ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం
యూనియన్ బ్యాంక్ రాష్ట్ర డైరెక్టర్ జమ్మూ నాయక్
విద్యార్థులతో బ్యాంక్ అధికారులు, ఉపాధ్యాయ బృందం
సిద్దిపేటరూరల్: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని యూనియన్ బ్యాంక్ రాష్ట్ర డైరెక్టర్ జమ్మూ నాయక్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని చింతమడక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక అక్షరాస్యతపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జమ్మూ నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతపై పూర్తి స్థాయిలో పట్టుసాధించేలా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రాణించాలంటే ఆర్థిక అక్షరాస్యత అవసరమన్నారు. ప్రస్తుతం విద్యార్థుల్లో ఫైనాన్షియల్ లిటరసీతో పాటుగా డిజిటల్ లిటరసీపై అవగాహన పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, సర్పంచ్ లతాశంకర్, ఉపాధ్యాయులు, వైద్యాధికారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


