగంలో హెలిప్యాడ్ నిర్మించారు. సభ ప్రాంగణంలోనే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.ఇంకా పూర్తికాని శిల్పారామం..జిల్లాలో పలు అభివృద్ధి పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. వెయ్యి పడకల ఆస్పత్రి, పర్యాటక అభివృద్ధి, కాలువల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పశు వైద్య కళాశాల నిర్మాణాలు పూర్తి అయ్యేందుకు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లయిన సందర్భంగా విజయోత్సవాలకు బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తారని ప్రజల్లో కోటి ఆశలు నెలకొన్నాయి. – సాక్షి, సిద్దిపేటప్రజల విన్నపాలు..సీఎం సభకు సర్వం సిద్ధం గతంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు.. హుస్నాబాద్‌ను కరీంనగర్లో విలీనం చేయాలి. హుస్నాబాద్ ప్రాంతంలో క్రీడాకారులకు కొదవ లేదు. ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాటు చేస్తే క్రీడాకారులు నైపుణ్యం సాధించే అవకాశం ఉంది. నాలుగు జిల్లాల సరిహద్దులో ఉన్న హుస్నాబాద్‌కు చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలి. ఎన్నికల సమయంలో ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీ మేరకు మెడికల్ కళాశాలపై ప్రకటన చేయాలి. ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం మెండుగా ఉన్నాయి. ఏదైన పరిశ్రమ నెలకొల్పితే స్థానిక యువత ఉపాధి పొందుతారు. హుస్నాబాద్‌లోని జనాభా దృష్ట్యా మున్సిపాలిటీని గ్రేడ్ 1 గా అప్‌గ్రేడ్ చేయాలి. -
నామినేషన్ల స్వీకరణలో అశ్రద్ధ తగదు
సిద్దిపేటరూరల్: నామినేషన్లను టీ–పోల్‌లో అప్లోడ్ చేయాలని, ఏ మాత్రం అశ్రద్ధ చూపవద్దని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నారాయణరావుపేట మండలం మల్యాల, రూరల్ మండలం పుల్లూరు, మచాపూర్ క్లస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 దాటినా మల్యాల, మాచాపూర్ క్లస్టర్లో ఎక్కువ మంది అభ్యర్థులు లైన్లో నిరీక్షించడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ పత్రాలు స్వీకరించిన వెంటనే టీ–పోల్‌లో అప్లోడ్ చేయాలన్నారు. కలెక్టర్ హైమావతి క్లస్టర్ల పరిశీలన -
క్రీడల్లోనూ సత్తాచాటాలి
సిద్దిపేటరూరల్: చదువుతో పాటు క్రీడల్లోనూ సత్తాచాటాలని, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ముందుకు సాగాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం పీఎంశ్రీ స్కూల్స్ జిలా స్థాయి స్పోర్ట్స్ మీట్ ను ఓల్డ్ ఎల్లంకి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థి రోజులో కొంత సమయాన్ని తప్పకుండా ఆటల కోసం కేటాయించాలన్నారు. క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతాయన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ సౌందర్య మాట్లాడుతూ పీఎంశ్రీ స్కూల్ స్థాయిలో మొదటిసారిగా నిర్వహిస్తున్నామని, ఈ క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పాల్గొంటారన్నారు. మొదటి రోజు సుమారు వెయ్యి మంది విద్యార్థులు, 60 మంది వ్యాయామ ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ పరకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మెరవాలి డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అట్టహాసంగా పీఎంశ్రీ స్పోర్ట్స్ మీట్ షురూ.. -
కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించండి
గజ్వేల్: పెండింగ్ బిల్లులు అడిగిన పాపానికి సర్పంచ్‌లను జైళ్లకు పంపిన కాంగ్రెస్‌ను ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడలో వివిధ పార్టీలకు చెందిన నేతలు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని వాపోయారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు రాక, సొంత డబ్బులు ఖర్చుపెట్టుకోలేక పంచాయతీ కార్యదర్శులు సెలవులు పెట్టి వెళ్లిపోతున్నారని తెలిపారు. వీధి దీపాల నిర్వహణ కూడా సక్రమంగా లేక గ్రామాల్లో చీకట్లు అలుముకున్నాయన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల గ్రామాలు అధ్వానంగా మారాయని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడా నిలదీయాలన్నారు. వృద్ధులకు నెలకు రూ.4వేల ఫించన్, కల్యాణ లక్ష్మితోపాటు తులం బంగారం హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలన్నారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. కుకునూరుపల్లిలో చేరికలు కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి మండలం రాయవరంలో కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ అధికారం దాహం కోసం పని చేస్తున్న కాంగ్రెస్ మద్దుతు దారులను ఓడించాలన్నారు. కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ గుర్ర మహేందర్‌తో పాటు కమ్మరి రవి, బక్కోళ్ల కరుణాకర్, రాజు, రంగస్వామి, అనిల్ మరి కొందరు బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్లో పలువురి చేరిక -
హుస్నాబాద్ మెరవాలి
హుస్నాబాద్: మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా అధికారులు పని చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో పెండింగ్, పూర్తయిన పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, మొక్కల పెంపకం వంటి పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ పనుల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీసీ రోడ్లు పెండింగ్ పనులను ఈనెలాఖరులోగా, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్నవి, ప్రతిపాదనలు చేయాల్సిన పనులపై వివిధ శాఖల అధికారులతో త్రిసభ్య కమిటీ వేశారు. మున్సిపాలిటీకి రింగ్ రోడ్ త్వరలోనే మంజూరు అవుతుందని మంత్రి తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో మంత్రి సమీక్ష -
ఊడలమర్రి నీడలో..
వర్గల్(గజ్వేల్): గురుకుల విద్యాలయంలో నిత్యం చదువులతో కుస్తీపట్టే వర్గల్ నవోదయ విద్యార్థులు మంగళవారం ఊడలమర్రి నీడలో..ఉయ్యాల జంపాలలు ఊగుతూ సందడి చేశారు. రిఫ్రెష్మెంట్ కోసం ప్రిన్సిపాల్, అధ్యాపకులతో కలిసి విద్యాలయ సమీపంలోని అవుసులోనిపల్లి పల్లెప్రకృతి వనం చేరుకున్నారు. ప్రకృతిసిద్ధంగా రూపుదిద్దుకున్న మర్రి ఊడలు, చెట్టుకొమ్మలపై గెంతుతూ, ఆటపాటలతో కేరింతలు కొట్టారు. ఫొటోలు దిగారు. ఆనందోత్సాహాల మధ్య గడిపి నూతనోత్సాహం పొందారు. అక్కడే వనభోజనం చేసి విద్యాలయానికి చేరుకున్నారు.నవోదయ విద్యార్థుల సందడి -
వైభవంగా లక్ష పుష్పార్చన
వర్గల్(గజ్వేల్): లక్ష పుష్పార్చనతో నాచగిరి శోభిల్లింది. రంగురంగుల పూల మధ్య స్తంభోద్భవుడు భక్తజనావళికి దివ్యదర్శనమిచ్చారు. ఆలయ ముఖమండపంలో మంగళవారం ఉదయం లక్షపుష్పార్చన కొనసాగింది. భక్తులు శ్రీనృసింహ నామం స్మరిస్తూ ఒక్కొక్కటిగా పూలను సమర్పించారు. వైభవంగా సాగిన ఈ మహోత్సవంతో ఆధ్యాత్మికత వెల్లివిరియగా, ఆలయ చైర్మన్ రవీందర్‌గుప్తా, ఈఓ విజయరామారావు, ధర్మకర్తలు, భక్తజనులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. ‘డబుల్ బెడ్రూం’ సమస్యలు పరిష్కరించండికాలనీవాసుల నిరసన హుస్నాబాద్: పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆ కాలనీవాసులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మున్సిపల్ అధికారులకు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. అలాగే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ పనులకు నిధులు కేటాయించకపోవడంతో తామే సొంత డబ్బులు ఖర్చుచేసి ఇళ్లలో ఉంటున్నామని వాపోయారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుద్దాల చంద్రయ్య, మల్లికార్జున్‌రెడ్డి, వికాస్, లక్ష్మణ్, కాలనీవాసులు పాల్గొన్నారు. బస్సులు ఆపాలిఆర్టీసీ డీఎంకు ఎస్ఎఫ్ఐ వినతి సిద్దిపేటకమాన్: బస్ స్టాప్‌లో బస్సులు ఆపడం లేదని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు. కుకునూరుపల్లి మండల కేంద్రంలోని బస్ స్టాప్‌లో బస్సులు ఆపాలని ఎస్ఎఫ్ఐ నాయకులు సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బస్సులు నిలపకపోవడంతో సిద్దిపేటకు వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. కీర్తనకు ఘన సన్మానంసిద్దిపేటకమాన్: సత్యసాయిబాబా శతజయంతి వేడుకల సందర్భంగా ఇటీవల కర్ణాటకలో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించిన సిద్దిపేటకు చెందిన యువతి కీర్తనను సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో అధ్యాపకులు మంగళవారం సన్మానించారు. ఆమె మాట్లాడుతూ ఆగస్టు 16 నుంచి నవంబర్ 23 వరకు 100 దేశాల కళాకారులు పాల్గొన్న ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ’ కల్చరల్ ఫెస్టివల్ ప్రపంచంలోనే అతి దీర్ఘ సాంస్కృతికోత్సవంగా గిన్నీస్ రికార్డు సృష్టించిందన్నారు. -
సామాజిక దృక్పథంతో ముందుకుసాగాలి
గజ్వేల్: విద్యార్థులు సామాజిక దృక్పథంతో ముందుకు సాగాలని ఏబీవీపీ ఆలిండియా స్టేట్ యూనివర్శిటీస్ కో–కన్వీనర్ కమల్సురేశ్ పిలుపునిచ్చారు. గజ్వేల్‌లో సోమవారం విద్యార్థులకు నగర అభ్యాస వర్గ శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే, విద్యార్థుల్లో సామాజిక సేవను పెంపొందించడానికి ప్రయత్నిస్తుందన్నారు. రక్తదాన శిబరాలు, మొక్కలు నాటడం, ఉచిత వైద్య శిబిరాలు, ఉచిత బోధనా తరగతులు లాంటి కార్యక్రమాలతోపాటు మహిళల్లో ఆత్మరక్షణ కోసం ఎస్ఎఫ్డీ(స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్) కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ్ జిల్లా ప్రచారక్ జనార్దన్జీ, జిల్లా కన్వీనర్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.ఏబీవీపీ నేత కమల్సురేశ్ -
7 నుంచి సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేటఅర్బన్: మెదక్‌లో 7 నుంచి 9వ తేదీ వరకు జరగనున్న సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య పిలుపునిచ్చారు. సిద్దిపేటలోని యూనియన్ భవన్లో సోమవారం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బహరంగసభకు ముఖ్యఅతిథిగా ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవీ రాఘవులు హాజరవుతారన్నారు. సీఐటీయూ ఆలిండియా అధ్యక్షురాలు హేమలత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భాస్కర్, సహాయ కార్యదర్శి రవికుమార్, నాయకులు సాదిక్, రాజు, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య -
నామినేషన్ల ప్రక్రియ పరిశీలన
● నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ● రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు హరితతొగుట(దుబ్బాక): ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు హరిత హెచ్చరించారు. మండల కేంద్రంలో నిర్వహించిన సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల ప్రక్రియను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అభ్యర్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ డీఓ నాగేశ్వర్ పాల్గొన్నారు. మిరుదొడ్డిలో.. మిరుదొడ్డి(దుబ్బాక): మిరుదొడ్డి మండల కేంద్రంతో పాటు, అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాలను సోమవారం రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు హరిత సందర్శించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండో రోజు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. నామినేషన్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఆమె వెంట ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఎంపీఓ ఫహీం, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఉన్నారు. -
పాఠశాలలో నమూనా బ్యాంకు
కళాశాలలో అకాడమిక్ ఆడిట్ ఘనంగా భగవద్గీత జయంతి వేడుకలు బాల్య వివాహాలపై అవగాహన హెచ్ఐవీని తరిమికొడదాం వర్గల్(గజ్వేల్): ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వర్గల్ మండల కేంద్రంలో పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది అవ గాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ర్యాలీలో ఆశా వర్కర్లు, కేజీబీవీ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా నామినేషన్ల సమర్పణ
సిద్దిపేటఅర్బన్: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు పోటెత్తారు. సోమవారం మంచి ముహూర్తం కావడంతో ఎక్కువ మంది నామినేషన్లు సమర్పించారు. మండలంలోని ఎన్సాన్పల్లి, పొన్నాల, ఎల్లుపల్లి, మిట్టపల్లి, తడ్కపల్లి క్లస్టర్లలో ఆర్వోలు నామినేషన్లు స్వీకరించారు. అభ్యర్థులు తమ మద్దతు దారులతో ర్యాలీగా వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్సాన్‌పల్లిలో లహరిక కృష్ణమూర్తి, పొన్నాలలో ఎర్ర శ్రావణ్, మందపల్లి సర్పంచ్ అభ్యర్థి కొమ్ము రాజయ్య ర్యాలీగా తరలి వచ్చి నామినేషన్లు అందజేశారు. అర్బన్ మండలంలో 12 గ్రామాలకు గాను సర్పంచ్ పదవికి 27 నామినేషన్లు దాఖలు కాగా వార్డు సభ్యులకు 133 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్సాన్‌పల్లిలో ఎన్నికల పరిశీలకురాలు హరిత నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. -
కాంగ్రెస్‌లో చేరికలు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం అంతక్కపేట గ్రామంలోని పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం ఆ నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రిటైర్డ్ హోంగార్డు గుజ్జుల వెంకటేశంతోపాటు కాశ బోయిన రమేశ్, మేదిని సాంబరాజు, ఇట్టబోయిన మోహన్, కాశబోయిన పోశ య్య పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, నాయకులు కాశబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.మందుబాబులకు జరిమానా సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన వాహన తనిఖీల్లో పది మంది పట్టు బడ్డారు. వారిని సోమవారం కోర్టులో హాజరుపర్చగా విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.1,06,000 జరిమానా, ఒకరికి పది రోజుల జైలు శిక్ష విధించారు. అడ్మిషన్లకు చివరి అవకాశం మద్దూరు(హుస్నాబాద్): ఓపెన్ స్కూల్లో పదోతరగతి, ఇంటర్లో ప్రవేశాలకు 7వ తేదీతో గడువు ముగుస్తుందని, ప్రభుత్వం చివరి అవకాశం కల్పించిందని రేబర్తి ఉన్నత పాఠశాల కో–ఆర్టినేటర్ వరదరాజు, అసిస్టెంట్ కో– ఆర్టినేటర్ చంద్రభాను సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విదేశాలలో ఉన్నత విద్యకు శిక్షణ తరగతులు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విదేశాలలో ఉన్నత విద్యావకాశాలు, స్కాలర్‌షిప్‌లపై బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు డాక్టర్ కృష్ణదయాసాగర్ సోమవారం తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సిద్దిపేట బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్ సంగారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి ఐటీఐ సీఎస్ఐ చర్చి జంక్షన్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ కొంతకాలంగా పని చేయడం లేదు. అలాగే ఈ రోడ్డుపై కనీసం ట్రాఫిక్ సిబ్బంది కూడా పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతోంది. -
‘నారోజు’కు జాతీయ ప్రతిభా లెజెండరీ అవార్డు
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు సహాయ అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న నారోజు వెంకటరమణ ప్రతిభా లెజెండరీ అవార్డు అందుకొన్నారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్, అభ్యుదయ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జాతీయ ప్రతిభా లెజెండరీ పురస్కారాల మహోత్సవం జరిగిందన్నారు. కళారంగంలో ఉత్తమ గాయనిగా రాణిస్తున్నందుకు గాను ఈ అవార్డు అందించారని చెప్పారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ చైర్మన్ కళారత్న బిక్కికృష్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సభ్యుడు డాక్టర్ నాలేశ్వరం శంకరం, బీసీ కమిషన్ పూర్వ చైర్మన్ బీఎస్ రాములు, విశ్రాంత హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చంద్రకుమార్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు ఆమె తెలిపారు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు
జగదేవ్‌పూర్(గజ్వేల్): శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని ఏసీపీ నర్సింహులు హెచ్చరించారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రమైన జగదేవ్‌పూర్, తిగుల్ గ్రామాల్లో సోమవారం పోలీసు కవాతు నిర్వహించారు. పాత నేరస్థులు, అనుమానితులను పిలిపించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వివాదాలు, ఘర్షణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలి చిన్నకోడూరు(సిద్దిపేట): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం కేంద్ర బలగాలతో చిన్నకోడూరులో పోలీసులు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పౌరులందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి భయాలు, ప్రలోభాలకు లొంగవద్దని చైతన్యవంతం చేశారు. కార్యక్రమలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ సైఫ్ అలీ, ఎంపీడీఓ జనార్దన్, తహసీల్దార్ సలీమ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లఘిస్తే చర్యలు కొండపాక(గజ్వేల్): త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏసీపీ హెచ్చరించారు. కుకునూరుపల్లి పోలీస్టేషన్న్లో కొండపాక, కుకునూరుపల్లి మండలాలకు చెందిన వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనల గురించి అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించవద్దన్నారు. ప్రజలను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిర్వహణను బంద్ చేశామని, ఎవరైనా నిర్వహిస్తే సమాచారం అందించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఏసీపీ సూచించారు. కార్యక్రమంలో తొగుట సీఐ లతీఫ్, ఎస్ఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఏసీపీ నర్సింహులు -
ఆర్ఎంపీలకు పద్మశాలీ సమాజం సన్మానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఆర్ఎంపీలు పేద ప్రజలకు సేవలందించాలని పద్మశాలీ సంఘం అధ్యక్షుడు కాముని రాజేశం, సిద్దిపేట ఆర్ఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముదిగొండ శ్రీనివాస్ అన్నారు. పట్టణ పద్మశాలీ సమాజం ఆధ్వర్యంలో సోమవారం పద్మశాలీ ఆర్ఎంపీలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎంపీలు వృత్తిలో సమాజాభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సిరిగాది బాల్‌రాజు, ఉపాధ్యక్షుడు శ్రీహరి, కోశాధికారి సూరం ప్రసాద్, సహాయ కార్యదర్శి రవితేజ, సహాయ కార్యదర్శి చిలుక ఆంజనేయులు, కార్యవర్గ సభ్యులు పెద్ద శ్రీనివాస్, ఆడేపు నాగరాజు, సిరిమల్లె సునీత తదితరులు పాల్గొన్నారు. -
హుస్నాబాద్‌ను కోనసీమగా తీర్చిదిద్దుతా
హుస్నాబాద్: నియోజకవర్గాన్ని, ఆదర్శవంతంగా, మరో కోనసీమగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభాస్థలిలో విలేకరులతో మాట్లాడారు. 3న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు సహచర మంత్రులను హుస్నాబాద్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. హుస్నాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాల భవన నిర్మాణం, ఏటీసీ, రాజీవ్ రహదారి నుంచి హుస్నాబాద్, హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు 4 లేన్ల రహదారి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారన్నారు. అలాగే కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్, హుస్నాబాద్ మున్సిపాలిటీలో రూ.20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఆర్టీఏ కార్యాలయ భవనం, ఇందిరా మహిళా శక్తి బజార్, ఉమ్మాపూర్లో అర్బన్ పార్క్ ఏర్పాటు, మహిళా సంఘాలకు బస్సులు, హైదరాబాద్ నుంచి హుస్నాబాద్‌కు ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభిస్తారని పొన్నం తెలిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు 70 సైకిళ్లు పంపిణీ చేయనున్నారన్నారు. మొత్తంగా రూ.480.36 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాన చేయనున్నట్లు మంత్రి చెప్పారు. అనంతరం కలెక్టర్ హైమావతితో కలిసి సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేద్దాం.. సర్పంచ్ ఎన్నికలపై నియోజకవర్గంలోని వివిధ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటనను విజయవంతం కోసం జన సమీకరణలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థులు క్లీన్‌స్విప్ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థి ఒక్కరే ఉండి, వారి గెలుపు కోసం మిగిలిన నేతలంతా ఐక్యంగా పని చేయాలని ఆదేశించారు. సమావేశంలో శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్త చైర్మన్ కేడం లింగమూర్తి, రాష్ట్ర హౌస్ఫేడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ 3న సీఎం రేవంత్ రాక రూ.480.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని వెల్లడి -
ప్రజావాణి రద్దు
సిద్దిపేటరూరల్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఎన్నికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హైమావతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరగదని తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. సర్పంచ్‌లకు 228.. వార్డులకు 287 రెండో విడత తొలి రోజు దాఖలైన నామినేషన్లు సిద్దిపేటరూరల్: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రశాంతంగా కొనసాగింది. ఆదివారం తొలిరోజు 10 మండలాల్లో 182 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు 228 దరఖాస్తులు రాగా, 1,644 వార్డు స్థానాలకు 287 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు 58 క్లస్టర్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. సమస్యాత్మక గ్రామాల్లో నిఘా ముమ్మరంగజ్వేల్ ఏసీపీ నర్సింహులు గజ్వేల్: శాంతియుత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలా అంతా సహకరించాలని గజ్వేల్ ఏసీపీ నర్సింహులు పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ మండలం జాలిగామ, బెజుగామ గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా...పోలీసు శాఖకు వెంటనే సమాచారం అందించాలని కోరారు. కాగా ఆయా గ్రామాల్లోని కూడళ్లల్లో పోలీసులతోపాటు ప్రత్యేక బలగాలు కవాతు నిర్వహించాయి. కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, అదనపు ఇన్స్పెక్టర్ ముత్యంరాజు, ఎస్ఐలు ప్రేమ్‌దీప్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణానికి విరాళం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు మిరుదొడ్డి(దుబ్బాక): ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు. 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ నేపధ్యంలో ఆదివారం మండల పరిధిలోని అల్వాల, చెప్యాలతో పాటు అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం, అల్మాజీపూర్, జంగపల్లి, వీరారెడ్డిపల్లి గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన వంటి కార్యక్రమాలు నిర్వహిచరాదన్నారు. ఇంటి యజమానుల అనుమతులు లేకుండా గొడలపై ఎన్నికల ప్రచారం చేయవద్దన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలని కోరారు. రేబిస్ వ్యాధితో అప్రమత్తం మద్దూరు(హుస్నాబాద్): రేబిస్ వ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అఽధికారి డాక్టర్ అర్జున్ సూచించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుక్కలు, కోతులు, ఎలుగుబంటితో పాటు ఇతర జంతువులు కాటు వేసినపుడు రేబిస్ వ్యాధి సోకుతుందన్నారు. ఈ వ్యాధి సోకినపుడు వైరల్ ఫీవర్‌తో పాటుగా వివిధ లక్షణాలు ఉంటాయని, వెంటనే ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాలని సూచించారు. -
నటనపై ఆసక్తితోనే సినిమాల వైపు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి చిన్న చిన్న పాత్రలు పోషించి తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకులకు మరింత దగ్గరగా అవుతున్నారు నటుడు తిరువీర్. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించారు. ప్రస్తుతం భరత్ భూషణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమా సిద్దిపేట పట్టణ శివారులోని చంద్లాపూర్‌లో షూటింగ్ జరుగుతోంది. ఆ సినిమాలో హీరోగా తిరువీర్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా హీరో తిరువీర్‌ను ‘సాక్షి’ పలకరించింది. వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. షూటింగ్‌లు చూసి.. సిటీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న సమయంలో కాలేజీ ప్రాంగణంలో సినిమా షూటింగ్‌లు జరిగేవి. అప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక కలిగింది. అదే లక్ష్యంతో డిగ్రీ పూర్తి అయిన తర్వాత తెలుగు యూనివర్సీటీలో ఆర్ట్స్ పై కోర్సు చేశాను. రంగస్థల నటునిగా పలు నాటికలు వేశాను. నా నటనను చూసి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. నేను నటించిన సినిమా తెర మీద కన్పించడం చాలా సంతోషంగా ఉంది. యాక్టర్ అవుతే చాలు అనుకున్నా.. ప్రజలు అభిమానంతో హీరోను అయ్యాను. రెడియో జాకీగా సైతం పని చేశాను. నాకు ఇష్టమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్. బొమ్మల రామారం సినిమాతో 2016లో బొమ్మల రామారం సినిమాతో సినీ ఫీల్డ్‌లోకి ఎంటరయ్యాను. నా మొదటి సినిమా నుంచే గుర్తింపు వచ్చింది. 2019లో వచ్చిన జార్జ్‌రెడ్డి(లలన్ సింగ్ పాత్ర), 2020లో వచ్చిన పలాస 1978 (రంగారావు పాత్ర)లలో నటించాను. ‘మసూద’ తో హీరోగా టర్నింగ్ పాయింట్ 2022లో వచ్చిన హర్రర్ థ్రిల్లర్ ‘మసూద’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. ఈ సినిమాను ప్రజలు బాగా ఆదరించారు. ఆ సినిమా హిట్ రావడంతో మంచి గుర్తింపు వచ్చింది. 2023లో వచ్చిన ‘పరేషాన్’ సినిమా ద్వారా ప్రేక్షకుల నుంచి మార్కులు కోట్టేశాను. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ ఎంతో బూస్టింగ్ ఇచ్చింది. సిద్దిపేట టౌన్ లోపలికి రావడం ఇదే మొదటి సారి. రంగనాయకసాగర్‌ను షూటింగ్ జరుగుతుండగా బ్రేక్ టైం వెళ్లి చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా కోమటి చెరువు, మల్లన్నసాగర్లు చూడాలి. ‘బొమ్మల రామారం’తో సినిమా రంగంలోకి ‘మసూద’లో హీరోగా టర్నింగ్ పాయింట్ ‘సాక్షి’తో నటుడు తిరువీర్ చంద్లాపూర్‌లో సినిమా షూటింగ్ -
అమ్మో.. రెబెల్స్!
పంచాయతీ ఎన్నికల పర్వం కీలక ఘట్టానికి చేరుకుంది. జిల్లాలో మొదటి విడత ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్క్రూటినీ జరిగి అభ్యర్థుల జాబితా వెలువడింది. ఈ క్రమంలోనే ప్రధాన గ్రామాల్లో పార్టీలకు రెబెల్స్ బెడద తలనొప్పిగా మారుతోంది. ఈ పరిస్థితివల్ల గెలిచే స్థానాలను ఓడిపోయే అవకాశం ఉందనే ఆందోళన పార్టీ నేతలను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 3లోగా రెబెల్స్‌ను బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీల నేతలు నిమగ్నమై ఉన్నారు. – గజ్వేల్ జిల్లాలోని 508 పంచాయతీలకుగానూ 163 పంచాయతీల్లో మొదటి విడత, 182 పంచాయతీల్లో రెండోవిడత, 163 పంచాయతీల్లో మూడో విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి విడత ఎన్నికల ప్రక్రియ.. కీలక ఘట్టానికి చేరుకుంది. ఆదివారం నామినేషన్ల స్క్రూటినీ జరిగి.. సాయంత్రం అభ్యర్థుల జాబితాలు వెలువడ్డాయి. 1న అప్పీలుకు అవకాశం కల్పించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 3న తుది గడువు విధించారు. ఈ క్రమంలోనే రెబెల్స్ వ్యవహారం అన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రధాన గ్రామాల్లో ఈ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒక్కో సర్పంచ్ స్థానానికి ఒక్కో పార్టీ నుంచి రెండు నుంచి నాలుగు ఆపైనా నామినేషన్లు వేశారు. పార్టీల మద్దతు దక్కని కొందరు ఇప్పటికే ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. కొందరైతే పార్టీల మద్దతు లేకున్నా.. సరే రెబెల్‌గా పోటీలోనే ఉంటామని భీష్మించుకున్నారు. ఈ పరిస్థితుల్లో వీరిని సముదాయించడం నేతలకు తలనొప్పిగా మారింది. ఇలాగే వదిలిపెడితే ఓట్లు చీలిపోయి.. గెలిచే స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉండటంతో బుజ్జగించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా వారిని సముదాయించి నామినేషన్లను విత్‌డ్రా చేయించే ప్రయత్నాలు సాగుతున్నాయి. పార్టీలు గ్రామాలవారీగా ముఖ్యనేతలకు ఈ బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలో గ్రామాల్లో జోరుగా సంప్రదింపులు సాగుతున్నాయి. ఇది వదులుకుంటే.. మరో అవకాశం సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేసిన రెబెల్ అభ్యర్థులు పార్టీలు పిలుపు మేరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే రాబోవు రోజుల్లో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని కొందరికీ, పార్టీ పదవులను అప్పగిస్తామని మరికొందరికీ హామీ ఇస్తున్నారు. ఇవే కాకుండా పార్టీ అభ్యర్థులుగా పోటీలో ఉండాలనుకుంటున్న వారి చేత రెబెల్స్ అభ్యర్థులుకు డబ్బులు ఇప్పించే ఒప్పందాలు చేస్తున్నారు. మొదటి విడతకు సంబంధించి నామినేషన్ల విత్‌డ్రా గడువులోగా ఎంతమంది... పార్టీల నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటారోననేది వేచిచూడాల్సిందే. మరోవైపు రెండో విడత విడతకు సంబంధించి ఆదివారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మూడో విడత గ్రామాలకు డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆయా గ్రామాల్లోనూ రెబెల్స్ బెడద పార్టీలను కలవరపరుస్తోంది.పార్టీల గుర్తులతో ప్రమేయం లేకుండా జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ మద్దతుదారులను గెలిపించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమదైన శైలిలో ప్రచారాన్ని చేపట్టడానికి సిద్ధమయ్యాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు ఉత్సాహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతుండగా, బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ మోదీ నాయకత్వాన్ని ప్రచారం చేస్తున్నది.జప్తిసింగాయిపల్లి ఏకగ్రీవం!సింగిల్ నామినేషన్ దాఖలు ములుగు(గజ్వేల్): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవం పర్వం కొనసాగుతోంది. అనేక చోట్ల సింగిల్ నామినేషన్లు దాఖలవుతుండటంతో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ములుగు మండలం జప్తిసింగాయిపల్లి పంచాయతీ ఏకగ్రీవానికి రంగం సిద్ధమైంది. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో బొమ్మగళ్ల లక్ష్మి ఒక్కరే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పంచాయతీలో మొత్తం 8 వార్డులు ఉండగా అందులో 2 వార్డులు ఏకగ్రీవం అయ్యేందుకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి బాటలో నడుస్తుందన్న ఆలోచనతో గ్రామస్తులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జప్తిసింగాయిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నిక అధికారిక ప్రకటనే మిగిలి ఉంది.అన్ని పార్టీలకూ తప్పని బెడద జిల్లాలో అంతటా ఇదే పరిస్థితి గెలుపోటములు ప్రభావితం చేసే అవకాశం బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం ఆసక్తికరంగా ‘పంచాయతీ’ రాజకీయాలు -
నేటి నుంచి నూతన మద్యం పాలసీ
సిద్దిపేటకమాన్: జిల్లాలో 2025–27 సంవత్సరానికి డిసెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలవుతుందని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి తెలిపారు. జిల్లాలో 93 మద్యం దుకాణాల ద్వారా విక్రయాలు జరగనున్నట్లు తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, మిరుదొడ్డి సర్కిల్ పరిధిలోని 93 మద్యం దుకాణాల నూతన పాలసీ ప్రకారం నిర్వహణకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 2,782 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 27న కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా మద్యం షాప్‌లను కేటాయించారు. షాప్‌లను దక్కించుకున్న లైసెన్స్‌దారులు సోమవారం నూతన మద్యం దుకాణాలను నడపనున్నారు. -
ఏకగ్రీవం వైపు అడుగులు
నామినేషన్ల హోరు వర్గల్(గజ్వేల్): గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం శనివారం ముగిసింది. నామినేషన్లు దాఖలుకు చివరిరోజు కావడంతో సర్పంచు, వార్డుల కోసం ఆశావహులు, మద్ధతుదారులు క్లస్టర్ కేంద్రాలకు పోటెత్తారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలు దాటితే నామినేషన్ వేసే అవకాశం లేదు. కానీ వర్గల్ మండలంలోని వర్గల్, గౌరారం, మీనాజీపేట, నెంటూరు, మజీద్‌పల్లి, వేలూరు కేంద్రాల వద్ద భారీగా ఆశావహులు నామినేషన్లు వేసేందుకు తరలివచ్చారు. అక్కడే క్యూ కట్టారు. ఐదు గంటల వరకు కేంద్రంలో ఉన్న వారందరికి టోకెన్లు జారీచేసి రాత్రి దాదాపు 9 గంటల వరకు నామినేషన్లు స్వీకరించినట్లు ఎంపీడీఓ మచ్చేందర్ పేర్కొన్నారు. వర్గల్ మండలంలో 27 గ్రామపంచాయతీలకు చివరిరోజే అత్యధికంగా నామినేషన్లు దాఖలైనట్లు ఆయన తెలిపారు.రాత్రి వరకు నామినేషన్లు ● కేంద్రాల వద్ద సందడి వర్గల్(గజ్వేల్)/గజ్వేల్‌రూరల్/సిద్దిపేటఅర్బన్/దుబ్బాకటౌన్/జగదేవ్‌పూర్(గజ్వేల్): ఏకగ్రీవం వైపు పల్లెలు పోటీపడుతున్నాయి. నామినేషన్ల ఘట్టానికి ముందే ‘సింగిల్’ నామినేషన్లతో తమ అభిమతాన్ని చాటుతున్నాయి. ఆదర్శంగా నిలుస్తున్నాయి. జిల్లాలోని గజ్వేల్, వర్గల్, దుబ్బాక, సిద్దిపేట, జగదేవ్‌పూర్ తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వర్గల్ మండలంలో చాంద్ఖాన్మక్తలో సర్పంచ్ పదవి కోసం మేదిని సజనిత భిక్షపతిరెడ్డి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే.. ఎనిమిది వార్డులకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో చాంద్‌ఖాన్ మక్త సర్పంచ్‌గా ఆమె ఏకగ్రీవం లాంఛనమే కానుంది. నూతన పంచాయతీగా ఆవిర్భవించిన ఈ పల్లె వరుసగా రెండోసారి ఏకగ్రీవమైన పంచాయతీగా రికార్డు సాధించనున్నది. అదేవిధంగా గుంటిపల్లి పంచాయతీ సర్పంచు కోసం బొమ్మ మహంకాళి ఏకగ్రీవం కానున్నది. తున్కిమక్త పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థులుగా భార్యాభర్తలు పసుల రాజు, పసుల రేణుక మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ 8 వార్డులకు సింగిల్ నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా, పంచాయతీ ఎన్నికల నామినేషన్ల చివరిరోజు ఆశావహులు శనివారం రాత్రి 9 గంటలకు చలిని లెక్కచేయకుండా వర్గల్ కేంద్రం వద్ద నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు నిరీక్షించారు. రాత్రి వరకు నామినేషన్ల స్వీకరణ గజ్వేల్ మండలంలోని 25 గ్రామ పంచాయతీలకు మొదటి విడతలో నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. రాత్రి 9 దాటినప్పటికీ అక్కారం, బయ్యారం క్లస్టర్ల పరిధిలోని గ్రామాలకు చెందిన ఆశావహులు నామినేషన్లను వేసేందుకు బారులు తీరారు. రంగంపేట ఏకగ్రీవం గజ్వేల్ మండలంలోని రంగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఒకే అభ్యర్థి రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేయడంతో ఏకగ్రీవానికి బాటలు పడ్డాయి. శనివారం సర్పంచ్ అభ్యర్థిగా నాగరాజు ఒకరే నామినేషన్ దాఖలు చేశారు. పాండవపురం సర్పంచ్ ఏకగ్రీవం! సిద్దిపేట మండలం పాండవపురం (బొగ్గులోనిబండ) గ్రామం సర్పంచ్ పదవి ఏకగ్రీవం చేసేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. 200 పైగా ఓటర్లు ఉన్న పాండవపురం సర్పంచ్ పదవి జనరల్ కాగా ముగ్గురు అభ్యర్థులు పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో గ్రామస్తులు వేలం పాట నిర్వహించినట్టు సమాచారం. అయితే ముగ్గురిలో ఒకరు రూ.16 లక్షలకు పైగా డబ్బులు కుల సంఘానికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. ఏకగ్రీవమైన లింగాయిపల్లి తండా దౌల్తాబాద్ మండలం లింగయిపల్లి తండా సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. సర్పంచ్ అభ్యర్థి గుగ్గులోతు లక్యనాయక్ ఒకే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు తండావాసులు సంబరాలు చేసుకున్నారు. మూడు గ్రామాలు ఏకగ్రీవం జగదేవ్‌పూర్ మండలం పలుగుగడ్డ, కొండాపూర్, అనంతసాగర్ గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. శనివారం నామినేషన్ల చివరి రోజు వరకు ఆయా గ్రామాల్లో ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలలయ్యాయి. పలుగుగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవికి అదే గ్రామానికి చెందిన నర్ర కనకయ్య, కొండాపూర్‌లో సుప్పరి పుష్ప, అనంతసాగర్‌లో క్యాసారం కుమార్‌లు ఒకే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ గ్రామాల్లో ఏకగ్రీవం ఎన్నిక జరిగినట్లేనని భావిస్తున్నారు. క్యూలో ఆశావహులు, మద్ధతుదారులు టోకెన్లు జారీచేసిన అధికారులు -
అప్రమత్తంగా ఉండండి
అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం సమస్యలుంటే సంప్రదించండిపంచాయతీ ఎన్నికల పరిశీలకురాలు హరిత గజ్వేల్: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఎలాంటి సమస్యలున్నా ఫోన్ నంబరు 63059 56344ను సంప్రదించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకురాలు హరిత కోరారు. గజ్వేల్ మండలం రిమ్మనగూడ క్లస్టర్లో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నియామవళికి అనుగుణంగా ముందుకుసాగాలని అధికారులను ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలన్నారు. పోలీసుల అనుమతి తప్పనిసరి: సీపీసిద్దిపేటకమాన్: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అనుసరించాలని చెప్పారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీ, బహిరంగ సభ నిర్వహణకు తప్పనిసరిగా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. ప్రచారానికి ఉపయోగించే వాహనాలకు సంబంధిత తహసీల్దార్ నుంచి అనుమతి తీసుకోవాలని చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణ, ఏకగ్రీవం కోసం ఎవరైనా బెదిరించినా, ప్రలోభపెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురు శిష్యుల ప్రతిభచిన్నకోడూరు(సిద్దిపేట): బాల చెలిమి పత్రిక హైదరాబాద్ నిర్వహించిన జాతీయ స్థాయి బాలల కథల పోటీల్లో మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు నరేశ్, విద్యార్థి బి.విశ్వతేజ మొదటి స్థానంలో నిలిచారు. ఉపాధ్యాయుడు రాసిన చిన్న విత్తనం–మహావృక్షం కథ, విద్యార్థి రాసిన ఊరు చేసిన తప్పు కథలు మొదటి స్థానంలో నిలిచాయి. డిసెంబర్ 22న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు వారిని అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆడిట్ జహీరాబాద్ టౌన్: రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాల మేరకు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం 2022–23–24 విద్యా సంవత్సరాలకు సంబంధించి అకాడమిక్ ఆడిట్ నిర్వహించారు. సంగారెడ్డి తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ప్రవీణ, వాణిజ్యవిభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేంద్ర అకాడమిక్ అడ్వయిజర్లుగా వ్యవహరించారు. కళాశాలలోని 15 విభాగాల పనితీరు, ప్రగతిని సమీక్షించారు. ఆధునిక బోధనకు అనుగుణంగా అధ్యాపకులు తమను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ అస్లం ఫారూకి మాట్లాడుతూ.. అకాడమిక్ ఆడిట్ వల్ల కళాశాలలకు ఎంతో మేలు జరుగుతుందని, లోటు పాట్లు తెలుసుకోడానికి దోహదపడుతుందని చెప్పారు. -
ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్ శ్రీ 2025
సిద్దిపేటజోన్: తెలంగాణ మలి విడత ఉద్యమాన్ని మలుపు తిప్పింది కేసీఆర్ దీక్ష అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం దీక్షా దివస్ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక కీలకమైన ఘట్టాలు, కేసీఆర్ దీక్ష, అమరవీరుల త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు. తెలంగాణ ఉద్యమంతో సిద్దిపేటకు అవినాభావ సంబంధం ఉందన్నారు. సిద్దిపేట పట్టణంలో దీక్ష శిబిరాన్ని శ్రీకృష్ణ కమిటీ సందర్శించి అభిప్రాయాలు సేకరించినట్టు గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోటి ఎకరాల మాగాణి అయిందన్నారు. అంతకుముందు దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొందరు మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన అందెశ్రీకి సమావేశంలో సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి హరీశ్‌రావు పూలమాల వేసి బైక్ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళలర్పించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సిద్దిపేట దీక్షలకు గుర్తుగా పైలాన్ ఆవిష్కరించి అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు శర్మ, రాజనర్స్, రవీందర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, సాయిరాం, చిన్న, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ కవర్లు వద్దు బాబూ..! సిద్దిపేటజోన్: ‘‘ఏమి తమ్మీ.. కర్రీ పాయింట్ మంచిగా నడుస్తోందా? ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నవా? వద్దు బాబు.. ప్లాస్టిక్ కవర్లలో వేడి కర్రీ వల్ల భవిష్యత్‌లో క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి. స్టీల్ బాక్స్ తెచ్చుకొమ్మని చెప్పు..’’ అంటూ ఎమ్మెల్యే హరీశ్‌రావు కర్రి పాయింట్ నిర్వహకుడికి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో ఒక ఆప్టికల్స్ షాప్‌ను ప్రారంభించారు. పక్కనే ఉన్న కర్రీ పాయింట్ వద్ద జనం రద్దీగా ఉండడంతో అక్కడి వెళ్లి ముచ్చటించారు. సిద్దిపేటలో ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధించారని, ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. ఆయన వెంట ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
3న సీఎం రాక
సభా ఏర్పాట్లను పరిశీలించిన పొన్నం హుస్నాబాద్: డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం రాత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. ప్రజా పాలన ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, భవిష్యత్‌లో చేయాల్సిన కార్యక్రమాలపై సీఎం మాట్లాడుతారని చెప్పారు. సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, నాయకులు చిత్తారి రవీందర్. ఎండీ హస్సేన్. సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దత్తత.. దగా!
అక్కన్నపేట(హుస్నాబాద్): కేంద్ర ప్రభుత్వం 2014లో సంసద్ ఆదర్శ గ్రామ యోజన (గ్రామజ్యోతి) పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచ డం, జీవనోపాధి అవకాశాలు కల్పించడం, అసమానతలు తగ్గించడం, వారిలో చైతన్యం కలిగించడం, అభివృద్ధి పరచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. లోక్‌సభ ఉభయ సభల సభ్యులందరూ ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి ఎంపీ 2014 నుంచి 2019 వరకు మూడు గ్రామాలను అభివృద్ధి చేయాలని, తర్వాత 2023 వరకు ఏటా ఒక గ్రామం చొప్పున ఐదు గ్రామ పంచాయతీలను ఆదర్శ గ్రామ పంచాయతీలు తీర్చిదిద్దాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2021–2022లో అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామాన్ని అప్పటి రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు దత్తత తీసుకున్నారు. అర్ధంతరంగా నిలిచిన జీపీ భవనం అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామం ‘పీఎం సంసద్ దత్తత గ్రామం కింద ఎంపిక అయింది. అయితే.. నిధులు మాత్రం మంజూరు కాలేదు. 2021–22 సంవత్సరంలో అప్పటి రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఈ పథకం కింద దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు కాగా చేసిన పనులకు బిల్లులు రావట్లేదని మధ్యలోనే నిర్మాణ పనులను నిలిపివేశారు. దీంతో తాత్కాలిక భవనంలో గ్రామ పంచాయతీ భవనం కొనసాగుతోంది. అంతర్గత రోడ్లు లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలుచోట్ల డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో రోడ్లపైనే మురికి నీరు ఏరులై పారుతోంది. రాజ్యసభ సభ్యుడు లక్ష్మీకాంతరావు దత్తత తీసుకోవడంతో గ్రామం రూపురేఖలు మారుతాయని ప్రజలు ఊహించారు. వర్షాలు కురిసినప్పుడు బురదమయంగా మారుతాయని కాలనీవాసులు చెబుతున్నారు. బస్సు సౌకర్యం లేదు.. తారురోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. బస్సు సౌక ర్యం కల్పించాలని అధికారులను విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అభివృద్ధికి నోచుకోని చౌటపల్లి 2021–2022లో దత్తత తీసుకున్న అప్పటి ఎంపీ లక్ష్మీకాంతరావు కనీస వసతులు లేక అవస్థలు అమలుకు నోచుకోని హామీలునివాస గృహాలు: 405 జనాభా: 1,550 -
అత్యవసర వైద్య సేవలపై శిక్షణ
సిద్దిపేటకమాన్: ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంట్లకు అందించే వైద్య సేవలపై వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్ తెలిపారు. శనివారం నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఐదు మెడికల్ కళాశాలలకు చెందిన 20 మంది వైద్యాధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలకు చెందిన అనస్థీషియా విభాగం హెచ్ఓడీ, నోడల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ, డాక్టర్ సురేశ్‌బాబు, డాక్టర్ శివ, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ జాన్సీ ఈ కార్యక్రమంపై ఈ ఏడాది ఆగస్టులో బనారస్ హిందూ యూనివర్సిటీలో శిక్షణ పొందారన్నారు. ఇదే అంశంపై ఎయిమ్స్ బీబీనగర్, జీఎంసీ నిజామాబాద్, కాకతీయ, గాంధీ, ఉస్మానియా మెడికల్ కళాశాలలకు చెందిన 20మంది వైద్యాధికారులకు ఈనెల 25నుంచి 29వరకు ఐదు రోజులు శిక్షణనిచ్చారని చెప్పారు. పేషెంట్లకు అత్యవసర వైద్య సేవలు ఎలా నిర్వహించాలి? సీపీఆర్, సర్జికల్ ట్రామా ఎమర్జెన్సీ, హార్ట్ఎటాక్, గర్భిణులు, చిన్న పిల్లలకు అత్యవసర వైద్య సేవలు అందించి వారిని సేవ్ చేసే విధానంపై శిక్షణ ఇచ్చామని వివరించారు. ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చందర్, వైద్యాధికారులు పాల్గొన్నారు.మెడికల్ కళాశాల డైరెక్టర్ విమలాథామస్ -
కోతుల సమస్య పరిష్కరించే వారికే ఓటు..
వెల్దుర్తి(తూప్రాన్): మండల కేంద్రం వెల్దుర్తిలో గత కొన్నేళ్లుగా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా పంచాయ తీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కో తులు, కుక్కల బెడద తొలగించిన అభ్యర్థులకే తాము మద్దతు ఇస్తామని సోషల్ మీడియా ద్వారా యువకులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలకులు, నాయకులు పట్టించుకోలేదని, ప్రస్తుతం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు మందు, విందు, ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు ముందే వానరాలు, గ్రామ సింహాల బెడద తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వెల్దుర్తి ప్రధాన రోడ్డుపై తిష్టవేసిన కోతులు -
మల్లన్న కల్యాణానికి విస్తృత ప్రచారం
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లన్న కల్యాణం వచ్చే నెల 14న జరగనుంది. ఇందుకు ఆలయ అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా స్వామి కల్యాణ ఆహ్వాన వాల్ పోస్టర్లను అంటించారు. బాసర, మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, కొండగట్టు, సికింద్రాబాద్, హైదరాబాద్, బస్టాండ్లతో పాటు తదితర ప్రాంతాలలో వాల్‌పోస్టర్లను ఆలయ సిబ్బంది అతికించారు. ఆలయంలో వేలంపాటలు కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం పలు అంశాలపై ఈఓ టంకసాల వెంకటేశ్ ఆధ్వర్యంలో వేలంపాటలు నిర్వహించారు. ఎల్లమ్మ ఆలయం వద్ద సంవత్సర కాలం కొబ్బరి కాయలు విక్రయించే లైసెన్సు హక్కును రూ.13 లక్షలకు చింతల వెంకటేశ్ దక్కించుకున్నారు. అన్నదాన సత్రం ఎదుట ఉన్న షాప్ నెం.1ను నెలకు అద్దె రూ.6,300లకు పి.అనిల్, షాప్ నెం 2ను రూ.6,200లకు ఎడుకొండలు దక్కించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. పూలే అడుగు జాడల్లో నడుద్దాం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ చిన్నకోడూరు(సిద్దిపేట): మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడుద్దామని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఉమేష్ అన్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘసంస్కర్త పూలే అన్నారు. మహిళలకు విద్య అవసరమని చాటి చెప్పిన మాతృమూర్తి సావిత్రీబాయి పూలే అని తెలిపారు. సమావేశంలో జిల్లా నాయకులు తిరుపతి, బాబు, శంకర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కొండపాక(గజ్వేల్): మండలంలోని అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శి జి. స్వామినాథ్రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టరేట్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. విధులపై నిర్లక్ష్యం వహించడంతో పాటు విధాన పరమైన లోపాలతో నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుండటంతో డీఎల్పీఓకు ఫిర్యాదు చేశారన్నారు. డీఎల్పీఓ విచారణ చేపట్టి నివేదికను కలెక్టరేట్లో అందించారన్నారు. దీంతో కార్యదర్శిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. నూతన గృహ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిసిద్దిపేటకమాన్: నూతన గృహ నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ అశ్రిత్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట పట్టణం రాఘవేంద్ర నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని, విరుద్ధంగా చేపడితే చర్యలు తప్పవన్నారు. మున్సిపల్ అనుమతులకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. -
ఏకగ్రీవం.. చట్టవిరుద్ధం
● నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు ● సీపీ విజయ్‌కుమార్ ● హుస్నాబాద్‌లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనహుస్నాబాద్: గ్రామ పంచాయతీల్లో వేలం పాట ద్వారా సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చట్ట విరుద్ధమని సీపీ విజయ్‌కుమార్ అన్నారు. వచ్చే నెల 3న సీఎం రేవంత్‌రెడ్డి హుస్నాబాద్‌లో పర్యటించనున్న సందర్భంగా శుక్రవారం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. సీపీ మాట్లాడుతూ గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఎన్నిక నిబంధనల పరంగా జరగాలన్నారు. సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవం కోసం డబ్బులు, వస్తువులు, భూములు ఇవ్వాలని డిమాండ్ చేసి, మిగిలిన ఆశావహులను నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమన్నారు. దీంతో ఎన్నిక రద్దు చేసే అవకాశం ఉంటుందన్నారు. వేలం పాట వేయడం, బెదిరించడం, స్వచ్ఛందగా నామినేషన్లు వేసే వారిని ఎవరూ అడ్డుకోవద్దన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు, రౌడీషీటర్లు, కేసులు ఉన్నవారిని, గొడవలు చేసే వారిని బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో డబ్బులు, మద్యం, గిఫ్ట్ వస్తువులు పంచరాదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, ఏసీపీ సదానందం, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు. నేడు సీపీతో ఫోన్‌ఇన్ సిద్దిపేటకమాన్: ప్రజా సమస్యలపై నేరుగా ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సీపీ విజయ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 నుంచి 12గంటల వరకు 8712667407, 8712667306 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రజలు, పోలీసుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుందని తెలిపారు. -
మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని ఐఓసీ(ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్) చౌరస్తా వద్ద వైన్ షాపు ఏర్పాటు చేయవద్దంటూ పట్టణానికి చెందిన పలువురు హైదరాబాద్‌లోని హెచ్ఆర్సీ(మానవ హక్కుల కమిషన్)కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని సంగాపూర్ మార్గంలో రోడ్డు పక్కన మద్యం దుకాణం ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు పడతామన్నారు. ఈ మా ర్గంలో దేవాలయం, ఐఓసీ, రెండు ఎడ్యుకేషన్ హబ్‌లు ఉన్నాయని, ఎడ్యుకేషన్ హబ్‌లోగల వసతి గృహాల్లో సుమారు రెండు వేల మంది వరకు విద్యార్థినులుంటారని వాపోయారు. ప్రతి రోజు సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ హబ్‌లలో రాకపోకలు సాగిస్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీఓ, ఎకై ్సజ్, మున్సిపల్‌శాఖల అధికారులకు వినతిపత్రాలు అందించినట్లు చెప్పారు. హెచ్ఆర్సీకి స్థానికుల ఫిర్యాదు -
అప్రమత్తంగా వ్యవహరించాలి
● కలెక్టర్ హైమావతి ● క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనగజ్వేల్: పంచాయతీ ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏ చిన్న సమస్య ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు తెలపాలని కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం గజ్వేల్ మండలం రిమ్మనగూడ క్లస్టర్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. క్లస్టర్ చుటూ 144సెక్షన్ అమల్లో ఉందని, 100మీటర్లలోపు నామినేషన్ వేసే అభ్యర్థితోపాటు మరో ఇద్దరినీ మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వచ్చిన సమయాన్ని సైతం రికార్డు చేయాలని చెప్పారు. ప్రశాంతగా ఎన్నికల జరిగేలా అంతా సహకరించాలని కోరారు. నామినేషన్ కేంద్రం సందర్శన ములుగు(గజ్వేల్): సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం ఆమె ములుగు మండలం వంటిమామిడి రాజీవ్‌రహదారిపై ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుతో పాటు చిన్నతిమ్మాపూర్లోని నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రాజీవ్‌రహదారిపై వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీచేయాలని కలెక్టర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. అదేవిదంగా నామినేషన్ ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులను వివరాలను అడిగితెలుసుకున్నారు. అధికారులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. -
అబార్షన్లు చేస్తే ఆస్పత్రులు సీజ్
● అర్హతకు మించి వైద్యం చేస్తే చర్యలు ● జిల్లా వైద్యాధికారి ధన్రాజ్గజ్వేల్రూరల్: అక్రమంగా అబార్షన్లు చేసే వైద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆసుపత్రులను సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ హెచ్చరించారు. శుక్రవారం గజ్వేల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని రాజిరెడ్డిపల్లి మార్గంలో ఓ మహిళ మృత శిశువును పొదల్లో పడేసినట్లు గుర్తించిన స్థానికులు వైద్యాధికారులకు సమాచారం అందించారన్నారు. ఇదే ప్రాంతంలో ఉండే ఓ నకిలీ వైద్యుడు అబార్షన్ చేసినట్లు తెలిసిందని, వెంటనే నకిలీ వైద్యుడు నిర్వహిస్తున్న ఆసుపత్రిని సీజ్ చేశామన్నారు. సదరు వైద్యునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అర్హతకు మించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మండల స్థాయిలో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో ఎమ్మార్వో, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, మెడికల్ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్తో కలిసి తనిఖీలు చేపట్టి అర్హతకు మించి వైద్యం చేసే ఆసుపత్రులను సీజ్ చేస్తామన్నారు. మృతశిశువుకు పోస్టుమార్టం పట్టణంలోని రాజిరెడ్డిపల్లికి వెళ్లే మార్గంలో చెట్ల పొదల మధ్య పడేసిన మృత శిశువుకు శుక్రవారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, రెవెన్యూ అధికారులు, పోలీసుల సమక్షంలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. కార్యక్రమంలో గజ్వేల్ సీఐ రవికుమార్, ఆర్ఐ కృష్ణతో పాటు వైద్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణులకు అన్ని పరీక్షలూ చేయాలి సిద్దిపేటకమాన్: గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు, టీబీ టెస్ట్‌లతో పాటు అవసరమైన అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ వైద్య సిబ్బందికి సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టీహబ్, టీబీ క్లినిక్‌ను డీఎంహెచ్ఓ సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పీహెచ్‌సీల నుంచి వచ్చిన రక్త నమునాలను టీహబ్‌లో పరీక్షించి ఆలస్యం కాకుండా తొందరగా ఫలితాలను అందజేయాలన్నారు. ఏఆర్టీ సెంటర్లో రోగులకు వైద్య సేవలు, మందులు అందించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్, టీహబ్ మేనేజర్ అనిల్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త పంచాయతీల్లో ఎన్నికళ
తొలిసారిగా ఎన్నికలు ● తండాల్లో పండుగ వాతావరణం ● బరిలో నిలిచేందుకు యువత ఆసక్తిహుస్నాబాద్: కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటమే ఇందుకు కారణం. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అవకాశం రావడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అక్కన్నపేట మండలంలో ఆరు గిరిజన తండాలు పంచాయతీలుగా ఏర్పడ్డాయి. దాస్ తండా, కెప్టెన్ చౌట్తండా, చౌటకుంట తండా, హరిరామ్ అంబానాయక్ తండా, శ్రీరామ్ తండా, సేవాలాల్ మహరాజ్ తండాలు నూతనంగా గ్రామ పంచాయతీలుగా మారాయి. ఇందులో సర్పంచ్ స్థానాలు ఎస్టీ రిజర్వుడ్ అయ్యాయి. ఇక్కడ మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి సారి సర్పంచ్‌గా, వార్డు మెంబర్‌గా ఎన్నిక అయ్యేందుకు చాలా మంది యువకులు ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. సర్పంచ్‌గా మొదటి సారి ఎన్నికై తే తమ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ నలుగురు కలిసినా ఎన్నికలపైనే చర్చించుకుంటున్నారు. ఎన్నికల క్షేత్రంలోకి యువకులు.. మొదటి సారిగా ఆ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతుండటంతో యువకులు పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునే పడిలోపడ్డారు. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేసుకునేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పరాయి పంచాయతీ పాలనలో తండాలు అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే ముందుగా ఆ గ్రామానికి వెచ్చించిన తర్వాతే తండాలకు కేటాయించే వారని, దీంతో అభివృద్ధిలో వెనుకబడి పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాలు గ్రామ పంచాయతీలుగా మారడంతో తమ గ్రామాలను తామే అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.సేవాలాల్ మహరాజ్ తండామేమే అభివృద్ధి చేసుకుంటాం మా తండా గ్రామ పంచాయతీగా ఏర్పడటం సంతోషంగా ఉంది. గతంలో పక్క గ్రామ పాలనలో ఉన్నాం. ఇప్పటి నుంచి మా ఊరి వారే సర్పంచ్, వార్డు మెంబర్లు కాబోతున్నారు. నిధుల కోసం ఎవరిపై ఆధారపడేదిలేదు. సమష్టిగా నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి చేసుకుంటాం. మొదటి సారి ఎన్నికలు నిర్వహిస్తుండటంతో మంచి వ్యక్తిని ఎన్నుకుంటాం. – బానోతు భాస్కర్ నాయక్, సేవాలాల్ మహరాజ్ తండా -
పల్లెల్లో పాలిటిక్స్!
గ్రామ పంచాయతీ ఎన్నికలు రంజుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల గుర్తులతో ఎన్నికలు జరగనప్పటికీ గ్రామాల్లో కీలక పదవిలో ఉంటుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జిల్లాలో మొదటి విడతలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగుతోంది. బలమైన అభ్యర్థిని బరిలో నిలిపితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఎమ్మెల్యేలు, జిల్లా, మండల నాయకులు కసరత్తు చేస్తున్నారు. తక్కువ సమయం ఉండటంతో రెండో, మూడో విడతకు సంబంధించి పోటీదారుల్లో ఎవరు మెరుగనే విషయమై గ్రామాల వారీగా ఆశావహులతో రహస్య సమావేశాలను నిర్వహిస్తున్నారు. – సాక్షి, సిద్దిపేట ప్రధాన పార్టీలకు చెందిన నేతలు ఆయా పార్టీల నుంచి ఒక్కొక్కరే బరిలో నిలిచే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి, పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవడం ద్వారా తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాజకీయ పార్టీల నేతలు పల్లెల్లో విస్తృతంగా కార్యకర్తల సమావేశాలు నిర్వహించి అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయానికి వస్తున్నారు. ఏకాభిప్రాయం కుదరని చోట మండల, నియోజకవర్గ స్థాయి నేతలను రంగంలోకి దింపి బుజ్జగింపులు చేస్తున్నారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఎంపీటీసీ అవకాశం కల్పిస్తామని సర్దిచెబుతున్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు పోటీ చేస్తే ఇతర పార్టీలకు చెందిన వారికి అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతామని జాగ్రత్త పడుతున్నారు.ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి..అభ్యర్థుల ఎంపికపై ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అభ్యర్థి ఎవరైతే బాగుంటుందన్నదానిపై చర్చిస్తున్నారు. అభ్యర్థికి వ్యక్తిగత ఫాలోయింగ్‌తోపాటు పార్టీకి, నాయకులకు విధేయుడిగా ఉండేలా చూసుకుంటున్నారు. దీనితో పాటు పార్టీకి చేసిన పనితీరును ఎంపికకు ప్రామాణికంగా భావిస్తున్నారు. వీరితోపాటు ప్రధానంగా ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. పోటీ చేసే అభ్యర్థి సొంతంగానే ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్తోమత ఉందా లేదా అని చూస్తున్నారు. దీని వల్ల ఆయా పార్టీల్లో ఏళ్లుగా కష్టపడుతున్న పేద కార్యకర్తలు, నాయకులకు చుక్కెదురవుతోంది. కొన్నేళ్లుగా పార్టీలో ఉంటూ.. పలుకుబడి ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనకబడి ఉన్న కొందరు నాయకులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణసాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శనివారంతో ముగియనుంది. జిల్లాలో మొదటి విడతలో 7 మండలాలు 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డులకు ఈ నెల 27 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. రెండో రోజు శుక్రవారం గ్రామ పంచాయతీలకు 194 నామినేషన్లు, వార్డు సభ్యులకు 445 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు 325 మంది, వార్డు స్థానాలకు 520 మంది నామినేషన్లు వేశారు. శుక్రవారం అష్టమి కావడంతో తక్కువ సంఖ్యలో నామినేషన్లు వేశారని, శనివారం నవమి తిథి ఉన్నప్పటికీ మంచి ముహూర్తాన్ని తెలుసుకుని నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చివరి రోజు కావడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చే అవకాశాలున్నాయి. ‘పంచాయతీ’పై ప్రధాన పార్టీల ఫోకస్ -
పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలి
జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పద్మశాలీలు అన్ని రంగాల్లో రాణించాలని, జిల్లా అధ్యక్షుడు కస్తూరి సతీష్ అన్నారు. చేర్యాల పద్మశాలి సంఘంలో విజయం సాధించిన కార్యవర్గానికి గురువారం సిద్దిపేటలోని జిల్లా కార్యవర్గం ఘనంగా సన్మానించింది. అనంత రం జిల్లా కార్యవర్గాన్ని చేర్యాల కార్యవర్గ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడు తూ పద్మశాలీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుండాలన్నారు. సర్పంచ్ ఎన్నికలలో పద్మశాలీలను అత్యధికంగా పోటీ చేయించి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు బూర మల్లేశం, ముదిగొండ శ్రీనివాస్, పేర్ల కృష్ణ దయాసాగర్, తాళ్ల విఠల్, సిరిసిల్ల బాలకిషన్, వంగర శ్రీశైలం, చేర్యాల అధ్యక్షులు కొక్కుల సురేందర్, ప్రధాన కార్యదర్శి బాలనర్సు, కోశాధికారి మల్లిపెద్ది వెంకటేశం, గోనె శ్రీహరి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
లైసెన్స్ తుపాకులు డిపాజిట్ చేయండి
సీపీ విజయ్‌కుమార్ సిద్దిపేటకమాన్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున లైసెన్స్ కలిగిన తుపాకుల(గన్)ను సంబంధిత పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేయాలని సీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక పీఎస్‌లలో ఈ నెల 29వ తేదీలోపు డిపాజిట్ చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం తిరిగి నిబంధనల ప్రకారం తీసుకెళ్లవచ్చన్నారు. డిపాజిట్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలోని సరిహద్దు పోలీస్స్టేషన్లలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంగ్లంపై పట్టు సాధించాలినంగునూరు(సిద్దిపేట): ఆంగ్లంపై పట్టు సాధిస్తే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఎంఈఓ దేశిరెడ్డి అన్నారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మండల స్థాయిలో నిర్వహించిన ఇంగ్లిష్ ఒలంపియాడ్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్షుడు కన్యాలాల్, సుధాకర్, ప్రభాకర్‌రెడ్డి, భూపతిరెడ్డి, అశ్రఫ్, వనిత, సుశీల, హమీద బేగం, సుధాకర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యం కావాలి డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గజ్వేల్: సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు దారుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్ మండలం రిమ్మనగూడకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఎన్నికల్లో ప్రచారాస్త్రాలుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మాధవరావు, నర్సింగరావు, అయిలుమల్లు తదితరులు పాల్గొన్నారు. అందెశ్రీ సంతాప సభ సిద్దిపేటకమాన్: తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో అందెశ్రీ సంతాప సభను గురువారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఏ బహిరంగ సభ, ప్రజాపోరాటం జరిగినా అందెశ్రీ ఉద్యమ గీతాన్ని వినిపించే వారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీను, పరమేష్, సాగర్, లక్ష్మణ్, నరేష్, మురళి, రేణుక, శృతి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజం రాష్ట్ర విద్యా పరిశీలన మండలి డైరెక్టర్ రమేశ్ చేర్యాల(సిద్దిపేట): ప్రతి ఉద్యోగికి పదవీ విర మణ సహజమని రాష్ట్ర విద్యా పరిశీలన మండలి డైరెక్టర్ గాజర్ల రమేశ్, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స్థానిక ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన ఎంఈఓ రచ్చ కిష్టయ్య పదవీ విరమణ ఆత్మీయ సన్మాన సభకు వారు హాజరై మాట్లాడారు. సామాన్య కుటుంబంలో జన్మించిన కిష్టయ్య ఉన్నత చదువులు చదివి హెచ్ఎంగా, ఎంఈఓగా పనిచేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా కృషి చేశా రని ప్రశంసించారు. కిష్టయ్య దంపతులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి రమేశ్, బేతి భాస్కర్, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించాల్సిందే
సిద్దిపేటకమాన్: ఆటో డ్రైవర్లు తప్పకుండా యూనిఫాం ధరించాలని ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్, సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై సీఐ గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు యూనిఫాం ధరించడం వల్ల ప్రయాణికుల్లో భద్రతా భావం పెరుగుతుందన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లోనే ఆటోలు నిలుపుకోవాలని, ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకూడదని సూచించారు. ఆటోల్లో పెద్ద పెద్ద సౌండ్ బాక్స్‌లు పెట్టి ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణికులను తరలించవద్దని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్సీ పత్రాలు, ఇతర అన్ని రకాల డాక్యుమెంట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నా రు. క్రమశిక్షణతో ఉండే డ్రైవర్లను గుర్తించి ఏడాదికి ఒకసారి సన్మానిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ విజయ్‌భాస్కర్, ఉమేష్, సిబ్బంది మహేష్, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
● కలెక్టర్ హైమావతి ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంసిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహాకరించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా జరిగే పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఇందుకు గురువారం నుంచి మొదటి విడత నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. నామినేషన్లు దాఖలుకు పోటీదారునితో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోపలికి అనుమతిస్తారన్నారు. ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి ఆ పంచాయతీలో, వార్డు మెంబర్ అదే వార్డు ఓటరు జాబితాలో పేరు నమోదై ఉండాలన్నారు. నామినేషన్ జనరల్ అభ్యర్థి రూ.2వేలు, రిజర్వ్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ)రూ. వెయ్యి, వార్డు మెంబర్స్ (ఎస్సీ, ఎస్టీ, బీసీ) రూ.250, ఇతరులు రూ.500 డిపాజిట్ చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీలలో 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.2 లక్షల 50 వేలు, తక్కువగా ఉంటే రూ. లక్షా 50 వేలు, వార్డు మెంబర్లు రూ.50 వేలు, రూ. 30 వేలు ఎన్నికల ఖర్చుగా నిర్ణయించినట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను రెండురోజుల ముందుగానే అందించాలని సూచించారు. ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలను ఎన్నికల పరిశీలకులు నిర్ధారించిన తరువాతే ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డిఓ జయదేవ్ ఆర్య, సీపీఓ దశరథ్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పరిశీలకులతో కలెక్టర్ సమావేశం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్.హైమావతి తన ఛాంబర్లో ఎన్నికల పరిశీలకులు కె.హరిత, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎన్.నిశాంతిలతో సమావేశమయ్యారు. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియపై చర్చించారు. నిబంధనలు కచ్చితంగా పాటించాలిగజ్వేల్: ఎన్నికల కమిషన్ నిబంధనలకనుగుణంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని కలెక్టర్ హైమావతి సూచించారు. గురువారం గజ్వేల్ మండలం అక్కారం, శ్రీగిరిపల్లి, దాతర్పల్లి, జగదేవ్‌పూర్ మండలం జగదేవ్‌పూర్, పీర్లపల్లి, ధర్మారం, గొల్లపల్లి, కొండాపూర్, దౌలాపూర్ క్లస్టర్ల పరిధిలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. ఎంపీడీలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. వంట తీరు ఇదేనా? గజ్వేల్ మండలం అక్కారం జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో మధ్యాహ్న భోజనం తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బగారా అన్నం, తోట కూర పప్పు నాణ్యతను పరిశీలించగా, సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట నిర్వహణ తీరును నిరంతరం పర్యవేక్షించాల్సిన బాధ్యత పాఠశాల హెచ్‌ఎంలపైనే ఉందన్నారు. -
స్వచ్ఛతను కాపాడుదాం
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ సిద్దిపేటజోన్: పట్టణంలో స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ కాపాడాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ సూచించారు. గురువారం ఆయన పట్టణంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. 3వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. త్వరలో యూజీడీ అమలు అయ్యేలా చూస్తామన్నారు. నూతనంగా మంజూరు అయిన నిధులతో వీధి దీపాలు, రోడ్లు వేస్తామని కాలనీ ప్రజలకు వివరించారు. అనంతరం 10, 26 వార్డుల్లో పర్యటించారు. సమస్యలపై అరా తీశారు. చెరువు వద్ద ఎలాంటి చెత్త వేయరాదని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ వైద్య సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో వెలువడే వ్యర్థాలు, హానికర చెత్తను ధర్మ ఏజెన్సీకి ఇవ్వాలని సూచించారు. చెత్త వేరు చేయు విధానంపై ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. బహిరంగ ప్రాంతంలో చెత్త వేసిన వారికి రూ.1000 జరిమానా విధించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజ్, కౌన్సిలర్లు ప్రవీణ్, తిరుమల్‌రెడ్డి, బాల్‌రాజేశం, డీఈ ప్రేరణ తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీలేని రుణాలు.. మాకేవి? పట్టణాల్లోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయకపోవడంతో నిరాశ చెందుతున్నారు. వివరాలు 8లో u
పంచాయతీ పోరు..జోరుమొదటి రోజు సర్పంచ్‌లకు 131, వార్డు సభ్యులకు 75 నామినేషన్లు సాక్షి, సిద్దిపేట: పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమైంది. తొలి విడతలో 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డులకు నామినేషన్ల స్వీకరణకు 41 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఆయా క్లస్టర్లలో ఆర్వో, ఏఆర్వోలను నియమించారు. మొదటి రోజు సర్పంచ్‌లుగా 131, వార్డు సభ్యులుగా 75 నామినేషన్లు వచ్చాయి. కలెక్టర్ హైమావతి, ఎన్నికల పరిశీలకురాలు హరిత నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ ఏడు మండలాల్లో శనివారంతో నామినేషన్ల స్వీకరణ ముగియనుంది. డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్ల విత్ డ్రా చేసుకోవచ్చు. వచ్చేనెల 11న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు జరగనుంది. ఏకగ్రీవానికి వేలం పాటలు ఎన్నికల నియమావళి అతిక్రమిస్తే చర్యలుపల్లెల్లో జోరుగా చర్చలుగ్రామ సర్పంచ్‌గా ఎవరు బరిలో ఉండాలన్న విషయంపై గ్రామ పెద్దలు, రాజకీయ పార్టీల నేతలు జోరుగా చర్చలు జరుపుతున్నారు.. ఏకగ్రీవం చేస్తే ఊరి అభివృద్ధికి తన సొంత డబ్బులు అందజేస్తానని పలువురు హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరికి వారే ఎవరిని బరిలో దింపితే గెలుపొందే అవకాశాలుంటాయని మండల, జిల్లా నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఏకగ్రీవాలు చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఇలా నిర్ణయం తీసుకునే గ్రామంలో ఒక్కరే నామినేషన్ వేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలి
ఆరె కటికె రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ జమాల్పూర్ బాల్‌రాజు గజ్వేల్: సంఘటిత పోరాటాలకు ఆరె కటికెలు సిద్ధం కావాల్సిన అవసరముందని, రాష్ట్రస్థాయిలో పటిష్ట నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఆరె కటికె రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ జమాల్పూర్ బాల్‌రాజు అన్నారు. గురువారం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఆరెకటిక కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయి ఎన్నికలకు మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నుంచి ఆరెకటికలను సిద్ధం చేస్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గం ఎన్నిక ఉంటుందని చెప్పారు. ఆరె కటికె సంఘం రాష్ట్ర నాయకుడు కల్యాణ్కర్ నర్సింగరావు మాట్లాడుతూ ఆరెకటికెలను ఏకం చేయడానికి రాష్ట్రస్థాయిలో సంఘం ఏర్పాటుకు నిర్ణయించడం అభినందనీయమన్నారు. సమావేశంలో ఆరెకటిక కమిటీ రాష్ట్ర నాయకులు నేతిక రవికుమార్, జితేందర్, గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు మురశీధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
చారిత్రక మలుపు.. దీక్షా దివస్
సిద్దిపేటజోన్: తెలంగాణ మలి విడత ఉద్యమ చరిత్రను మలుపు తిప్పిన రోజు నవంబర్ 29 అని, ఉద్యమ ఘట్టంలో చరిత్రాత్మకమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నవంబర్ 29 (దీక్షా దివస్) పురస్కరించుకుని గురువారం పొన్నాల శివారులో బీఆర్ఎస్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ దీక్ష, అమరుల త్యాగ ఫలితంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. నవంబర్ 29 లేనిదే డిసెంబర్9 ప్రకటన లేదని, డిసెంబర్ 9 ప్రకటన మేరకు జూన్ 2 ఫలితమన్నారు. జూన్2 లేకపోతే తెలంగాణ ఎక్కడిదని, రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎక్కడిదని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో భాగంగా కేసీఆర్ దీక్ష ప్రారంభించగా, మద్దతుగా సిద్దిపేటలో 1,531 రోజులు దీక్ష శిబిరాన్ని నిర్వహించిన ఘట్టాన్ని గుర్తు చేశారు. దీక్ష శిబిరానికి గుర్తుగా పైలాన్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. కానీ మోడల్ బస్టాండ్ నిర్మాణంలో తీసివేసినట్లు చెప్పారు. ఉద్యమ జ్ఞాపకాల కోసం క్యాంపు కార్యాలయం ముందు పైలాన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అట్టహాసంగా నిర్వహిద్దాం ఈనెల 29న జిల్లా కేంద్రంలో దీక్షా దివస్‌ను అట్టహాసంగా నిర్వహించాలని హరీశ్‌రావు సూచించారు. రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం 10 గంటలకు బైక్ ర్యాలీ, తెలంగాణ అమరవీరులకు నివాళులు, ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అమర వీరుల కుటుంబాలకు సన్మానం ఉంటుందన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమానికి నారు, నీరుపోసిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. రాష్ట్ర సాధనలో కీలకమైన పాత్ర కేసీఆర్ పోషించినట్టు వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శర్మ, జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు పాల్గొన్నారు. త్వరలో పైలాన్‌కు శంకుస్థాపన మరింత సుందరంగా చెరువులు జిల్లా కేంద్రంలోని చెరువులను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, అందుకు సంబంధించిన పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఎర్ర చెరువు, నర్సాపూర్ చెరువులను పరిశీలించారు. చెరువుల అభివృద్ధి కోసం మున్సిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. రెండు చెరువుల అభివృద్ధి, సుందరీకరణ కోసం రూ. 6.34 కోట్లు కేటాయింపు చేసినట్లు పేర్కొన్నారు. ఎర్ర చెరువుకు రూ.3.14కోట్లు, నర్సాపూర్ చెరువుకు రూ.3.20కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. చెరువుల్లోకి మురికి నీరు వెళ్లకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించి ,వేగవంతం చేయాలని సూచించారు. అలాగే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళాశాల అధికారులు, ప్రతినిధులతో వివిధ అంశాలపై అరా తీశారు. సమస్యలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని ఇంజనీర్లకు సూచించారు. మూడు సార్లు ఏ ప్లస్ న్యాక్ గ్రేడింగ్ సాధించిన ఏకై క కళాశాల అని కొనియాడారు. -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
సిద్దిపేటకమాన్: కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే కార్మిక కోడ్లను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఉద్యోగ భద్రత లేకుండా కార్మిక కోడ్లను రూపొందించారని అన్నారు. దీంతో కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతోందన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకువచ్చిన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో గోపాలస్వామి, లక్ష్మణ్, మల్లేశం నర్సింహులు, శ్రీనివాస్, శశిధర్, వెంకట్, భాస్కర్, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పైసలెట్ల..?
‘పంచాయతీ’పై ‘రియల్’ ప్రభావం ● భూములు, ప్లాట్ల ధరలు పడిపోవడంతో ఆశావహుల్లో నిరాశ ● అమ్మకాల్లేక నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలుగజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడం పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండేవి. కొంతకాలం నుంచి పరిస్థితి భిన్నంగా మారింది. ఈక్రమంలోనే ఆశావహుల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు కోసం వెంపర్లాడుతున్నారు. ఆశావహులందరూ ఎన్నికల బరిపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు కీలకం. కనుక ఏమీ చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరూ ఎక్కువ ఖర్చు పెడితే..వారు గ్రామాల్లో పట్టునిలుపుకుంటారనే పరిస్థితి రావడంతో ఇది పోటీదారులకు ఛాలెంజ్‌గా మారింది. తాకట్టు రుణాల వైపు పరుగు డబ్బులను ఇన్‌స్టంట్‌గా పొందడానికి సర్పంచ్ పోటీదారులు వేరే దారిలేక... తాకట్టు రుణాలవైపు పరుగు తీస్తున్నారు. బంగారం మొదలుకొని ఇళ్లు, పొలాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంకులో రోజువారీగా 5 గోల్డ్ లోన్లు చేయడమే గగనంగా ఉండేది. నేడు సీను మారిపోయింది. సర్పంచ్ ఔత్సాహికుల వల్ల నిత్యం 20కిపైగా గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. బంగారం నిల్వలు లేని వ్యక్తులు ఇళ్లు, పొలాలు, ప్లాట్లు వడ్డీ వ్యాపారులకు అడ్డగోలు వడ్డీ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రెండ్రోజులుగా వ్యవహారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. జోరుగా నడిచిన కాలంలో.. ‘రియల్’ వ్యాపారం జోరుగా నడిచిన కాలంలో ప్రధాన రహదారుల వెంబడి ఉండే గ్రామాల్లో ఒకటి, రెండు గుంటలు అమ్ముకుంటే చాలు.. ఎన్నికల ఖర్చు సమకూరుతుందనే ధీమాలో ఉండేవారు. కానీ ఆ పరిస్థితి ముచ్చుకై నా కనిపించడం లేదు. ఒకవేళ అమ్ముకుందామనుకున్నా.. ధరలు పడిపోవడం వల్ల ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక వేళ కొనుగోలు చేస్తామని ఎవరైనా వచ్చినా.. అత్తెసరు ధరకు కొంటామని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరైతే ఎలాగైనా సర్పంచ్ ఎన్నికై గ్రామంలో పట్టు సాధించాలనే సంకల్పంతో.. వాస్తవ ధరకు 50శాతం తగ్గినా అమ్మడానికి వెనుకాడటం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు సిద్ధమైన ఓ పార్టీ నాయకుడు ఇప్పటికే అతి తక్కువ ధరకు భూమిని అమ్ముకొని డబ్బులు సిద్ధం చేసుకున్నారు. గ్రామంలోని సన్నిహితులు, స్నేహితుల ఎంత వారించినా వినకుండా ముందుకుసాగుతున్నారు. -
రాజ్యాంగమే మనకు మార్గదర్శనం
సిద్దిపేటకమాన్: రాజ్యాంగమే మనకు మార్గదర్శనమని, అందరూ గౌరవించాలని అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జయప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కోర్టు భవనంలో బుధవారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఆమోదించిన రోజు నవంబర్ 26 అని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలన్నారు. రాజ్యాంగ ప్రవేశికను కోర్టు సిబ్బందితో న్యాయమూర్తి చదివించారు. అలాగే డిసెంబర్ 31న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు రాజీపడేట్లు చూడాలని పోలీసుశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సాధన, సంతోష్‌కుమార్, తరణి, పోలీసు అధికారులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సీపీ విజయ్ కుమార్‌తో కలిసి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురికే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవ్వరినీ అనుమతించవద్దని అధికారులు ఆదేశించారు. నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఆర్డీఓలకు అప్పీలు చేయవచ్చన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మండల కేంద్రాల్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. భద్రత కట్టుదిట్టం సీపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరేవరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో జిల్లాలోని వైన్ షాపులు, బార్లు మూసివేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, సీపీఓ నాగేశ్వర్, జెడ్పీ సీఈఓ రమేశ్, ఆర్డీఓలు, ఏసీపీలు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు కలెక్టర్ హైమావతి అధికారులకు దిశానిర్దేశం -
సంగ్రామమే..
పోలింగ్ కేంద్రాల పరిశీలనతొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డుల్లో వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నామినేషన్లను ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు స్వీకరించనున్నారు. – సాక్షి, సిద్దిపేట దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, రాయపోలు, వర్గల్ మండలాల్లో మొదటి విడతలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లో ఐదు నుంచి ఆరు గ్రామ పంచాయతీలకు కలిపి నామినేషన్లను స్వీకరించేందుకు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 163 గ్రామాలకు 41 క్లస్టర్లను ఏర్పాటు చేసి వీటికి రిటర్నింగ్ అధికారి(ఆర్వో)లను 54 మందిని, ఏఆర్వోలను 54 మందిని నియమించారు. డిసెంబర్ 3న ఉపసంహరణ గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. డిసెంబర్1 వరకు అప్పిళ్లు, 2వ తేదీ వరకు పరిష్కారం, 3న నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. అదే రోజుపోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లో 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. మొదటి విడతలో 1,92,749 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.మండలాల వారీగా ఓటర్ల వివరాలిలా.. మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం దౌల్తాబాద్ 11,974 12,510 0 24,484గజ్వేల్ 16,544 17,460 02 34,006జగదేవ్‌పూర్ 15,305 15,993 0 31,298 మర్కూక్ 9,575 9,918 0 19,493 ములుగు 15,440 15,615 0 31,055 రాయపోలు 10,524 11,005 0 21,529 వర్గల్ 15,258 15,626 0 30,884జగదేవ్‌పూర్(గజ్వేల్): సర్పంచ్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసిన ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం జగదేవ్‌పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పరిశీలించారు. పోలింగ్‌బూత్‌ల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశామని ఎస్ఐ తెలిపారు. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డులు 108 మంది ఆర్వో, ఏఆర్వోల నియామకం -
కల్యాణం.. కమనీయం
తిలకిస్తున్న భక్తులుసుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంతో అలరారింది. బుధవారం వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. క్షేత్రంలో అభిషేకాలు, అర్చనలు, కల్యాణాది కార్యక్రమాలతో భక్తిభావనలు ఉప్పొంగాయి. తెల్లవారుజామున అర్చక పరివారం వేద మంత్రోచ్ఛరణల మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు మొదలయ్యాయి. గర్భగుడిలో కొలువైన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణలు, భక్తజన హర్షధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులకు మాంగళ్యధారణ చేశారు. కమనీయంగా సాగిన కల్యాణ వైభోగాన్ని భక్త జనులు తిలకించి పరవశించారు. – వర్గల్(గజ్వేల్) -
రుణాలు సద్వినియోగం చేసుకోండి
హుస్నాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడు మండలాల్లోని 5,329 స్వయం సహాయక సంఘాలకు రూ.5.66 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు రుణం కావాలన్నా బ్యాంకర్లు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. 18 సంవత్సరాల పైనబడిన వారందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆడబిడ్డలు ఆర్థికంగా రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పొన్నం తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి పొన్నం ప్రభాకర్ వడ్డీలేని రుణాలు అందజేత


