గజ్వేల్ బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ
గజ్వేల్: మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 20వార్డులకుగానూ అభ్యర్థులను ఖరారు చేసి భీ–ఫాంలను సైతం అందజేసింది. ఈ విషయాన్ని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థుల జాబితాను సోమవారం సాయంత్రం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌ముదిరాజ్ విడుదల చేశారు. 20వార్డులకుగానూ 19మంది అభ్యర్థుల ఎంపిక పూర్తికాగా, 18వార్డు విషయంలో ఉత్కంఠ కొనసాగుతున్నది. అధికారికంగా ప్రకటించిన అభ్యర్థుల్లో మైస కనకమ్మ(1వవార్డు), గాడిపల్లి కల్యాణి(02), కోట కిశోర్(03), రొట్టెల శ్రీనివాస్(04), అన్నపూర్ణ(05), పేర్ల సిద్దేశ్వరీ(06), మన్నెం శశిధర్‌రెడ్డి(07), కేతావత్ ఆంజనేయులు(08), లింగంపల్లి హరికుమార్(09), కొమ్ము చంద్రశేఖర్(10), పిట్ల రత్నమ్మ(11), దామరంచ దయాకర్‌రెడ్డి(12), పల్పునూరి కల్పన(13), మామిండ్ల రేణుక(14), మౌనిక(15), పుష్పలత(16), నాగులపల్లి కవిత(17), నాయిని సందీప్‌కుమార్(19), ఉప్పల మధుసూదన్ గుప్తా(20వ వార్డు) ఉన్నారు.
వీడని సస్పెన్స్
బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే మెజార్టీ వార్డుల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా.. అధికారికంగా వారి పేర్లను ప్రకటించలేదు. కొన్ని వార్డుల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్నది. రెబెల్స్ బుజ్జగించిన తర్వాత అభ్యర్థులను ప్రకటించి వారి సమక్షంలోనే అధికారిక అభ్యర్థులకు భీ–ఫాంలను అందజేసి గెలుపునకు వారి సహకారం తీసుకోవాలనే ఆలోచనతో ముందుకుసాగుతున్నట్లు పార్టీ వర్గాల తెలిసింది. ఏదీఏమైనా కొద్ది గంటల్లో అభ్యర్థుల ప్రకటించి భీ–ఫాంలను కూడా అందజేయనున్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సంపూర్ణం
గజ్వేల్ బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ


