దరఖాస్తుల ఆహ్వానం
సిద్దిపేటరూరల్: దివ్యాంగులకు ఉపకరణాలు అందించనున్నారని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి జిల్లా సంక్షేమశాఖ అధికారి ఎల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాటరీ వీల్‌చైర్, మొబైల్‌బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్, వీల్‌చైర్ అటాచ్మెంట్, వీల్‌చైర్, టాబ్స్, వినికిడి యంత్రాలు వంటి ఉపకరణాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈనెల 10లోపు ఆన్‌లైన్‌లో http://http.tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
జాతీయస్థాయి
స్కేటింగ్ పోటీల్లో ప్రతిభ
గజ్వేల్: చైన్నెలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని సైనిక్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న యువికా అనే విద్యార్థిని రెండోస్థానంలో నిలిచి వెండి పతకం దక్కించుకున్నారు. దేశంలోని 16రాష్ట్రాలకు చెందిన 400మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా..యువికా తనదైన ప్రతిభతో పోటీల్లో విజేతగా నిలిచారు. విద్యార్థిని జాతీయస్థాయిలో రాణించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణ ప్రసవాలసంఖ్య పెంచండి
గజ్వేల్‌రూరల్: ప్రభుత్వాస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ధనరాజ్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే గర్భిణులకు నార్మల్ డెలివరీ అయ్యేలా సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు వారు ఎక్సర్‌సైజ్ చేసేందుకు ఒక యోగా టీచర్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ దీప్తి ప్రియాంక తదితరులున్నారు.
తాగునీటి ఎద్దడి
నివారణకు ప్రత్యేక డ్రైవ్
అక్కన్నపేట(హుస్నాబాద్): రానున్న వేసవి దృష్టా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని మిషన్ భగీరథ (ఇంట్రా) డీఈ రుహీనా తస్కీన్ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో తాగునీటి సరఫరా, ఇబ్బందులపై ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగా సోమవారం అక్కన్నపేట మండలంలోని కట్కూర్, చాపగానీతండా, కన్నారం గ్రామాల్లో మిషన్ భగీరథ ఇంట్రా, గ్రీడ్ అధికారులు పర్యటించారు. ఈ సందర్భంగా చాపగానీతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్ని ఆమె మాట్లాడారు గ్రామాల్లో ఉన్న భగీరథ వాటర్ ట్యాంకులు, పైపులైన్ల వ్యవస్థలతో పాటు పంచాయతీ బోరు బావుల వివరాలను నమోదు చేసుకుంటున్నామన్నారు. తాగునీరు సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారుల దృష్టికి తీసుకోరావాలన్నారు. కార్యక్రమంలో భగీరథ గ్రీడ్ ఏఈ సాయికృష్ణ, సర్పంచ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా జాగృతం కోసమే
బాకీ కార్డు
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ కల్లబొల్లి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యం చేయడానికి బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బాకీ కార్డుల పేరిట వినూత్న రీతిలో జాగృతం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక 7 వార్డులో బాకీ కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసి కాంగ్రెస్ చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హామీల పేరిట ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు విఠోభా, శ్రీనివాస్ యాదవ్, సాయి, నాయకులు బండల రాజు, ప్రభాకర్‌రెడ్డి, యాదగిరి, నగేష్, రాజు, నర్సింహులు, రమేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం


