breaking news
Siddipet District News
-
సంగ్రామమే..
పోలింగ్ కేంద్రాల పరిశీలనతొలి విడతలో జరిగే గ్రామ పంచాయతీలకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులు ఉండగా వీటికి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి విడతలో 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డుల్లో వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నామినేషన్లను ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు స్వీకరించనున్నారు. – సాక్షి, సిద్దిపేట దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవ్‌పూర్, మర్కూక్, ములుగు, రాయపోలు, వర్గల్ మండలాల్లో మొదటి విడతలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. 7 మండలాల్లో ఐదు నుంచి ఆరు గ్రామ పంచాయతీలకు కలిపి నామినేషన్లను స్వీకరించేందుకు క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 163 గ్రామాలకు 41 క్లస్టర్లను ఏర్పాటు చేసి వీటికి రిటర్నింగ్ అధికారి(ఆర్వో)లను 54 మందిని, ఏఆర్వోలను 54 మందిని నియమించారు. డిసెంబర్ 3న ఉపసంహరణ గురువారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, చెల్లుబాటైన అభ్యర్థుల జాబితాలను ప్రకటించనున్నారు. డిసెంబర్1 వరకు అప్పిళ్లు, 2వ తేదీ వరకు పరిష్కారం, 3న నామినేషన్లను విత్ డ్రా చేసుకోవచ్చు. అదే రోజుపోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. 11న ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లో 2 గంటల నుంచి ఓట్లను లెక్కించనున్నారు. మొదటి విడతలో 1,92,749 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.మండలాల వారీగా ఓటర్ల వివరాలిలా.. మండలం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం దౌల్తాబాద్ 11,974 12,510 0 24,484గజ్వేల్ 16,544 17,460 02 34,006జగదేవ్‌పూర్ 15,305 15,993 0 31,298 మర్కూక్ 9,575 9,918 0 19,493 ములుగు 15,440 15,615 0 31,055 రాయపోలు 10,524 11,005 0 21,529 వర్గల్ 15,258 15,626 0 30,884జగదేవ్‌పూర్(గజ్వేల్): సర్పంచ్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసిన ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం జగదేవ్‌పూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పరిశీలించారు. పోలింగ్‌బూత్‌ల ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అలాగే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశామని ఎస్ఐ తెలిపారు. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ 7 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డులు 108 మంది ఆర్వో, ఏఆర్వోల నియామకం -
ఎన్నికలకు పైసలెట్ల..?
‘పంచాయతీ’పై ‘రియల్’ ప్రభావం ● భూములు, ప్లాట్ల ధరలు పడిపోవడంతో ఆశావహుల్లో నిరాశ ● అమ్మకాల్లేక నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలుగజ్వేల్: రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడం పంచాయతీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు జరిగితే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉండేవి. కొంతకాలం నుంచి పరిస్థితి భిన్నంగా మారింది. ఈక్రమంలోనే ఆశావహుల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన డబ్బులు కోసం వెంపర్లాడుతున్నారు. ఆశావహులందరూ ఎన్నికల బరిపై దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఖర్చు కీలకం. కనుక ఏమీ చేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతున్నారు. ఎవరూ ఎక్కువ ఖర్చు పెడితే..వారు గ్రామాల్లో పట్టునిలుపుకుంటారనే పరిస్థితి రావడంతో ఇది పోటీదారులకు ఛాలెంజ్‌గా మారింది. తాకట్టు రుణాల వైపు పరుగు డబ్బులను ఇన్‌స్టంట్‌గా పొందడానికి సర్పంచ్ పోటీదారులు వేరే దారిలేక... తాకట్టు రుణాలవైపు పరుగు తీస్తున్నారు. బంగారం మొదలుకొని ఇళ్లు, పొలాలు, ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల బ్యాంకుల్లో రద్దీ పెరిగింది. గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రధాన బ్యాంకులో రోజువారీగా 5 గోల్డ్ లోన్లు చేయడమే గగనంగా ఉండేది. నేడు సీను మారిపోయింది. సర్పంచ్ ఔత్సాహికుల వల్ల నిత్యం 20కిపైగా గోల్డ్ లోన్లు తీసుకుంటున్నారు. బంగారం నిల్వలు లేని వ్యక్తులు ఇళ్లు, పొలాలు, ప్లాట్లు వడ్డీ వ్యాపారులకు అడ్డగోలు వడ్డీ కింద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రెండ్రోజులుగా వ్యవహారం జోరుగా సాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. జోరుగా నడిచిన కాలంలో.. ‘రియల్’ వ్యాపారం జోరుగా నడిచిన కాలంలో ప్రధాన రహదారుల వెంబడి ఉండే గ్రామాల్లో ఒకటి, రెండు గుంటలు అమ్ముకుంటే చాలు.. ఎన్నికల ఖర్చు సమకూరుతుందనే ధీమాలో ఉండేవారు. కానీ ఆ పరిస్థితి ముచ్చుకై నా కనిపించడం లేదు. ఒకవేళ అమ్ముకుందామనుకున్నా.. ధరలు పడిపోవడం వల్ల ఎవరూ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఒక వేళ కొనుగోలు చేస్తామని ఎవరైనా వచ్చినా.. అత్తెసరు ధరకు కొంటామని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరైతే ఎలాగైనా సర్పంచ్ ఎన్నికై గ్రామంలో పట్టు సాధించాలనే సంకల్పంతో.. వాస్తవ ధరకు 50శాతం తగ్గినా అమ్మడానికి వెనుకాడటం లేదు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికకు సిద్ధమైన ఓ పార్టీ నాయకుడు ఇప్పటికే అతి తక్కువ ధరకు భూమిని అమ్ముకొని డబ్బులు సిద్ధం చేసుకున్నారు. గ్రామంలోని సన్నిహితులు, స్నేహితుల ఎంత వారించినా వినకుండా ముందుకుసాగుతున్నారు. -
ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
సిద్దిపేటరూరల్: గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఎన్నికల ఏర్పాట్లపై సీపీ విజయ్ కుమార్‌తో కలిసి ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు విడతల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశామన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి అభ్యర్థితో పాటు కేవలం ముగ్గురికే అనుమతి ఉంటుందన్నారు. నామినేషన్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఎవ్వరినీ అనుమతించవద్దని అధికారులు ఆదేశించారు. నామినేషన్ల పరిశీలనకు సంబంధించి ఆర్డీఓలకు అప్పీలు చేయవచ్చన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మండల కేంద్రాల్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. భద్రత కట్టుదిట్టం సీపీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరేవరకు బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో లైటింగ్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ రోజుల్లో జిల్లాలోని వైన్ షాపులు, బార్లు మూసివేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, సీపీఓ నాగేశ్వర్, జెడ్పీ సీఈఓ రమేశ్, ఆర్డీఓలు, ఏసీపీలు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు కలెక్టర్ హైమావతి అధికారులకు దిశానిర్దేశం -
లేబర్ కోడ్లను రద్దు చేయాలి
సిద్దిపేటకమాన్: కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే కార్మిక కోడ్లను రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, ఉద్యోగ భద్రత లేకుండా కార్మిక కోడ్లను రూపొందించారని అన్నారు. దీంతో కార్మికుల జీవితాలకు భద్రత లేకుండా పోతోందన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకువచ్చిన కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో గోపాలస్వామి, లక్ష్మణ్, మల్లేశం నర్సింహులు, శ్రీనివాస్, శశిధర్, వెంకట్, భాస్కర్, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగమే మనకు మార్గదర్శనం
సిద్దిపేటకమాన్: రాజ్యాంగమే మనకు మార్గదర్శనమని, అందరూ గౌరవించాలని అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జయప్రసాద్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట కోర్టు భవనంలో బుధవారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఆమోదించిన రోజు నవంబర్ 26 అని తెలిపారు. భారత రాజ్యాంగంలో ఉన్న హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలన్నారు. రాజ్యాంగ ప్రవేశికను కోర్టు సిబ్బందితో న్యాయమూర్తి చదివించారు. అలాగే డిసెంబర్ 31న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక కేసులు రాజీపడేట్లు చూడాలని పోలీసుశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సాధన, సంతోష్‌కుమార్, తరణి, పోలీసు అధికారులు, న్యాయసేవా సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణం.. కమనీయం
తిలకిస్తున్న భక్తులుసుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవంతో అలరారింది. బుధవారం వల్లీదేవసేన సుబ్రహ్మణ్యేశ్వరుల కల్యాణం వైభవంగా జరిగింది. క్షేత్రంలో అభిషేకాలు, అర్చనలు, కల్యాణాది కార్యక్రమాలతో భక్తిభావనలు ఉప్పొంగాయి. తెల్లవారుజామున అర్చక పరివారం వేద మంత్రోచ్ఛరణల మధ్య సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు మొదలయ్యాయి. గర్భగుడిలో కొలువైన వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి విశేష పంచామృతాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణలు, భక్తజన హర్షధ్వానాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారు దేవేరులకు మాంగళ్యధారణ చేశారు. కమనీయంగా సాగిన కల్యాణ వైభోగాన్ని భక్త జనులు తిలకించి పరవశించారు. – వర్గల్(గజ్వేల్) -
యాంత్రీకరణతో ఉత్పాదకత పెంచాలి
సిద్దిపేటరూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులు యాంత్రీకరణను మరింతగా వినియోగించి ఉత్పాదకతను పెంచుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లాలో ఎంపికై న 171 మంది మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ యాంత్రీకరణ వినియోగంతో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఆయిల్ పామ్ సాగు రైతులు కోరుతున్న బ్రష్ కట్టర్ తదితర యంత్రాలను కూడా త్వరితగతిన అందజేస్తామని తెలిపారు. అనంతరం రైతులతో మాట్లాడి పంటల సాగు వివరాలను తెలుసుకున్నారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి 7 లక్షల 80 వేల నిధులను మంజూరు చేసిందని, ఈ నిధులతో సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, మానకొండూర్, జనగాం నియోజకవర్గాల మహిళా రైతులకు యంత్ర పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ స్వరూపరాణి, సహాయ సంచాలకులు, ఇతర శాఖాధికారులు, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు. మహిళా సంక్షేమ పథకాలతో పరివర్తన గజ్వేల్: మహిళల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. మంగళవారం గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌లో నియోజవర్గంలోని 3,718 మహిళా సంఘాలకు రూ.3.99కోట్ల వడ్డీలేని రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 1,99,624మందికి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశామన్నారు. ఈ చీరలు ధరించి మహిళలు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. జిల్లాలోని మహిళలు ఉపయోగించుకున్న ఉచిత బస్సు ప్రయాణం ఖర్చు రూ.240.87కోట్లను ప్రభుత్వం భరించందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలతో మంచి పరివర్తన వస్తుందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఆర్డీఓ వీవీఎల్ చంద్రకళ, అదనపు డీఆర్డీఓ సుధీర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేత -
రుణాలు సద్వినియోగం చేసుకోండి
హుస్నాబాద్: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడు మండలాల్లోని 5,329 స్వయం సహాయక సంఘాలకు రూ.5.66 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు రుణం కావాలన్నా బ్యాంకర్లు మహిళా సంఘాలకు లోన్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలన్నారు. 18 సంవత్సరాల పైనబడిన వారందరూ మహిళా సంఘాల్లో చేరి ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆడబిడ్డలు ఆర్థికంగా రాణించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పొన్నం తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి పొన్నం ప్రభాకర్ వడ్డీలేని రుణాలు అందజేత -
ఎన్నికల వేళ.. నామినేటెడ్ పోస్టులు
సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నప్పటికీ పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేపట్టలేదు. హుస్నాబాద్, గజ్వేల్ నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించింది. ఆ పదవులకు సైతం ఏడాది పదవీకాలం పూర్తి అయి రెండో సంవత్సరంలో కొనసాగుతున్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీలను నియమించలేదు. తాజాగా దుబ్బాక నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీలను, కొమురవెల్లి దేవాలయ కమిటీ మంగళవారం నియమించారు. పల్లె ఎన్నికల వేళ స్థానిక నేతలకు తీపి కబురు అందింది. సిద్దిపేట నియోజకవర్గంలో వర్గపోరు ఉండటంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ కావడం లేదని పలువురు కాంగ్రెస్ నేతల ద్వారా తెలుస్తోంది. బాధ్యతలు స్వీకరించేది ఎప్పుడో? నాలుగు మార్కెట్ కమిటీలను ఈ నెల 24న నియమించినట్లు ఉత్తర్వులను విడుదల చేయగా అవి ఈ నెల 25న బయటకు వచ్చాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వ్యవసాయ కమిటీ బాధ్యతలు ఎప్పుడు స్వీకరిస్తారని జోరు చర్చ సాగుతోంది. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత స్వీకరిస్తారా?.. లేదా ముందే స్వీకరించారా? అని ప్రచారం జరుగుతోంది. కొందరిలో నిరాశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులు గెలుపొందేందుకు నామినేటెడ్ పోస్టులు లభించిన వారు కృషి చేసే అవకాశం ఉంది. దాదాపు రెండేళ్లు నియమించకుండా ఎన్నికల సమయంలో నియమించారు. నామినేట్ పోస్టులు లభించిన వారు పలువురు సంతోషంగా, మరికొందరు నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నేతలకు తీపి కబురు -
మహిళలకు తులం బంగారం ఏమాయె..
దుబ్బాక: మహిళలకు ఇస్తామన్న రూ.2500.. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం పథకాలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని ఐఓసీ కార్యాలయంలో నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మహిళ సంఘాలకు రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. ఎలా అభివృద్ధి చెందాలి అన్న దానిపై మహిళలకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. కుటుంబాలను చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మహిళల మీదనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ కై లాసం, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి మిరుదొడ్డి(దుబ్బాక): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరి కృషి అవసరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతెలో మంగళవారం ప్రీ ప్రైమరీ స్కూల్‌ను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి డబ్బును, సమయాన్ని వృథా చేసుకోవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ బడుల్లోనే విద్యార్థులకు మంచి మెరుగైన విద్య అందించడంతోపాటు అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. మన ఊరి పిల్లలు మన ఊరిలోనే చదువుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఎంఈఓ అంజాగౌడ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
రైతు బజార్.. బేజార్
పండించిన పంటలను రైతులే నేరుగా అమ్ముకునేందుకు రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన రైతు బజార్లు అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి. చిన్నకోడూరు మండల కేంద్రంలో 2018లో రూ.30 లక్షలు వెచ్చించి రైతు బజారు నిర్మించారు. మార్కెట్ కార్యాలయం, నీరు, విద్యుత్ సౌకర్యంతో పాటు 18 దుకాణాలు ఏర్పాటు చేయగా కూరగాయలు, మాంస విక్రయాలకు వాటిని కేటాయించారు. ఏడాది పాటు సాగినా అధికారుల పర్యవేక్షణ లేక నిరుపయోగంగా మారింది. దీంతో విక్రయదారులు రోడ్లకు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తున్నారు. రైతు బజారులో పిచ్చి మొక్కలు పెరిగి, చెత్త చెదారంతో నిండిపోయింది. ఈ మార్కెట్ మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అధికారులు స్పందించి రైతు బజార్‌ను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు రైతులు కోరుతున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
లోకల్ ఫైట్
గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలకు వేళైంది. మంగళవారం సాయంత్రం షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డులున్నాయి. మూడు విడత ల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. – సాక్షి, సిద్దిపేటమొదటి విడతలో 7 మండలాల్లో 163 గ్రామ పంచాయతీలు, 1,432 వార్డుల్లో ఎన్నికల జరగనున్నాయి. ఇందుకోసం ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. డిసెంబర్ 11న పోలింగ్ జరగనుంది. రెండో విడతలో .. రెండో విడతలో 10 మండలాల్లో 182 జీపీలు, 1,644 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. డిసెంబర్ 6వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరణ గడువు విధించారు. డిసెంబర్ 14న పోలింగ్ జరగనుంది. మూడో విడతలో.. మూడో విడతలో 9 మండలాల్లో 163 జీపీలు, 1,432 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. డిసెంబర్ 9వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. డిసెంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. మండలం జీపీలు వార్డులుదౌల్తాబాద్ 25 214 గజ్వేల్ 25 230 జగదేవ్‌పూర్ 25 222 మర్కూక్ 16 140 ములుగు 26 222 రాయపోలు 19 166 వర్గల్ 27 238మండలం జీపీలు వార్డులుఅక్కన్నపేట 38 306 చేర్యాల 20 184 దూల్మిట్ట 11 94 హుస్నాబాద్ 17 140 కోహెడ 27 244 కొమురవెల్లి 11 100 కొండపాక 15 146 కుకునూరుపల్లి 14 120 మద్దూరు 10 98మోగిన పంచాయతీ నగారా మూడు విడతల్లో ఎన్నికలు మొదటగా 163 జీపీలు, 1,432 వార్డులు రెండో విడతలో 182 జీపీలు, 1,644 వార్డులు మూడో దఫాలో 163 జీపీలు, 1,432 వార్డులు– సర్వం సిద్ధం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని సిద్ధం చేసింది. ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను అందుబాటులో ఉంచారు. వార్డుల వారీగా ఓటరు జాబితాలను ఫొటో సహా సిద్ధం చేశారు.పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. – పల్లెల్లో వేడెక్కిన రాజకీయాలు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఆశావహులు పావులు కదిపేందుకు సన్నద్ధమవుతున్నారు.పార్టీ రహిత ఎన్నికలే అయినా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జరిగే తొలి స్థానిక ఎన్నికలు కావడం గమనార్హం. మండలం జీపీలు వార్డులుఅక్బర్పేట–భూంపల్లి 19 168 బెజ్జంకి 24 210 చిన్నకోడూరు 28 256 దుబ్బాక 21 188 మిరుదొడ్డి 10 98 నంగునూరు 25 220 నారాయణరావుపేట 11 96 సిద్దిపేట రూరల్ 15 140 సిద్దిపేట అర్బన్ 12 116 తొగుట 17 152ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు కేంద్రమంత్రి బండి సంజయ్ నజరానా హుస్నాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షల ప్రోత్సాహక నిధులిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ నజరానా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామని హామీ ఇవ్వడంతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 75 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లను ఏకగ్రీవం చేశారన్నారు. కానీ ఐదేళ్ల కాలంలో ఆయా గ్రామాలకు కేసీఆర్ ప్రభుత్వం నయా పైసా ఇవ్వకుండా మొండి చేయి చూపిందన్నారు. నిధులు ఇచ్చేది తెచ్చేది బీజేపీ మాత్రమేనని, ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు ఓటేస్తే ఏమి లాభంలేదని పేర్కొన్నారు. -
అర్జీలను సత్వరం పరిష్కరించాలి
సిద్దిపేటరూరల్: ప్రజావాణిలో అందించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. మళ్లీ అర్జి పెట్టుకోకుండా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, పెన్షన్లు, ఇతర అర్జీలు మొత్తం 123వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పరిహారం చెల్లించాలి.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సేకరించిన రైతుల భూములకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే అందించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూసేకరణలో 1083 మంది రైతులు సెక్షన్ 64 కింద స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో డబ్బులు అందేలా చూడడం జరిగిందన్నారు. కొన్ని కారణాలతో సెక్షన్ 77 కింద సిద్దిపేట నియోజకవర్గంలోని 96 మంది రైతులకు పరిహారం అందలేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి వారికి డబ్బులు వచ్చేలా చూడాలన్నారు. రిజర్వేషన్ సవరించండి ధూల్మిట్ట గ్రామంలో సర్పంచ్ స్థానాన్ని ఈసారి రిజర్వేషన్‌ను సవరించాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు కలెక్టర్‌కు వినపతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామానికి మూడు పర్యాయాలుగా సర్పంచ్ ఎన్నికలో జనరల్ మహిళా రిజర్వేషన్ కొనసాగిందన్నారు. ప్రస్తుతం కూడా మహిళా జనరల్ కేటాయించారని తెలిపారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి ప్రస్తుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామానికి వచ్చిన జనరల్ మహిళా రిజర్వేషన్లో మార్పులు చేయాలని కోరారు. కలెక్టర్ హైమావతి అధికారులకు దిశానిర్దేశం -
ఆస్పత్రుల్లో కుక్క కాటుకు మందేది?
హుస్నాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కుక్క కాటుకు కూడా మందులు అందుబాటులో లేని దుస్ధితి నెలకొందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.1.50 కోట్ల విలువల గల 15 రకాల అత్యాధునిక పరికరాలను ఆయన ప్రారంభించారు. డాక్టర్లు, సిబ్బంది, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సర్కార్ ఆస్పత్రులకు వచ్చే వారంతా పేద, మధ్య తరగతి ప్రజలేనన్నారు. సూది, మందుతో పాటు కనీస సౌకర్యాలు లేకపోతే పేదలు చావాల్సిందేనా ప్రశ్నించారు. సర్కార్ ఆస్పత్రికి వచ్చే రోగులేవరూ చికిత్స కోసం బయటకు వెళ్లే దుస్థితి రాకుండా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన పరికరాలను అందించినట్లు తెలిపారు. విద్యా, వైద్య రంగాలకు సంబందించి పేదలకు పూర్తి స్ధాయిలో సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధులు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, సూదులు, కాటన్ ఇతర చిన్న చిన్న మెడికల్ పరికరాలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పార్లమెంట్ పరిధిలో హుస్నాబాద్, వేములవాడ, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రుల్లో దాదాపు రూ.4 కోట్ల పైగా నిధులు వెచ్చించి వైద్య పరికరాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు డాక్టర్లను దైవంగా భావిస్తారని, అంతటి గొప్ప వృత్తిని దైవంగా భావించి పేదలకు సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంగోపాల్ రెడ్డి, దొడ్డి శ్రీనివాస్, లక్కిరెడ్డి తిరుమల, సంపత్ నాయక్, మహేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పత్తి కొనుగోలు పరిమాణాన్ని పెంచండిపత్తి కొనుగోలు పరిమాణాన్ని 7 నుంచి 9 క్వింటాళ్లకు పెంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని రైతులు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. వాతావరణ పరిస్థితులు, నీటి సమస్యలు, మార్కెట్ అస్థిరత వల్ల తాము తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లను మాత్రమే పత్తి కొనుగోలు చేసేలా సీసీఐ నిర్ధారించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ ఈ విషయంపై సీసీఐ అధికారులు, సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. బండి సంజయ్‌ని కలిసిన తారవ్వ ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన రైతు తారవ్వ బండి సంజయ్‌ని కలిశారు. తారవ్వకు జరిగిన నష్టాన్ని తెలుసుకొని బండి సంజయ్ ఆ రోజు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి భరోసా కల్పించారు. బీజేపీ నేతల ద్వారా తారవ్వకు రూ.50 వేలు అందించారు. ఈ క్రమంలో కేంద్రమంత్రిని తారవ్వ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సర్కార్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలు ప్రారంభం -
అయ్యో.. బీసీ!
గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఎట్టకేలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ హైమావతి గెజిట్‌ను సోమవారం విడుదల చేశారు. రిజర్వేషన్ల కేటాయింపులో రొటేషన్ విధానం బీసీలను దెబ్బతీసింది. 2019 ఎన్నికలతో పోలిస్తే బీసీలకు సర్పంచ్ స్థానాలు తగ్గిపోయాయి. 2019లో 499 గ్రామ పంచాయతీలుండగా అన్‌రిజర్వుడ్‌కు 245, బీసీలకు 143, ఎస్సీలకు 93, ఎస్టీలకు 18 స్థానాలు కేటాయించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ స్థానాలు పెరగగా బీసీలకు 7స్థానాలు తగ్గాయి. జిల్లా యంత్రాంగం ఎన్నికలకు సర్వం సిద్ధం చేసింది. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందులో ఎస్టీలకు 22 రిజర్వేషన్ కాగా మహిళలకు 8, జనరల్‌కు14 ఉన్నాయి. ఎస్సీలకు 97 కేటాయించగా మహిళలకు 41, జనరల్‌కు 56, బీసీలకు 136 రిజర్వ్‌కాగా 61సర్పంచ్ స్థానాలను మహిళలకు, 75 స్థానాలను జనరల్‌కు కేటాయించారు. అన్‌రిజర్వుడ్‌కు 253 సర్పంచ్ స్థానాలను కేటాయించారు. అందులో మహిళలకు 122, జనరల్‌కు 131 కేటాయించారు. జిల్లాలో వార్డులు 4,508 ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు 169 కేటాయించగా మహిళలకు 77, జనరల్‌కు 92 వార్డు స్థానాలను కేటాయించారు. ఎస్సీలకు 849 వార్డులు కేటాయించగా మహిళలకు 325, జనరల్‌కు 524 వార్డులు, బీసీలకు 1,041 రిజర్వ్ కాగా మహిళలకు 524, జనరల్‌కు 517 వార్డులు, అన్‌రిజర్వుడ్‌కు 2,203 సర్పంచ్ స్థానాలను కేటాయించగా మహిళలకు 995, జనరల్‌కు 1,208 వార్డులు రిజర్వ్ అయ్యాయి.‘స్థానిక’ంగా రిజర్వేషన్లు ఇలా.. మండలం ఎస్టీ ఎస్సీ బీసీ అన్ రిజర్వుడ్ మొత్తం మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ మహిళ జనరల్ అక్బర్పేట–భూంపల్లి 0 0 2 2 2 3 5 5 19 అక్కన్నపేట 6 6 2 3 3 4 7 7 38 బెజ్జంకి 0 0 3 3 3 3 6 6 24 చేర్యాల 0 0 2 2 3 3 5 5 20 చిన్నకోడూరు 0 0 2 3 4 5 7 7 28 దౌల్తాబాద్ 0 1 2 3 3 4 6 6 25 దూల్మిట్ట 1 2 0 1 1 2 2 2 11 దుబ్బాక 0 1 2 2 3 3 5 5 21 గజ్వేల్ 0 0 3 3 3 3 6 7 25 హుస్నాబాద్ 1 1 1 2 1 2 4 5 17 జగదేవ్‌పూర్ 0 0 2 2 4 4 6 7 25 కోహెడ 0 1 2 3 3 4 7 7 27 కొమురవెల్లి 0 0 1 2 1 1 3 3 11 కొండపాక 0 0 1 2 2 2 4 4 15 కుకునూరుపల్లి 0 0 1 2 2 2 3 4 14 మద్దూరు 0 0 1 1 1 2 2 3 10 మర్కూక్ 0 0 1 2 2 3 4 4 16 మిరుదొడ్డి 0 0 1 1 1 2 2 3 10 ములుగు 0 0 2 3 4 4 6 7 26 నంగునూరు 0 1 2 3 3 3 6 7 25 నారాయణరావుపేట 0 0 1 1 1 2 3 3 11 రాయపోలు 0 0 2 2 2 3 5 5 19 సిద్దిపేటరూరల్ 0 0 1 2 2 2 4 4 15 సిద్దిపేటఅర్బన్ 0 0 1 1 2 2 3 3 12 తొగుట 0 0 1 2 2 3 4 5 17 వర్గల్ 0 1 2 3 3 4 7 7 27తగ్గిన సర్పంచ్ స్థానాలు రొటేషన్ విధానంతో భారీగా కోత రిజర్వేషన్లు ప్రకటించిన కలెక్టర్ 508 జీపీలలో బీసీలకు 136, ఎస్సీలకు 97, ఎస్టీలకు 22 , అన్‌రిజర్వుడ్ 253 ఇక ఎన్నికల నోటిఫికేషనే తరువాయికొంపముంచిన రొటేషన్ పద్ధతి 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేయగా , బీసీలకు డెడ్కేటెడ్ కమిషన్ ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేశారు. సెప్టెంబర్ నెలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల ప్రకారం 207 సర్పంచ్ స్థానాలు కేటాయించారు. ఇప్పుడు కేవలం 136 సర్పంచ్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ రొటేషన్ పద్ధతితో బీసీ సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని పలువురు బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓటరు జాబితా సిద్ధం చేయగా, తాజాగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇక ఎన్నికల ప్రక్రియకు నోటిఫికేషన్ మిగిలి ఉంది. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
హుస్నాబాద్: నిరుద్యోగ యువత కోసం టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపా ల్ భిక్షపతి తెలిపారు. వరంగల్ ప్రథమ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో 50 రోజుల పాటు శిక్షణ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో భోజనం, ఉచిత వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసిన యువతకు కేంద్ర ప్రభుత్వ సంస్థ జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సర్టిఫికెట్లు, ఉద్యోగావశాలు కల్పించనున్నామన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ వచ్చే నెల 1నుంచి కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు.ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పోరాడుదాంసిద్దిపేటకమాన్: ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పోరాడుదామని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక రాష్ట్ర కన్వీనర్ సంతోష్ అన్నారు. సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ 22 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరు మీద వందలాది ఆదివాసులను హత్య చేస్తూ ప్రజల్లో నిత్యం భయాందోళన కలిగిస్తున్నారన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు. భారత రాజ్యాంగ హక్కుల కోసం ఉద్యమిద్దామన్నారు. కార్యక్రమంలో ప్రభాకర్, విష్ణు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయండిసిద్దిపేటఅర్బన్: గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరు గార్చే లేబర్ కోడ్లను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. సిద్దిపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమైన చర్య అన్నారు. పంటలకు కనీస మద్ధతు ధర కల్పించకుండా రైతులను మోసం చేస్తోందని అన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులలో కోతలు విధిస్తూ పథకాన్ని నీరు గారుస్తోందని మండిపడ్డారు. వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ 26న జరిగే ఆందోళన కార్యక్రమాలలో వేల సంఖ్యలో ప్రజలు హాజరై ప్రభుత్వ విధానాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శశిధర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్, సీఐటీయూ నాయకులు ఎల్లయ్య, రవికుమార్, రవీంద్రచారి, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా కమలాకర్ సిద్దిపేటజోన్: రాష్ట్ర గ్రామ పాలన అధికారుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లాకు చెందిన కమలాకర్ ఎన్నికయ్యారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెవెన్యూ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కాలువకు మరమ్మతులు చేపట్టండిఅక్కన్నపేట(హుస్నాబాద్): ఆరుగాలం ఎంతగానో శ్రమించి పండించిన వరి పంటను కోసేందుకు గోసైతుందని రైతులు వాపోతున్నారు. ఇటీవల మోంథా తుపాన్ కారణంగా వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండలంలో మూడు చోట్ల గౌరవెల్లి కాలువ కోతకు గురైంది. దీంతో ఈ గ్రామాల రైతులు వరి పంటలను కోసేందుకు దారి లేక ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కెనాలు చుట్టు పక్కలా దాదాపు 300ఎకరాల వరకు వరి పంటను సాగు చేయగా, ఇంకా 100ఎకరాల వరకు పంట కోతకు ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కెనాలు కోతకు గురై మట్టి, బండరాళ్లు పొలాల్లోకి కొట్టుకురావడంతో దారిలేక హార్వెస్టర్లు, తదితర యంత్రాలు పంట కోసేందుకు ముందుకు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రైతులు గుగులోతు రాంబాబునాయక్, తిరుపతినాయక్, ఐలేష్‌యాదవ్, జుంలాల్నాయక్ తదితరులు కోతకు గురైన కెనాలను సందర్శించి పరిశీలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతకు గురైన కాలువకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు. -
‘గౌరవెల్లి’కి అనుమతులివ్వండి
హుస్నాబాద్: తెలంగాణలోని గౌరవెల్లితో సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులకు త్వరగా పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శి తన్మయికుమార్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సెక్రటరీ కో ఆర్డినేషన్ డాక్టర్ గౌరవ్‌తో కలిసి మంత్రి సోమవారం డిల్లీలో తన్మయికుమార్‌ను కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నీటి పారుదల ప్రాజెక్టులు, వాటికి సంబంధించిన అనుమతులపై చర్చించారు. సుప్రీంకోర్టు ధర్మాసనం మే 2025లో ఇచ్చిన వనశక్తి తీర్పును ఇటీవల వెనక్కి తీసుకుందని తెలిపారు. ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు మంజూరు చేస్తే ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించే అవకాశాలు పెరుగుతాయని కార్యదర్శికి వివరించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.కేంద్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శిని కలిసిన మంత్రి పొన్నం -
తుక్కాపూర్ అభివృద్ధికి కృషి
తొగుట(దుబ్బాక): మండల పరిధిలోని తుక్కాపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. తుక్కాపూర్‌లో పెద్దమ్మ, పోచమ్మ దేవాలయాల ప్రహరీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీ భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ దేవాలయ ఆవరణలో ముదిరాజ్ కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో గ్రామం నుంచి అనేక కుటుంబాలు వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రధాన మంత్రి హర్‌ఘర్ సూర్యయోజన్ పథకంలో భాగంగా ప్రతి కుటుంబం సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.72వేలు సబ్సిడీ అందిస్తోందన్నారు. సంబంధిత అధికారిని గ్రామానికి పంపిస్తామని, గ్రామస్తులు సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. మండలంలోని కాన్గల్ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఎంపీకి బీజేపీ నాయకుడు చంద్రశేఖర్‌గౌడ్ వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి విభీషణ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చంద్రం, మాజీ ఉప సర్పంచ్ ప్రవీణ్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ రఘునందన్‌రావు -
ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే చర్యలు
●అధికారుల పర్యవేక్షణ అవసరం ●కలెక్టర్ హైమావతి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ భవనాలను, ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం కాలనీలో ఫంక్షన్‌హాల్, వృత్తినైపుణ్య శిక్షణ కేంద్రం, పాఠశాలలను పరిశీలించారు. ఫంక్షన్‌హాల్ మూసి వుండటంతో ఆపరిశుభ్రంగా ఉందని, ఫంక్షన్‌హాల్‌ను శుభ్రంగా చేసేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలు, ఆస్తుల పర్యవేక్షణ బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. కాలనీలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఉర్దూమీడియం ప్రాథమిక పాఠశాలలు డబుల్ బెడ్రూంలలో కొనసాగడంతో విద్యార్థులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ స్పందిస్తూ శాశ్వత భవన నిర్మాణం కోసం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అంచనా తయారుచేయాలని డీఈఓను ఆదేశించారు. -
ఎన్ఎంఎంఎస్ పరీక్ష ప్రశాంతం
98.14శాతం హాజరు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో, ముట్రాజ్‌పల్లి, గజ్వేల్, హుస్నాబాద్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,723 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 1,691 మంది హాజరయ్యారు. దీంతో 98.14శాతం హాజరుశాతం నమోదైంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణ తీరును జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కేంద్రంలోని ఐదు పరీక్ష కేంద్రాలలో పరిశీలించారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాకు చెందిన ఉండ్రాళ్ళ రాజేశం రచించిన బాలకథా చంద్రిక తెలంగాణ సారస్వత పరిషత్ హైదరాబాద్‌లో ఆదివారం ఆవిష్కరించినట్లు కథల తాతయ్య ఎన్నవెళ్లి రాజమౌళి తెలిపారు. సారస్వత పరిషత్‌లో శివారెడ్డి, చెన్నయ్య, చినవీరభద్రుడు, డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపల్లి అశోక్ చేతుల మీదుగా బాలకథ చంద్రిక ఆవిష్కరణ జరిగిందన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులు బాలసాహిత్యం ఉండ్రాళ్ళ రాజేశం చేస్తున్న కృషిని కొనియాడారన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్‌లో బాలకథా చంద్రిక పుస్తకం ఆవిష్కరణ కావడంతో జిల్లాకు చెందిన కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. కొండపాక(గజ్వేల్): దుద్దెడ శివారులోని టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. సుమారు అర కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆదివారం సెలవు దినం కావడం.. శుభకార్యాలు అధికంగా ఉండటంతో.. కరీంనగర్, మంచిర్యాల, గోదావరిఖని, సిరిసిల్లా, వేములవాడ సిద్దిపేట తదితర పట్టణాల నుంచి హైదారాబాద్ వైపునకు వాహనాలు వెళ్లాయి. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు క్యూ కట్టాయి. నాలుగు లేన్లలో వాహనాలు వెళ్లేలా ఏర్పాటు చేసినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో నిరసన సిద్దిపేటజోన్: కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్ల నోటిఫికేషన్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆదివారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్లను కార్మిక సంఘలు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రవికుమార్, సత్యం, వినోద, నర్సింహులు, కవిత తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికానికి ప్రోత్సాహం.. మహిళలకు ప్రాధాన్యం
అక్కన్నపేట/కోహెడ(హుస్నాబాద్): పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడమేకాకుండా మహిళలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అక్కన్నపేట మండలం చౌటపల్లి గ్రామ క్రాసింగ్ వద్ద ఏర్పాటవుతున్న ఇండస్ట్రియల్ పార్కులో మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. అక్కన్నపేట, కోహెడలోని రైతు వేదికల్లో ఆదివారం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పలువురు మహిళలకు బొట్టు పెట్టి చీరలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కింద ప్రతీ మహిళకు చీర అందిస్తోందన్నారు. గ్రామగ్రామాన మహిళా సంఘాల వారు మహిళలకు బొట్టు పెట్టి చీరలను అందించాలన్నారు. ఆర్టీసీ బస్సులకు మహిళా సంఘాలనే ఓనర్లను చేస్తున్నామన్నారు. ఇందిరా క్యాంటీన్లు, అమ్మ ఆదర్శ పాఠశాలలు, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ ప్లాంట్ మహిళా సంఘాలకు ఆర్థిక వృద్ధి సాధించేలా ప్రభుత్వం అవకాశం ఇస్తుందన్నారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు మండలాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, ఎంఎన్జీ క్యాన్సర్ ఆస్పత్రి వారు క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారన్నారు. అలాగే లయన్స్ క్లబ్ వారు కంటి పరీక్షలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసిన ఇంటింటా సర్వేలో ఏ ఇంట్లో అయితే ఉన్నత చదువులు చదివారో ఆ ఇల్లు ఉన్నత స్థాయిలో ఉన్నట్లు తేలిందన్నారు. మహిళా సంఘాల వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. రైస్ మిల్లు, వస్తువుల తయారీ కార్యక్రమాలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్నోవేషన్‌లో మహిళలకు ట్రైనింగ్ ఇస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్యా, ఆర్డీఓ రామ్మూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్: గౌరవెల్లి ప్రాజెక్టుపై కోర్టు కేసు మన పక్షానే వచ్చిందని, త్వరలోనే కాలువలు తవ్వి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు బొట్టు పెట్టి ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు. 23 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోలార్ పవర్ ప్లాంట్, పెట్రోల్ బంక్‌లు, ఆర్టీసీ బస్సులు, అగ్రికల్చర్, సేరికల్చర్, హార్టికల్చర్లల్లో ఉపాధి అవకాశాలు పెంచుకొని మహిళలు రాణించాలన్నారు. హుస్నాబాద్ మహిళా సంఘాలకు సంబంధించిన వడ్డీ రూ.60 లక్షలు ప్రభుత్వమే చెల్లించిందన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని అమరవీరుల స్తూపం పక్కన మహిళలకు సంబంధించి 10 ఎకరాల్లో మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ అన్ని రకాల వస్తువులు అమ్ముకోవచ్చన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్‌లో మహిళలకు ప్రత్యేక యూనిట్లు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైస్ మిల్లు, వస్తువుల తయారీ కార్యక్రమాల్లో శిక్షణ బస్సుకు మహిళా సంఘాలే ఓనర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ -
ఉత్కంఠకు తెర!
ఖరారైన ‘పంచాయతీ’ రిజర్వేషన్లు! ● బీసీలకు 132, ఎస్సీలకు 97, ఎస్టీలకు 25 ● మహిళలకు 50శాతానికి సంబంధించి డ్రా ● జిల్లాలో 508 జీపీలు, 4,508 వార్డులు ● సోషల్ మీడియాలో రిజర్వేషన్లు వైరల్ సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ రిజర్వేషన్ల ఉత్కంఠకు తెర పడింది. జిల్లాలోని సర్పంచ్‌లు 508, వార్డు సభ్యులు 4,508 రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం ఖరారు చేసి ప్రభుత్వానికి పంపించింది. మహిళలకు కేటాయించే 50శాతం రిజర్వేషన్లను ఆదివారం సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఆయా మండల రాజకీయ పార్టీల నేతల సమక్షంలో డ్రాలు తీశారు. రిజర్వేషన్లు తెలియడంతో నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. బీసీలకు దాదాపు 132, ఎస్సీలకు 97, ఎస్టీలకు 25, జనరల్‌కు 254 గ్రామ పంచాయతీలు కేటాయించినట్లు తెలుస్తోంది. జిల్లా యంత్రాంగం అధికారికంగా గెజిట్‌ను విడుదల చేయాల్సి ఉంది. సోషల్ మీడియాలో నేతల హల్చల్ ఆయా మండలాల నాయకుల సమక్షంలో డ్రా తీయడంతో ఏ గ్రామం ఏ రిజర్వేషన్ అయిందో అధికారికంగా ప్రకటించనప్పటికీ తెలిసిపోయింది. రిజర్వేషన్లకు సంబంధించి పత్రాలపై రాజకీయ నాయకులు సంతకాలు పెట్టిన క్రమంలో ఫొటోలు తీసుకున్నారు. ఆ పత్రులు సోషల్ మీడియాలలో వైరల్ అవుతున్నాయి. ఓటరు జాబితాలో వార్డుల మార్పులు సైతం చేసి ఆదివారం జాబితాలను ప్రకటించారు. రిజర్వేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో ఇక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ రావడమే మిగిలి ఉంది. రెండు నుంచి మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పలువురు రాజకీయ నాయకులు నిరాశ చెందారు. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్న ఆశావహులకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అంతా సిద్ధం చేసుకున్నారు. పలువురికి రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో డైలమాలో పడ్డారు. ఏడాది కాలంగా గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత రిజర్వేషన్లు తారుమారు కావడంతో తలలు పట్టుకుంటున్నారు. -
రోడ్ల మరమ్మతులకు నిధులివ్వండి
● లేదంటే సచివాలయం ముట్టడిస్తాం ● సర్పంచ్ ఓట్ల కోసమే చీరల రాజకీయం ● ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: రోడ్ల మరమ్మతులకు నిధులివ్వకుంటే నియోజకవర్గంలోని వేలాదిమంది ప్రజలతో కలిసి రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లుదెబ్బతినడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రెండేళ్లుగా పాలకవర్గం లేక ఎన్నో సమస్యలతో గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నా కన్నెత్తి చూడని ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ఇందిరమ్మ పేరిట చీరలు పంపిణీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో ప్రతి బతుకమ్మ పండగకు మహిళలకు చీరలు పంపిణీ చేస్తే నేడు రేవంత్ సర్కార్ ఓట్ల కోసం పంపిణీ చేయడం శోచనీయమన్నారు. ఇన్చార్జి మంత్రి వివేక్‌కు సమస్యలు పట్టవా.. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రోడ్లు, పలు అభివృద్ధి పనులకు నిధులివ్వాలని ఎన్నో సార్లు విన్నవించినా బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమన్నారు. -
సేవలు నిరంతరం కొనసాగాలి
సత్యసాయి జయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సత్యసాయి బాబా ట్రస్ట్ సేవలు నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని సత్య సాయిబాబా దేవాలయంలో ఆదివారం జరిగిన శతయంతి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ సాక్షాత్తు భగవంతుని అవతారం సత్యసాయి బాబా గురించి మాట్లాడే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం అన్నారు. శరీరం శాశ్వత కాదు.. సేవ శాశ్వతం అంటూ చాటి చెప్పిన వ్యక్తి సత్యసాయి బాబా అన్నారు. ఇంకా వందేళ్లయినా సత్యసాయి బాబా ఆశయాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. 166దేశాలలో దాదాపు 10వేల సత్యసాయి సంస్థలు నిరంతరం మానవ సేవలో, ధర్మస్థాపనలో ఉన్నాయన్నారు. అనంతరం ఆలయ నిర్వహకులు హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. కర్మ భవన్ ఏర్పాటుకు కృషి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలో కర్మ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తానని, సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం రాష్ట్రంలోని ఆదర్శకంగా నిలువాలని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పట్టణ ఆర్యవైశ్య నూతన కార్యాలయాని హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గనికి శుభాంక్షాలు తెలిపారు. ఆర్యవైశ్యలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పదవితోనే గౌరవం గుర్తింపు రాదని పనితోనే గుర్తింపు వస్తుందన్నారు. పేద వైశ్యలకు సహయ సహకారలను అందిచడంలో ముందు ఉండాలని అన్నారు. వాసవి వివాహ వారధి కార్యక్రమం మంచి కార్యక్రమం అని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు.సమాజ శ్రేయస్సుకు ఐక్యతగా కలిసి పని చేయాలన్నారు. -
యువ శక్తి చాటుతా..
గజ్వేల్:‘కాంగ్రెస్ పార్టీది సుధీర్ఘ చరిత్ర. దేశంలో ఎవరికీ దక్కని విధంగా చిన్న వయసులోనే డీసీసీ అధ్యక్ష పీఠం దక్కింది. దీనిని నిలబెట్టుకుంటా.. యువ శక్తిని చాటుతా.. పార్టీలో సమన్వయం సాధించి జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తా’నని డీసీసీ అధ్యక్షురాలిగా నియమితురాలైన తూంకుంట ఆంక్షారెడ్డి వెల్లడించారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం.. తండ్రి రాజకీయ వారసత్వం.. రాజకీయాల్లో ఆమెకు అరుదైన అవకాశం దక్కిన క్రమంలో ఆంక్షారెడ్డిని ఆదివారం ‘సాక్షి’ పలకరించింది. ఆమె వెల్లడించిన విషయాలు ఇలా.. సాక్షి: డీసీసీ పదవి వస్తుందని ఊహించారా? ఆంక్షారెడ్డి: పార్టీ కోసం నిరంతరం పనిస్తున్నాను. కనుక పదవి నాకే వస్తుందని గట్టిగా నమ్మాను. దేశంలో ఎవరికీ దక్కని విధంగా 27ఏళ్ల వయసులో డీసీసీ అధ్యక్ష పీఠం దక్కింది. దీనిని నిలబెట్టుకుని పార్టీ పటిష్టతకు కృషి చేస్తా. సాక్షి: మీ తండ్రి రాజకీయ వారసత్వం, పైరవీ వల్లే మీకు ఈ పదవి వచ్చిందనే విమర్శలున్నాయి.. దీనిపై మీ స్పందన? ఆంక్షారెడ్డి: మా నాన్న మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. ఆయనను నియోజకర్గ ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా నర్సన్నగా పిలుచుకుంటారు. నేను మా నాన్న అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. నేను నర్సన్న బిడ్డగానే కాదు.. గడిచిన ఎనిమిదేళ్లల్లో ప్రజల పక్షాన స్వతహాగా ఎన్నో పోరాటాలు చేశాను. యూత్ కాంగ్రెస్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా కొనసాగాను. ప్రజల సమస్యలపై కొట్లాడినందుకు నాపై 14 కేసులు ఉన్నాయి. పార్టీ కోసం తెగించి కొట్లాడే మనస్తత్వం నాది. కనుకే అధిష్టానం గుర్తించి ఈ పదవి ఇచ్చింది. పదవి కోసం ఎలాంటి పైరవీ చేయలేదు. సాక్షి: జిల్లాలో బీఆర్ఎస్ బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎలా నడుపుతారు? ఆంక్షారెడ్డి: పార్టీలోకి కొత్త రక్తం వస్తే సమూల మార్పులుంటాయని రాహుల్‌గాంధీ గారు భావించారు. కనుకే నాకు అవకాశం వచ్చింది. జిల్లాలోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతాను. వారంలో ఒకరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉంటా. రెండేసి రోజులు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పర్యటిస్తా. ప్రత్యేకించి బీఆర్ఎస్ మోసాలను, అక్రమాలను బయటపెడతా. ప్రత్యేకించి మాజీ మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెడతా. దీనిద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేస్తా. సాక్షి: కాంగ్రెస్‌లో సమన్వయంలోపం, గ్రూపుల గోల ఎక్కువ. దీనిని ఎలా సరిచేస్తారు? ఆంక్షారెడ్డి: పార్టీలోని సీనియర్ నాయకులను గౌరవిస్తూనే వారందరినీ ఏకతాటిపైకి తెస్తా. ఇప్పటివరకు పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇక నుంచి సమన్వయ సాధనే లక్ష్యం. ప్రతి నాయకున్ని కలుస్తా. పార్టీ కోసం విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని కోరుతా. అధిష్టానానికి, కార్యకర్తలకు అనుసంధానకర్తగా పనిచేస్తా. సాక్షి: స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు మీ కార్యాచరణ ఏమిటీ? ఆంక్షారెడ్డి: ఎన్నిక ఏదయినా సరే, కాంగ్రెస్ గెలుపే లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే మాకు ప్రచారాస్త్రాలు. ఇప్పటికే నాయకులతో సమావేశాలు ప్రారంభించాను. టిక్కెట్ల కేటాయింపుల్లో చిన్న,చిన్న మనస్పర్థలుంటే నివారిస్తా. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు మావే. సాక్షి: భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? ఆంక్షారెడ్డి: పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడి వచ్చాను. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నా. ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవి వరించింది. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తా. యువ నాయకత్వానికి బాటలు వేస్తా ఎన్నిక ఏదైనా.. కాంగ్రెస్ గెలుపే లక్ష్యం దేశంలోనే అతి చిన్న వయసులో డీసీసీ పగ్గాలు చేపట్టా.. ‘సాక్షి’తో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి -
బానిసలుగా మార్చేందుకే నూతన కోడ్లు
సీఐటీయూ నాయకులుగజ్వేల్రూరల్/కొమురవెల్లి(సిద్దిపేట)/దుబ్బాక: కార్మికవర్గాన్ని కార్పొరేట్ యాజమాన్యాలకు బానిసగా మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక కోడ్లను తీసుకువచ్చిందని, వాటిని వెంట నే రద్దు చేయాలని సీఐటీయూ నాయుకులు డిమాండ్ చేశారు. నూతన కోడ్ల అమలును వ్యతిరేకిస్తూ శనివారం వారు వివిధ చోట్ల నిరసన కార్య క్రమాలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులోగల రాణే పరిశ్రమ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ నూతన కార్మిక కోడ్ చట్టాలను రద్దుచేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బండ్ల స్వామి, వేణుగోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, వెంకట్రావ్, భిక్షపతి, సాజిద్, యాదగిరి, ఎల్లయ్య, శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. కొమురవెల్లిలో జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు హరించే విధంగా ఉన్నాయన్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నర్సింహులు, రవి, కవిత, సుశీల, చంద్రం తదితరులు పాల్గొన్నారు. దుబ్బాకలో పట్టణ కన్వీనర్ భాస్కర్ ఆధ్వర్యంలో కార్మికులు కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కోడ్లతో కార్మికులు చాలా హక్కులు, ప్రయోజనాలు కోల్పోతారన్నారు శ్రీనివాస్, మల్లేశం, ఎల్లం సాజిద్, రాజు తదితరులపాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్సిద్దిపేటజోన్/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలో బీఫ్ విక్రయిస్తున్న వ్యాపారులతో శనివారం సమావేశం నిర్వహించారు. మాంసం వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారవేయవద్దని, మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందజేయాలని సూచించారు. బహిరంగ ప్రాంతాల్లో వేస్తే చర్యలు తప్పవన్నారు. వ్యర్థాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం దివ్యాంగుల కార్పొరేషన్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను పరిశీలించారు. అలాగే పట్టణంలో పలు ప్రాంతాలలో పర్యటించి డ్రైనేజీలలో చెత్తాచెదారం తొలగించాలని సూచించారు. బుస్సపూర్ డంపుయార్డ్ తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని బీసీ కళాశాల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. వంటగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. -
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లిబెజ్జంకి(సిద్దిపేట): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారి అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బెజ్జంకిలో శనివారం నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ఎనిమిది వేల చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీపీఎం విద్యాసాగర్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఎం పరశురాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, రత్నాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చీరల తరలింపులో అపశృతి మహిళకు అందించే చీరల తరలింపులో అపశృతి చోటుచేసుకుంది. దేవక్కపల్లె, తోటపల్లి గ్రామాలకు తీసుకువెళ్తుతున్న ఆటో దాచారం స్టేజీ సమీపంలో బోల్తాపడింది. దీంతో సంఘం సభ్యులు మార్క పుషవ్వ, సీఏ కొండ సౌజన్య, నోముల లహరికి స్వల్పగాయాలయ్యాయి. -
బెల్ట్‌షాపులను బంద్ చేయాల్సిందే..
● పురుగుల మందు డబ్బాలతో మహిళలు ఆందోళన ● నిర్వాహకులపై దాడికి యత్నంఅక్కన్నపేట(హుస్నాబాద్): బెల్ట్‌షాపులతో తమ భర్తలంతా తాగుబోతులుగా మారుతున్నారని, ఈ షాపులను వెంటనే బంద్ చేయకపోతే పురుగుల మందు తాగి చచ్చిపోతామని హెచ్చరిస్తూ సుమారుగా 50 మంది మహిళలు ఆందోళనకు దిగారు. ఈ ఘటన అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలో శనివారం చోటుచేకుంది. సుమారు 40 నుంచి 50 మంది మహిళలు గ్రామంలోని బెల్ట్‌షాపుల నిర్వాహకుల ఇంటిపై దాడికి యత్నించారు. పలువురి ఇంటి ఎదుట పురుగుమందు డబ్బాలతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. తెల్లవారుజాము నుంచి రాత్రి పడుకొనే వరకు మద్యం తాగుతూనే ఉంటున్నారని, తమను నిత్యం వేఽధిస్తున్నారని వాపోయారు. నానా బూతులు తిడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళలు కంటతడి పెట్టారు. బెల్ట్‌షాపు నిర్వాహకులు రూ.50 వేల నుంచి రూ.లక్షల వరకు ఉద్దెర ఇస్తూ తమ భర్తలను తాగుబోతులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట కోతల సమయంలో మద్యం షాపులకు లక్షల కొద్దీ బాకీలు కట్టాలని గొడవలకు దిగుతున్నారని, దీంతో పుస్తెలతాడు, కమ్మలు లాంటివి అమ్మేస్తున్నార ని వాపోయారు. అధికారులు స్పందించి బెల్ట్ షాపులను బంద్ చేయించాలని డిమాండ్ చేశారు. బెల్ట్ షాపులపై దాడి అక్కన్నపేట మండలం గౌరవెల్లి, జనగామ గ్రామాల్లో బెల్ట్ షాపులపై ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ శనివారం దాడి చేశారు. వివిధ గ్రామాల్లోని నాలుగు బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 36 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ తెలిపారు. అనుమతి లేకుండా బెల్ట్‌షాపు నిర్వహిస్తే చర్యలు తప్పవన్నారు. సిబ్బంది కర్ణాకర్, ముడావత్ తిరుపతినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా..
ఎంపీ రఘునందన్‌రావు దుబ్బాక: కార్యకర్తల కష్ట సుఖాల్లో అన్ని విధాలుగా అండగా ఉంటానని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు భరోసా ఇచ్చారు. దుబ్బాకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సప్తగిరి, మరికొందరు కార్యకర్తల కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడొద్దని తమకు ఏ కష్టమొచ్చినా తన దృష్టికి తీసుకు రావాలన్నారు. ఆయన వెంట సుంకోజి ప్రవీణ్, మల్లుగారి రమణారెడ్డి తదితరులు ఉన్నారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు మహిరానాజ్ కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లి హైస్కూల్ విద్యార్థిని మహిరానాజ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయిందని ఎంఈఓ బచ్చలి సత్తయ్య శనివారం తెలిపారు. ప్రజ్ఞాపూర్‌లో ఇటీవల నిర్వహించిన జిల్లాస్థాయి పోటీలలో ఆమె ప్రతిభ కనబర్చింది. 26 నుంచి 28 వరకు పెద్దపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటుందన్నారు. శిక్షణనిచ్చిన పీఈటీ క్యాతం రాజ్‌కుమార్, విద్యార్థినిని అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుకండి ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి గజ్వేల్‌రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వా0ములు కావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివా రం అయ్యప్పస్వాములకు స్టీల్‌ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాల న్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మ న్ రాజమౌళి, స్వాములు శ్రీనివాస్, సురేశ్, మాజీ కౌన్సిలర్ మెట్టయ్య పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఎంపిక కోహెడ(హుస్నాబాద్)/చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్రస్థాయి ఇన్స్పైర్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. కోహెడ గురుకుల పాఠశాల పదో తరగతి విద్యార్థి మేకల విష్ణువర్ధన్‌రెడ్డి కార్బన్ డయాకై ్సడ్ సంగ్రహించే పరికరం, అలాగే చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్ విద్యార్థిని శ్రీవర్షిణి మృత్తిక లేకుండా మొక్కలు పెంచే విధానానికి సంబంధించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయని గైడ్ టీచర్ తిరుపతిరెడ్డి, హెచ్ఎం సతీశ్ శనివారం తెలిపారు. -
సైన్స్ నిత్యజీవితంలో భాగం
● ఎంపీ రఘునందన్‌రావు ● ముగిసిన ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు నచ్చిన రంగంలో ఆకాశమే హద్దుగా రాణించాలని, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన, జిల్లా స్థాయి ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శన శుక్రవారం ముగిసింది. 187 ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనలో 236, ఐదు ఉపాధ్యాయ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందులో రాష్ట్ర స్థాయికి 19 ఇన్స్పైర్, 14 వైజ్ఞానిక ప్రదర్శనలు, ఒకటి ఉపాధ్యాయ ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. రోదశి నుంచి వచ్చిన విలియమ్స్ లాగా సిద్దిపేట విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. సైన్స్ నిత్య జీవితంలో ఓ భాగమని, సైన్స్ లేనిదే ఏదీ లేదని ప్రతి ఒక్కటి దాంతో ముడిపడి ఉందని, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పేర్కొన్నారు. అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకొని సైన్స్‌లో రాణించాలన్నారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు. అంతకు ముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్వో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలకు సిద్ధం కావాలి
జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి హుస్నాబాద్: విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల, అపోలో ఒకేషనల్ జూనియర్ కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, కళాశాల అనుబంధ ధ్రువ పత్రాలు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలను తనిఖీ చేశారు. అనంతరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు. చేర్యాల(సిద్దిపేట): కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఈ నెల 28న సూర్యాపేటలో జరిగే గీతన్నల రణభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బండకింది అరుణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని అర్జునపట్ల, నాగపురి, పెద్దరాజుపేట, పోతిరెడ్డిపల్లి, కడవేర్గు గ్రామాల్లో గీతకార్మికులతో కలిసి మహాసభ వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గీత కార్మికులు పాల్గొన్నారు. అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ సిద్దిపేట ఎడ్యుకేషన్: ప్రపంచ జనాభా పెరుగుతున్న కొద్ది ఆహారభద్రతలో చేపల పాత్ర కీలకమవుతుందని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పేర్కొన్నారు. కళాశాల జువాలజీ, ఫిషరీస్ విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 40 రకాల చేపలు, వాటి విత్తనోత్పత్తి, బయోప్లాక్ అక్వేరియం, అక్వాక్లినిక్, వృక్ష ఫ్లవకాలు, చేపలు పట్టేందుకు ఉపయోగించే వలలు, పడవల రకాలు, చేపల వంటకాలు 30 వరకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు స్టాళ్లను ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఓఈ డాక్టర్ గోపాల సుదర్శనం, జువాలజీ, ఫిషరీస్ విభాగాధిపతి డాక్టర్ అయోధ్యరెడ్డి, అధ్యాపకులు డా.లీలావతి, హేమలత, డా.మధుసూదన్‌రెడ్డి, విశ్వనాథ్, డా.పుణ్యమ్మ, డా.వైకుంఠం, డాక్టర్ జగదీశ్వరాచారి, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, డా.మహేశ్, డా.కృష్ణయ్య, డా. ఉమామహేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. వర్గల్(గజ్వేల్): కార్తీకం కాంతులీనింది. నాచగిరికి కాసుల వర్షం కురిపించింది. వ్రతాలు, దీపారాధనలు, ఆర్జిత సేవలు, అభిషేకాలు, కల్యాణాది పూజా కార్యక్రమాలతో శోభిల్లిన కార్తీకమాసంలో ఆలయానికి రూ.32,82,207 ఆదాయం సమకూరింది. హుండీ లెక్కిస్తే మరో రూ.10 లక్షలు పైగా వచ్చే అవకాశముంది. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీకమాసంలో నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం ఆధ్యాత్మికతతోపాటు ఆదాయాన్ని పంచింది. అక్టోబర్ 22న కార్తీకమాసం ప్రారంభమై ఈనెల 20న ముగిసింది. ఈ సారి దాదాపు లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తం వివిధ పద్దుల ద్వారా కార్తీకంలో రూ.32,82,207 ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ విజయరామారావు పేర్కొన్నారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్ రవీందర్‌గుప్తా, ధర్మకర్తలు, అర్చక సిబ్బంది భక్తజనోల్లాసం మధ్య కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. -
పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ
తెలంగాణ అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి సువర్ణములుగు(గజ్వేల్): పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి భూమిపై ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ అటవీశాఖ ప్రధాన సంరక్షణ అధికారి డాక్టర్.సి.సువర్ణ పేర్కొన్నారు. శుక్రవారం ములుగు అటవీ కళాశాల, పరిశోధన సంస్థ(ఎప్‌సీఆర్‌ఐ)లో పర్యావరణం, వ్యర్థాల నిర్వహణ అంశంపై కళాశాల డీన్ వి.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణీకరణ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, వ్యర్థాలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం అధికారులతో కలిసి సదస్సుకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్.డి.రాజిరెడ్డి మాట్లాడుతూ వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే పద్ధతులు కనిపెట్టాలన్నారు. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత పరిశోధకులు, విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డాక్టర్.ప్రియాంకవర్గీస్ మాట్లాడుతూ రెడ్యూస్–రీయూజ్–రీసైకిల్ నినాదాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాన్నారు. కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.ఎన్.ఎస్.శ్రీనిధి, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు,విద్యార్థులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇళ్ల మధ్యే మురుగు!
హుస్నాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నాలుగు సార్లు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం పడకేసింది. 15 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలతో జలదిగ్బంధానికి గురై పట్టణం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ వరద నీరు మాత్రం నిలిచిపోయి మురికి నీటి మడుగులు చెరువులను తలపిస్తున్నాయి. హుస్నాబాద్ పట్టణంలోని కూరగాయల మార్కెట్ రోడ్డుతోపాటు క్యాస కాంప్లెక్స్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వరద నీరు చేరి మురికి నీటి మడుగులుగా మారాయి. దాదాపు 3 నుంచి 4 ఎకరాల ఖాళీ స్థలంలో వరద నీరు చేరి 15 రోజులు గడుస్తున్నా... ఆ నీరు ఎటూ వెళ్లే దారి లేక మురికి నీటి చెరువుగా తయారైంది. జనావాసాల మధ్య పెద్ద ఎత్తున మురికి నీరు నిలువడంతో అందులో చెత్త చెదారం వేయడంతో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో స్థానికులు దుర్వాసనను భరించలేకపోతున్నారు. రాత్రి సమయంలో విష పురుగుల భయంతో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ రోడ్డు నుంచే నిత్యం వందలాది మంది కూరగాయలు తీసుకెళ్లడానికి వచ్చేవారు దుర్వాసన భరించలేక ముక్కు మూసుకొని వెళ్తున్నారు. సెల్లార్లలో తగ్గని నీటి ఊట ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెయిన్ రోడ్డులోని సెల్లార్లు నీటిలో మునిగిపోయాయి. వరద నీటితో విలువైన సామాన్లు తడిసి దుకాణాదారులు తీవ్రంగా నష్టపోయారు. సెల్లార్లలో నిలిచిన నీటిని రోజుల తరబడి మోటార్లతో బయటకు తోడే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మురికి నీటి మడుగులను ఆనుకొని ఉన్న సెల్లార్లలో ఇప్పటికీ నీటి ఊట తగ్గడం లేదు. దాదాపు 15 రోజుల నుంచి దుకాణాలు మూసేసి ఉన్నాయి. ఉదయం మోటార్లతో నీటిని బయటకు పంపడం, రాత్రి సమయంలో మళ్లీ ఊట పెరగడం పరిపాటిగా మారింది. ఖాళీ స్థలంలోని నీటిని పూర్తిగా బయటకు పంపిస్తే గాని ఊటలు తగ్గే అవకాశం ఉండదు. ఈ ఖాళీ స్థలం పక్కనే పోలీస్ స్టేషన్, టెలిఫోన్ ఎక్చేంజ్ భవనాలను పటేల్ కుంటలో నిర్మించడంతో వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఖాళీ స్థలాల్లో నిలిచిపోతుందని స్థానికులు పేర్కొంటున్నారు. నోటీసులు జారీ చేస్తాం కూరగాయల మార్కెట్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నీటిని తొలగించాలని నోటీసులు జారీ చేశాం. కొందరి అడ్రస్ తెలువడం లేదు. ఖాళీ స్థలాల్లో ఉన్న మురికి నీటిని బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తాం. నీటిని తొలగించకుంటే చర్యలు తీసుకుంటాం. ప్రజల ఇబ్బందులను తొలగిస్తాం. –మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్ సెల్లార్లలో తగ్గని నీటి ఊటలు 15 రోజులుగా దుకాణాల మూసివేత చెత్తాచెదారంతోవిజృంభిస్తున్న దోమలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
రాష్ట్రంలో రెగ్యులర్ డీఈవోలు ముగ్గురే!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో 33 జిల్లాలుంటే రెగ్యులర్ డీఈవోలు ముగ్గురు మాత్రమే ఉన్నారని, మిగతా చోట్ల అందరూ ఇన్‌చార్జిలే ఉన్నారని, కొన్ని జిల్లాల్లో ఐఏఎస్‌లను ఇన్చార్జి డీఈవోలుగా నియమించారని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ, లోకల్ బాడీస్ బాధ్యతలుంటాయని, వారిని ఇన్చార్జి డీఈవోలుగా నియమించడంతో విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి ఎలా పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లాలో సైన్స్ ఫెయిర్‌ను శుక్రవారం హరీశ్‌రావు సందర్శించి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఓపీఎస్, సీపీఎస్ ఉద్యోగుల సమస్యను పరిష్కారిస్తామని, ఇప్పుడు ఆ విషయమే మాట్లాడటం లేదన్నారు. ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, పీఆర్సీ ప్రస్తావనే లేదని ఆరోపించారు. స్కావెంజర్లకు 7 నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై త్వరలో తాను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు. -
దేశ నిర్మాణంలో యువత కీలకం
● ఎంపీ రఘునందన్‌రావు ● దుబ్బాకలో ఘనంగా ఏక్తా ర్యాలీ ● పాల్గొన్న అదనపు కలెక్టర్, విద్యార్థులు దుబ్బాక : ఏక్ భారత్.. శ్రేష్ట భారత్‌గా ప్రపంచంలో నంబర్‌వన్‌గా నిలుద్దామని, 2047 నాటికి వికసిత్ భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శుక్రవారం దుబ్బాక పట్టణంలోని అంగడి బజార్లో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి ఎంపీ ఏక్తా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారి గుండా విద్యార్థులతో భారీ ర్యాలీని నిర్వహించి గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అక్కడ జాతీయ సమైక్యతపై ప్రతిజ్ఞ చేయించి, మాట్లాడారు. దేశ సమైక్యతకు భంగం కలిగిస్తే శిక్ష తప్పదని హెచ్చరించారు. హైదరాబాద్, జమ్ము కశ్మీర్ వంటి కొన్ని రాజ్యాలు స్వతంత్రదేశాల్లా నిలవాలని ప్రయత్నించినా అడ్డుకొని భారతదేశంలో విలీనం కావడంలో సర్దార్ పటేల్ తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేశారు. విశ్వగురువు భారత్ లక్ష్యం సాధనలో ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రజలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ఎంఈఓ ప్రభుదాసుతో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
రిజర్వేషన్లపై ఉత్కంఠ
సాక్షి, సిద్దిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా సాగుతోంది. గ్రామం, వార్డు రిజర్వేషన్లు ఏది అవుతుందోనని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టరేట్లో ఆర్డీవో, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది రిజర్వేషన్ల కసరత్తును ప్రారంభించారు. శుక్రవారం రాత్రి వరకు కొనసాగింది. త్వరలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో తీర్మానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 23న ఓటరు జాబితాను ప్రకటించేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. బీసీలకు 26శాతం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50శాతం రిజర్వేషన్ల అమలు చేయనున్నారు. ఈ మేరకు ఈ నెల 17న మంత్రిమండలి సమావేశంలో 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 2024 సామాజిక ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే(ఎస్ఈఈఈపీసీ) ప్రకారం బీసీ రిజర్వేషన్లు, 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 508 గ్రామ పంచాయతీలుండగా 50శాతం రిజర్వేషన్లు, మిగతా 50శాతం ఓపెన్ కేటగిరిలో ఉండనున్నాయి. బీసీలకు 26 శాతం, ఎస్సీలకు 19 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది. దీని ప్రకారం చూస్తే బీసీలకు దాదాపు 132, ఎస్సీలకు 97, ఎస్టీలకు 25 గ్రామ పంచాయతీలు కేటాయించే అవకాశం ఉండనుంది. దీంతో గతంలో 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించగా ప్రస్తుతం 26శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉంది. రిజర్వేషన్ కలిసి వస్తుందా? గతంలో ప్రకటించిన రిజర్వేషన్లు అమలు చేయకపోవడంతో పలువురు నిరాశ చెందారు. గతంలో రిజర్వేషన్లు ప్రకటించడంతో పలువురు గ్రామాల్లో దావత్‌లు, పలువురికి ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పాత కేటగిరిల్లో రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో రిజర్వేషన్ కలిసి వస్తుందా లేదా అని ఆందోళన చెందుతున్నారు. కలిసి రాకపోతే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చులు అన్ని వృధా అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఏది అవుతుందని ఇప్పటికే పలువురు గ్రామ స్థాయి నాయకులు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నెల 23న రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మూడు దశల్లో ఎన్నికలు జిల్లాలో జరగనున్నాయి. కసరత్తును ప్రారంభించిన అధికారులు జిల్లాలో 508 జీపీలు, 4508 వార్డులు కలిసి వస్తుందా? లేదా అని ఎదురు చూపులు సిద్దిపేటరూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కల ప్రకారం , ఎస్ఈఈఈపీసీ 2024 ప్రకారం బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియపై పంచాయతీశాఖ, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు ఉండగా, 4508 వార్డుల్లో రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టాలన్నారు. రిజర్వేషన్ ప్రక్రియ ఆయా డివిజన్ల ఆర్డీఓల నేతృత్వంలో చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ విజయ్‌కుమార్, డీఆర్డీఏ జయదేవ్‌ఆర్యా, ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, డీఎల్పీఓలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు. -
నూతన ఒరవడి సృష్టించాలి
● గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు ● సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులు వినూత్నంగా ఆలోచించి, నూతన ఒరవడిని సృష్టించాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశం గురువారం జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు. వారోత్సవాల్లో నిర్వహించిన క్విజ్, చిత్రలేఖనం, సుడోకు, వ్యాసరచన, ముగ్గుల పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా లింగమూర్తి మాట్లాడుతూ గ్రంథాలయాలను ఉపయోగించుకుని విజ్ఞానవంతులు కావాలన్నారు. చిన్ననాటినుంచే విద్యార్థులు గ్రంథాలు చదవడం అలవరచుకోవాలన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలన్నారు. జిల్లాలో అన్ని మండలాల్గో గ్రంథాలయాలు ఉన్నాయన్నారు. గ్రంథాలయాల్లో కంప్యూటర్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పోటీపరీక్షల్లో గ్రంథాలయం నుంచి చదువుకున్న విద్యార్థులు గ్రూప్–1, 2, 3, 4, డీఎస్సీ తదితర పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించారన్నారు. కేవలం గణితం, భౌతిక రసాయనశాస్త్రలే కాకుండా విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలన్నారు. కవి చొప్పదండి సుధాకర్ మాట్లాడుతూ సంస్కారవంతమైన జీవితానికి గ్రంథాలయాలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ సూపరింటెండెంట్ రాజేశ్వరి, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, న్యాయవాది మనోహర్, మామిడాల స్రవంతి, రామగిరి స్వాతి, గ్రంథపాలకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలో మావోళ్లు!
దుబ్బాక: ఆపరేషన్ కగార్తో చోటుచేసుకుంటున్న సంఘటనలతో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కుటుంబీకులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. నక్సలైట్ ఉద్యమానికి ఊపిరిపోసిన ఉమ్మడి మెదక్జిల్లాలో ఆపరేషన్ కగార్ మొదలైనప్పటినుంచి ఆందోళనకర పరిస్థితే నెలకొంది. భౌగోళికంగా ఉమ్మడి మెదక్‌జిల్లా ఉత్తర, దక్షిణ తెలంగాణకు సరిహద్దులో ఉండటంతో నక్సలైట్ ఉద్యమానికి కేంద్రబింధువుగా మారింది. ఇటీవలనే రాంచంద్రారెడ్డి ఎన్కౌంటర్ 40 రోజుల క్రితం జరిగిన ఎన్కౌంటర్లో కోహెడ మండలం తీగలకుంటపల్లికి చెందిన కట్టా రాంచంద్రారెడ్డి మృతిచెందాడు. ఆయన మూడున్నర దశబ్దాల క్రితం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యమంలో చేరారు. 20 రోజుల క్రితం ధూళ్మిట్ట మండలం కూటిగల్‌కు చెందిన కూకటి వెంకన్న ఉద్యమజీవితాన్ని విడిచి జనజీవన స్రవంతిలో చేరారు. అలాగే దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన సోలిపేట కొండల్‌రెడ్డి ఎన్కౌంటర్లో మరణించగా, ఏఓబీ ఇన్చార్జి, సెంట్రల్ కమిటీ సభ్యుడు దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లికి చెందిన దుభాషి శంకర్ ఆలియాస్ రమేష్ అరెస్టయి ఒడిశా సెంట్రల్ జైల్లో ఉన్నారు. అలాగే రుద్రారం గ్రామానికి చెందిన జనశక్తి కేంద్రకమిటీ సభ్యుడు సుభాష్, మల్లుపల్లికి చెందిన సంజీవ్‌తో పాటు కీలకనాయకులు ఎన్కౌంటర్లలో అమరులయ్యారు. వరుస సంఘటనలతో బెంగ వరుస సంఘటనలతో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఏం వార్త వినాల్సివస్తుందోనని అజ్ఞాతంతో ఉన్న భాగ్య, స్వరూప, అరుణ కుటుంబీకులు, బంధువులు కలవరం చెందుతున్నారు. ● మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రంగబోయిన భాగ్య అలియాస్ కల్పన. రూపి పేరుతో మావోయిస్టు పార్టీలో 25 ఏళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం నార్త్బస్తర్ ప్రతాపూర్ ఏరియా కమాండర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం. ● నంగునూరు మండల కేంద్రానికి చెందిన రంగు అరుణ అలియాస్ పద్మక్క 30 ఏళ్లుకు పైగా మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ యాక్షన్ టీంలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ● అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన కాశబోయిన స్వరూప పదో తరగతి చదువుతున్న క్రమంలోనే ఉద్యమబాట పట్టారు. 30 ఏళ్ల క్రితమే ఉద్యమబాట పట్టిన స్వరూప దండకారణ్యంలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వరుస ఎన్కౌంటర్లు.. అరెస్టులతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మావోయిస్టు ఉద్యమంలో ముగ్గురు మహిళలు కీలక పాత్ర -
స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ హైమావతి ● వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ సిద్దిపేటరూరల్: స్థానిక సంస్థలకు ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న క్రమంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, తదితర ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా షెడ్యూల్‌ను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు. ఎన్నికల నిర్వహణలో శాంతి భద్రతలు, సిబ్బంది కేటాయింపు తదితర అంశాలపై దృష్టిసారించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, జెడ్పీ సీఈఓ రమేశ్, డీపీఓ విజయ్‌కుమార్, డీఆర్డీఓ జయదేవ్‌ఆర్యా, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌మూర్తి, డివిజనల్ పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో సీఎంచే ఆయిల్‌పాం ఫ్యాక్టరీ ప్రారంభం నంగునూరు(సిద్దిపేట): ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నర్మేటలో రూ. 300 కోట్లతో నిర్మించిన ఫ్యాక్టరీని గురువారం వివిధ శాఖల అధికారులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే ఫ్యాక్టరీని ప్రారంభిస్తారని హెలీప్యాడ్, సభ స్థలం, వీఐపీ పార్కింగ్, స్టాళ్ల ఏర్పాటు, బీటీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివస్తారని వారికి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, జిల్లా ఉద్యానవన, వ్యవసాయశాఖ జిల్లా అధికారులు సువర్ణ, స్వరూపరాణి, ఆయిల్‌ఫెడ్ మెనేజర్ సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రణిత్గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బ్రాండెడ్ మాటున
జనరిక్ మందులుమందుల మాఫియా.. కళ్లముందే కనికట్టు చేస్తున్నారు. జనరిక్ మందులను అంటగట్టి.. బ్రాండెడ్ వసూళ్ల దందా యథేచ్ఛగా సాగిస్తున్నారు. చౌక ధరలకు లభించే జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో బ్రాండెడ్ పేరిట మెడికల్ షాపుల నిర్వాహకులు రోగుల జేబులు గుల్ల చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బ్రాండెడ్ మాత్రల స్లిప్ ఒక్కటి మార్కెట్లో రూ.50కు లభిస్తే.. అదే మోతాదులో అంతే క్వాలిటీగా ఉండే జనరిక్ మందులు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. వీటినే ఇస్తూ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోంది. – సాక్షి, సిద్దిపేట చౌకగా లభించే జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో బ్రాండెడ్ పేరిట మెడికల్ షాపుల నిర్వాహకులు రోగులను మోసం చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 500లకు పైగా రిటైల్, హోల్‌సెల్ మెడికల్ షాపులున్నాయి. జిల్లాలో కేవలం ఆరు మాత్రమే జనరిక్ మందుల షాపులకు అనుమతులుండగా రెండు మాత్రమే కొనసాగుతున్నాయి. ప్రజలపై ఆర్థిక భారం పడవద్దని ఉద్దేశంతో జనరిక్ మందుల విక్రయాలను చేపట్టింది. మెడికల్ షాపులలో విధిగా మందుల ధరలు సూచించే పట్టికలను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించడం లేదు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు మామూళ్లు ముట్టచెప్పడంతో మెడికల్ షాపులపై కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరలు తక్కువ ఎందుకంటే.. జనరిక్, బ్రాండెడ్ మందులు పేరు మాత్రమే వేరు. తయారీ ఫార్ములా ఒక్కటే. జనరిక్ మందుల తయారీకి ఫార్మా కంపెనీలు ఎలాంటి పరిశోధనలు, క్లినికల్ ట్రయల్స్ చేయనవసరం లేదు. అందుకే వాటి మందుల ధరలు బ్రాండెడ్ వాటితో పోలిస్తే 30 నుంచి 80శాతం తక్కువ ధరల్లో లభిస్తాయి. ఆ మందులపై ముద్రించే ఎమ్మార్పీ కంటే చాలా తక్కువ ధరలకే అమ్ముతారు. ఉదాహరణకు బ్రాండెడ్ కంపెనీకి చెందిన పారాసెట్మాల్ 650 మి.గ్రా. దీని ధర 15 మాత్రలకు రూ.29 ఉంటుంది. 10 మాత్రలకు రూ.18 తీసుకుంటారు. అదే జనరిక్‌కు చెందిన పారాసెట్మాల్ 650 మి.గ్రా 10 ట్యాబ్లెట్లు రూ.4.50కే వస్తుంది. ఇలా మందుల జనరిక్ మందులను ఇస్తూ బ్రాండెడ్ పేరుతో రూ.14 అధికంగా వసూలు చేస్తున్నారు. అనుబంధ మెడికల్ షాప్‌లలో.. వివిధ ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే మెడికల్ షాప్‌లలో ఎక్కువగా జనరిక్ మందులనే ఇస్తూ అక్రమ దందాకు తెరలేపుతున్నారు. జనరిక్ మందులపై ఉండే ఎమ్మార్పీలకే విక్రయిస్తున్నారు. ఆ డాక్టర్లు రాసే మందులు మరో మెడికల్ షాపులలో లభించకపోవడంతో తప్పని పరిస్థితుల్లో అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఇవి జనరిక్ మందులా? బ్రాండెడ్ మందులా? గుర్తుపట్టలేని విధంగా రంగు రంగు కలర్లలో ఉంటాయి. దీంతో బ్రాండెడ్ మందుల స్థానంలో జనరిక్ మందులను విక్రయిస్తూ రోగులను పిండిపిప్పి చేస్తున్నారు. రోగుల జేబులు గుల్ల చేస్తున్న నిర్వాహకులు పట్టించుకోని డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆస్పత్రులకు అనుబంధంగా ఉండే షాపులలో మోసాలు అధికంమెడికల్ షాపుల సంఘ నాయకుడి మెడికల్ ఏజెన్సీలో ముందులు తీసుకోకపోతే డ్రగ్ అధికారులతో ఆ మెడికల్ షాపులపై దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసోసియేషన్ నుంచి మామూళ్లు వసూలు చేసి డ్రగ్ అధికారులకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అసోసియేషన్ గుప్పిట్లో డ్రగ్స్ అధికారులు ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. మెడికల్ షాపుల నిర్వాహకులు ఇలా మోసాలకు పాల్పడుతున్నా ఔషధ నియంత్రణ మండలి వారు పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికై నా ఔషధ నియంత్రణ అధికారులు దృష్టి సారించి మెడికల్ మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఇందిరమ్మ చీరలు
● నేటి నుంచి పంపిణీ.. ● జిల్లాలో లక్షా 99వేల మందికి అందించేందుకు ఏర్పాట్లు సిద్దిపేటరూరల్: జిల్లాలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద శుక్రవారం నుంచి చీరలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. బతుకమ్మ పండుగ నాటికే పంపిణీ చేయాలని భావించినప్పటికీ చీరలు సిద్ధం కాకపోవడం, స్థానిక ఎన్నికల కోడ్ దృష్ట్యా వాయిదా వేశారు. ఒక్కో మహిళకు ఒక్కో చీర చొప్పున అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో అధికారులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళల వివరాలు సేకరించారు. జిల్లాలో 1,99,000 మంది మహిళలకు చీరలు అందించనున్నారు. మొదటగా కోహెడ మండల కేంద్రంలో మంత్రి పొన్నం మొదటగా పంపిణీ చేయనున్నారు. ఏర్పాట్లు పూర్తి చేశాం జిల్లాలోని అర్హులైన మహిళలందరికీ చీరలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చీరలను గోదాముల నుంచి సరఫరా చేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మహిళా సంఘాల సభ్యుల ద్వారా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – జయదేవ్ ఆర్యా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి -
సైన్స్ ప్రదర్శనలు నైపుణ్యాన్ని పెంచుతాయి
● జిల్లా విద్యాశాఖ ప్రత్యేకపర్యవేక్షణ అధికారి సోమిరెడ్డి ● రెండో రోజూ కొనసాగిన ప్రదర్శనలు ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులు మేదావులుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి సోమిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న జిల్లా స్థాయి ఇన్స్పైర్, వైజ్ఞానిక ప్రదర్శనను గురువారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీస్తాయన్నారు. విద్యార్థులు ప్రతి విషయాన్ని శాసీ్త్రయ కోణంలో ఆలోచించినపుడే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. నిర్వహణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం జిల్లాలోని వివిధ పాఠశాలకు చెందిన 4,815 మంది విద్యార్థులు ప్రదర్శనలను తిలకించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, డీఎస్ఓ కళ్ళెపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం జగదేవ్‌పూర్(గజ్వేల్): సిద్దిపేటలో జరుగుతున్న జిల్లా ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్‌కు జగదేవ్‌పూర్ మోడల్ పాఠశాల విద్యార్థులు ఎంపికైనప్పటికీ పంపించడానికి ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారు. ఎగ్జిబిషన్లో విద్యార్థులు ప్రాజెక్టు ప్రదర్శన చేయాల్సి ఉండగా, పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు హాజరు కాలేదు. ప్రాజెక్టు ప్రదర్శనకు ప్రభుత్వం రూ. 10వేల ఆర్ధికసాయం అందించినా నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా ‘మొబైల్ కూప్స్ హెల్త్ఫైర్’ ప్రాజెక్టు ప్రదర్శనకు పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. గతంలో ప్రాజెక్టుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించిన టీచర్ పాఠశాల నుంచి బదిలీపై వెళ్లారన్నారు. మహిళా భద్రత బ్యాండ్.. ఈ ప్రదర్శనను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సిద్దిపేట విద్యార్థులు సుప్రజ, శరణ్య, కృష్ణవేణిలు ప్రదర్శించారు. ఈ బ్యాండును చేతి గడియారం వలే చేతికి ధరించవచ్చు. ఎక్కడికై నా వెళ్ళినప్పుడు ఎవరైనా పోకిరీలు వేధించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ బ్యాండు పైన ఒక క్లిక్ నొక్కగానే సెన్సార్ ద్వారా రిసీవర్ సహాయంతో స్పీకర్ ద్వారా సౌండ్ ప్రొడ్యూస్ అయి గట్టి శబ్ధం వస్తుంది. పోలీసు సైరన్లా సౌండ్ రావడంతో మహిళలు ప్రమాదం నుంచి తప్పించుకునే వీలు కలుగుతుంది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ ప్రాథమికోన్నత నాంచారుపల్లి పాఠశాల విద్యార్థిని అర్చన, గైడ్ టీచర్ దేవరాజ్ ఆధ్వర్యంలో ప్రదర్శించారు. జీవామృతం, వేపనూనె, వర్మీ కంపోస్ట్, పంచగవ్యలను వినియోగిస్తూ సేంద్రియ సాగు ఏ విధంగా చేయాలో ప్రాజెక్టు రూపంలో వివరించారు. ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకంతో పంట దిగుబడి, నాణ్యతపై ఈ ప్రాజెక్టులో భాగంగా వివరించారు. ఒకేరకమైన పంటలు కాకుండా పంట మార్పిడి చేయడం తదితర విషయాలను తెలిపారు. -
విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
● ప్రాజెక్టు రూపకర్తలు శాస్త్రవేత్తలుగా ఎదగాలి ● ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి, కలెక్టర్ హైమావతి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విజ్ఞానాన్ని అందిపుచ్చుకొన్నవారే ఉన్నత స్థాయికి ఎదుగుతారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్‌ను వారు ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 187 ఇన్స్పెయిర్, 236 సైన్స్, 5 ఉపాధ్యాయ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మెదడుకు పదును పెట్టి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. విద్యార్థులు, భావిశాస్త్రవేత్తలుగా ఎదిగి అనేక ఆవిష్కరణలు చేయాలన్నారు. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు మహాత్ముల పుస్తకాలను చదవాలన్నారు. రాష్ట్రంలోనే ఇన్స్పైర్, సైన్స్ ప్రాజెక్టులతో సిద్దిపేట జిల్లా ముందుందన్నారు. పదవతరగతి పరీక్ష ఫలితాల్లోనూ జిల్లాను ముందు వరుసలో ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సైన్‌న్స్ ఆఫీసర్ కళ్లెపల్లి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫెక్టు
దుబ్బాకరూరల్: ఆర్అండ్బీ అధికారులు బుధవారం స్థానిక జాతీయ రహదారిని పరిశీలించారు. ‘సాక్షి’ దిన పత్రికలో ‘నెత్తురోడుతన్న రోడ్లు’ అనే కథనం ఇటీవల ప్రచురితమైన విషయం విదితమే. స్పందించిన ఆర్అండ్బి అధికారులు జాతీయ రహదారి పోతారెడ్డిపేట వద్ద రోడ్డును పరిశీలించారు. అదే విధంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడుతూ ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలను వివరించారు. రోడ్డు మార్గంలో ప్రమాద సూచికలు పెట్టాలని, రోడ్డు పక్కన డ్రైనేజిలను పూర్తి చేయాలన్నారు. రోడ్డు మార్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. -
పొద్దు తిరుగుడుకు ప్రోత్సాహం
పొద్దు తిరుగుడు పంటను ప్రోత్సహించడానికి వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. ఈసారి కొత్తగా నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (జాతీయ నూనె గింజల పథకం) కింద వందశాతం సబ్సిడీపై విత్తనాలు అందిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 6,250 ఎకరాల్లో సాగు లక్ష్యంగా 160క్వింటాళ్ల మేర పంపిణీ చేయనున్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ విత్తన పంపిణీ చేపడుతున్నారు. గజ్వేల్: ఉమ్మడి మెదక్ జిల్లా (సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్)లో ఏటా యాసంగిలో 6 లక్షల మేర పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో సింహభాగం వరి సాగులోకి వస్తుండగా.. ఆరుతడి పంటలను రైతులు భారీగానే సాగు చేస్తారు. ఆరుతడిలో ముఖ్యమైన పొద్దు తిరుగుడు పంటకు ఈసారి వంద శాతం విత్తన సబ్సిడీ అందజేస్తున్నారు. నూనె గింజల పంటల సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ నూనె గింజల పథకం కింద ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. సిద్దిపేట జిల్లాలో ఇప్పటికే పంపిణీ ప్రక్రియ మొదలయ్యింది. జిల్లాలో 6,250 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను సాగు చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. ఎకరాకు 2.5కిలోల విత్తనం అవసరముంటుంది. ఈ క్రమంలోనే జిల్లాకు 160క్వింటాళ్ల మేర విత్తనం వచ్చింది. జిల్లాలోని పొద్దు తిరుగుడు పంటను సాగు చేసే మండలాలను గుర్తించి పంపిణీ చేపడుతున్నారు. మహిళల భాగస్వామ్యం.. ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యుసింగ్ ఆర్గనైజేషన్ల ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. విత్తన పంపిణీలో మహిళలను భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని అన్ని వ్యవసాయ డివిజన్లలో ఈ పంపిణీ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మున్నెన్నడూలేని విధంగా వందశాతం సబ్సిడీపై పొద్దు తిరుగుడు విత్తనాలు అందజేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ 10వేల ఎకరాల సాగు లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. నూనె గింజల సాగు పెంపే లక్ష్యం నూనె గింజల సాగును ప్రోత్సహించడమే లక్ష్యం. ఈసారి పొద్దు తిరుగుడు విత్తనాలను వందశాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం సాగుతోంది. కొన్ని జిల్లాల్లో వేరుశనగ విత్తనాలను సైతం అందిస్తున్నారు. రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. – స్వరూపరాణి, జిల్లా వ్యవసాయాధికారి వందశాతం సబ్సిడీపై విత్తనాలు జిల్లాలో 6,250ఎకరాలసాగు లక్ష్యం సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనూ పంపిణీకి చర్యలు -
చిట్టి చేతులు..ఎన్నెన్నో అద్భుతాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన ఇన్స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్ సంబురంగా కొనసాగింది. విద్యార్థులు వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలను ప్రదర్శించారు. నిత్యం అందుబాటులో ఉండే పరికరాలతో ప్రాజెక్టులను రూపొందించడం విశేషం. ప్రదర్శనలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అందులో కొన్ని ప్రాజెక్టుల గురించి తెలుసుకుందాం.. ఇంటెలిజెన్స్ చలాన్ సిస్టమ్ ఆన్ రోడ్ ఈ ప్రాజెక్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుర్రాలగొంది విద్యార్థి శ్రావ్య రూపొందించారు. ఈ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయడం, నిబంధనలు పాటించని వాహనాలకు చలాన్ వేయడం ఆటోమెటిక్‌గా జరుగుతుంది. ఒక వేళ వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే సిగ్నల్ పై ఉన్న కెమెరా ద్వారా ఫొటో తీసి, ఆటోమెటిక్‌గా వాహనంపై చలాన్ జనరేట్ అవుతుంది. దీంతో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించే అవకాశం ఉంది. పవర్ ప్రొడక్షన్.. పవర్ ప్రొడెక్షన్ ప్రాజెక్టును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ విద్యార్థులు లక్షిత్, యోగినాథ్లు రూపొందించారు. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా సోలార్ పలక ద్వారా విద్యుత్‌ను జనరేట్ చేసి విద్యుత్ సరఫరా చేయడం. సోలార్ పలకలు కేవలం ఏ విధంగా అమర్చితే అలాగే ఉంటాయి. కానీ ఈ ప్రాజెక్టులో మాత్రం వెలుతురు ఏ దిక్కున ఉంటే, ఆ దిక్కుకు సోలార్ పలకలు మారుతాయి. దీంతో నిరంతరం విద్యుత్‌ను పొందే అవకాశం ఉంటుంది. చిన్న బల్బుల పై వెలుతురు పడగానే సెన్సార్ సిస్టం ద్వారా సోలార్ పలకలు వెలుతురు వైపునకు మరలుతాయి. దీంతో విద్యుత్ అధికంగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఆటోమెటెడ్ ఫెర్టిలైజర్ డిస్పెన్సింగ్ సిస్టమ్ ఈ ప్రాజెక్టును లచ్చపేట ఆదర్శపాఠశాల విద్యార్థి ఎండీ అజీజ్ రూపొందించాడు. ఈ పరికరంలో గేర్ మోటారు, ఎరువు, రసాయనాలు వేసే బాక్స్, సోలార్ పలక, సెన్సార్ రిసీవర్, నీటిమోటారు, సెల్‌ఫోన్, పైపులు, బ్యాటరీలను ఉపయోగించారు. సెల్‌ఫోన్ సహాయంతో సెన్సార్ రిసీవర్‌ను కంట్రోల్ చేస్తారు. సెల్‌ఫోన్‌తో సెన్సార్‌కు సమాచారం అందించగానే ఈ పరికరం పని చేస్తుంది. సోలార్ విద్యుత్ శక్తి ద్వారా పంట చేనులో ప్రయాణిస్తుంది. పరికరానికి అమర్చిన పైపుల ద్వారా పంట చేనులో ఎరువులు, రసాయనాలు పిచికారీ చేస్తారు. తక్కువ ఖర్చుతో ఈ పరికరం పంట చేనులో రైతులకు శ్రమ లేకుండా వినియోగించే అవకాశం ఉంది. వినూత్న ఆలోచనలతో నూతన ఆవిష్కరణలు సంబురంగా ఇన్స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్ తరలివచ్చిన వేలాదిమంది విద్యార్థులు -
భూ సేకరణ వేగిరం చేయండి
● కలెక్టర్ హైమావతి ● అధికారులు, రైతులతో సమావేశం సిద్దిపేటరూరల్: రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణంలో భాగంగా భూ సేకరణను వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో అధికారులు, మర్కూక్, వర్గల్ మండలాల రైతులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఆర్‌లో భూమిని కోల్పోతున్న బాధిత రైతులకు ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ప్రజా అవసరాల కోసం భూమిని త్యాగం చేస్తున్న మీకు దక్కాల్సిన నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. భూమిని త్వరగా అందించేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు. పారదర్శకంగా చీరల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ హైమావతి సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి’ కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరు స్పెషల్ ఆఫీసర్‌ను నియమిస్తున్నామని అన్నారు. ప్రజా ప్రతినిదుల సమక్షంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి నిర్ణీత గడువు లోపు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీపీఓ వినోద్ కుమార్, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు టి. రేణుక, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు, ఏపీవోలు, తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలే వాడాలి కొమురవెల్లి(సిద్దిపేట): హాస్టళ్లలో నాణ్యమైన ఆహారపదార్థాలతో రుచికరమైన వంటకాలను తయారు చేయాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించారు. స్టోర్ రూంలో ఉన్న కూరగాయలను, వంట సామగ్రిని, రాత్రిభోజనాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మెనూ ప్రకారం కూరలు వండాలన్నారు. ఎలాంటి సాకులు చెప్పొద్దని సిబ్బందికి సూచించారు. పిల్లలందరికీ సరిపోయేలా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. -
రియల్ నయా దందా
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో రియల్టర్లు కొత్త దందాకు తెరలేపారు. ప్రజలల్లో కొనుగోలు శక్తి తగ్గడంతో ఇళ్లు, ప్లాట్లు, సాగు భూములు అమ్ముడుపోవడం కష్టంగా మారింది. దీంతో యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాగైనా భూములు, ఇళ్లు అమ్మి సొమ్ము చేసుకోవాలన్న లక్ష్యంతో కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. రూ.500 నుంచి రూ.2వేల విలువ చేసే కూపన్లు విక్రయించి లక్కీ డ్రాల ద్వారా ఇళ్లు, ప్లాట్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇలా సులువుగా డబ్బులు సంపాదించి కస్టమర్లను బోల్తా కొట్టించి భూములను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాస్త జిల్లా వ్యాప్తంగా ప్రచారం కావడంతో అమాయకులు లక్కీ డ్రాలో పాల్గొని మోసపోయే అవకాశాలున్నాయి. దీనిని ఆరంభంలో కట్టడి చేస్తే ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశం ఉంది. ఈ లక్కీ డ్రాలపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ పండుగల నేపథ్యంలో షాపింగ్ చేసిన వారికి వివిధ బహుమతులు అందజేసేందుకు పెద్ద పెద్ద బట్టల షాపులు, ఎలక్ట్రానిక్స్ వారు లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. దీనికి వినియోగదారుల నుంచి స్పందన ఎక్కువగానే ఉంటుంది. రియల్ఎస్టేట్ వ్యాపారులు ఇదే పద్ధతిలో రూ.500 నుంచి రూ.2వేలకే లక్షల విలువ చేసే ఇల్లు, ప్లాట్ తమ సొంతం చేసుకోవచ్చని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి ప్రజలను ఆకర్షిస్తున్నారు. జగదేవ్‌పూర్, ములుగు మండలాల పరిధిలో ఎక్కువగా ఇళ్లు, ప్లాట్లు లక్కీ డ్రా దందా కొనసాగుతోంది. ఆన్లైన్లో సైతం ఈ ఫోన్ నంబర్‌కు డబ్బులు పంపిస్తే పేరు రాసి డ్రాలో వేస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. లక్కీ డ్రాలకు సంబంధించిన వీడియో, కరపత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని ప్రజలు చూసి నయా ట్రెండ్ వైపు ఆకర్షితులవుతుండటం గమనార్హం. ప్రత్యేకంగా ఏజెంట్ల నియామకం ఒక్కో దానిపై వేలాది మందిని సభ్యులుగా చేర్చుకొని రూ.లక్షలు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకొని సభ్యులను చేర్చుతున్నట్లు తెలుస్తోంది. డబ్బులు వసూలు చేసిన తర్వాత నిర్వాహకులు చేతులు ఎత్తేస్తే పరిస్థితి ఏమిటని, ఇలాంటి వాటికి చట్టంలో అనుమతులు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా మోసం చేస్తే లక్కీ డ్రాలో డబ్బులు కట్టిన వారి పరిస్థితి ఏమిటని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. లక్కీ డ్రా పేరుతో డబ్బులు వసూలు చేసిన తర్వాత ఒప్పందం మేరకు భూములు చేతులు మారకపోతే ఎలా? అన్నది సైతం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రారంభంలోనే నిలువరించాలి రాష్ట్రంలో లాటరీలకు అనుమతి లేదు. ఇళ్లు, భూముల లక్కీ డ్రా అంశం రెవెన్యూ, పోలీసులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్కీ డ్రాలు ప్రారంభంలోనే అధికారులు కట్టడి చేస్తేనే ప్రజలు మోసపోకుండా ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. లక్కీ డ్రా కూపన్ ఒక్కో కూపన్ రూ.500 నుంచి రూ.2వేలు వసూలు జగదేవ్‌పూర్, ములుగు ప్రాంతాల్లో ఇష్టారాజ్యం కట్టడి చేయాలంటున్న ప్రజలు అలా చేయడం చట్ట విరుద్ధం మనీ సర్క్యూలేషన్ 1978 యాక్ట్ కింద లక్కీ డ్రాలు నిర్వహించడం చట్ట విరుద్ధం. ఎవరు ప్రయోట్ చేయవద్దు. ఎవరూ డబ్బులు చెల్లించవ వద్దు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. – విజయ్‌కుమార్, సీపీ, సిద్దిపేటఇల్లు.. ప్లాట్.. లక్కీ డ్రా అంటూ రియల్టర్ల మాయాజాలం -
సెట్విన్ విస్తరణ
జోగిపేట, దుబ్బాకలో రెండు శిక్షణ కేంద్రాలు● ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు ● జహీరాబాద్‌లో కొనసాగుతున్న వృత్తి నైపుణ్య కోర్సులుసాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఉపాధి కల్పించే వృత్తులపై శిక్షణనిచ్చే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ (సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, ట్రైనింగ్) జిల్లాలో తన సేవలను విస్తరిస్తోంది. ఇప్పటికే జహీరాబాద్ పట్టణంలో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో రెండు చోట్ల ఈ కూడా నెలకొల్పాలని నిర్ణయించింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంతోపాటు, సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. జిల్లాలకు ఈ సంస్థ సేవల విస్తరణ హైదరాబాద్ కేంద్రంగా సేవలందించే ఈ సంస్థ నగరంలో 21 చోట్ల ఈ శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. గతేడాది మరో రెండు కేంద్రాలను సిటీలో నెలకొల్పింది. ఇప్పటికే సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి, డిచ్‌పల్లిలో ఈ కేంద్రాలు వృత్తిపరమైన శిక్షణ కోర్సులు అందిస్తున్నాయి. ఇప్పుడు జోగిపేటతోపాటు, దుబ్బాకలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దుబ్బాకలో ఈ కేంద్రం నిర్వహించేందుకు ఓ నాయకుడు ఉచితంగా భవనం ఇస్తానని ముందుకొచ్చారు. అలాగే జోగిపేటలోనూ ఈ కేంద్రాన్ని కొన్ని నెలల్లోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సెట్విన్ ఎండీ వేణుగోపాల్ పేర్కొన్నారు. వేర్‌హౌస్, కాస్మెటాలజీ కోర్సులు.. మైనార్టీల కోసం ప్రత్యేకంగా వేర్‌హౌజ్, కాస్మెటాలజీ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. పీఎంకేవీవై (ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన) పథకం కింద ఈ ఆరు నెలల కోర్సును జహీరాబాద్ కేంద్రంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బుధవారం నుంచి దరఖాస్తులు తీసుకున్నట్లు అడ్మినిస్ట్రేషన్ హెడ్ భరత్ తెలిపారు. వృత్తి నైపుణ్య శిక్షణలు.. ఆధునిక కోర్సులుసెట్విన్ ప్రధానంగా వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ కోర్సులు అందిస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగ్గట్టుగా కొన్ని ఆధునిక కోర్సులను కూడా నిర్వహిస్తోంది. జహీరాబాద్ సెంటర్లో ప్రస్తుతం సీసీటీవీ ఇన్స్టాలేషన్, మొబైల్, ఏసీ, ఫ్రిడ్జ్ రిపేర్ కోర్సులతోపాటు, ప్రీప్రైమరీ టీచర్ ట్రైనింగ్కోర్సులు, కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 580 మంది ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. జోగిపేట, దుబ్బాకల్లో ఏర్పాటు చేయనున్న శిక్షణ కేంద్రాల్లో స్థానికంగా డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ కోర్సులు పూర్తి చేసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లు విదేశాల్లో సైతం అనుమతి ఉంటుంది. దీంతో చాలామంది యువత ఈ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ కోర్సులు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు పొందిన వారు ఇతర దేశాల్లో ఈ వృత్తుల్లో స్థిరపడుతున్నారు. ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఈ వృత్తులకు మంచి డిమాండ్ ఉంది. -
ఉత్సాహంగా యువజనోత్సవం
లంబాడి వేషధారణలో సెల్ఫీ తీసుకుంటున్న విద్యార్థినులు●అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ●ప్రతిభకు పదును పెట్టండి: సీపీ పిలుపుసిద్దిపేటజోన్: చిన్నారుల విచిత్ర వేష ధారణలు.. లంబాడీ, కోయ, జానపద నృత్యాలతో యువజనోత్సవాలు కనులపండువగా సాగాయి. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక విపంచి ఆడిటోరియంలో యువజనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సాహిత్య, కళారంగాల్లో యువత రాణించాలని సూచించారు. ప్రతిభకు మరింత పదును పెట్టాలన్నారు. కళారంగంలో ప్రతిభ చూపిన వారికి చిరస్థాయిగా గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని, జిల్లాకు గుర్తింపు తేవాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య. యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సైన్స్ సంబురాలు
● ఒకేచోట ఇన్స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన ● ఏర్పాట్లు పూర్తి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి ఇన్స్పెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్ల ప్రదర్శన నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన చైర్మన్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 187 ఇన్స్పైర్, 236 సైన్స్ ఎగ్జిబిట్లను, 5 ఉపాధ్యాయ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా మన జిల్లాలోనే 187 ఇన్స్పైర్ ఎగ్జిబిట్లను ప్రదర్శించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు ప్రదర్శనలు ● సైన్స్ ఎగ్జిబిట్లను బుధ, గురు, శుక్రవారాల్లో ప్రదర్శించనున్నారు. ● ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రదర్శన కొనసాగనుంది. ● జిల్లా స్థాయిలో రాణించిన ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక అవుతాయి. ● ప్రతి పాఠశాల నుంచి కనిష్టంగా ఒకటి, గరిష్టంగా రెండు ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. ● ప్రతి రోజు దాదాపుగా 1000 మంది విద్యార్థులు తిలకించనున్నారు. ● ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శనకు గాను 13 కమిటీలను నియమించారు. ● ఈ కమిటీలు ఈ ఎగ్జిబిట్ల ప్రదర్శన పూర్తయ్యే వరకు సమన్వయంతో పనిచేసి, సైన్స్ ఎగ్జిబిషన్‌ను విజయవంతం చేయనున్నాయి. 13 కమిటీలతో సమన్వయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం నుంచి శుక్రవారం వరకు సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. అందుకు గాను 13 కమిటీలతో సమన్వయం చేస్తున్నాం. కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో ఈ ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిట్ల ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. – కల్లెపల్లి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు: కలెక్టర్ హైమావతి గజ్వేల్: మండల పరిధిలోని ఆహ్మదీపూర్ పీహెచ్సీలో విధులకు సకాలంలో హాజరుకాని వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది ఒక రోజు వేతనాన్ని కట్ చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. మంగళవారం ఉదయం 9.34గంటల ప్రాంతంలో పీహెచ్‌సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంలో హెచ్ఈఓ సత్యనారాయణరెడ్డి, ఆయామ్మ తప్పా ఎవరూ విధుల్లోకి రాలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది ఒక రోజు వేతనం కట్ చేయాలని ఆక్కడి నుంచే ఫోన్లో డీఎంహెచ్ఓకు ఆదేశాలిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేదీలేదని హెచ్చరించారు. కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగిరం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలిసి బండగుట్టపై నిర్మాణం చేపడుతున్న వసతిగదులు, క్యూ కాంప్లెక్స్, కల్యాణ వేదికలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 14న స్వామివారి కల్యాణం, జనవరి 18 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమతున్నందునా భక్తులకు ఇబ్బందులు తలెత్తవద్దన్నారు. ఆర్ఆండ్ బీ, పంచాయతీరాజ్, దేవాదాయ, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్ శాఖల సహకారం తీసుకోవలన్నారు. 14 నుంచి శీఘ్రదర్శనం నిలిపివేత మల్లికార్జున స్వామి ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని వచ్చే నెల 14నుంచి మార్చి 16తేదీ వరకు నిలిపివేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, త్వరగా స్వామివారిని దర్శించుకునేందకే శీఘ్రదర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
జ్వాలా తోరణం.. తరించిన భక్తజనం
నాచగిరిలో వినూత్న కార్యక్రమంవర్గల్(గజ్వేల్): ప్రసిద్ధ నాచగిరి క్షేత్రం వినూత్న కార్యక్రమాలతో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ప్రతి నెలా గిరిప్రదక్షిణతో స్వాతి నక్షత్ర మహోత్సవానికి ప్రాధాన్యత చేకూర్చిన ఆలయవర్గాలు, తాజాగా కార్తీకమాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి వినూత్నమైన ‘జ్వాలాతోరణం’ కార్యక్రమం చేపట్టారు. పల్లకీపై సభామండపం వద్దకు వేంచేసిన లక్ష్మీనృసింహస్వామివారు అక్కడ భగభగ జ్వలిస్తున్న ‘జ్వాలా’తోరణాన్ని భక్తుల గోవింద, శివనామస్మరణల మధ్య పరిక్రమణ(దాటడం) చేశారు. తరువాత భక్తులు స్వామివారి అనుగ్రహం పొందారు. కార్తీకమాసంలో ఆలయాల వద్ద జ్వాలాతోరణం ఎంతో శుభకరమని, విశిష్టమని ఆలయ వేదపండితులు పేర్కొంటున్నారు. -
డ్రగ్స్‌ను తరిమేద్దాం.. ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దాం
హుస్నాబాద్: డ్రగ్స్‌ను తరిమికొట్టి ఆరోగ్యకర సమాజాన్ని నిర్మిద్దామంటూ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ దేశ, సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. -
బాల రచయితకు అరుదైన అవకాశం
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని అనంతసాగర్ ఉన్నత పాఠశాల విద్యార్థి విశ్వతేజ (7వ తరగతి)కు అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 23న హైదరాబాద్‌లో నిర్వహించే బాల రచయితల సభలో సృజనానుభవాలు అనే అంశంపై ప్రసంగించే అవకాశం విశ్వతేజకు లభించింది. విశ్వతేజం అనే కథల పుస్తకం రాయడం వల్ల విద్యార్థికి ప్రసంగించే అవకాశం లభించింది. విశ్వతేజను హెచ్ఎం జ్యోతి, ఉపాధ్యాయులు, సాహితీ వేత్తలు అభినందించారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గజ్వేల్‌లోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో బోధించుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ పేర్కొన్నారు. పీజీటీ ఫిజిక్స్ (1), జూనియర్ లెక్చరర్ గణితం (1) ఖాళీలు ఉన్నాయన్నారు. అర్హత కల్గిన మహిళలు ఈ నెల 24 సాయంత్రం 5గంటల లోపు గురుకుల పాఠశాలలో దరఖాస్తులు అందించాలన్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు క్విజ్, సుడోకు పోటీలను మంగళవారం నిర్వహించారు. పోటీలను జిల్లా ఆర్టీఏ మెంబర్ డాక్టర్ సూర్యవర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యవర్మ మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తూ, పోటీలలో నిలిచి విజేతలు కావాలన్నారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గంథ్రపాలకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి దుబ్బాకటౌన్: రైతులకు నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి అన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులను మాత్రమే ఫర్టిలైజర్ దుకాణ యజమానులు విక్రయించాలన్నారు. మంగళవారం రాయపోల్ మండలం చిన్నమాసాన్ పల్లి రైతు వేదికలో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫర్టిలైజర్ దుకాణాలు, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలలో రైతులు విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రశీదు ఇవ్వాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరేష్, ఏఈఓలు ప్రవీణ్, ప్రియాంక, ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు తదితరులున్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఉపాధ్యాయులందరూ ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలన్న నిబంధనను పూర్తిగా తొలగించాలన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు టెట్ రాసి ఉత్తీర్ణత కావడం అంటే ఇబ్బందికరమన్నారు. టెట్ పై చట్టసవరణ చేయాలని కోరుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులగం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షం గౌడ్లు కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిని, ఇతర మంత్రులను కలుస్తున్నట్లు తెలిపారు. -
మళ్లీ స్థానిక సందడి
● ప్రభుత్వ నిర్ణయంతో డిసెంబర్లో ఎన్నికలు ● ఆశావహుల్లో రిజర్వేషన్ల ఉత్కంఠ ● పల్లెల్లో నాయకుల హడావుడి పల్లెల్లో ఎన్నికల సందడి మళ్లీ మొదలైంది. సుప్రీం, హైకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లు 50శాతానికి మించకుండా పంచాయతీ ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహిస్తామని మంత్రివర్గం తీర్మానించింది. గతంలోనే మూడు దశలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా యంత్రాంగం సైతం ఎన్నికల ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. పల్లెల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. – సాక్షి, సిద్దిపేట స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ప్రకటించగా హైకోర్టు స్టే విధించింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్‌లు పడ్డాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో పల్లెల్లో రిజర్వేషన్ల ఉత్కంఠ మొదలైంది. గత ప్రభుత్వం 2018లో గ్రామ పంచాయతీ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం జీపీల రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. పాతవే కొనసాగిస్తారా? కొత్తగా ప్రకటిస్తారా? అని.. సర్పంచ్ గిరి ఏ రిజర్వేషన్ అవుతుందో అని ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. వారు పోటీ చేసే స్థానానికి ఏ రిజర్వేషన్ వస్తుందోనని లెక్కలు వేసుకుంటున్నారు. రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు కేటాయిస్తే కొత్తగా ఏ స్థానం ఎవరికి రిజర్వేషన్ అవుతుందోననే చర్చ కొనసాగుతోంది. ఇక బీసీలకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్లు అమలయితే మారే రిజర్వేషన్ల పైనా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల్లో 50శాతం స్థానాలు కేటాయిస్తారు. అందుకే మహిళా స్థానాలు ఆయా పదవులకు రిజర్వ్ అయితే నాయకులు వారి సతీమణులు, తల్లులను కూడా బరిలోకి దించేందుకు సమాయత్తమవుతున్నారు. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలపై నాయకులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం తిరిగి కసరత్తు చేస్తుండటంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామంలో పలువురు ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి అవసరమైన పనులన్నీ చేసి పెడతామని హామీలు గుప్పిస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. -
ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు కొత్త రూపు
గజ్వేల్: ‘సాక్షి’ ప్రయత్నం ఫలించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిర్మించిన గజ్వేల్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ ఆదాయం పెంచుకునే ప్రతిపాదనల వ్యవహారంలో జాప్యాన్ని నివారించడానికి ‘సాక్షి’ పలు సందర్భరాల్లో కథనాలు ప్రచురించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో మడిగెల నిర్మాణానికి ఇటీవల ప్రభుత్వం రూ.3కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ శంకుస్థాపన చేయనున్నారు. అరకొర ఆదాయంతో.. ఆధునిక వసతులతో రూ. 22.87కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ మార్కెట్ 2019 డిసెంబర్ లో అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ మార్కెట్‌కు వస్తున్న ఆదాయానికి, నిర్వహణకు పొంతన లేకుండా మారింది. ఇందులో ఉన్న 242 కూరగాయలు, పూలు, మాంసం స్టాళ్ల ద్వారా రూ.2.42 లక్షల ఆదాయం సమకూరాల్సి ఉండగా, ప్రస్తుతం 120కిపైగా మాత్రమే స్టాళ్లు నడుస్తున్నాయి. వీటి ద్వారా కేవలం రూ.లక్షకుపైగా ఆదాయం వస్తోంది. ఇకపోతే 16 దుకాణాలు (షాపింగ్ కాంప్లెక్స్)లకు 1.20లక్షల ఆదాయం సమకూరుతోంది. సూపర్ మార్కెట్ ద్వారా రూ.86వేల ఆదాయం, మొత్తంగా రూ.3లక్షల పైచిలుకు ఆదాయం మాత్రమే వస్తున్నది. నిజానికి ఈ వనరుల ద్వారా నెలకు రూ.6.50 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. మార్కెట్ నిర్వహణ ఖర్చులు, అద్దెలు సక్రమంగా వసూలు కాక ప్రతి నెల రూ.1.60లక్షల వరకు ఇతర నిధుల నుంచి పూడ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. నిజానికి నెలకు రూ.6.50లక్షల ఆదాయం సక్రమంగా వస్తే నిర్వహణ ఖర్చులుపోనూ కనీసం నెలకు రూ.2 లక్షల పైచిలుకు ఆదాయం సమకూరేది. కానీ నెలవారీగా నిర్వహణ ఖర్చులపేరిట రూ.1.60లక్షలకుపైగా భారం పడుతూ ఏడాదికి వచ్చే సరికి రూ.20లక్షల భారం మోయాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఈ ముందుభాగం (మార్కెట్ రోడ్డు), టీవైఆర్ కాంప్లెక్స్ రోడ్డు కమర్షియల్ మడిగెలను నిర్మించుకునే అవకాశం ఉందని ‘సాక్షి’ పలు సందర్భాల్లో లేవనెత్తింది. సాక్షి కథనాల ఆధారంగా.. ‘సాక్షి’ కథనాల ఆధారంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.1.68కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఆమోదం లభించలేదు. తిరిగి గతేడాది నవంబర్ 21న ‘దేశంలోనే తలమాణికం...అయినా నిర్లక్ష్యం’ శీర్షికన మరో కథనాన్ని ప్రచురించింది. ఈ క్రమంలో ఇటీవల ఇంటిగ్రేటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.3కోట్లను ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులతో 26 మడిగెలను నిర్మించనున్నారు. ఈ పనులను మంగళవారం జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ ప్రారంభించనున్నారు. ఈ ఏర్పాట్లను సోమవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఆదాయం పెంచుకునే దిశగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.3కోట్ల పనులకు నేడు మంత్రి వివేక్ శంకుస్థాపన ఫలించిన ‘సాక్షి’ ప్రయత్నం -
శివోహం.. దీప శోభితం
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం కార్తీక సహస్ర దీపారాధనలు, వ్రతాలు, కల్యాణాలతో శోభిల్లుతోంది. కార్తీకమాసం ఆఖరి సోమవారం కావడంతో క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. భక్తజనుల హరిద్ర నదిలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు శివకేశవులను స్మరించుకుంటూ భక్తిశ్రద్ధలతో సత్యదేవుని వ్రతమాచరించారు. వ్రతం, శ్రీవారి కల్యాణ మొక్కులు తీర్చుకున్నారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని తరించారు. మరోవైపు సత్యనారాయణస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా శ్రీరమాసత్యనారాయణుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నాచగిరి ప్రాంగణంలో రాత్రి సామూహిక కార్తీక దీపోత్సవం కనువిందు చేసింది. భక్తులు లింగాకృతిలో దీపాలు వెలిగించి తరించారు. దౌల్తాబాద్(దుబ్బాక): డీసీసీబీలో స్వర్ణ డిపాజిట్ పథకంతో అనేక లాభాలు ఉన్నాయని బ్రాంచ్ మేనేజరు ఎల్లయ్య అన్నారు. సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని దొమ్మాటలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారులు, ప్రజలు స్వర్ణనిధి డిపాజిట్ పథకం సద్వినియోగం చేసుకొని తద్వార అధిక వడ్డీ పొందాలన్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచుకోవాలని, వ్యక్తి గత బ్యాంకు సంబంధించిన వివరాలు తెలియని వ్యక్తులతో పంచుకోకూడదన్నారు. కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువు మన ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి విద్యార్థులకు సూచించారు. 58వ గ్రంథాలయ వారోత్సవాలు పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గ్రంథాలయంలో సోమవారం ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియెట్ స్థాయి విద్యార్థులకు విడివిడిగా వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేడం లింగమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. గ్రంథాలయాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రవీందర్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల వల్ల లాభాలతో పాటు అనేక నష్టాలు ఉన్నాయని అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కార్యక్రమంలో మహేందర్, రచయిత ముక్కెర సంపత్ కుమార్, గంథ్రపాలకులు రాజు, దాసరి రాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక: సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 21న దుబ్బాకలో జిల్లాస్థాయి ఏక్తా మార్చ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన శాఖ అధికారి రంజిత్‌రెడ్డి తెలిపారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో పాఠశాలల, కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావాలన్నారు. ముఖ్య అథితిగా ఎంపీ రఘునందన్‌రావు హాజరవుతున్నారన్నారు. -
ఇక పక్కా
భూ హద్దుల లెక్క..● 13,251 సర్వేనంబర్లు, 46,363 ఎకరాలు.. ● లైసెన్స్డ్ సర్వేయర్లతో సర్వే చేయించేందుకు సన్నాహాలు ● పరిష్కారం కానున్న భూ సమస్యలు భూ సమస్యలకు ఇక శాశ్వత పరిష్కారం లభించనుంది. ‘భూ భారతి’ కింద భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించి లెక్క తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు ఆధార్ కార్డు మాదిరిగానే భూములకు భూధార్ కార్డులు ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేసి పంపించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా నుంచి 70 గ్రామాల జాబితాను పంపించారు. నూతనంగా నియమితులైన లైసెన్స్డ్ సర్వేయర్లతో త్వరలో భూముల సర్వే నిర్వహించి ప్రతి భూకమతానికి హద్దులు గుర్తించనున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లాలో అనేక గ్రామాల్లో సరిహద్దు వివాదాలున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సర్వేయర్ల కొరత ఉండేది. ఇటీవల జిల్లాల వారీగా సర్వేయర్లను కేటాయించడంతో ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసి భూధార్ కార్డులు జారీ చేయనున్నారు. జిల్లాలో 70 గ్రామాల్లో 13,251 సర్వేనంబర్లలో 46,363.30 ఎకరాల భూమిని సర్వే చేయనున్నారు. డీజీపీఎస్ (డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) ద్వారా సర్వే జరిపి ఆ వివరాలను భూ భారతి పోర్టల్‌లో అప్లోడ్ చేయనున్నారు. దశాబ్ధాలుగా ఉన్న భూ సమస్యలు సైతం పరిష్కారం కానున్నాయి. సర్వే చేసే గ్రామాలు ఇవే.. సీతారాంపల్లి, అన్కంపేట్ (సిద్దిపేట రూరల్), శివునిపల్లి, రామునిపట్ల(చిన్నకోడూరు), కూడవెల్లి, అల్మాస్పల్లి(అక్బర్పేట–భూంపలి), ఇమాంబాద్, నాంచారుపల్లి, బుర్గుపల్లి (సిద్దిపేట అర్బన్)లో సర్వే చేయనున్నారు. అలాగే శివరాంపూర్, ఆరెపల్లి, లచ్చపేట, చెర్వాపూర్(దుబ్బాక), చందంపల్లి, దీర్పయాంపల్లి, అప్పాయిపల్లి, కొనాపూర్ (దౌల్తాబాద్), నాగరాజుపల్లి, నర్మెట–మైసంపల్లి, వెంకటాపూర్(నంగునూరు), చందాపూర్, లింగపేట్(తొగుట), ఇబ్రహీంపూర్ (నారాయణరావుపేట), తపాస్‌పల్లి, రాంసాగర్, మర్రిముచ్చ్యాల (కొమురవెల్లి), పెద్దరాజపేట, అర్జునపట్ల(చేర్యాల)ను సర్వే చేసేందుకు గుర్తించారు. లింగుపల్లి, కొండాపూర్(మిరుదొడ్డి), లక్కపల్లి, నర్సాయిపల్లి, ధర్మారం(మద్దూరు), జాలపల్లి(ధూల్మిట్ట), చౌటపల్లి, పోతారం.జే(అక్కన్నపేట), వీరాపూర్, దేక్కపల్లె, పోతారం(బెజ్జంకి),నాగారం, మహ్మదాపూర్ (హుస్నాబాద్), రామచంద్రాపూర్, వెంకటాపూర్, ఎల్లయిగుడా(కుకునూరుపల్లి), యెల్కల్, ఆరెపల్లి ఎస్జే, లింగారెడ్డిపల్లి(రాయపోల్), వెంకటాపూర్(బీజీ), గోపాలపూర్, అనంతసాగర్(జగదేవ్‌పూర్)లో సర్వే చేయనున్నారు. గిరాయిపల్లి(కొండపాక), అంగడికిష్టాపూర్(మర్కూక్), తునికిమక్త, కొండాయిపల్లె, రామచంద్రాపూర్, సీతారంపల్లె, సింగాయిపల్లి, అంబర్పేట్(వర్గల్), హవాయిగుడా, ఆరెపల్లి, కోమటిబండ, దత్తర్పల్లె, మక్తమసాన్పల్లె(గజ్వేల్), ముస్తఫాగుడా, గంగాధరపల్లె, నర్సాపూర్, సింగన్న గుడా, దాసర్లపల్లె(ములుగు) గ్రామాలున్నాయి. ప్రస్తుతం రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణంతోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆన్లైన్లో ఉన్న సమచారం ఆధారంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో భూమి వివరాలు తెలియడం లేదు. లైసెన్స్డ్ సర్వేయర్లతో సర్వే చేయడం వలన పూర్తి సమాచారం ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఆ సమాచారం అక్కడ సర్వేయర్‌కు వెళ్తుంది. ఆ భూమిని సర్వే చేసి మ్యాప్‌ను సిద్ధం చేసి మండల సర్వేయర్‌కు అందజేస్తారు. దానిని పరిశీలించి ధ్రువీకరిస్తారు. అనంతరం ఆ నక్షా ఆధారంగా రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ తహసీల్దార్ పూర్తి చేయనున్నారు. -
సమస్యా?.. అయితే నేరుగా మాట్లాడండి
● ప్రతి శనివారం ఫోన్ ఇన్ ● పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ సిద్దిపేటకమాన్: ప్రజలు, పోలీసుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి వారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతి శనివారం ఉదయం 11గంటల నుంచి 12 గంటల వరకు ఫోన్లో తనతో నేరుగా మాట్లాడవచ్చని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తనకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ప్రతి ఫిర్యాదును గోప్యంగా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 8712667100, 8712667306, 87126 67371 నంబర్లకు ఫోన్ చేసి వివరించవచ్చని తెలిపారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేర రహిత సమాజం కోసం పౌరులందరూ సహకరించాలని కోరారు. -
అర్జీలు పెండింగ్‌లో ఉండొద్దు
● అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ ● ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు 160 సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరం పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారుల నుంచి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అర్జీలు స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. తిరిగి అర్జి పెట్టుకోకుండా సమస్య పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్, తదితర అర్జీలు మొత్తం 160 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోడ్లు నిర్మించండి కొమురవెల్లి మండల కేంద్రం నుంచి రాంనగర్ మీదుగా చేర్యాలకు వెళ్లే రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిందని వెంటనే నూతన రోడ్లు నిర్మించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయన్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించిన రోడ్లను నిర్మించి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కార్యదర్శి భరత్ కుమార్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు పాల్గొన్నారు. -
టెన్త్ విద్యార్థినులకు సైకిళ్లు అందజేత
బెజ్జంకి(సిద్దిపేట): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థినులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కానుకగా సైకిళ్లు అందజేశామని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాల్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలో వడ్లూరు బేగంపేట పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలకు రావడానికి విద్యార్థులు ఇబ్బందులు పడొద్దని సైకిళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాజు, హెచ్ఎం గోపికృష్ణ, చైర్మన్ రమ్య, నాయకులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి కీర్తి ఎల్లలు దాటాలి
● మల్లన్న కల్యాణం వైభవంగా జరగాలి ● అధికారులతో మంత్రి కొండా సురేఖ సమీక్ష సిద్దిపేటరూరల్: కొమురవెల్లి మల్లన్న కల్యాణం, జాతరను ఆధ్యాత్మిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వైభవోపేతంగా నిర్వహించాలని దేవాదాయ ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. సోమవారం అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత ఏడాది కంటే మరింత వైభవంగా నిర్వహించాలన్నారు. వచ్చే నెల 14 ఉదయం 10.45 గంటలకు మల్లికార్జున స్వామి వారి కల్యాణం, జనవరి 18 నుంచి 10 వారాలపాటు జాతరను నిర్వహించేందుకు నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ జాతర ఏర్పాట్లపై ఇదివరకే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఏర్పాట్లపై ఆయా శాఖల ద్వారా నిర్వహించాల్సిన విధులపై ప్రాథమికంగా సమీక్ష నిర్వహించామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు డీసీపీ కుషాల్కర్, ఆర్డీఓ సదానందం, హుస్నాబాద్ ఏసీపీ సదానందం, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌మూర్తి, డీపీఓ విజయ్ కుమార్, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రమౌళి, ఆర్అండ్బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, దేవాదాయ, తదితర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రయ్రయ్
నలు దిక్కులా హుస్నాబాద్‌కు నలు దిక్కులా నాలుగు లేన్ల రోడ్లతో ప్రయాణం ఇక సులభతరం కానుంది. కరీంనగర్, హనుమకొండ,సిద్దిపేట, జనగామ జిల్లాలు హుస్నాబాద్ నుంచి 40 నుంచి 45 కి.మీ. దూరంలో ఉంటాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి నుంచి హుస్నాబాద్ మీదుగా సిద్దిపేట వరకు జాతీయ రహదారి పనులు తుది దశకు చేరుకున్నాయి. అలాగే కరీంనగర్ రాజీవ్ రహదారి కొత్తపల్లి నుంచి హుస్నాబాద్‌కు రూ.88 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల రహదారి పనులు ప్రారంభమయ్యాయి. కొత్తగా మొదటి ఫేజ్‌లో హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు ఫోర్ లేన్ల నిర్మాణం కోసం రూ.58 కోట్లు మంజూరయ్యాయి. హుస్నాబాద్: ఏదైనా ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా అభివృద్ధి పరుగులు పెడుతుంది. గౌరవెల్లి ప్రాజెక్టు 95 శాతం పూర్తయింది. ఈ ప్రాజెక్టు ద్వారా భూగర్భజలాలు పెరిగి, చెరువుల నిండి వ్యవసాయ రంగం ఎంతో అభివృద్ధి చెందనుంది. అక్కన్నపేట మండలం చౌటపల్లిలో పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించేందుకు అధికారులు భూ సర్వే కూడా పూర్తి చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది మందికి ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ కళాశాలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే విద్యార్థులకు నాలుగు వరుసల రహదారితో రవాణా సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భూముల ధరలకు రెక్కలు.. వాణిజ్య, వ్యాపారులకు సరుకుల రవాణా అనువుగా ఉంటుంది. భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. జనగామ వరకు రహదారి పూర్తయితే యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు దూర భారం తగ్గుతుంది. అలాగే హుస్నాబాద్ ప్రాంతానికి గుండెకాయ లాంటి మహా సముద్రం గండి పర్యాటక కేంద్రంగా మారబోతుంది. మహా సముద్రం గండిని రూ.10 కోట్ల అంచనా వ్యయంతో టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నాలుగు వరుసల రోడ్లతో వాహనాల రాకపోకలతో హుస్నాబాద్‌లో వ్యాపారం జోరుగా సాగనుంది. పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, టూరిజం పరంగా ప్రగతి పథంలో హుస్నాబాద్ నిలువనుంది. వేగంగా ఫోర్ లేన్ల రహదారుల నిర్మాణం నాలుగు జిల్లాలకు సరిహద్దు కేంద్రంగా హుస్నాబాద్ కొత్తగా హుస్నాబాద్– అక్కన్నపేట కోసం రూ.58 కోట్లు మంజూరు -
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం
● లేబర్ కోడ్లను రద్దు చేయాల్సిందే ● సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు సిద్దిపేటఅర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వర్గ వ్యతిరేక విధానాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని ఓ గార్డెన్లో సీఐటీయూ జిల్లా నాల్గవ మహాసభ జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా తీసుకురావడంతో కార్మికుల్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేసిందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్ని కారు చౌకగా ప్రైవేటుకు అప్పగించడం వల్ల పెట్టుబడిదారి చేతుల్లో కార్మికులు బానిసలుగా మారేలా కేంద్ర ప్రభుత్వం చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీం వర్కర్లకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచకుండా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆశ, అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. షెడ్యూల్ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు వేతన ఒప్పందాలు చేసి వేతనాలు పెంచాల్సి ఉండగా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్ చంద్రారెడ్డి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి గోపాలస్వామి, భాస్కర్, సత్తిరెడ్డి, పద్మ, స్వామి, మదు, రవికుమార్, మహేష్, శోభ, కనకయ్య, బాలనర్సయ్య, తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు రత్న’కు దరఖాస్తు చేసుకోండి
సిద్దిపేటఅర్బన్: అభ్యుదయ రైతులకు అందజేసే రైతు రత్న అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సుస్థిర, సమీకృత, వినూత్న వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు, సేంద్రియ, వాతావరణ స్నేహపూర్వక వ్యవసాయానికి విశిష్టమైన సేవలు అందించిన రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. వచ్చిన దరఖాస్తులను రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం సభ్యులు పరిశీలించి ఉత్తమ రైతులను ఎంపిక చేస్తారన్నారు. పురస్కారాలను మహా కిసాన్ మేళా–2025 సందర్భంగా డిసెంబర్ 3, 4 తేదీలలో హైదరాబాద్‌లోని కన్హ శాంతి వనంలో ప్రదానం చేస్తారన్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తులను అందజేయాలని సూచించారు. సిద్దిపేటకమాన్: పుస్కారాలు ఇవ్వడం, బాలల కథా పోటీలను ప్రోత్సహించడం సాహిత్యాభివృద్ధికి ఎంతో ముఖ్యమని నరసింహారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో వాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో పెందోట పురస్కారాల ప్రధాన సభ, 2025 బాలల కథల పోటీల బహుమతి ప్రదానత్సోవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సాహిత్య కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. దీంతో పాటు నాలుగు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అశోక్, రాజు, పరశురాములు, రాజమౌళి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కొండపాక(గజ్వేల్): గ్రామీణ జీవితంలోని వాస్తవికతను, కష్ట జీవితాన్ని చరిత్రగా నిలిపేవి నవలలని ప్రజా రచయిత నాళేశ్వరం శంకరం అన్నారు. కొండపాక మండలం బందారం గ్రామంలో సిదారెడ్డి రచించిన నాగటి తరం నవలను ఆదివారం ఆవిష్కరించారు. మంజీరా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిష్కరణ సభకు సాహితీ వేత్తలు, కళాకారులు, రాజకీయ కార్యక్రర్తలు, యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శంకరం మాట్లాడుతూ గ్రామాన్ని అర్థం చేసుకుంటే యావత్ దేశాన్ని అర్థం చేసుకున్నట్లేనన్నారు. భాషా, పల్లె జీవన విధానంలోని వాస్తవికతను సిధారెడ్డి నవల ద్వారా స్పష్టమవుతుందన్నారు. సీపీఎం జిల్లా నాయకుడు నక్క యాదవరెడ్డి మాట్లాడుతూ దోపిడీ, అన్యాయం కొత్త రూపాల్లో వస్తున్న ఈ సమయంలో నాగటి తరం నవలలో కనిపించే పాత్రలు మన సమాజం నడిచే నీడలను వెలుగులోకి తెస్తాయన్నారు. ప్రజా గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాటలతో సభకు నూతన ఉత్సాహాన్ని తెచ్చారు. కార్యక్రమంలో రచయితలు దేవీశ్రీ ప్రసాద్,పాసింజర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం బెజ్జంకి(సిద్దిపేట): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అధిక స్థానాలు గెలుపొంది సత్తా చాటాలాని బీజేపీ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. బెజ్జంకిలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. 19న కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో నిర్వహించనన్న బూత్‌స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. కొలిపాక రాజు, బుర్ర మల్లేశంగౌడ్, రామచంద్రం, సంగ రవి, తూముల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చలి మంటలు
మిరుదొడ్డి(దుబ్బాక): మునుపెన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరిగిపోతోంది. ఒక్క భూంపల్లి మండలంలోనే 8.9 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి తీవ్రతను తెలియజేస్తోంది. ఉదయం పొగ మంచుతో జనాలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. సాయంత్రం 5 దాటిందంటే చాలు చలి తీవ్రతతో ఇండ్ల నుండి జనాలు బయటకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అస్తమా వ్యాధిగ్రస్తులు శ్వాస కోశ సంబంధమైన ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే మంకీ క్యాపులు, స్వెట్టర్లు ధరిస్తున్నారు. రాత్రి పూట చలిమంటలతో జనాలు ఉపశమనం పొందుతున్నారు. -
మల్లన్న క్షేత్రం.. భక్తజన సంద్రం
● స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ ● పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ మల్లనామస్మరణతో మారుమోగాయి. కలెక్టర్ హైమావతి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను, చిత్రపటాన్ని అందించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు పట్నా లు, అర్చన, ఒడిబియ్యం సమర్పించారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని బోనం చెల్లించారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఆలయఅధికారులు పర్యవేక్షించారు. -
చెత్త ఆదాయంపై చిత్తశుద్ధి ఏదీ?
● మున్సిపాలిటీల్లో సాగని వర్మీకంపోస్ట్ తయారీ ● అరకొర సిబ్బంది, సౌకర్యాల లేమి.. జిల్లాలోని మున్సిపాలిటీల్లో తడి చెత్త ద్వారా కంపోస్ట్ తయారీ ప్రక్రియ నామమాత్రంగా సాగుతోంది. దీని ద్వారా మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చే అవకాశమున్నా.. ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు. సిద్దిపేట మినహా మిగిలిన నాలుగు మున్సిపాలిటీల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. గజ్వేల్: జిల్లాలోని మున్సిపాలిటీల్లో ‘చెత్త’తో ఆదాయం వచ్చే మార్గాలపై చిత్తశుద్ధి కరువైంది. సిద్దిపేటలో ఈ ప్రక్రియ కొంతవరకు సాగుతుండగా, మిగతా మున్సిపాలిటీల్లో నామమాత్రంగానే మారింది. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉన్నాయి. జనాభా 80వేల పైచిలుకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. ఈ చెత్తను నల్లవాగు గడ్డ వద్ద నిర్మించిన డంపింగ్ యార్డుకు తరలిస్తారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను వేరు చేసే ప్రక్రియ కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. నామమాత్రంగానే.. డంపింగ్ యార్డులో తడి చెత్తను కంపోస్ట్‌గా మార్చడానికి 12 బెడ్లను నిర్మించారు. వీటిల్లో శాసీ్త్రయంగా కంపోస్ట్ ప్రక్రియను చేపట్టాల్సి ఉన్నా జరగడం లేదు. నామమాత్రంగా నెలకు కొంత కంపోస్ట్‌ను తయారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు. నిజానికి కంపోస్ట్ ద్వారా ఏటా మున్సిపాలిటీకి రూ.లక్షల్లో ఆదాయం వచ్చే అవకాశమున్నా... ఈ అంశంపై నిర్లక్ష్యం కొనసాగుతోంది. సిబ్బంది కొరతే కారణం.. గజ్వేల్– ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఆర్అండ్ఆర్ కాలనీతో కలుపుకొని ప్రస్తుతం 162మంది పారిశుద్ధ్యి సిబ్బంది ఉన్నారు. మరో 50మందికిపైగా సిబ్బంది అవసరం. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో అయిదు వాహనాలు అవసరమున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమీటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటం వల్ల ..ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తడి చెత్తతో కంపోస్ట్ తయారీ ప్రక్రియ సక్రమంగా సాగటం లేదని తెలుస్తోంది. మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ.. మిగిలిన మూడు మున్సిపాలిటీల్లో పరిస్థితిని పరిశీలిస్తే.. తడిచెత్తతో కంపోస్ట్ తయారీ దేవుడెరుగు.. కనీసం చెత్త సేకరణ శాసీ్త్రయంగా సాగడం లేదు. హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 36వేల జనాభా, 6800 ఇళ్లు ఉన్నాయి. రోజు దాదాపు 11మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో చెత్త తరలింపు సమస్యగానే పరిణమించింది. దుబ్బాకలో 30వేలజనాభా ఉండగా.. 7400 వేల ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ నిత్యం 4.5మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. చేర్యాల మున్సిపాలిటీలో చెత్త సేకరణ సక్రమంగా సాగక నివాస ప్రాంతాల పక్కను చెత్తను తగులబెట్టడం ఇబ్బందికరంగా మారుతోంది. మరింత సిబ్బంది కావాలి ప్రస్తుతం తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీ అనుకున్న స్థాయిలో సాగడం లేదు. దీనిని పెంచాలంటే మరింత సిబ్బంది కావాలి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – బాలకృష్ణ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ -
ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి
● ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం ● పాల్గొన్న మంత్రి పొన్నం దంపతులు హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో అమ లు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా అన్నిట్లో విజయాలు చేకూరాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. కార్తీక మాసం పురస్కరించుకొని ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం దంపతులు సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. రాష్ట్రంలో మంచి వర్షాలు, పాడి పంటలతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. -
రాజకీయాలు కావు.. సేవలు గొప్పవి
● వైద్య కళాశాలకు మదన్ మోహన్ పేరు ● ప్రభుత్వానికి లేఖ రాసి, కృషి చేస్తా ● మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: ‘రాజకీయాలు, వ్యక్తులు గొప్ప కాదు, నాయకులు చేసిన సేవ, కృషి గొప్పవి. మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ గొప్ప నాయకుడు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మదన్ మోహన్ 93వ జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక విక్టరీ టాకీస్ చౌరస్తా పార్కులో కుటుంబ సభ్యులతో కలిసి మదన్ మోహన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. తొలిదశ ఉద్యమానికి మొట్టమొదటి ఉప ఎన్నిక సిద్దిపేట అని, ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ కావాలని మదన్ మోహన్‌కు పట్టం కట్టారన్నారు. మలి దశ ఉద్యమంలో సిద్దిపేట కేసీఆర్‌కు పట్టం కట్టారని వివరించారు. సిద్దిపేట ప్రజలు చాలా గొప్ప వారని, తొలి, మలి ఉద్యమాల్లో రాష్ట్రం ఏర్పడాలని ఒక బలమైన ఆకాంక్షను వెలిబుచ్చి ఆశీర్వదించిన గడ్డ సిద్దిపేట అని అన్నారు. అప్పట్లో ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినా పదవులు కాదు, తెలంగాణ రాష్ట్రం కావాలని నిక్కచ్చిగా చెప్పిన నేత మదన్ మోహన్ అని తెలిపారు. మదన్ మోహన్ ప్రస్తుతం మన మధ్య లేకున్నా ఆయన చేసిన సేవలు సజీవమని కొనియాడారు. అప్పట్లోనే సిద్దిపేట ప్రాంతంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం ముంగిట్లోకి తెచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న మెడికల్ కళాశాలకు మదన్ మోహన్ పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తానన్నారు. సిద్దిపేట ప్రజల కోసం పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్‌లు మాట్లాడుతూ మదన్ మోహన్‌తో తమ కు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మదన్ మోహన్ బంధువులు సాధన, రవీంద్రనాథ్, అనుపమ, హరిందర్, ప్రశాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్స్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. -
మల్లన్న కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు
● కొమురవెల్లిలో భక్తులకు ఇబ్బందులు కలగవద్దు ● కలెక్టర్ హైమావతి ● అధికారులకు దిశానిర్దేశంసిద్దిపేటరూరల్: భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కల్యాణం, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల 14న ఉదయం 10.45 నిమిషాలకు స్వామి వారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జాతరకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, పార్కింగ్, బారీకెడ్లు, పోలీస్ కంట్రోల్ రూం, లడ్డూ కౌంటర్, భక్తుల క్యూలైన్, అన్నదానం వంటివి చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, అదనపు డీసీపీ కుశాల్కర్, ఏసీబీ సదానందం, ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. చెత్త వాహనాలకు మెడికల్ వ్యర్థాలు ఇవ్వొద్దుసిద్దిపేటరూరల్: చెత్త వాహనాలకు మెడికల్ వ్యర్థాలను ఇచ్చే ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో వైద్యఆరోగ్య, పబ్లిక్ హెల్త్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వెటర్నరి, మున్సిపల్ కమిషనర్లకు కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు.. బయోమెడికల్ వ్యర్థాలను ధర్మా అండ్ కంపెనీ ద్వారా తరలించాలన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లు కేవలం ప్రాథమిక వైద్య సేవలను అందించడం వరకే పరిమితం చేయాలన్నారు. -
ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించాలి
బెజ్జంకి(సిద్దిపేట): ఇంటర్మీడియట్లో మెరుగైన ఫలితాలు సాధించాలని డీఐఈఓ రవీందర్‌రెడ్డి సూచించారు. బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో మాట్లాడుతూ పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. హాజరు శాతాన్ని మరింత పెంచాలన్నారు. ల్యాబ్ పరీక్షల కోసం విద్యార్థులకు వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవస్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఆకస్మిక తనిఖీ చిన్నకోడూరు(సిద్దిపేట): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి రవీందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. కళాశాలకు సంబంధించిన అడ్మిషన్ రిజిస్టర్‌ను, విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను, యూనిట్ టెస్టులకు సంబంధించిన మార్కులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమై 90 రోజుల ప్రణాళిక, బిల్డింగ్ మరమ్మతుల పనులను, స్పోర్ట్స్ మెటీరియల్, వార్షిక పరీక్షలకు సంబంధించిన సూచనలు చేశారు. ఆరోగ్యానికి నడక తప్పనిసరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సిద్దిపేటకమాన్: ప్రతి ఒక్కరూ రోజూ యోగా, వాకింగ్ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టు భవనంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బందికి హెల్త్ క్యాంపులో బీపీ, షుగర్, ఇతర రక్త పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు సెషన్స్ జడ్జి జయప్రసాద్, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాధన, అదనపు జూనియర్ సివిల్ జడ్జి తరణి, అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, డీఎంహెచ్ఓ ధనరాజ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు దాటాలంటే భయమేస్తోంది..
● ప్రాణాలను బిగపట్టి.. దాటిస్తున్నాం ● సీపీకి ఉపాధ్యాయుడు శ్రీనివాస్ ఫోన్‌కాల్ ● హుటాహుటినా చేరుకున్న విజయ్‌కుమార్ ● నియంత్రణ చర్యలపై ఆదేశాలుగజ్వేల్: ‘సార్.. రోడ్డు దాటాలంటే భయమేస్తోంది. ప్రాణాలను బిగపట్టి పిల్లలను దాటిస్తున్నాం, ప్లీజ్... ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి..’ అంటూ ఓ ఉపాధ్యాయుడు చేసిన ఫోన్ కాల్.. సీపీ విజయ్‌కుమార్‌ను కదలించింది. హుటాహుటినా ఆ ప్రదేశానికి చేరుకునేలా చేసింది. ఈ సంఘటన శనివారం గజ్వేల్ మండలం కొడకండ్లలో చోటుచేసుకుంది. గ్రామంలోని రాజీవ్‌రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇదే క్రమంలో రోజూ బడి పూర్తి కాగానే రోడ్డు దాటించే సందర్భంలో వాహనాల వేగం, మలుపుల వద్ద నియంత్రణ పాటించకపోవడంతో ఏర్పడుతున్న ఇబ్బందులపై గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు మదనాల శ్రీనివాస్ మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంతో సీపీ విజయ్‌కుమార్ కాల్ చేసి తెలిపారు. ఇదే సమయంలో వంటిమామిడి వద్ద రోడ్డు ప్రమాదాల నియంత్రణపై సీపీ పరిశీలన జరుపుతున్నారు. ఉపాధ్యాయుడు ఫోన్‌కాల్‌తో హుటాహుటినా ఏసీపీ నర్సింహులు, ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్తోపాటు ట్రాఫిక్ సీఐ మురళి, రాజీవ్‌రహదారి నిర్మాణ పనుల సంస్థ హెచ్‌కేఆర్ ప్రతినిధులను వెంటబెట్టుకొని కొడకండ్లకు చేరుకున్నారు. తనకు కాల్ చేసిన ఉపాధ్యాయుడిని పిలిపించి రోడ్డు ప్రమాదాల ప్రదేశాలను పరిశీలించారు. సీపీ స్పందిస్తూ.. ప్రమాదాల నివారణకు స్టడ్స్ లేదా స్పీడ్ బ్రేకర్స్ ఇతర అంశాలను పరిశీలించి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ రహదారిపై ప్రమాదాల నివారణకు డివైడర్ల మధ్యలో చెట్ల పొదల తొలగింపు, స్పీడ్ బ్రేకర్స్ ఇతర చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. -
మత్స్యకారులకు స్వర్ణయుగమే..
హుస్నాబాద్: రాష్ట్రంలో మత్స్యకారులకు స్వర్ణయగం తీసుకువస్తామని, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువులో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి 3 లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. అంతకు ముందు శిఽథిలావస్థకు చేరిన వెటర్నరీ ఆస్పత్రి, అసంపూర్తిగా ఉన్న వెజ్, నాన్ వెజ్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 165 చెరువులకు గాను 38.32 లక్షల ఉచిత చేప పిల్లలను విడుదల చేయనున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ పశువైద్య శాల ఆధునీకరణ. చేపల మార్కెట్, స్టోరెజ్ సెంటర్, పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల మెనూలోనూ చేపల కూర ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిల్లలకు కంటి చూపు, గుండె జబ్బులు రాకుండా చేపల పొడిని అందజేస్తామని తెలిపారు. నాలుగు లేన్ల రహదారికి రూ.58 కోట్లు హుస్నాబాద్ నుంచి అక్కన్నపేట వరకు నాలుగు లేన్ల రహదారి కోసం రూ.58 కోట్లు మంజూరైనట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న కొనుగొళ్లు, ఆర్టీసీ బస్టాండ్‌లో వరద నీరు రాకుండా తీసుకోవాల్సిన చర్యల పై ఆర్టీసీ అధికారులు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్లు ఉన్నారు. -
పత్తి రైతు పరేషాన్
రేపటి నుంచి కొనుగోళ్లు బంద్● సీసీఐ నిబంధనలకు నిరసనగా వ్యాపారుల నిర్ణయం ● తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్‌కు విక్రయిస్తున్న రైతులు ● అందినకాడికి దోచుకుంటున్న దళారులు ● అధికారుల పర్యవేక్షణ కరువుకొండపాకలోని ఓ మిల్లు వేబ్రిడ్జిలో కాంటా పెడుతున్న పత్తి వాహనం ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని ఈ నెల17 నుంచి కొనుగోళ్లు బంద్ చేస్తామని వ్యాపారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో డబ్బులు అత్యవసరం ఉన్న రైతులు చేసేదిలేక ప్రైవేటును ఆశ్రయిస్తున్నారు. దీంతో దళారులు దోపిడీకి తెరతీస్తున్నారు. క్వింటాలు పత్తికి రూ.6,100 నుంచి రూ.6,600లకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ చెల్లించే దానికంటే ఒక్కో క్వింటాలుకు రూ.1,500 నుంచి రూ.2వేల వరకు రైతులు నష్టపోతున్నారు. – సాక్షి, సిద్దిపేట: సీసీఐ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఇప్పటి వరకు 17 మిల్లుల్లోనే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. 8శాతం తేమ ఉండి గింజ పొడవును మేరకు రూ.8,010 నుంచి రూ.8,110 వరకు, 9 శాతం తేమ ఉంటే రూ.7,979 నుంచి రూ.8,028, 10 నుంచి 12శాతం వరకు తేమ ఉంటే రూ.7,689 నుంచి 7,947 వరకు సీసీఐ కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు సీసీఐ వారు 4,822 మంది రైతుల నుంచి 5,438 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేశారు. సీసీఐ కొనుగోళ్లను బంద్ చేస్తామని జిన్నింగ్ మిల్లుల యజమానులు ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తెంపిన పత్తి ఇంట్లో నిల్వపెట్టడం ఇబ్బంది అని, మరోవైపు ప్రైవేట్ వారు ధరను ఇంకా తగ్గిస్తారని భావించి వచ్చిన కాడికి అమ్మేస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ వ్యాపారులు దోపిడీకి పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రైవేట్ వ్యాపారులు 5,066 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయడం గమనార్హం. ఇప్పటికే అకాల వర్షాలు, అనుకూలించని వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి పత్తి దిగుబడులు ఆశించినంతగా రావడం లేదు. పెట్టిన పెట్టుబడులు రాలేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జిన్నింగ్ మిల్లుల యజమానుల దోపిడీకి అడ్డు లేకుండా పోతుందని రైతులు ఆరోపిస్తున్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు పత్తి కొనుగోళ్లు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని పలువురు రైతన్నలు కోరుతున్నారు.రోజంతా ఆరబెట్టినా.. రోజంతా ఎండలో ఆరబెట్టి సీసీఐ కేంద్రానికి తీసుకవచ్చి లైన్లో ఉంచితే.. రాత్రి, ఉదయం వేళల్లో కురుస్తున్న మంచుతో పత్తిలో తేమ శాతం పెరుగుతోంది. దీంతో సీసీఐ నిర్ణయించిన తేమ శాతం రాకపోవడంతో ఆ పత్తిని రిజక్ట్ చేస్తున్నారు. దీంతో వెంటనే ప్రైవేట్ వ్యాపారి ఆ పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ అదే పత్తిని మధ్యాహ్నం తర్వాత అదే సీసీఐ కేంద్రంలో లోడ్ పెడుతున్నారని ఈ నెల 14న జరిగిన దిశ సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు చెప్పిన మాటలు ఇవి. ఇలా రైతులను దోపిడీకి గురి చేస్తున్నారంటూ తనకు ఫోన్లు వస్తున్నాయని ఆరోపించారు. -
నాణ్యమైన విత్తనాలతో మంచి దిగుబడి
కొల్చారం(నర్సాపూర్): నాణ్యమైన విత్తనంతో పంటలు సంవృద్ధిగా పండించి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆదిశగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేసిందని జిల్లా నోడల్ అధికారి, శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ అన్నారు. శుక్రవారం మండలంలోని కిష్టా పూర్లో ఎంటీయూ 1010 రకం వరిని పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన విత్తనాలను రైతులు తమ పొలాల్లో పండించి, ఇతర రైతులకు చేరవేసేలా చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశం అన్నారు. ఇది విత్తన లభ్యతను పెంచడమే కాకుండా, నాణ్యమైన విత్తనంపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఓ శ్వేతకుమారి, వ్యవసాయ విస్తరణ అధికారులు అంబిక, నిరోషా తదితరులు పాల్గొన్నారు.శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ -
మల్లన్న చెంత.. వసతుల చింత
●కొమురవెల్లిలో భక్తులకు తప్పని తిప్పలు ●సౌకర్యాల కల్పనలో విఫలం ●బ్రహ్మోత్సవాలపై నేడు సమీక్ష పూర్తికాని 50 గదుల నిర్మాణం బండ గుట్టపై నిర్మిస్తున్న 50 గదుల పనులు, క్యూ కాంప్లెక్స్, ఎల్లమ్మ గుట్టపై నిర్మిస్తున్న త్రిశూలం ఢమరుకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికి తోడు ఆలయంలో ఆర్జీత సేవలు, బుకింగ్ కార్యకలాపాలు, ఆన్లైన్ సేవలు, మాస్టర్ ప్లాన్, ఆలయ భూముల ఫెన్సింగ్, ఉప ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠ ప్రకటనలకే పరిమితం అయింది.కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న చెంత భక్తులకు వసతులు కరువయ్యాయి. వచ్చేనెల 14న స్వామి వారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నా యి. ఉత్సవాల నిర్వహణకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుగానే సమీక్ష నిర్వహించి వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేస్తామని చెబుతున్నా, కార్యరూపం దాల్చడం లేదు. శనివారం బ్రహ్మోత్సవాలపై కలెక్టరేట్లో సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈసారైనా అమలుకు నోచుకుంటాయా..? లేదా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 200 మందికే అన్నదానం సాధారణ రోజుల్లో 100, జాతర సమయంలో 500 మందికి అన్నదానం చేస్తామని నాలుగేళ్ల క్రితం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించినప్పటికీ, అమలుకు నోచుకోలేదు. ఈవిషయాన్ని కమిషనర్‌కు పంపిస్తే ప్రతి ఆదివారం 200 మందికి అన్నదానం చేసేందుకు అనుమతి ఇచ్చా రు. కానీ 500 మందికి పెంచాలని భక్తులు కోరుతున్నారు. గతేడాది నిర్వహించిన సమీక్షలో స్వామి వారికి భక్తులు సమర్పించే పూలతో అగరబత్తీలను తయారు చేయాలని, భక్తులకు నీడ కోసం షామియానాల ఏర్పాటు, క్యూలైన్లలో తాగు నీటి వసతి కల్పించాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆలయ అధికారులను ఆదేశించినా వారు పట్టించుకోలేదు. కలగానే అమ్మవార్ల కిరీటాలు మల్లన్నకు భక్తులు సమర్పించిన 8 కిలోల బంగారం ఉన్నప్పటికీ, స్వామివారికి కిలోన్నర పరిమాణంలో బంగారు కిరీటం చేయించారు. అమ్మవార్లకు సైతం కిరీటాలు చేయిస్తామని గత సమీక్ష సమావేశంలో తెలిపినా, కలగానే మిగిపోయింది. మల్లన్న దర్శనం కోసం వచ్చే భక్తులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నుంచి కొమురవెల్లి చేరుకుంటున్న క్రమంలో పోలీసులు ఆయా మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలు చొచ్చుకు రాకుండా కిలోమీటర్ దూరంలో నిలిపివేస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన సామగ్రి వెంట తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే కొమురవెల్లి రావడానికి మూడు ప్రధాన దారులుండగా, అందులో తిమ్మారెడ్డిపల్లి, గుర్జకుంట కమాన్ల నుంచి కొమురవెల్లికి వచ్చే రోడ్లు గుంతలమయంగా మారాయి. అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఇబ్బంది కలుగకుండా మరమత్ములు చేయించాలి. -
కదలని కాళేశ్వరం కాల్వలు
● బీళ్లుగా మారిన లక్ష ఎకరాలు ● తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మెదక్‌జోన్/పాపన్నపేట/నర్సాపూర్ రూరల్/నర్సాపూర్/కౌడిపల్లి/కొల్చారం: కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల నిర్మాణాలు అర్ధాంతరంగా ఆగిపోవటంతో లక్షన్నర ఎకరాలకు నీరందకుండా పోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం జిల్లాలోని పలు మండలాల్లో విస్తృతంగా పర్యటించిన ఆమె రాత్రి మెదక్ చర్చిలో ప్రార్థనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు లేవని, నిజాం పాలనలో నిర్మించిన ఘనపూర్ ఆనకట్టతోనే 24 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చర్చి జరగాల్సిన అభివృద్ధి జరగలేదన్నారు. మెదక్ అంటేనే ఉద్యమాల ఖిల్లా అని, ఇక్కడ అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అంతకుముందు ఘనపురం ప్రాజెక్టు, ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గుడి మునుగొద్దు అంటే ప్రాజెక్టు ఎత్తు పెంచాలన్నారు. ప్రభుత్వం రూ. 30 కోట్లు విడుదల చేసి పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే నర్సాపూర్ మండలంలో ఓ పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం కౌడిపల్లి ఎస్టీ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేశారు. బాహాటంగా మాట్లాడితే వెళ్లగొట్టారు బాహాటంగా మాట్లాడినందుకే బీఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శుక్రవారం నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లిలో ట్రిపుల్‌ఆర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా రైతులు కొంతమంది బడా నాయకుల భూములు కాపాడేందుకు అలైన్మెంట్ మార్చారని కవిత దృష్టికి తీసుకొచ్చారు. మీ తరఫున తప్పకుండా కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం రెడ్డిపల్లి మీదుగా వెళుతున్న కాళేశ్వరం ప్యాకేజీ 17 కాల్వను సందర్శించారు. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యాదగిరి, నాయకులు శేఖర్, రాము యాదవ్, గణేష్ కుమార్ పాల్గొన్నారు. -
యువతతోనే సమాజంలో మార్పు
మెదక్‌జోన్: యువతరంతోనే సమ సమాజ నిర్మాణం జరుగుతుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలను జిల్లా యువజన వ్యవహారా లు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు ఎంపీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్రం తర్వాత 565 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప సమైక్యతవాదన్నారు. అనంతరం కలెక్టర్ రాహుల్‌రాజ్ మాట్లాడుతూ.. వల్లభాయ్ పటేల్ కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా యువజన క్రీడల అధికారి రంజిత్‌రెడ్డి, డీఐఎస్‌ఓ రమేశ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోడల్ లైబ్రరీగా తీర్చిదిద్దాలి మెదక్ గ్రంథాలయాన్ని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. రూ. 5 లక్షల విలువైన పుస్తకాలను లైబ్రరీకి అందిస్తానని తెలిపారు. పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుహాసినిరెడ్డి మాట్లాడుతూ.. పుస్తకాలు నూతన విషయాలు, వివిధ సమాచార వనరులు, ప్రయోగాలపై అవగాహన పెంచడానికి కీలకంగా నిలుస్తున్నాయని పేర్కొ న్నారు. కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు -
కలలు సాకారం చేసుకోవాలి
సీపీ విజయ్‌కుమార్ సిద్దిపేటరూరల్: విద్యార్థులు కలలు సాకారం చేసుకునేందుకు బాగా కష్టపడాలని సీపీ విజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు గుడ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 100కు డయల్ చేయాలన్నారు. చైల్డ్ కేర్సెంటర్లో ఉంటున్నామని నిరాశ పడకుండా ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలను తెలుసుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలు ఆటలు బాగా అడుతూ మంచి ఆహారాన్ని కడుపునిండా తినాలన్నారు. అనంతరం బాలికల సంరక్షణకు సంబంధించిన పోస్టర్లను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పలు పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ శారదా, డీఆర్ఓ నాగరాజమ్మ, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, డీఎంహెచ్ఓ ధనరాజ్, డీపీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవలు మరింత మెరుగుపడాలి
కలెక్టర్ హైమావతి సిద్దిపేటరూరల్: ప్రజలకు వైద్యం అందించడంలో సిబ్బంది మరింతగా సేవలను మెరుగుపరచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పీహెచ్సీ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డెంగీ కేసుల పర్యవేక్షణ నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. టీబీ ముక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్క్రీనింగ్ పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపినందుకు అభినందనలు తెలిపారు. మాతా, శిశు మరణాలు, సీ సెక్షన్ ప్రసవాలను తగ్గించాలన్నారు. హాస్టల్స్‌లో ప్రత్యేక ఎనిమియా స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించాలన్నారు. జిల్లాను ఆరోగ్య సేవల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ధనరాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ వినోద్ బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గుర్రాలగోంది పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అలాగే జక్కాపూర్‌లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నారాయణరావుపేట మండల కేంద్రంలోని పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఫీల్డ్, మీటింగ్స్ పేరుతో విధులు నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఫోన్ ద్వారా హెచ్చరించారు. -
ఇదేం భోజనం..?
● కలెక్టర్ హైమావతి ఆగ్రహం ● పాఠశాలల ఆకస్మిక తనిఖీములుగు(గజ్వేల్): మెనూ పాటించకుండా పిల్లలకు ఇదేమి భోజనమని కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం క్షీరసాగర్ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, వంటిమామిడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తప్పనిసరిగా విద్యార్థుల భోజన విషయంలో మెనూ పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వంటిమామిడి పాఠశాలలో మెనూ పాటించకపోవడంతో ప్రధానోపాధ్యాయుడిపై మండిపడ్డారు. మధ్యాహ్నభోజనం వంటలు రుచికరంగా వండాలని, వంటగది, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వంట సిబ్బందిని, భోజనం విషయంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన కలెక్టర్ సమయం వృధా చేయకుండా లక్ష్యంతో చదువుకోవాలని, సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలని సూచించారు. సబ్జెక్టుల విషయంలో ఎటువంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవాలన్నారు. -
ఏసీబీకి చిక్కిన అవినీతి ఖాకీ
● రూ.50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత ● ములుగు ఎస్ఐ, కానిస్టేబుల్ అరెస్ట్ములుగు(గజ్వేల్): లంచం తీసుకుంటున్న ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ మంగళవారం రాత్రి మీడియాకు వెల్లడించిన వివరాలిలాఉన్నాయి. తమ సోదరికి కేటాయించిన ఇంటిని వేరే వాళ్లు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేయించేందుకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని ఓ వ్యక్తి ఈ నెల 5న ఎస్ఐ విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. అలాగే హైకోర్టుకూడా ఇదే విషయమై తహసీల్దార్‌కు ఇల్లు ఖాళీ చేయించేలా డైరెక్షన్ ఇచ్చింది. సరిపడా సిబ్బంది లేరని మూడు, నాలుగుసార్లు ఫిర్యాదుదారులను ఎస్ఐ తిప్పించుకున్నారు. చివరకు ఫిర్యాదు దారునితో రూ. లక్ష డిమాండ్ చేస్తూ కేసు, కౌంటర్ కేసును కూడా విచారిస్తానని ఎస్ఐ డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 6న ఎస్ఐని కలసి రూ.50 వేలు ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాడు. మంగళవారం ఎస్ఐకి రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
ఇందిరమ్మా.. ఇల్లేదమ్మా?
బుధవారం శ్రీ 12 శ్రీ నవంబర్ శ్రీ 2025నత్తనడకన నమూనా ఇళ్లుఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలకమైన మోడల్ హౌస్ (ఇందిరమ్మ నమూనా ఇళ్లు) నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ప్రతి మండలంలో మోడల్ హౌస్ నిర్మించాలని, దానిని చూసి లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలన్న లక్ష్యంతో చేపట్టారు. కానీ నేటికీ పూర్తి కావడం లేదు. జిల్లా వ్యాప్తంగా 26 మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణానికి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు రెండు చోట్ల మాత్రమే అందుబాటులోకి రాగా.. చాలా చోట్ల పునాదులకే పరిమితమయ్యాయి. మరికొన్ని మండలాల్లో పనులే ప్రారంభం కాకపోవడం గమనార్హం. ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక విషయాలు వెలుగుచూశాయి. –సాక్షి, సిద్దిపేట రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి రాగానే గూడులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కోసం ప్రజాపాలనలో దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో అర్హులైన 13,054 కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో రూ.5లక్షల వ్యయంతో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ఇంటిని దాదాపు 45 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయినప్పటికీ ఇప్పటి వరకు కోహెడ, హుస్నాబాద్, కొండపాక, అక్కన్నపేట, దౌల్తాబాద్, సిద్దిపేట అర్బన్, నారాయణరావు పేటలలో నిర్మాణాలు సుమారు పూర్తి అయ్యాయి. కానీ కోహెడ, హుస్నాబాద్‌లలో మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. మూడు మండలాల్లో బేస్మెంట్, దర్వాజ లెవల్ వరకు నాలుగు మండలాలు, స్లాబ్ లెవల్ వరకు 9 మండలాల పూర్తికాగా, వివిధ అడ్డంకులతో మూడు మండలాల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. మోడల్ హౌస్ నిర్మాణానికి రూ.5లక్షల నిధులను కేటాయించారు. ఇసుక, ఐరన్, కూలీల పనుల రేట్లు పెరగడంతో మధ్యలోనే పలు చోట్ల పనులు నిలిచిపోయినట్లు సమాచారం. అదనంగా డబ్బులు ఎవరు పెట్టుకోవాలని అధికారులు వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఇసుక లభించకపోవడంతో పనులు అర్ధంతంగా నిలిచిపోయాయి. త్వరలో పూర్తి చేస్తాం ఇందిరమ్మ మోడల్ హౌస్‌ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. వర్షాలు కురవడంతో పనులు మధ్యలో నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల ఇసుక సమస్యతో ఆగిపోయాయి. –శ్రీనివాస్, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
అందెశ్రీకి రేబర్తి గ్రామస్తుల నివాళి
మద్దూరు(హుస్నాబాద్): ప్రముఖ వాగ్గేయకారుడు అందెశ్రీ సొంత గ్రామమైన రేబర్తిలో ఆయనకు ఘన నివాళులర్పించారు. గ్రామ కూడలిలో అందెశ్రీ చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్ర గీతం అందించిన ఘనత అందెశ్రీకి దక్కిందన్నారు. అందెశ్రీ మరణం మమ్మల్ని కలిచివేసిందంటూ ప్రగాడ సంతాపం తెలిపారు. మల్లన్న హుండీ ఆదాయం రూ.73 లక్షలుకొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు భారీ ఆదాయం సమకూరింది. 76రోజులలో హుండీ ద్వారా రూ.73,18,504 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్ తెలిపారు. మంగళవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో హుండీలలోని నగదును దేవాదాయ శాఖ సిద్దిపేట డివిజన్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు లెక్కించారు. నగదు రూ.73,18,504, విదేశీ కరెన్సీ 21, మిశ్రమ బంగారం 80 గ్రాములు, మిశ్రమ వెండి 4కిలోల 800 గ్రాములు ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, కాయిత మోహన్‌రెడ్డి, మామిడాల లక్ష్మి, ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పాల్గొన్నారు. ఓంకారం.. దివ్వెల శోభితంవర్గల్(గజ్వేల్): ప్రసిద్ధమైన నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం నిత్య సామూహిక కార్తీక దీపోత్సవంతో అలరారుతోంది. మంగళవారం రాత్రి స్వామివారి సన్నిధిలో సామూహిక దీపోత్సవం నేత్రపర్వం చేసింది. భక్తజనులు ‘ఓం’ ఆకృతిలో దివ్వెలు వెలిగించి సామూహిక దీపారాధనలో భాగస్వాములయ్యారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. విద్యా రంగానికి ఆజాద్ సేవలు ఎనలేనివి సిద్దిపేటఎడ్యుకేషన్: దేశంలో విద్యారంగ పటిష్టతకు, సీ్త్రవిద్యకు భారత తొలి విద్యాశాఖ మంత్రి డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ పటిష్టమైన పునాదులు వేశారని వక్తలు కొనియాడారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్, జూనియర్ కళాశాల(కోఎడ్యుకేషన్)లో ఆజాద్ జయంతిని పురస్కరించుకుని పరిశోధన, అభివృద్ధి విభాగం కన్వీనర్ డాక్టర్ గోపాల సుదర్శనం అధ్యక్షతన మంగళవారం జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, డాక్టర్ ఖలీంమొయియొద్దిన్, సీఓఈ డాక్టర్ గోపాలసుదర్శనం, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి తదితరులు విద్యారంగానికి కలాం చేసిన సేవలను కొనియాడారు. భారతీయ విద్యావిదానం ప్రపంచానికి ఒక ప్రమాణిక ఆధారమన్నారు. ఐఐటీ, యూజీసీ, ఏఐసీటీఈ, ఐఐఎస్ లాంటి ప్రఖ్యాత విద్యాసంస్థల ఏర్పాటుకు అబుల్ కలాం కృషి ఎంతో ఉందన్నారు. కారుకలన్నారు. సుధీర్ఘ కాలం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన సాంస్కృతికి మండలలను ఏర్పాటు చేసి విద్యా విశిష్టతను దేశానికి చాటిచెప్పిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అయోధ్యరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
శాసీ్త్రయ విధానంలో బోధించాలి
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): బట్టి విధానంతో కాకుండా, శాసీ్త్రయ విధానంలో విద్యార్థులకు బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. టీ–శాట్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌లో జిల్లా స్థాయి క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. క్విజ్‌లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ విద్యార్థిని సానియా, వక్తృత్వంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమ్మగడ్డ విద్యార్థిని శ్వేత, వ్యాసరచన పోటీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దమ్మగడ్డ విద్యార్థిని సుహాసినిలు విజయం సాధించారు. ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇలాంటి పోటీల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట అర్బన్ ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలి విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి నిర్వాహకులకు సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న రూమ్ టు రీడ్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలకంఠ మనోహర్, సెక్టోరియల్ అఽధికారి రంగనాథ్ పాల్గొన్నారు -
ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే చర్యలు
● నిబంధనలు అతిక్రమించి వ్యాపారం చేసేవారిపై చర్యలు తప్పవు ● ట్రాఫిక్ ఏసీపీ సుమన్కుమార్గజ్వేల్రూరల్: ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ ఏసీపీ సుమన్‌కుమార్ అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వాటిని ట్రాఫిక్ సీఐ మురళితో కలిసి మంగళవారం తొలగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏసీపీ సుమన్‌కుమార్ మాట్లాడుతూ వ్యాపారస్తులు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దని సూచించారు. రోడ్లపై సామగ్రి, బోర్డులను పెట్టి వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. నిబంధనలు పాటించి తమ వ్యాపారాలను నిర్వహించుకోవాలన్నారు. అనంతరం పట్టణంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో మద్యం తాగి వాహనాలు నడిపిన పలువురికి కౌన్సిలింగ్ ఇచ్చారు. -
మల్లన్న ఆలయంలో భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తరలిరావడంతో సందడిగా మారింది. మట్టికుండలో మల్లన్నకు బెల్లం పాయసం తయారు చేసి బోనం నివేదించారు. చెలక, నజరు, ముఖమండప పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి వేడుకున్నారు. గంగిరేణు చెట్టుకు ముడుపులు కట్టారు. కొండపై ఉన్న ఎల్లమ్మను దర్శించుకుని తమ పిల్లాపాపలను చల్లంగా చూడలని వేడుకున్నారు. చెత్త ఆటోలకు తుప్పు చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామాల్లో చెత్తను వెంట వెంటనే తరలించడానికి ప్రతి పంచాయతీకి స్వచ్ఛ భారత్ ఆటోలు అందజేశారు. ట్రాక్టర్లు వెళ్లలేని కానీలలో చెత్తను తీసుకెళ్లడానికి ఆటోలను కేటాయించారు. చాలా గ్రామాల్లో చెత్త ఆటోలను మూలన పడేశారు. అవి తుప్పు పట్టిపోతున్నాయి. పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చే ఆటోలకు ఈదుర్గతి పట్టడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘పద్యం’ చిరస్మరణీయం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పద్యం పదికాలాల పాటు నిలుస్తుందని, ధారణతో కూడిన అవధానం తెలుగు సాహిత్యంలోనే ఉందని అవధాని గౌరిభట్ల రఘురామశర్మ అన్నారు. సిద్దిపేటలోని లలిత చంద్రమౌళీశ్వర క్షేత్రం మాస ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పూజలు, హోమాలు, వైధిక కార్యక్రమాలతో పాటు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశపతి శ్రీనివాసశర్మ, రుక్మాభట్ల కొదండరామశర్మలు సంగీతంతో అలరించారు. అష్టావధానాన్ని డాక్టర్ గౌరిభట్ల రఘురామశర్మ నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు పండరి రాధకృష్ణ, కవులు, రచయితలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. తాగునీటి సరఫరాలో నేడు అంతరాయం సిద్దిపేటజోన్: లోయర్ మానేరు డ్యామ్ మరమ్మతుల నేపథ్యంలో సోమవారం తాగునీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇల్లంతకుంట శివార్లలో పైపులైన్ లీకేజీ వల్ల అత్యవసర మరమ్మతులు నిర్వహిస్తున్నారని, దీంతో 18, 19, 20, 21, 36వ వార్డుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని తెలిపారు. ఆయా వార్డుల ప్రజలు సహకరించాలని కోరారు. -
రైతన్నకు తీరని నష్టం
ఇంకా నేలవాలిన పంటలే దర్శనం ● భారీ వర్షాలతో కోలుకోని అన్నదాతలు ● ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకోలు వానాకాలం సీజన్లో జిల్లాలో 5,20,672 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. 3.63 లక్షల ఎకరాల్లో వరి, సుమారు లక్ష ఎకరాల్లో పత్తి, 25 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలతో పాటు కంది, పెసర, ఇతర పంట లు సాగయ్యాయి. జిల్లాలో 3,916 మంది రైతులకు చెందిన 5,483 ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వ్యవసా యాధికారుల అంచనా ఉండగా ఇంతకు రెట్టింపు గానే నష్టం వాటిల్లినట్లు కనబడుతోంది.ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మల్లుగారి నర్సింహారెడ్డి. దుబ్బాకకు చెందిన ఇతను వానాకాలంలో తన సొంత పొలంతోపాటు కౌలుకు తీసుకొని మొత్తం 20 ఎకరాల్లో వరి వేశారు. రూ.4 లక్షలకు పైగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. తీరాపంట చేతికొచ్చేవేళ వర్షాలు దంచికొట్టడంతో పొలంలోనే పంటంతా నేలవాలింది. పైగా గొలలు మొలకలొస్తూ తీవ్రంగా నష్టం వాటిల్లుతోంది. పంటంతా నేలవాలడంతో కోసేందుకు సైతం వీలుకావడంలేదు. సగం పంటైనా దక్కుతుందో లేదో అంటూ రైతు ఆవేదన చెందుతున్నారు. ఈ ఒక్క రైతుదే కాదు చాలా మంది పరిస్థితి ఇలాగే ఉంది. దుబ్బాక: రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా తయారైంది. పగబట్టినట్లుగా వరణుడు రైతులను కోలుకోలేకుండా చేశాడు. సరిగ్గా పంటలు చేతికొస్తాయనుకున్న దశలోనే భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. వరిపంటలు కోసిన రైతులు కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రోడ్లపై ఆరబెట్టగా వానలు దంచికొట్టడంతో ధాన్యం తడిసిముద్దవడం, కొట్టుకుపోవడంతో తీరని నష్టం ఏర్పడింది. చాలా చోట్ల కోతకొచ్చిన వరిపంటలు పొల్లాల్లోనే నేలవాలి ఉన్నాయి. దీంతో కోసేందుకు రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. కన్నీటిపర్యంతం ఆరుగాలం రెక్కలు ముక్కలు జేసుకొని పండించిన పంటలు తీరా నోటికాడికొచ్చే సమయంలో నాశనం కావడంతో రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. పంటల నష్టంతో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైందని ప్రభుత్వమే సమగ్రంగా పంటల నష్టంపై సర్వే జరిపించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ రైతులు కోరుతున్నారు.అధైర్యపడొద్దు మోంథా తుపాన్‌తో జిల్లాలో పంటలు దెబ్బతిన్నాయి. రైతులకు నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందిస్తాం. రైతులు ఆందోళన చెందొద్దు. –స్వరూపరాణి, జిల్లా వ్యవసాయ అధికారి -
డబుల్ బెడ్రూంలో గలీజ్ పనులు
● ఖాళీ గదుల్లో అసాంఘిక కార్యక్రమాలు ● జోరుగా గంజాయి, మద్యం సేవనం ● రోజూ కొత్త వ్యక్తుల సంచారం ● చోద్యం చూస్తున్న అధికారులుడబుల్బెడ్రూం గృహాలుదుబ్బాకరూరల్: పట్టణంలోని ఖాళీ డబుల్ బెడ్రూంల్లో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మద్యం, గంజాయి వంటివి సేవించడమేకాకుండా ఘర్షణలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తిచూడకపోవడం గమనార్హం. దుబ్బాకలో ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించారు. 900వందల వరకు ఇళ్లు ఉంటాయి. మూడేళ్ల క్రితం కొందరికి పంపిణీ చేశారు. సుమారు 800వందల ఇళ్లల్లో ప్రజలు తమ కుటుంబీకులతో ఉంటున్నారు. ఇందులోనూ మున్సిపాలిటీ పరిధిలోని లబ్ధిదారులే ఉండాలి. కానీ స్థానికేతరులే అధికంగా ఉంటున్నారు. కేటాయించని వాటిలోనూ కొందరు అక్రమంగా నివసిస్తున్నారు. కొంత మంది యువకులు మత్తు పదార్థాలు సేవిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. రాత్రి వేళ అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం కొత్త వ్యక్తులు సంచరిస్తున్నారు. శని, ఆదివారాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇళ్ల సమీపంలోనే బెల్ట్ షాపు డబుల్ బెడ్రూంల వద్ద బెల్ట్ షాపు ఉండడంతో విచ్చల విడిగా విక్రయాలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి 12 గంటలుదాటినా విక్రయాలు జరుగుతున్నా పోలీసులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ బెడ్రూంల్లో రోజూ గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని పోలీస్‌స్టేషన్ వరకు వెళ్తున్నాయి. పోలీస్‌లు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారే తప్ప అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడంలేదు. మరోవైపు కొందరు మృత్యువాత పడుతున్న ఘటనలు సైతం జరుగుతున్నాయి. ఇవి ఆత్మహత్యలా? లేక హత్య లా? అన్న అనుమానాలు నెలకొన్నాయి. డబుల్ బెడ్రూంల వద్ద సీసీ కెమెరాలు సైతం పూర్తి స్థాయిలో లేకపోవడంతో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారని స్థానికులు వాపోతున్నారు. -
వీధుల్లో చీకట్లు..వీడని ఇక్కట్లు
జిల్లాలోని పట్టణాల్లో జనం పాట్లుమున్సిపాలిటీల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. రాత్రి అయిందంటే చాలు జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. వీధి దీపాలు ఫెయిలైతే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో పట్టణాలకు వీధి దీపాలను సరఫరా చేసిన సంస్థ టెండర్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో కొత్త సంస్థలకు అవకాశం ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నది. గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ప్రస్తుతం వీధి దీపాల సమస్య తీవ్రంగా మారింది. గతంలో ఎక్కడైనా లైట్లు ఫెయిలైతే వెంటనే వాటి స్థానంలో కొత్తవి బిగించేవారు. కానీ నేడు నెలలు గడిచినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ వైశాల్యం ప్రస్తుతం 43 చదరపు కిలోమీటర్ల మేర ఉంది. పట్టణంలో ఆర్అండ్ఆర్ కాలనీ విలీనం కావడంతో వైశాల్యం గణనీయంగా పెరగడానికి కారణమైంది. ఇకపోతే ఈ పట్టణానికి కంఠహారంగా 24కిలోమీటర్ల మేర రింగు రోడ్డు ఉంది. మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజ్‌పల్లి, సంగుపల్లి, సంగాపూర్, రాజిరెడ్డిపల్లి, ఆర్అండ్ఆర్ కాలనీతోపాటు రింగు రోడ్డు కలుపుకొని ఇక్కడ 7126 వీధి దీపాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు ఏటా రూ.20లక్షలకుపైగానే ఖర్చవుతోంది. ఇది సాధారణ నిర్వహణ మాత్రమే. ఒకవేళ కొత్త స్తంభాలు, వైరు వేయాలనుకున్నా బడ్జెట్ పెరిగే అవకాశముంటుంది. ఏడాదిన్నర క్రితం వరకు వీధి దీపాల నిర్వహణ సజావుగానే సాగింది. గతంలో పనిచేసిన ఈఎస్ఎల్ సంస్థ టెండర్ రద్దు కావడంతో కొత్తగా మున్సిపాలిటీల స్థాయిలో టెండర్లు నిర్వహించుకొని వీధి దీపాలు వేయించుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో టెండర్లు పిలువగా..ఓ వ్యక్తి టెండర్‌ను దక్కించుకున్నారు. కానీ ఇప్పటివరకు అగ్రిమెంట్ చేసుకోలేదు. పనులు మొదలు పెట్టలేదు. ఈక్రమంలోనే మూడుసార్లు నోటీసులు ఇచ్చినా...ఫలితం లేకుండా పోయింది. ఒక్క గజ్వేల్‌లోనే కాదు...సిద్దిపేట మున్సిపాలిటీలోనూ ఈ సమస్య తీవ్రంగా ఉన్నది. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ కొంత కాలంగా ప్రధాన ప్రదేశాల్లో చీకట్లు ముసురుకొని జనం ఇబ్బందిపడుతున్నారు. బాలికలకు ఇబ్బందులు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వీధిలైట్లు సక్రమంగా వెలగడంలేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేకించి గజ్వేల్‌లోని బాలికల ఎడ్యుకేషన్ హబ్, రింగు రోడ్డు వద్ద ఈ సమస్య తీవ్రంగా ఉంది. వెంటనే పరిష్కరించాలి. – బారు అరవింద్, గజ్వేల్ సమస్యను పరిష్కరిస్తాం మున్సిపాలిటీలో వీధి లైట్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్న మాట వాస్తవమే. టెండర్ దక్కించుకున్న వ్యక్తి అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అతనికి నోటీసులు ఇచ్చాం. ఇప్పటికీ రాకపోతే ఇతర మార్గాల ద్వారా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పలు ప్రధాన కాలనీల్లో.. పట్టణంలోని పలు ప్రధాన కాలనీల్లో, బాలికల వసతి గృహాల వద్ద, రింగు రోడ్డుపై లైట్లు ఫెయిలై తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల రాత్రివేళల్లో దొంగతనలకు ఆస్కారం కలుగుతుండగా, అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయి. మరోవైపు రోడ్లపై లైటింగ్ లేక తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యేకించి రూ.341కోట్ల వ్యయంతో నిర్మించిన గజ్వేల్ రింగు రోడ్డు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఎక్కడికక్కడా సర్కిళ్లు, అందమైన గార్డెనింగ్‌తో తీర్చిదిద్దారు. కానీ నేడు లైట్లు వెలగక రాత్రివేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోంది. -
వేడెక్కిన రాజకీయం
● హరీశ్‌రావు సభలో ఎమ్మెల్యే సోదరుడు ప్రత్యక్షం ● వేడెక్కిన పటాన్చెరు రాజకీయాలు రామచంద్రాపురం(పటాన్చెరు): రాజకీయాల్లో ఒక్క అడుగు ఎటువైపునకై నా దారితీస్తుంది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యా రు. అయితే ఆయన ప్రస్తుతం దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక లు జరుగుతున్న నేపథ్యంలో ఆయన సోద రుడు గూడెం మధుసూదన్‌రెడ్డి హరీశ్‌రావు సభలో వేదికపై ప్రత్యక్షమవడం అధికార కాంగ్రెస్‌పార్టీలో కంగారు పుట్టించగా... బీఆర్ఎస్లో జోష్ నింపింది. అయితే బీఆర్ఎస్లోనే మరొక వర్గం మాత్రం మధుసూదన్‌రెడ్డి ప్రత్యక్షంపై గుస్సవుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ జరిగింది తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరు కేటీఆర్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సభలో ప్రారంభమవ్వగానే హరీశ్‌రావు ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదేసమయంలో ఒక్కసారిగా వేదికపైకి గూడెం మధుసూదన్‌రెడ్డి ఎక్కి కూర్చున్నారు. ఈ చర్యతో బీఆర్ఎస్ కొందరు నేతలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వేదికపై గూడెం మధుసూదన్‌రెడ్డి కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. స్థానిక నేతల్లో మొదలైన కంగారు గూడెం మధుసూదన్‌రెడ్డి అనేక నెలలుగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో స్థానిక నేతలు కొందరు నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఒకసారిగా వేదికపై కనిపించడంతో ఆ నేతల్లో కంగారు మొదలైంది. మళ్లీ ఎమ్మెల్యే కుటుంబం బలం పెంచుకుంటే మన పరిస్థితి ఏంటి అని లోలోపల గుసగుసలాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. -
బెజ్జంకిలో పత్తి దగ్ధం
రూ. 20 లక్షల వరకు నష్టంబెజ్జంకి(సిద్దిపేట): ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి అగ్నికి ఆహుతైంది. రైతుకు తీవ్ర ఆవేదన మిగిల్చిన ఘటన శనివారం బెజ్జంకిలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతు ఐలయ్య తనకున్న 12 ఎకరాలతో పాటు 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. కాగా ఇటీవల కురిసిన వర్షాలకు పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉందని ఇంటి వద్ద 350 క్వింటాళ్ల పత్తిని ఆరబెట్టాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పత్తి దగ్ధమైంది. స్థానికులు ట్యాంకర్ల ద్వారా తెచ్చిన నీటిని పిచికారీ చేసినా మంటలు అదుపులోకి రాలేదు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, ఎస్ఐ సౌజన్య ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సిద్దిపేట నుంచి ఫైరింజన్ తెప్పించడంతో ఎట్టకేలకు మంటలు ఆర్పినప్పటికీ సుమారు 300 క్వింటాళ్లకు పైగా కాలిపోగా మిగితా పత్తి నల్లబడి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో సుమారు రూ.20లక్షల వరకు నష్టం వాటిల్లిందని రైతు కుటుంబం రోదిస్తుండటం స్థానికులను కలిచి వేసింది. ఫైరింజిన్ సకాలంలో వస్తే ఇంత నష్టం జరిగేది కాదని స్థానికులు పేర్కొంటున్నారు. -
పాతాళ గంగ.. ౖపైపెకి రావంగ
పాతాళ గంగ ౖపైపెకి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో భూగర్భ జలాలు భారీగా పెరగడంతో ఈసారి యాసంగిలో సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. దీంతో యాసంగికి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – సాక్షి, సిద్దిపేటగతేడాది అక్టోబర్‌లో జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు 8.24 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది అక్టోబర్‌లో 6.43 మీటర్ల లోతులోనే అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే 76% అధికంగా వర్షం కురవడంతో భూగర్భ జలాలు ఉబికివచ్చి జిల్లాలోని చెరువులు, కుంటలు, బోరుబావులు జలకళ సంతరించుకున్నాయి. గతేడాది అక్టోబర్ నాటికంటే ఈసారి అదేనెలలో 1.81మీటర్ల ఎత్తుకు భూగర్భ జలాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో గతంలో పోల్చితే భూగర్భ జలాలు పైకి వచ్చాయి. అత్యధికంగా మర్కూక్‌లో 10.11మీటర్లు, రాయపోలు మండలంలో 7.69 మీటర్లు, దౌల్తాబాద్‌లో 4.63, తొగుటలో 4.23, పెరిగాయి. జిల్లాలో అత్యల్ప లోతులో వర్గల్ మండలంలో 1.81మీటర్లలో భూగర్భ జలాలు, అత్యధికంగా 17.51 మీటర్ల లోతులో దౌల్తాబాద్ మండలంలో భూగర్భ జలాలున్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఐదు మండలాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. చేర్యాలలో –4.01 మీటర్లు, బెజ్జంకి మండలంలో –0.73, కోహెడలో –1.21, కొండపాకలో –0.94, మద్దూరులో –0.20 మీటర్ల మేర భూగర్భ జలాలు కిందకు వెళ్లాయి. జిల్లావ్యాప్తంగా సగటున సాధారణ వర్షపాతం 699.4మిల్లీ మీటర్లు కాగా ఇప్పటివరకు 1229.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 76% అధికంగా వర్షం కురిసింది. దీంతో చెరువులు అలుగులు పోశాయి. జిల్లాలో ఉన్న రిజర్వాయర్లకు వరద నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పెరిగాయి. సాధారణం కంటే 76% అధికంగా వర్షపాతం నమోదు భూగర్భ జలాలు పెరిగాయి... ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. యాసంగి పంటకు భూగర్భ జలాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. –నాగరాజు, ఏడీ, భూగర్భ జలశాఖయాసంగి పంటలకు ఢోకా లేనట్టే జిల్లాలో పెరిగిన భూగర్భ నీటి మట్టంతో వ్యవసాయ బోర్లు, బావుల పరిధిలో సాగుకు మరింత ఉపయోగకరంగా మారనుంది. వ్యవసాయ బావుల వద్ద కూరగాయలు, వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర పంటలు సాగు చేసేందుకు దోహదపడనుంది. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో యాసంగి సాగుకు ఇబ్బంది లేదు. గతంలో వదిలేసిన బోర్లలో కూడా నీరు ఉబికి వస్తుండటంతో రైతులు మోటార్లు బిగించుకోనున్నారు. దీంతో యాసంగిలో సాగు విస్తీర్ణం మరింత పెరగనుంది. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సీపీ విజయ్‌కుమార్ సిద్దిపేటకమాన్: సిద్దిపేట జిల్లా కోర్టులో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోలీసు కమిషనర్ విజయ్‌కుమార్ తెలిపారు. చిన్న చిన్న కాంపౌండబుల్ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అన్నారు. కమిషనరేట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న 2,230 కాంపౌండబుల్ కేసుల్లో రాజీపడవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని సీపీ పేర్కొన్నారు. రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములుసిద్దిపేటఅర్బన్: కార్మిక చట్టాలను రద్దుచేసి లేబర్ కోడ్లను తెచ్చిన కేంద్ర ప్రభుత్వం కార్మి క వర్గానికి తీవ్ర అన్యాయం చేసిందని, వాటి రద్దు కోసం ఉద్యమించడానికి సిద్ధమవుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు చెప్పారు. స్థానిక కార్మిక, కర్షక భవ నంలో శనివారం జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు మెదక్ జిల్లా కేంద్రంలో జరగనున్న సీఐటీయూ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా మహాసభలు వాయిదా సీఐటీయూ సిద్దిపేట జిల్లా 4వ మహాసభలు 9, 10 న సిద్దిపేటలో జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్టు జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి తెలిపారు. ఈ మహాసభలను 15, 16 తేదీలలో నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భాస్కర్, ఉపాధ్యక్షురాలు పద్మ, సత్తిరెడ్డి, సహాయ కార్యదర్శి రవికుమార్, మహేశ్, బాలనర్సయ్య, భాస్కర్, షఫీ, రాజు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ ఔన్నత్యాన్ని చాటే గీతం నర్సాపూర్: వందేమాతరం గీతం దేశ ఔన్నత్యాన్ని చాటుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్ అన్నారు. శనివారం పట్టణ చౌరస్తాలో విద్యార్థులు, పార్టీ నాయకులతో కలిసి వందేమాతరం గీతాన్ని సామూహికంగా ఆల పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మతాలకు అతీతంగా గీతం సారం తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మల్లేశ్‌గౌడ్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సురేశ్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా రాణికి నియామక పత్రం అందజేశారు. టీఎంఎఫ్ నూతన కార్యవర్గం మెదక్ కలెక్టరేట్: తెలంగాణ గణిత ఫోరం (టీఎంఎఫ్) జిల్లా నూతన కార్యవర్గాన్ని శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నుకున్నట్లు జిల్లా గౌరవ అధ్యక్షుడు సదన్ కుమార్ తెలిపారు. నూతన అధ్యక్షుడిగా కొండల్‌రెడ్డి (జెడ్పీహెచ్ఎస్, కూచన్‌పల్లి), ప్రధాన కార్యదర్శిగా గోపాల్ (జెడ్పీహెచ్ఎస్, జాన్సిలింగాపూర్), కోశాధికారిగా నాగరాజు(జెడ్పీహెచ్ఎస్, చిన్నశంకరంపేట), ఉపకోశాధికారిగా బాలరాజు (జెడ్పీహెచ్ఎస్, కుర్తివాడ)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు కొండల్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో గణిత నైపుణ్యాలు పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు వరప్రసాద్, పంతంగి శ్రీనివాస్, ధనుంజయ్, తదితర గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాతపద్ధతిలోనే పత్తి కొనుగోళ్లు చేయాలిసంగారెడ్డి: ఆన్లైన్ విధానానికి స్వస్తి చెప్పి పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని శివంపేట రైతులు డిమాండ్ చేశారు. శనివారం శివంపేట్ టోల్ గేట్ జాతీయ రహదారి 161 పై రైతులు నిరసన తెలిపారు. -
కామ్రేడ్స్ల కయ్యం!
హుస్నాబాద్: సీపీఐ నాయకుల వర్గ పోరుతో ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపుతోంది. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవన్ హాలులో శనివారం రెండు వర్గాల నాయకులు వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. సీపీఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ మూడు మండలాల కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. వీరికి పోటీగా అదే హాలులో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ జాగిర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ అధ్యక్షతన నియోజకవర్గ స్ధాయి సమావేశం నిర్వహించారు. ఒకే సమయంలో రెండు సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఆర్ధం కాని పరిస్ధి తి. రెండు వర్గాల పోటాపోటీ నినాదాలతో కార్యాలయం మారుమోగింది. ఈ వర్గ పోరు ఇప్పటిది కాదు శాసన సభ ఎన్నికల తర్వాత నుంచి మొదలైన వర్గ పోరు దాదాపు రెండేళ్ల నుంచి నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చీలికలకు దారి తీసింది. అప్పటి నుంచి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మంద పవన్ మధ్య ఉన్న విభేధాలతో జిల్లాలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు. గతంలో హుస్నాబాద్ పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహించుకునేందుకు పవన్ వస్తే చాడ వర్గీయులు తాళం వేశారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాష్ట్ర పార్టీ కార్యదర్శి సాంబశివరావుకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఆయన రెండు వర్గాల మధ్య సమన్వయం చేశారు. తర్వాత ఇద్దరు నాయకులు సమన్వయంతో ఉన్నట్లు సమావేశాలు నిర్వహించినా.. లోపల మాత్రం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నియోజకవర్గ కమిటీ జిల్లా పార్టీ గుర్తించదు జిల్లా పార్టీకి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎంపిక చేసిన సీపీఐ హుస్నాబాద్ నియోజకవర్గ కమిటీని తాము గుర్తించడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఎంపికలో పాల్గొ న్న జిల్లా కమిటీ సభ్యులకు షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గ కన్వీనర్ సత్యనారాయణ మాట్లాడుతూ నవంబరు 17, 18వ తేదీలలో జరిగే సీపీఐ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
డయాలసిస్ సేవల్లో ప్రథమం
దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రి ఘనతదుబ్బాక: దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రిలోని డయాలసిస్ సెంటర్ వరుసగా రెండోసారి ఉత్తమ సేవల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. 2023 మార్చి 5న ఆస్పత్రిలో అపెక్స్ కిడ్నీవేర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై వారు ఐదు పడకలతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కేవలం రెండున్నర సంవత్సరాల్లోనే 10 వేల మందికి పైగా రోగులకు సేవలు అందించడం విశేషం. సెంటర్ ఇన్చార్జి శేఖర్, సిబ్బంది సురేష్, వివేక్‌రెడ్డి, స్వామి, మానస, రమేశ్‌ను సూపరింటెండెంట్ హేమరాజ్సింగ్తో పాటు వైద్యులు సన్మానించి అభినందించారు. సిబ్బంది అంకితభావంతో చేస్తున్న వైద్యసేవలకు గాను ఈ గుర్తింపు దక్కిందని కొనియాడారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ఆస్పత్రిని ప్రభుత్వం అన్ని విభాగాల్లో అభివృద్ధి చేస్తే ఇంకా మంచి వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. -
అన్నదాత... అరిగోస
సిద్దిపేటజోన్: జిల్లాలో వానాకాలం సీజన్ ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ అంతా అస్తవ్యస్తంగా మారింది. అన్నదాతలు రెక్కలు ముక్కలు చేసి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. తేమ, పొల్లు, చిన్న గింజ పేరిట పంటను కొనేందుకు నిర్వాహకులు సవాలక్ష కొర్రీ లు పెడుతున్నారు. మరోవైపు ప్రకృతి కన్నెర్ర చేయ డంతో కురుస్తున్న అకాలవర్షాలతో రైతుల పంట తడిసి ముద్దయిపోతోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు పంటకు మద్దతు ధర కోసం అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తుంది. కొనుగోలు ప్రక్రియ జాప్యంతో రైతులు పడిగాపులు కాయడం, అకాల వర్షాలతో పంట తడవడం, తేమ శాతం అనుగుణంగా లేని క్రమంలో అరబెట్టడం, మళ్లీ వర్షం కారణంగా తడవడం, తేమ శాతం మళ్లీ పెరగడం ఇది నిత్యకృత్యంగా మారుతోంది. సిద్దిపేట యార్డులో కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయించేందుకు రైతు లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 25 వేల ధాన్యం బస్తాలు తూకం కోసం సిద్ధంగా ఉన్నాయి. కొర్రీల కిరికిరి ప్రభుత్వ మద్దతు ధర పొందడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. తేమ శాతం, పొల్లు, గింజ పరిమాణం పేరుతో కొర్రీలు పెడుతున్నారు. నిబంధనల మేరకు 14తేమ శాతం ఉన్న మొక్కజొన్న క్వింటాలుకు రూ 2,400 మద్దతు ధర, అదేవిధంగా 17 తేమ శాతం ఉన్న ధాన్యం క్వింటాలుకు రూ 2,389 మద్దతు ధర ప్రకటించారు. వర్షాల కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనితో దాన్ని ఆరపెట్టడానికి అన్నదాతలు రోజులకొద్దీ యార్డులో పడిగాపులు కాయాల్సి వస్తుంది. కనీసం 6 రోజుల నుంచి 20 రోజుల వరకు ఒక్క తేమ శాతం తక్కువగా ఉండేందుకు రైతులు యార్డులో ఉండే పరిస్థితి నెలకొంది. ఇరవై రోజులు అయింది.. మాది సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సన్ పల్లి. 10 ట్రాక్టర్లో వడ్లు తెచ్చిన. అకాల వర్షానికి తడిసింది. ప్రతి రోజు ఇక్కడే అరబోస్తున్న, తేమ శాతం ఎక్కువ, తక్కువ అవుతుంది. 20నుంచి ఇప్పుడు 18 వచ్చింది. ఆర బెట్టేందుకు చాలా కష్టంగా ఉంది. సార్లు వస్తున్నారు.. చూసి పోతున్నారు. ఏమి చేయాలో అర్థం అయితలేదు. కోరబండికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. –కనకవ్వ గోస పడుతున్నాం.. రెక్కలు ముక్కలు చేసి కష్టపడి పంట కాపాడుకున్నాం. గింజలు అమ్మితే పైసలు వస్తాయని ఇక్కడికి వస్తే సార్లు తేమ సరిగ్గా లేదు అంటున్నారు. 13 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇల్లు, పిల్లలు అక్కడ మా కష్టాలు ఎవ్వరికీ రావొద్దు. కోర బండికి, జల్లికి ఇప్పటి వరకు రూ 5,000 ఖర్చు అయింది. –పున్నమ్మ (నర్సాపురం) -
వందేమాతరం.. స్ఫూర్తికి వందనం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జాతీయ గేయం ‘వందేమాతరం’ను రచించి 150 ఏళ్లయిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వేడుకలు నిర్వహించారు. శుక్రవారం అన్ని విద్యాసంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వందేమాతరం గేయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది ఉదయం 10గంటలకు ఆలపించారు. అనంతరం విద్యార్థులకు వందేమాతరం గేయంపై క్వీజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు వందేమాతరం ఆకృతిని ప్రదర్శించారు. అందరూ ఏకతాటిపైకి: డీఈఓ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో వందేమాతరంపై నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు బహుమతులను డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం గేయం భారతీయులను ఏకం చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మనోహర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా
● కలెక్టర్ హైమావతి ● రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం సిద్దిపేటరూరల్: ఓటరు జాబితాను అత్యంత పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్‌తో కలసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితా తయారీకి జిల్లాలోని నియోజకవర్గాల వారీగా ఒక్కో రాజకీయ పార్టీ నుంచి బీఎల్ఎస్ను అపాయింట్ చేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి భూభారతిలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన సాదాబైనామా, ఇతరత్రా దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా అధికారులను ఆదేశించారు. భూభారతి చట్టం మార్గదర్శకాల మేరకు క్షేత్ర పరిశీలన చేసి పరిష్కారం చేయాలన్నారు. అవసరమైన గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్, గ్రామ పంచాయతీ భవనాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లను ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపడుతున్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ వారు చేపడుతున్న పనులపై శుక్రవారం ఈఈ, డీఈ, ఏఈలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, పీహెచ్సీ సబ్‌సెంటర్లు, మహిళా సమాఖ్య భవనాలు, మినీ ఫంక్షన్‌హాల్, డ్రైనేజీ ఇతర పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. పనులు పూర్తి కాగానే ఎఫ్టీఓ జనరేట్ చేయాలన్నారు. కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్మించాలన్నారు. సమావేశంలో ఈఈ శ్రీనివాస్, డీఈ చిరంజీవులు, డీఆర్డీఓ జయదేవ్‌ఆర్యా, డీడబ్ల్యూఓ శారద పాల్గొన్నారు. -
ప్రజలను ఏకం చేసిన గీతం
సిద్దిపేటరూరల్: స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలను ఏకం చేయడంలో వందేమాతరం గీతం ముఖ్య పాత్ర పోషించిందని కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో వందేమాతరం గీతం సామూహిక ఆలాపన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ 150 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలన సమయంలో దేశంలోని కవులందరూ ప్రజలను ఏకం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. అందులో భాగంగానే బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గీతాన్ని రచించారన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన స్వాతంత్య్ర, క్విట్ ఇండియా, దండి యాత్ర వంటి ఎన్నో ఉద్యమాల్లో ఈ గీతం ముఖ్య నినాదంగా నిలిచిందన్నారు. భవిష్యత్తు తరాలకు వందేమాతరం గీతం గొప్పతనాన్ని స్మరించేలా అందరం కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్‌హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, అధికారులు, కలెక్టరేట్, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
బీడీ పరిశ్రమను కాపాడండి
కేంద్ర మంత్రికి బీఎమ్మెస్ వినతి సిద్దిపేటజోన్: రాష్ట్ర గ్రామీణ ఉపాధి బీడీ పరిశ్రమ పరిరక్షణకు కేంద్రం సానుకూలంగా స్పందించాలని భారతీయ మాజ్దుర్ సంఘ్ (బీఎమ్మెస్) రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సూర్ మండవకు వినతిపత్రం అందజేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న అసంఘటిత రంగ కార్మిక సంఘాల సమావేశంలో పాల్గొన్న మంత్రికి సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలో బీడీ పరిశ్రమ పరిస్థితి, ఇబ్బందులు గురించి వివరించారు. కార్మికుల పెన్షన్ రూ.5వేలకు పెంచాలని, అసంఘటిత కార్మికుల సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. న్యాయమూర్తి సంతోష్‌కుమార్ సిద్దిపేటకమాన్: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్ అన్నారు. జాతీయ న్యాయ సేవ దినోత్సవం సందర్భంగా జిల్లా జైలులో శుక్రవారం అవగాహన కల్పించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ వారానికి మూడు సార్లు జైలును సందర్శిస్తారని అన్నారు. న్యాయవాదులు లేని వారికి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సహాయం అందిస్తారని తెలిపారు. ఖైదీల వంట గది, స్టోర్ రూంను పరిశీలించి, వారికి కల్పిస్తున్న భోజన వసతుల గురించి జైలు సిబ్బందిని న్యాయమూర్తి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో న్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్: స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ఆరేళ్లుగా విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డు పాలయ్యారని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సర్కార్ తీరుతో విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే విద్యారంగా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్ నాయక్, కిషోర్, మహేష్, రాజు, నవీన్ తదితరులు ఉన్నారు. చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని మల్లారం శివారులో డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని శుక్రవారం గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఎంపీడీఓ జనార్దన్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని నివాసాల సమీపంలో డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల వాతావరణం కలుషితం అవుతుందన్నారు. ప్లాంట్ ద్వారా వచ్చే డస్టుతో పంట పొలాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వాపోయారు. డాంబర్ ప్లాంట్ నిర్మాణం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అక్కన్నపేట(హుస్నాబాద్):మండలానికి బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్లు మంజూరైనట్లు గిరిజన శాఖ ఏఈ దిలీప్ శుక్రవారం పేర్కొన్నారు. కేశనాయక్‌తండా, దుబ్బతండా, పంచరాయితండా, తుక్కితండా, దేవనాయక్తండా, పంతుల్‌తండా, ఫన్యానాయక్తండాలతో పాటు తదితర తండాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కాంగ్రెస్ నేత ధరావత్ తిరుపతినాయక్ కృతజ్ఞతలు తెలిపారు. -
నాడు పురివిప్పి.. నేడు కళతప్పి
● నిరుపయోగంగా హరిత హోటల్ ● ఏడాదిగా ‘మహతి’లో కార్యక్రమాలు నిల్ ● అధికారుల నిర్లక్ష్యమే కారణమా? గజ్వేల్: పర్యాటక ఆతిథ్యం.. వెలవెలబోతోంది. కొన్నేళ్లుగా ఓ వెలుగు వెలిగిన ఈ శాఖకు చెందిన హరిత హోటల్ నిరుపయోగంగా మారింది. మరోవైపు రవీంధ్రభారతిని తలదన్నే రీతిలో గజ్వేల్‌లో నిర్మించిన మహతి ఆడిటోరియం సైతం మునుపటి కళను కోల్పోయింది. ఏడాదిగా ఈ ఆడిటోరియంలో కార్యక్రమాలే సాగడంలేదు. ఎట్టకేలకు వారం క్రితం టెండర్ ద్వారా నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే యోచనలో ఉన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో రాజీవ్‌రహదారి పక్కన 2007లో అప్పటిమంత్రి డాక్టర్ జే.గీతారెడ్డి చొరవతో ఎకరం పది గుంటల విశాలమైన స్థలంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మించారు. ఈ హోటల్ గడిచిన మూడేళ్ల క్రితం వరకు ఓ వెలుగు వెలిగింది. ప్రజ్ఞాపూర్‌లో రింగు రోడ్డు అందుబాటులోకి రావడంతో.. బైపాస్ నుంచే వాహనాలు వచ్చివెళుతున్నాయి. ఫలితంగా హరిత హోటల్ నిర్మించిన ప్రదేశంలో వాహనాల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. దీంతో హోటల్ కళ తప్పింది. నిర్వహణ భారంగా మారటంతో మూసేయడంతో నిరుపయోగంగా మారింది. దీని తర్వాత సంబంధిత అధికారులు ఇంతటి విలువైన భవనాన్ని వినియోగంలోకి తేచ్చే ప్రత్యామ్నాయమార్గాలను ఆలోచించకపోవడంతో పార్కింగ్‌కు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ‘మహతి’కి టెండర్ పూర్తి.. గజ్వేల్ పట్టణంలో రూ.19.5కోట్ల వ్యయంతో మహతి ఆడిటోరియం నిర్మించారు. 2019 డిసెంబర్ 11న అందుబాటులోకి వచ్చింది. ఇందులో రెండు ఫంక్షన్ హాల్స్ ఉండగా.. ప్రధాన హాలులో వీఐపీ సీట్లతో కలుపుకొని 1100 సీట్ల సామర్థ్యం, రెండో మినీ హాలును 250 సీట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ ఆడిటోరియం కూడా ఏడాది క్రితం వరకు ఓ వెలుగువెలిగింది. కానీ ఏడాదిగా ఇందులో కార్యక్రమాలు జరగడం లేదు. ఎట్టకేలకు వారం క్రితం టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులు ఈ మహతిని నిర్వహించడానికి ముందుకొచ్చారు. అగ్రిమెంట్ కావాల్సి ఉంది. అన్ని హంగులతో నిర్మించిన ఈ భవనాన్ని టూరిజం శాఖ స్వయంగా నిర్వహిస్తే.. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. మరో విషయం ఏమిటంటే ఇంత గొప్పగా నిర్మించిన ఆడిటోరియానికి ప్రస్తుతమున్న రెండెకరాల స్థలంతోపాటు మరో 2ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ అవసరముంటుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ముందుగానే అంచనా వేశారు. ఆడిటోరియానికి ఆనుకుని ఉన్న పాల శీతలీకరణ కేంద్రం స్థలాన్ని ఇందుకోసం తీసుకోవాలని అనుకున్నారు. ఈ కేంద్రాన్ని రాజిరెడ్డిపల్లి వైపున ఉన్న ప్రభుత్వ స్థలంలోకి మార్చాలని కూడా ప్రతిపాదించారు. కానీ.. ఈ వ్యవహారంలో ఇంకా స్పష్టత రాలేదు. భారీ కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఇక్కడ కచ్చితంగా పార్కింగ్ సమస్యలు తలెత్తే అవకాశముంది. మరోవైపు ఆడిటోరియంను మరింత సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో అదనంగా రూ. 2.06కోట్ల నిధులు కావాలని పర్యాటక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో మినీ హాల్లో సీట్ల ఏర్పాటు, అదనంగా రెండు లిఫ్ట్‌లు, ఆడిటోరియం అద్భుతంగా చూపరులను ఆకట్టుకునే విధంగా లైటింగ్, ప్రొజెక్టర్ తదితర పనులను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ముందుకుసాగకపోవడం వల్ల కూడా ‘మహతి’ కళ తప్పిందని చెప్పొచ్చు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని హరిత హోటల్ అంశం ఉన్నతాధికారుల దృష్టిలో ఉంది. ఇకపోతే మహతి ఆడిటోరియం నిర్వహించడానికి వారం క్రితం టెండర్లో ఒకరు ముందుకొచ్చారు. ఆడిటోరియం ఎప్పటిలాగే వినియోగంలోకి తెస్తాం. ఇతర అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – రమేశ్‌నాయక్, ఏజీఎం, టూరిజం శాఖ నిరుపయోగంగా హరిత హోటల్ ఏడాదిగా కార్యక్రమాలు జరగని మహతి ఆడిటోరియం -
ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి మేలు
నంగునూరు(సిద్దిపేట): రసాయన ఎరువులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రముఖ పారిశ్రామిక వేత్త వంగ రాజేశ్వర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంటల పరిశీలనలో భాగంగా శుక్రవారం ముండ్రాయి లోని రాజేశ్వర్‌రెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయలు, పూలు, పండ్ల తోటల సాగులో అవలంబిస్తున్న పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి కృషి
● విదేశీ ప్రతినిధుల బృందం స్పష్టీకరణ ● మరోవైపు ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం ● సందడిగా వర్గల్ పూలే గురుకులం వర్గల్(గజ్వేల్): స్థానిక జ్యోతిబాపూలే గురుకులం రెండు వేర్వేరు కార్యక్రమాలతో సందడిగా మారింది. ఒకే ప్రాంగణంలోని మహిళా డిగ్రీ కళాశాలను గురువారం కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు సందర్శించగా, జూనియర్ కళాశాలలో అండర్–17 ఉమ్మడి జిల్లాస్థాయి ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఆటల పోటీలను పూలే గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్‌లాల్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, ఆర్సీఓ రాజేశంతో కలిసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. డిగ్రీ కళాశాలలో కాగ్నిజెంట్ సంస్థ ప్రతినిధులు మహిళా డిగ్రీ కళాశాలను కాగ్నిజెంట్ విదేశీ కంపెనీ ప్రతినిధులు మైఖేల్, రూట్టలెడ్జి, సుసన్, మౌనిక, కారోల్ భోరాసకి,థామస్ జోన్స్, వైవీట్టే వర్గాస్, కోటగిరి మురళి, శ్రీరామ్ రంగమణి, నేహా రీచార్య, బిభాస్ రాయ్, అనురాధ, లావణ్య తదితరులు సందర్శించారు. ప్రయోగశాలను సందర్శించి విద్యార్థుల ప్రయోగాత్మక పరిజ్ఞానాన్ని అభినందించారు. గురుకులంలో విద్యార్థుల కోసం అవసరమైన ప్రయోగశాల సామగ్రి, కంప్యూటర్లను అందజేస్తామన్నారు. విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విదేశీ ప్రతినిధులకు ప్రిన్సిపాల్ భాస్కర్‌రావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గురుకులాల జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ లాల్ హాజరుకాగా, ఆర్సీఓ రాజేశం, వీపీ గోవిందరావు, అధ్యాపకులు రాధ, జయ తదితరులు పాల్గొన్నారు. -
నాన్నా.. క్షేమంగా రండి
‘నాన్నా.. పది నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు.. క్షేమంగా ఇంటికి రండి’ అంటూ ఇద్దరు యువకులు వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు తరుచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో గురువారం సిద్దిపేట పట్టణం గాంధీనగర్‌కు చెందిన ఇద్దరు యువకులు వెంకి, సాయి.. మోడ్రన్ బస్టాండ్ చౌరస్తాలో టెడ్డీ మాస్కులు, ఫ్లెక్సీలతో ట్రాఫిక్, రోడ్డు నిబంధనలపై వివరించారు. ఈ సందర్భంగా బ్యానర్లు ప్రదర్శించారు. ఇది చూసిన వాహనదారులు, ప్రజలు యువకులను అభినందించారు. – సిద్దిపేటకమాన్పది నిమిషాలు ఆలస్యమైనా ఫర్వాలేదు టెడ్డీ మాస్కులతో యువకుల వినూత్న అవగాహన -
పరిశ్రమలతో అభివృద్ధి వేగిరం
● కలెక్టర్ హైమావతి ● టీజీఐఐసీ భూముల్లో హద్దుల నిర్ధారణకు సర్వేవర్గల్(గజ్వేల్): పరిశ్రమల రాకతో వర్గల్ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని, పట్టాదారులకు, పరిశ్రమ వర్గాలకు భూహద్దుల విషయంలో ఎవరికీ అన్యాయం జరగకుండా పరిష్కరిస్తామని కలెక్టర్ హైమావతి అన్నారు. గురువారం వర్గల్ మండల కేంద్రంలోని 1641, 1642 సర్వేనంబర్లలో పలు కంపెనీలకు టీజీఐఐసీ కేటాయించిన భూమిలో భూ హద్దుల సమస్య తలెత్తిన ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. రెండు సర్వే నంబర్లలో సర్వే జరిపి హద్దులు ఏర్పాటుచేయాలని ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ వినయ్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్ వెంట టీజీఐఐసీ ఎండీ కాశిరెడ్డి, ఆర్డీఓ చంద్రకళ, తహసీల్దార్ రఘువీర్‌రెడ్డి, కంపెనీల ప్రతినిధులు, రైతులు ఉన్నారు. ఆస్పత్రి తనిఖీ ఆస్పత్రి నూతన భవనంలోకి వెంటనే ఫర్నీచర్ షిఫ్ట్ చేయాలని కలెక్టర్ డీఎంహెచ్ఓను ఆదేశించారు. గురువారం ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించారు. మెడిసిన్ కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు. ఆసుపత్రిలో లీకేజీ సమస్యలు వెంటనే పరిష్కరించాలని పీఆర్ ఈఈని ఆదేశించారు. ఆసుపత్రిలో అవుట్పేషంట్లు పెరగాలని, మెరుగైన వైద్యసేవలందించాలని వైద్యాధికారిని ఆదేశించారు. అపరిశుభ్రతపై ఆగ్రహం కొండపాక(గజ్వేల్): కుకునూరుపల్లిలోని హైస్కూల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా విద్యాధికారికి ఫోన్ ద్వారా ఆదేశించారు. కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, కుకునూరుపల్లి హైస్కూళ్లను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి సూచనలు చేశారు. హైస్కూల్ ఆవరణ అపరిశుభ్రంగా ఉంటే హెచ్ఎం ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఉపాధ్యాయులు విధి నిర్వహణపై అలసత్వం చూపితే సహించేదిలేదంటూ హెచ్చరించారు. క్రమ శిక్షణతో కూడిన మెరుగైన బోధన అందించాలన్నారు. అనంతరం తిమ్మారెడ్డిపల్లి హైస్కూల్ ఆవరణలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలు హాజరు శాతాన్ని పౌష్టికాహార పంపిణీల రిజిస్టరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ బచ్చలి సత్తయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పుస్తకాల్లేవ్.. చదువెట్ల?
కళాశాలలు తెరిచి ఐదు నెలలైనా అందని పుస్తకాలుఇంటర్మీడియెట్ సిలబస్ పూర్తికావొస్తోంది.. మరోవైపు పరీక్షలు ముంచుకొస్తున్నాయి. అయినా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నేటికీ పాఠ్య పుస్తకాలు అందలేదు. కళాశాలలు ప్రారంభమై ఐదు నెలలు కావొస్తున్నా అందకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. చేసేదిలేక కొందరు సీనియర్ల పాత పుస్తకాలతో, మరికొందరు ఇతరులపై ఆధారపడి సరిపెట్టుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించి పాఠ్యపుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. – సాక్షి, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. అందులో 5,350 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2025–26 విద్యాసంవత్సరం జూన్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలను అందజేస్తోంది. కళాశాల ప్రారంభోత్సవం రోజునే పాఠ్యపుస్తకాలను అందజేయాలి. పలువురు విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలను ఇవ్వకపోవడంతో కొందరు పాత పుస్తకాలను సీనియర్ల దగ్గర తీసుకున్నారు. మరికొందరు పాఠ్యపుస్తకాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం కలిపి 5,350 మంది విద్యార్థులుండగా ఇంకా 6,155 పాఠ్య పుస్తకాలు రావాల్సి ఉంది. విద్యార్థులు చదువుకునేందుకు.. ఆధ్యాపకులు బోధించే పాఠాలు అర్థమయ్యేందుకు.. ఇంటి వద్ద పునశ్ఛరణ చేసుకునేందుకు పాఠ్య పుస్తకాలు ఎంతో అవసరం. పరీక్షలు సమీపిస్తున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందలేదు. పుస్తకాల కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఉత్తీర్ణత శాతం తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి త్వరగా పాఠ్యపుస్తకాలు అందించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంటర్ దశ కీలకం దుబ్బాక: విద్యార్థులకు ఇంటర్ దశ ఎంతో కీలకమైనదని ఇంటర్మీడియెట్ బోర్డు ఉమ్మడి మెదక్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కిషన్ అన్నారు. గురువారం దుబ్బాక పట్టణంలోని ఎస్ఆర్, వాగ్దేవి జూనియర్ కళాశాలలతో పాటు లచ్చపేట మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలను, రామక్కపేట గురుకుల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు, ప్రయోగశాలలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలంటే భయపడకుండా బాగా చదవాలన్నారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలన్నారు. అలాగే విద్యార్థులకు పలు సూచనలు చేశారు. -
ప్రతీ పంటకు నష్ట పరిహారం చెల్లిస్తాం
● రైతులు ఆందోళన చెందొద్దు ● జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి జగదేవ్‌పూర్(గజ్వేల్): కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు గేట్ల మొరాయింపుతో కాల్వల ద్వారా పంట నష్టం జరిగిన ప్రతీ రైతుకు నష్ట పరిహారం అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. కాల్వల ద్వారా పంట నష్టం జరిగిన ఇటిక్యాల, లింగారెడ్డిపల్లి, జగదేవ్‌పూర్ గ్రామాల్లో గురువారం ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ వద్ద గేట్లు మొరాయింపు జగదేవ్‌పూర్ మండల మీదుగా వెళ్లే కాల్వలు నిండి పొంగి పంట పొలాల్లోకి చేరినట్లు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఆయా గ్రామాల్లో వరి, పత్తి సుమారు వంద ఎకరాల్లో పంట నష్టం జరగవచ్చని, రెవెన్యూ అధికారుల నివేదన ప్రకారం ప్రతి పంటకు నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందకుండా పంట నష్టం వివరాలను రెవిన్యూ, వ్యవసాయ అధికారులకు తెలుపాలన్నారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలను సేకరించాలని అదేశించారు. -
అధిక కేసులు రాజీ కుదర్చాలి
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి హుస్నాబాద్: లోక్ అదాలత్‌లో అధిక కేసులు రాజీ కుదర్చాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రేవతి కోరారు. ఈ నెల 15న నిర్వహించే స్పెషల్ లోక్ అదాలత్ సందర్భంగా గురువారం కోర్టు హాలులో పోలీస్ అధికారులతో కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు. జడ్జి రేవతి మాట్లాడుతూ కక్షిదారులు చిన్న చిన్న తప్పులకు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోకుండా రాజీ మార్గాన్ని ఎంచుకోవాలన్నారు. పెండింగ్ కేసులను వీలైనంత ఎక్కువగా రాజీ కుదిరేలా చేయాలన్నారు. సమావేశంలో పోలీస్, ఎకై ్సజ్ పోలీస్, బ్యాంక్ అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
సేవలు.. వెల్లెస్
సిద్దిపేటకమాన్: ప్రభుత్వ వెల్నెస్ సెంటర్లో వైద్య సేవలు కరువయ్యాయి. వైద్య సేవల నిమిత్తం వచ్చే వారిని పరీక్షించే బీపీ మెషీన్లు పనిచేయకపోవడం, బీపీ పరీక్షించే స్టాఫ్‌నర్సు లేకపోవడం, పోస్టు ఖాళీగా ఉండడంతో వైద్య సేవల కోసం వచ్చే వారు ఇబ్బందులు పడుతున్నారు. వెల్నెస్ సెంటర్‌పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, వైద్యు లు, సిబ్బంది సైతం సమయ పాలన పాటించకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడంలేదు. రోజూ 100 నుంచి 125మంది రాక.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం జిల్లా కేంద్రం సిద్దిపేటలోని పాత ఎంసీహెచ్ భవనంలో వెల్నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండటంలేదు. రోజూ ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30గంటల వరకు ఓపీ సేవలు అందుబాటులో ఉంటాయి. వెల్నెస్కు రోజూ సుమారు 100 నుంచి 150మంది వరకు వస్తుంటారు. ఎక్కువ మంది బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నవారు చికిత్స, మందుల కోసం వస్తారు. కానీ సెంటర్లో కొంత కాలంగా స్టాఫ్ నర్సు పోస్టు ఖాళీగా ఉండటంతో బీపీ సమస్యతో బాధపడుతూ సెంటర్‌కు వచ్చే వారు బీపీ పరీక్షించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చేసేదిలేక ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇతర సెంటర్ల నుంచి, కానీ సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి కానీ డిప్యుటేషన్‌పై సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అందని వైద్య సేవలు సెంటర్లో 22 మంది సిబ్బంది వెల్నెస్ సెంటర్లో ప్రస్తుతం ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ఇద్దరు డెంటల్ డాక్టర్లు (వీరిలో ఒకరు సెంటర్ ఇన్చార్జి), ఇద్దరు డెంటల్ అసిస్టెంట్లు, ఇద్దరు ఫిజియోథెరపిస్ట్‌లు, ముగ్గురు ఫార్మసిస్టులు, ముగ్గురు డీఈఓలు, ముగ్గురు మెడికల్ ఆఫీసర్ల అసిస్టెంట్లు, ఇద్దరు ల్యాబ్ టెక్నీషీయన్లు, ముగ్గురు స్వీపర్లు విధులు నిర్వహిస్తున్నారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. సెంటర్‌పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ వేసి సొంత పనుల నిమిత్తం బయటకు వెళుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారు లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, స్టాఫ్ నర్సును ఏర్పాటు చేసి, అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు కోరుతున్నారు. -
ఆకాశ వీధిలో.. అందాల జాబిలి
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025కనువిందు చేసిన పౌర్ణమి చంద్రుడు సిద్దిపేటలోని వేంకటేశ్వర ఆలయంలో కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులుకార్తీక పౌర్ణమి చంద్రుడు కనువిందు చేశాడు. మునుపెన్నడూ లేని విధంగా సూపర్ మూన్ ఆకట్టుకుంది. నింగిలో చల్లనయ్య పండు వెన్నెలను కురిపించాడు. చంద్రుడు ఇలా భూమికి దగ్గరగా రావడం ఏడాదికి రెండు సార్లు జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు చంద్రుడిని ఆసక్తిగా తిలకించారు. దుబ్బాకటౌన్/మిరుదొడ్డి(దుబ్బాక) -
పాలన భారమాయె.. అప్పులు అధికమాయె
● పంచాయతీ కార్యదర్శులకు నిత్యం గండం ● ‘స్థానిక’ ఎన్నికల వాయిదాతో మరింత ఆందోళన చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామ పంచాయతీ పాలన కార్యదర్శులకు నిత్యం గండంగా మారింది. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ఉండటంతో మొత్తం భారమంతా పంచాయతీ కార్యదర్శులపైనే పడుతోంది. పారిశుద్ధ్య పనులు, నీటి సరఫరా, ఏ చిన్న సమస్య తలెత్తినా కార్యదర్శే డబ్బులు వెచ్చించి పనులు చేయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో కార్యదర్శులు తమ జీతాల నుంచి పంచాయతీల్లో చేసే పనులకు పెట్టుబడులు పెడుతూ అప్పుల పాలవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి నిధులు వస్తాయని భావించినా ఎన్నికలు వాయిదా పడటంతో గ్రామాల్లో నిధుల కొరతతో అభివృద్ధి కుంటుపడుతోంది. అత్యవసర పనులకు అప్పులు జిల్లాలో 508 గ్రామ పంచాయతీలు.. 480 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఆ గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టకపోతే ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదర్శులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో శానిటేషన్, బ్లీచింగ్, విద్యుత్ బల్బుల ఏర్పాటు, మోటార్ల రిపేరు వంటి పనులకు కార్యదర్శులే అప్పులు తెచ్చి పెడుతున్నారు. దీంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో పాటు, మంజూరైన నిధులకు కూడా బిల్లులు పాస్ కాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. నిధులు విడుదల చేయాలి గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. నిధులు లేక ఆర్థిక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. శానిటేషన్, ట్రాక్టర్ రిపేర్లు, డీజిల్ తో పాటు వీధి దీపాలకు ఇబ్బందిగా మారింది. పంచాయతీలకు పాలకవర్గాన్ని ఏర్పాటు చేసే వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. – రాజు, పంచాయతీ కార్యదర్శి, పెద్దకోడూరు -
అందరికీ సమాన విద్యే లక్ష్యం
పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్గజ్వేల్: అందరికీ సమానమైన శాసీ్త్రయ విద్యను సాధించడమే లక్ష్యంగా పీడీఎస్‌యూ (ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం) ఆవిర్భవించిందని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్ తెలిపారు. బుధవారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనెల 19న గజ్వేల్‌లో నిర్వహించనున్న పీడీఎస్‌యూ నాలుగో జిల్లా మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీడీఎస్‌యూ 50ఏళ్లుగా అనుకున్న లక్ష్యం కోసం రాజీలేని పోరాటాలను కొనసాగిస్తున్నదని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 19న గజ్వేల్‌లో నాలుగో మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో విద్యారంగ సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ మాట్లాడుతూ విద్యారంగానికి సముచిత బడ్జెట్ కేటాయింపులు జరగకపోవడం వల్ల.. తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని వాపోయారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు దేవులపల్లి రమేశ్, టీపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు రాజులు, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రామునిబండ.. జనం నిండా
● భక్తులతో కిటకిటలాడిన ఆలయం ● ఆలయ గోపురానికి భూమిపూజ రామునిబండకు భక్తజనం పోటెత్తారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జంగంరెడ్డిపల్లి సమీపంలోగల బండమీది సీతారాముల ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతియేటా కార్తీకపౌర్ణమి నుంచి రెండు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా బుధవారం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఆలయ గోపుర నిర్మాణానికి నిర్వాహకులు భూమిపూజ నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే భక్తులు గుండంలో స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు. – జగదేవ్‌పూర్(గజ్వేల్) -
మల్లన్న ఆలయంలో ఏకాదశ రుద్రాభిషేకం
కొమురవెల్లి(సిద్దిపేట): కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మల్లన్న ఆలయంలో బుధవా రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, సహస్ర బిల్వార్చన, అన్న పూజ నిర్వహించారు. అనంతరం అర్చకులు ప్రసాదవితరణ గావించారు. లక్షదీపోత్సవం మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని గంగిరేణు చెట్టు ప్రాంగణంలో లక్షదీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం సురభి నాట్యమండలిచే భూకై లాస్ నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వెంకటేశ్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు,ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ట్యాంకు నిర్మాణానికి చర్యలు మిరుదొడ్డి(దుబ్బాక): శిథిలావస్థకు చేరిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు స్థానంలో కొత్త ట్యాంకు నిర్మాణానికి చర్యలు తీసుకుంటా మని మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ రామచందర్ తెలిపారు. అక్టోబర్ నెల 25న ‘సాక్షి’లో ప్రచురితమైన అమ్మో... వాటర్ ట్యాంక్ అన్న వార్తా కథనానికి అధికారులు స్పందించారు. బుధవారం మిరుదొడ్డిలో శిథిలావస్థకు చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాటర్ ట్యాంకును ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ కొత్త వాటర్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని కింది స్థాయి అధికారులకు సూచించారు. ఆయన వెంట ఎస్ఈ వెంకట్‌రెడ్డి, ఈఈ నర్సింహులు గౌడ్, డీఈ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా జట్టు ఘన విజయంమెదక్ కలెక్టరేట్: రాష్ట్రస్థాయి బాలికల ఫుట్‌బాల్ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లా జట్టు ఘన విజయం సాధించింది. వికారాబాద్ జిల్లాలో ఈనెల 3నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రస్థాయి అండర్ –14 బాలికల టోర్నమెంట్ జరిగింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో రంగారెడ్డితో జరిగిన మ్యాచ్‌లో1–0తో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఫైనల్లో ఉమ్మడి నల్లగొండ జట్టుపై హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో డ్రాతో ముగియగా తదనంతరం జరిగిన పెనాల్టీ షూటవుట్‌లో ఉమ్మడి జిల్లా జట్టు నల్లగొండ జిల్లా జట్టుపై 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. -
గడువులోగా సిలబస్ పూర్తి
డీఐఈఓ రవీందర్‌రెడ్డి ఆదేశంసిద్దిపేటఎడ్యుకేషన్: విద్యార్థి దశలో ఇంటర్మీడియెట్ అత్యంత ముఖ్యమైన దశ అని, క్రమశిక్షణ, పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానాల్లో ఉండాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వరంగ జూనియర్ కళాశాలలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. అధ్యాపకులు గడువులోగా సిలబస్ పూర్తి చేయాలని, వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు తీసుకోవాలని సూచించారు. కళాశాలల్లో వసతులు, ఎఫ్ఆర్ఎస్, యూడైస్, టీచింగ్ డైరీలు, కళాశాల రికార్డులు, అధ్యాపకులు హాజరు తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్ని కళాశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ఇంటర్లో ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించేలా అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
వాన
వెంటాడుతున్న● కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం ● నేలవాలుతున్న వరి, రంగు మారుతున్న పత్తి ● జిల్లాలోని 14 మండలాల్లో 5,488 ఎకరాల్లో పంట నష్టం సాక్షి, సిద్దిపేట: పంట చేతికొచ్చే వేళ అకాల వర్షాలతో రైతులు అరిగోసపడుతున్నారు. వరి పైర్లు నేలవాలగా, ఇంటికి చేరాల్సిన పత్తి తడిసిమద్దయి రంగు మారుతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టం చేతికి అందని పరిస్థితులతో కన్నీరు మున్నీరవుతున్నారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి జిల్లాలో రోజు ఏదో ఒక చోట వర్షం పడుతోంది. జిల్లావ్యాప్తంగా 3,916 మంది రైతులకు చెందిన 5,483 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దాదాపు 300 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. అత్యధికంగా కోహెడలో జిల్లాలో వర్షాలకు 14 మండలాల్లో పంట నష్టం జరిగింది. పంట విక్రయించే దశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా కోహెడ మండలంలో 1,086 మంది రైతులకు చెందిన 1,895 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. తర్వాత హుస్నాబాద్‌లో 1,499, నంగునూరులో 703, అక్కన్నపేటలో 551 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. అవస్థలు పడలేక పచ్చి వడ్ల విక్రయం నిమిషాల్లోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. తేమ ఉండటంతో కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో వడ్లను ఆరబెట్టేందుకు అవస్థలు పడలేక పచ్చి వడ్లనే మిల్లర్లకు విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లర్లు ఇదే అదనుగా దోపిడీకి పాల్పడుతున్నారు. క్వింటాల్ వడ్లను రూ. 1,600 నుంచి రూ. 1,700లకు కొనుగోలు చేస్తున్నారు. ఇబ్బందులను అధికారులు అర్థం చేసుకొని తేమశాతంలో కొంత వెసులుబాటు కల్పించాలని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా జిల్లాలో గత 20 రోజులుగా వరి కోతలు మొదలయ్యాయి. వాతావరణ మార్పులతో కొందరు పొలాలు కోయలేకపోతున్నారు. చాలా చోట్ల వరి నేలవాలడంతో వడ్ల గొలుసులు రాలిపోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇందిరమ్మ బిల్లు రావడం లేదని..
● పంచాయతీ కార్యాలయంలో వంటావార్పు ● ఓ లబ్ధిదారుడి వినూత్న నిరసన హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందంటే సంతోషంతో ముగ్గు పోసుకొని ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ఇల్లు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో నిరసనకు దిగారు. మంగళవారం హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వంట వార్పు చేశారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జనవరిలో 135 ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేసింది. మొదట లబ్ధిదారులకు కొలతల నిబంధనలు చెప్పక ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు ముగ్గు పోసి పనులు చేసుకోవాలని సూచించారు. మొదటి బిల్లు రూ.లక్ష మంజూరైన తర్వాత లెంటల్ లెవల్ బిల్లు దగ్గర అధికారులు కొర్రీలు పెట్టారు. 600 ఫీట్లు దాటితే బిల్లులు రావని చెప్పడంతో కొందరు ఇంటి పిల్లర్లను కూలగొట్టి స్లాబులు వేసుకున్నారు. కొందరు అప్పటికే స్లాబులు వేసుకోవడంతో వీరి సమస్యను స్థానిక నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదు. దీంతో తోటపల్లి లబ్ధిదారు శాతవేని ఏలేంద్ర అతని కొడుకు మహేశ్ బిల్లు రావడం లేదని అవేదనతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వంటావార్పు చేసి నిరసన తెలిపాడు. -
సర్వే అధికారుల పాత్ర కీలకం
● పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలి ● అధికారులకు కలెక్టర్ హైమావతి ఆదేశం సిద్దిపేటరూరల్: భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో సర్వే అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ కె.హైమావతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా, మండల సర్వే ల్యాండ్ శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై కలెక్టర్, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఎఫ్‌లైన్ పిటిషన్, అప్పీలు, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై ఆరా తీసారు. పెండింగ్‌లో దరఖాస్తులు పరిశీలించి, వెంటనే పరిష్కరించాలన్నారు. కొత్తగా ఎంపికై న లైసెన్స్ సర్వేయర్లను ఫీల్డ్ విజిట్ చేయించి, సర్వే అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. మిల్లర్లకు ఇబ్బందులు ఉంటే చెప్పాలి జిల్లాలో రైతులతో పాటు మిల్లర్లకు ఇబ్బందులు తలెత్తకుండా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ కె. హైమావతి మిల్లర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో 2025–26 కాటన్ మార్కెట్ ఎంఎస్పీ కింద పత్తి సేకరణకు సంబంధించి మిల్లర్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మిల్లర్లు ఎల్1, ఎల్2, ఎల్3, ఎల్ 4 ఎంపిక విధానం వల్ల జిల్లా పరిధిలో మొత్తం 22 జిన్నింగ్ మిల్లులకు 10 మిల్లుల్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. రైతులు పండించిన పంటను పాత జిల్లాల పరిధిలో యాప్ ద్వారా రైతులే మిల్లులను ఎంచుకుంటారన్నారు. మిల్లుల సామర్థ్యాన్ని మించి పంట నిల్వలు ఉన్నట్లయితే, మరో మిల్లుకు తరలించుకునే అవకాశం రైతులకు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఎం మార్కెటింగ్ నాగరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ, మిల్లర్లు పాల్గొన్నారు. హుస్నాబాద్: పంచాయతీ రాజ్ శాఖలో ఈజీఎస్ కింద చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనాలను డిసెంబర్ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. పట్టణ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోహెడ నుంచి సముద్రాల రోడ్డు బీటీ రోడ్డు, హుస్నాబాద్‌లో జంక్షన్, ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆర్డీఓ రామ్మూర్తి, డీఆర్డీఓ జయదేవ్ ఆర్య, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, అధికారులు పాల్గొన్నారు. -
మళ్లీ వర్షం.. రైతుల పరేషాన్
దుబ్బాకతోపాటు పలుగ్రామాల్లో వర్షం దుబ్బాక: ఇప్పటికే వర్షాలకు ధాన్యం తడిసిపోయి అవస్థలు పడుతోన్న రైతుల పరిస్థితి తాజా వర్షంతో మూలిగేనక్కమీద తాటిపండు పడ్డటైంది. దుబ్బాక,చెల్లాపూర్,రాజక్కపేట, రఘోత్తంపల్లి,రామక్కపేట,ఆకారం, లచ్చపేట, ధర్మాజీపేటతోపాటు పలు గ్రామాల్లో మంగళవారం కూడా వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మళ్లీ తడిసిపోయింది. ఇప్పటికే ధాన్యం తడిసి మొలకలు రావడం, వరదల్లో కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారింది. తమ వడ్లు తడిసిపోవడంతో ఆ నీళ్లను తొలగించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. వర్షాలకు వడ్లు తడిసిపోవడంతో మ్యాచర్రాక కొనుగోలు ప్రక్రియ సైతం మందకొడిగా సాగుతుండటంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని లేకుంటే ఈ వర్షాలకు చేతికిరాకుండా పోతుందంటూ రైతులు వాపోతున్నారు.ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పోరుబాట పట్టనున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్నికయిన వంగ మహేందర్‌రెడ్డి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు మూడు నెలల్లోపు చెల్లిస్తామని, సీపీఎస్ రద్దు చేస్తామని, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. డిసెంబర్ 9లోపు హామీలు నెరవేర్చకుంటే పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ, రాష్ట్ర ఆడిట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పత్రిక సంపాదక వర్గ సభ్యురాలు లక్కిరెడ్డి విజయ, శుభాకర్ రెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్‌మావో చేర్యాల(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లలో విధించిన ఆంక్షలు తొలగించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్‌మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధి వీరన్నపేట శివారులోని మహేశ్వరి కాటన్ ఇండస్ట్రీస్‌లో పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా.. ఆంక్షలు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. పత్తి అమ్మాలంటే యాప్‌లో నమోదు చేయాలని, ఎకరాకు 7క్వింటాళ్ల వరకు మాత్రమే సీసీఐ ద్వారా కొనుగోలు చేస్తా మని నిబంధనలు పెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నర్సిరెడ్డి, ధర్మారెడ్డి, సంపత్, మల్లయ్య, నర్సింహులు పాల్గొన్నారు. నర్సాపూర్ రూరల్: మండలంలోని నారాయణపూర్ గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇటీవల మెదక్, తూప్రాన్‌లో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి అండర్–14 వాలీబాల్ బాలికల జట్టుకు 9వ తరగతి విద్యార్థినులు అఖిల, శ్రీజ, వైష్ణవి సెలక్ట్ అయ్యారు. అండర్–17 రబ్బి జట్టుకు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఎన్. వందన, 9వ తరగతి విద్యార్థులు నందిని, సారిక, జిమ్నాస్టిక్స్ రాష్ట్రస్థాయికి మొదటి సంవత్సరం విద్యార్థిని వందన ఎంపికై ంది. జిల్లాస్థాయి అండర్ 17 అథ్లెటిక్స్‌కు 9వ తరగతి విద్యార్థిని హర్షిని 1,500 మీటర్ల పోటీలో గెలుపొందింది. ఎంపికై న విద్యార్థులను మంగళవారం ప్రిన్సిపాల్ లలితాదేవి, పీడీ సాలి, అధ్యాపక బృందం విద్యార్థులు అభినందించారు. -
రైతులు అధైర్య పడొద్దు
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వర్గల్(గజ్వేల్): రైతు దేశానికి వెన్నెముక రైతేనని అంతటి గొప్పదనం కలిగిన అన్నదాతలు అధైర్య పడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. వర్గల్ మండలం తున్కిఖాల్సా ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మంగళవారం ఏర్పాటు చేసిన ‘అగ్రి ఎక్స్పో’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థుల్లో వ్యవసాయం, పనిముట్లు, విత్తనాలు, సేంద్రియ ఎరువుల తయారీ తదితరాలపై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమం అభినందనీయమన్నారు. సాగు సేంద్రియం వైపు సాగాలని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలకు ప్రైవేటు అప్పులు, అధిక వడ్డీ కారణమని చాలా ఘటనల్లో వెల్లడైందని, మనీ లెండింగ్ లైసెన్సింగ్ విధానం మారాల్సిన అవసరముందని చెప్పారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం కృష్ణ సౌజన్య, ఉపాధ్యాయులు శ్యామ్ రాథోడ్, పులిరాజు, మంజులరెడ్డి, విమల, రుక్మిణి శ్రీనివాస్, జరీనా, ఫర్హిన్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు పాఠశాల ప్రాంగణంలో నాగలి, ట్రాక్టర్, వ్యవసాయ బావి, పొలంలో మంచె, గుడిసె, ఎద్దులు, గడ్డివాము, నిచ్చెన, కొడవలి, గడ్డపార, పార, రోలు, రోకలి, కుదురు, సాగు కోసం కట్టిపెట్టిన వివిధ విత్తనాలు, పాత, కొత్త వ్యవసాయోపకరణాలను విద్యార్థులు స్టాల్స్ మాదిరి ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. రైతులను గుర్తుకు తెచ్చే వస్త్రధారణలో వారు ఆయా అంశాలను వివరిస్తూ సందర్శకులకు అవగాహన కల్పించారు. ఆయా ప్రదర్శనలు నేటి తరం ఆలోచింపజేసేలా ఆకట్టుకున్నాయి. -
ఔరా.. ఇది సర్కార్ స్కూలే..!
ఈ చిత్రంలో కనిపిస్తోంది చెరువు నిండుకుండలా మారింది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇది సాక్ష్యాత్తు వందలాది మంది పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాల. నంగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ మొత్తం ఇటీవల కురిసిన వర్షాలకు చెరువును మరిపించేలా వరదనీరు చేరింది. ఉపాధ్యాయుల, విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం లేదు. దీంతో విద్యార్థులు రోజు నీటిలోనే నుంచే పాఠశాలకు వెళ్సాల్సి వస్తుంది. –సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ప్రజలు అందిస్తున్న అర్జీలను స్వీకరించిన అధికారులను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు అందించిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం అందిస్తున్న అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. వివిధ రకాల సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 154 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్ఓ నాగరాజమ్మ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన రైతన్నలు
ధాన్యం కొనాలంటూ ఆందోళన రహదారిపై భారీ ధర్నా, రాస్తారోకో స్తంభించిన రాకపోకలు ● దుబ్బాకలో పరిస్థితి ఉద్రిక్తంమంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025దుబ్బాకలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులుదుబ్బాక: ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ రైతులు రోడ్డెక్కారు. భారీ వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సోమవారం దుబ్బాక పట్టణంలో రైతులు ఆందోళనకు దిగారు. వందలాది మంది రైతులు మార్కెట్‌యార్డు వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అక్కడినుంచి పట్టణంలోని శివాజీచౌక్ వద్దకు చేరుకొని సిద్దిపేట–దుబ్బాక ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 2 గంటలకు పైగా ఆందోళన రైతులు రెండుగంటలకుపైగా ఆందోళన చేపట్టడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కీర్తిరాజు, భూంపల్లి ఎస్ఐతో పాటు పెద్ద ఎత్తున పోలీసుబలగాలు అక్కడి చేరుకొని ఆందోళన విరమించాలని రైతులకు నచ్చజెప్పినా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదంటూ భీష్మించి కూర్చున్నారు. తహసీల్దార్ సంజీవ్‌కుమార్ సైతం రైతులకు న్యాయం జరిగేలా చూస్తామంటూ చెప్పినా ఫలితం కానరాలేదు. ఓ దశలో రోడ్డుపై వంటావార్పు చేసేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. స్తంభించిన ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మొలకొచ్చిన వడ్లతోనిరసనతహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం పారబోతనంగునూరు(సిద్దిపేట): తడిసిన వడ్లను కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనకు దిగారు. సోమవారం నంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో తడిసిన, మొకల వచ్చిన వడ్లను పారబోసి నిరసన తెలిపారు. మోంథా తుపాన్‌తో చాలా గ్రామాల్లో వడ్లు తడవడంతో మొలకలు వచ్చాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చినా వడ్లు ఎండే పరిస్థితి లేకపోవడంతో కొన్ని రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు కొనకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మొలక వచ్చిన వడ్లు పోసి నిరసన తెలిపారు. వ్యవసాయ అధికారులు స్పందించకపోవడంతో మండల కేంరంలోని వివేకానంద సర్కిల్ వద్ద రాసారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో విరమించాలని నచ్చజెప్పారు. వినకపోవడంతో రూరల్ సీఐ శ్రీణు, ఎస్ఐ వివేక్ తహసీల్దార్, ఏఓకు ఫోన్ చేసి సమస్యను వివరించారు. డీఎస్ఓ తనూజతో పాటు తహసీల్దార్ మాధవి, ఏఓ గీత అక్కడి చేసుకొని రైతులను సముదాయించారు. సమస్యను ఉన్నతాధికారులకు వివరించి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.కొనుగోళ్లపై అలసత్వం వద్దుతడిసిన ధాన్యం పరిశీలన మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులు పరిశీలించారు. వరదలో కొట్టుకుపోయిన వడ్లపై సైతం ఆరా తీశారు. తడిసిన వడ్లను కొనకుంటే మాకు చావే దిక్కు అంటూ నాగవ్వ, బాల్‌రెడ్డితో పాటు పలువురు రైతులు తమ వడ్లను చూపిస్తూ బోరున విలపించారు. ఉన్నతాధికారులకు నివేదించి తప్పకుండా న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.సీఐ, తహసీల్దార్ కాళ్లపై పడుతూ.. మా వడ్లను కొనాలంటూ పలువురు మహిళా రైతులు సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ సంజీవ్‌కుమార్ కాళ్లమీద పడబోగా వారు వారించారు. ‘తప్పకుండా న్యాయం చేస్తాం బాధపడొద్దు’ అంటూ రైతులకు ధైర్యం చెప్పారు. -
పీహెచ్‌సీల దశ మారేనా..? అక్కన్నపేట మండలంలో ఆరోగ్యఉప కేంద్రాల నిర్మాణాలు ఏళ్లుగాసాగుతున్నాయి. వివరాలు 11లో u
పంట నష్టం నమోదు చేసుకోండి ● రైతులు ఆందోళన చెందొద్దు ● పంటల సర్వేకు ప్రత్యేక బృందాల ఏర్పాటు ● జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి హుస్నాబాద్‌రూరల్: గ్రామాలకు వచ్చే వ్యవసాయ అధికారులకు రైతులు పంట నష్టంపై సమాచారం ఇచ్చి నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి తెలిపారు. సోమవారం పందిల్ల గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు. హుస్నాబాద్ మండలంలో పంట నష్టాన్ని సర్వే చేయడానికి 30 మంది ఏఈఓలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతుల వారీగా పంట నష్టం వివరాలను సేకరించి మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఏఈఓలకు సూచించారు. దెబ్బతిన్న ప్రతి రైతు పంటను నమోదు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాలకు వచ్చిన అధికారులకు రైతులు వారి పంటల వద్దకు తీసుకెళ్లి నమోదు చేయించాలని చెప్పారు. -
భారతీయ సంప్రదాయం మహోన్నతం
ఎంపీ ఈటల రాజేందర్వర్గల్(గజ్వేల్): సీ్త్రలను గౌరవిస్తూ, దేవతలుగా పూజించుకునే భారతీయ సంప్రదాయం మహోన్నతమైనదని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం వర్గల్ మండలం చిన్న దండుపల్లి పోచమ్మ ఆలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని భూమాతగా పూజిస్తామని, మైసమ్మ, ముత్యాలమ్మ, సీతాలమ్మ అందరూ తల్లులే మనలను కాపాడుతారన్నారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని, చల్లగా చూడాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు బొల్లిపల్లి తిరుపతిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మెన్ గాడిపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా జరిగిన విగ్రహ ప్రతిష్ఠోత్సవాల్లో గ్రామస్తులు పాల్గొని తరించారు. సాయంత్రం బోనాల కార్యక్రమం నిర్వహించారు. -
పీఎఫ్ సొమ్ము స్వాహా
ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా పలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు స్వాహా చేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 20 ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలలో 1,650 మంది వివిధ హోదాల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మొత్తం డబ్బులు పొందుతూ ఉద్యోగుల ఈపీఎఫ్(ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్) మాత్రం చెల్లించడంలేదు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం వల్లే ఇలా జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా లక్షలాది రూపాయలు ఏజెన్సీలు మాయం చేయడం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ద్వారా పని చేసే ప్రతీ ఉద్యోగికి సంబంధిత ఏజెన్సీ ఈపీఎఫ్, ఈఎస్ఐ తప్పనిసరిగా చెల్లించాలి. ఉద్యోగుల వేతనంలో ఈపీఎఫ్ 14శాతం, ఈఎస్ఐ (ఎంప్లాయి సర్వీస్ ఇన్సూరెన్స్) 3.5శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇవేవి ఉద్యోగుల ఖాతాలలో జమ చేయకపోయినా అధికార యంత్రాంగం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే సిబ్బంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. రాజకీయ నాయకుల అండతోనే.. రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటం వల్లే అధికారులను సైతం ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించడం లేదని ఏజెన్సీ బాధ్యులను అడిగితే ఎక్కడ ఉద్యోగం నుంచి తొలగిస్తారేమోనని అడగకుండా ఉండిపోతున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు చెల్లించడం లేదు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీల టోకరా లక్షలాది రూపాయలు మాయం రాజకీయ నాయకుల అండతో ఇష్టారాజ్యం పట్టించుకోని జిల్లా యంత్రాంగంకొమురవెల్లి మల్లన్న దేవాలయంలో.. కొమురవెల్లి దేవాలయంలో దాదాపు 30 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఫిబ్రవరి 2021 నుంచి ఫిబ్రవరి 2025 వరకు కొనసాగిన ఏజెన్సీ నిర్వాహకులు ఈపీఎఫ్, ఈఎస్ఐ దాదాపు రూ.20లక్షలకు పైగా చెల్లించలేదు. ఉద్యోగులందరూ గతంలో కలెక్టర్‌కు, జిల్లా ఉపాధి అధికారికి విన్నవించారు. చివరకు పోలీస్‌స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేశారు. అలాగే అటవీ శాఖలో పని చేస్తున్న 12 మంది సిబ్బందికి 2023–24 సంబంధించి దాదాపు రూ.6లక్షల వరకు ఈపీఎఫ్, ఈఎస్ఐ చెల్లించలేదు. దీంతో సదరు ఏజెన్సీకి అటవీ శాఖ నోటీసులు సైతం జారీ చేసింది. ఇప్పటి వరకు సదరు ఏజెన్సీ నుంచి ఎలాంటి సమాధానం లేదని సమాచారం. అటవీ శాఖ నోటీసులు జారీ చేయడంతో సంబంధింత ఏజెన్సీలు ఉద్యోగులను బెదిరింపులకు గురి చేసి కొంత డబ్బులు ముట్టచెప్పి సెటిల్ చేసుకున్నట్లు లెటర్లు తీసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డబ్బు స్వాహా చేస్తున్నారు. విత్ డ్రా చేసుకుందామని వెళ్తే.. పిల్లల చదువు కోసం ఫీజు చెల్లించేందుకు పీఎఫ్ డబ్బులు కొంత విత్ డ్రా చేయాలనుకున్నా. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు వెళ్లా. పీఎఫ్ నంబర్‌తో చెక్ చేస్తే డబ్బులు లేవని తేలింది. విషయాన్ని తోటి ఉద్యోగులకు చెప్పాను. మాకు జరిగిన మోసాన్ని సదరు అధికారికి వివరించాం. వెంటనే అధికారి స్పందించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. – ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఫిర్యాదులు రాలేదు ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రైవేట్ ఏజెన్సీలు ఈపీఎఫ్‌లు చెల్లించడం లేదని ఫిర్యాదులు రాలేదు. సదరు ఉద్యోగులు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. ఏజెన్సీలు అందించే సెక్యురిటీ డిపాజిట్ డబ్బుల నుంచి కట్ చేసి ఈపీఎఫ్‌లు చెల్లించేందుకు కృషి చేస్తాం. – రాఘవేందర్, జిల్లా ఉపాధి అధికారి -
మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం భారీ సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. పుష్కరిణిలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ఉద్యోగులు, అర్చకులు, ఒగ్గుపూజారులు భక్తులకు సేవలందించారు. ఆలయ పర్యవేక్షకుడిగా చంద్రశేఖర్ ఆలయ పర్యవేక్షకుడు సురేందర్‌రెడ్డి ఇటీవల బదిలీపై వెళ్లగా, మరో పర్యవేక్షకుడు శుక్రవారం పదవీ విరమణ పొందారు. దీంతో దేవాదాయ శాఖ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్‌ను మల్లన్న ఆలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఆదివారం బాధ్యతలు చేపట్టారు. -
ఐత చంద్రయ్య రచనలు అమోఘం
జాసాప అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రముఖ కవి ఐత చంద్రయ్య రచనలు అమోఘమని, జాతీయ సాహిత్య పరిషత్ (జాసాప) అధ్యక్షుడు ఎన్నవెళ్లి రాజమౌళి అన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ఐతా చంద్రయ్య రచించిన ‘మంచుముద్ద’ కథకు చోటు దక్కింది. ఈ మేరకు ఆదివారం సిద్దిపేట శాఖ గ్రంథాలయంలో ఐత చంద్రయ్యను అభినందించారు. ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశంలు మాట్లాడుతూ కథా సాహిత్యంలో ఐతా చంద్రయ్య రచనలు అద్భుతమన్నారు. జాతీయ స్థాయి అవార్డులు సైతం ఐతా చంద్రయ్యకు లభించాలని ఆకాంక్షించారు. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ తన రచన మంచుముద్ద 1995లో రాసినట్లు తెలిపారు. మంచుముద్ద కథ డిగ్రీ కళాశాల తెలుగు పాఠంగా ఎంపిక చేయడంపై కళాశాల ప్రిన్సిపాల్, తెలుగు శాఖ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కవులు పెందోట వెంకటేశ్వర్లు, వరుకోలు లక్ష్మయ్య, బస్వరాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వినియోగదారుల సౌలభ్యానికే ప్రాధాన్యం
బెజ్జంకి(సిద్దిపేట): విద్యుత్ వినియోగదారుల సౌలభ్యానికి ప్రాధాన్యతనిస్తూ అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సిద్దిపేట విజిలెన్స్ ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డి అన్నారు. విజిలెన్స్ ఆవగాహన వారోత్సవాల సంర్భంగా మండలంలోని రామసాగరంలో ఆదివారం అవగాహన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కృష్ణతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఎవరైనా లంచం అడిగితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
కాలనీలన్నీ కంపు
జెట్టింగ్ యంత్రం లేక.. మురుగు వీడక గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 2020 జూన్ నెలలో ప్రారంభమైన యూజీడీ పనులు పూర్తయ్యాయి. తొలుత రూ.100కోట్లతో ప్రారంభమైన పనులు తర్వాత అంచనాలు పెరిగి.. రూ.155కోట్లతో 130కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. ఇందులో భూగర్భ మురుగునీటి పైప్‌లైన్ వ్యవస్థతో పాటు నాలుగు చోట్ల ఎస్టీపీ(సేవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్)ల నిర్మాణం చేపట్టారు. జెట్టింగ్ యంత్రం కోసంబతిమాలుకోవాల్సిందే.. మున్సిపాలిటీ పరిధిలో అతికష్టమ్మీద పనులు పూర్తయి.. యూజీడీ అందుబాటులోకి వచ్చినా.. ఈ వ్యవస్థ నిర్వహణ మాత్రం అధ్వానంగా మారింది. యూజీడీ పనులు లోపభూయిష్టంగా సాగటం వల్ల పలు కాలనీల్లో నిర్మించిన పైపులైన్లకు లీకేజీలు ఏర్పడ్డాయి. మరోవైపు కొన్ని చోట్ల చాంబర్ల ధ్వంసమయ్యాయి. ఫలితంగా జనావాసాల్లోకి యూజీడీ మురుగునీరు పారుతోంది. ఫలితంగా ముక్కుపుటలదిరే దుర్గంధం వెదజల్లుతోంది. ఎక్కడైనా యాజీడీ చాంబర్ల నిండితే.. వాటిని క్లియర్ చేయాల్సిన జెట్టింగ్ యంత్రం ఈ మున్సిపాలిటీకి అందుబాటులో లేదు. రూ.155కోట్లతో పనులు చేపట్టిన కాంట్రాక్ట్ ఏజెన్సీకి రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సాకుతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ మున్సిపాలిటీకి జెట్టింగ్ యంత్రం సమకూర్చలేదు. ఫలితంగా యూజీడీ నిండినా, లీకేజీల ఏర్పడి క్లియర్ చేయాల్సి వస్తే.. సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులను బతిమాలుకొని ఇక్కడికి జెట్టింగ్ మిషన్‌ను తెప్పించుకుంటున్నారు. సమయానికి రాకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రోజులు గడస్తున్నా.. క్లియర్ చేయడం లేదు మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో కొత్తగా బస్టాండ్ నిర్మిస్తున్న వెనుకభాగం కాలనీలో యూజీడీ నిండిపోయి లీకేజీ అవుతున్నా.. క్లియర్ చేసే పరిస్థితి లేదు. సిద్దిపేట యంత్రాన్ని ఇక్కడి మున్సిపల్ అధికారులు కొన్ని రోజులుగా అడుగుతున్నా.. బతిమాలుతున్నా.. ఇప్పటివరకు వారు పంపలేదు. ఫలితంగా వారం రోజులకుపైగా దుర్గంధభరితమైన నీటి లీకేజీ కాలనీవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీనివల్ల రోగాలు వేగంగా ప్రబలుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీకి సొంత జెట్టింగ్ యంత్రం సమకూర్చకపోతే పరిస్థితి దయనీయంగా మారే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం జెట్టింగ్ మిషన్ లేక యూజీడీ నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. యూజీడీ లీకేజీలు, నిండిపోతున్నాయంటూ నిత్యం పట్టణ ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయి. సకాలంలో సమస్యను పరిష్కరించకలేకపోతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సొంత జెట్టింగ్ యంత్రాన్ని సమకూర్చాలని కోరుతాం. – బాలకృష్ణ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కమిషనర్ రూ.కోట్లు వెచ్చించి యూజీడీ నిర్మించినా.. శుద్ధి యంత్రం కొనుగోలులోతీరని జాప్యం అధికారుల నిర్లక్ష్యమే కారణం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ దుస్థితి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రూ.155 కోట్ల వ్యయంతో యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ) పనులు పూర్తి చేసినా రూ.50లక్షలు వెచ్చించి శుద్ధి యంత్రం సుమకూర్చలేకపోయారు. రూ.30కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో ఈ యంత్రం కొనుగోలులో జాప్యం నెలకొంది. ఫలితంగా పలు కాలనీల్లో యూజీడీ పైపులైన్లు, చాంబర్లు ధ్వంసమై నిండిపోవడం, లీకేజీలు ఏర్పడి జనావాసాల్లో మురుగు పారుతోంది. ఇలాంటి పరిస్థితి వేళ సిద్దిపేట మున్సిపాలిటీ నుంచి జెట్టింగ్ యంత్రాన్ని బతిమాలి తెప్పించుకోవాల్సి వస్తున్నది. అది సమయానికి రాక.. కాలనీలు కంపుకొడుతున్నాయి. – గజ్వేల్: -
దీప శోభితం.. వ్రత వైభవం
వర్గల్(గజ్వేల్): నాచగిరి కిక్కిరిసింది. భక్తులతో పోటెత్తింది. వ్రత వైభవంతో అలరారింది. కార్తీక దీప కాంతులతో శోభిల్లింది. శుభకర కార్తీకం, ద్వాదశి ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీనృసింహుని సన్నిధికి భక్తు లు తరలివచ్చారు. హరిద్రనది వాగులో స్నానం చేశారు. వ్రతమండపంలో సత్యదేవుని వ్రతమాచరించారు. గర్భగుడిలో లక్ష్మీనారసింహులను దర్శించుకున్నారు. అభిషేకం, కల్యాణాది మొక్కులు తీర్చుకున్నారు. సూర్య బింబాకృతిలో.. రాత్రివేళ కార్తీక సహస్ర దీపోత్సవం నేత్రపర్వం చేసింది. ఆలయ ప్రాంగణంలో సూర్య బింబాకృతిలో కార్తీక దీపాల వరుసలు వెలుగులు విరజిమ్మాయి. సామూహిక దీపోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సూర్య బింబం ఆకృతిలో దీపాలు వెలిగించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. -
పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరండి
చేర్యాల(సిద్దిపేట): పట్టుదలతో బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని కలెక్టర్ హైమావతి విద్యార్థినులకు సూచించారు. పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆదివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, వంట సరుకులు సక్రమంగా అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. రిజిస్టర్లు చెక్ చేస్తూ స్టాక్ రిజిస్టర్ సక్రమంగా మెయింటేన్ చేయాలని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించకుండా కూరగాయాలు దొరకడంలేదని సాకులు చెబితే ఉపేక్షంచేది లేదని వంట సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం విద్యారినులతో మాట్లాడుతూ కడుపునిండా తిని బాగా చదువుకోవాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని లక్ష్యాన్ని ఎంచుకోని నిరంతరం శ్రమించాలని విద్యార్థులకు తెలిపారు. కలెక్టర్ హైమావతి కేజీబీవీ సందర్శన -
మళ్లీ దంచికొట్టిన వాన
అయ్యో.. పాపం రైతన్నదుబ్బాక/దుబ్బాకరూరల్: వరుణుడు రైతులపై పగబట్టాడు. ఇప్పటికే భారీ వర్షాలతో చేతికొచ్చిన ధాన్యం తడిసిముద్దవగా.. పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ఈ బాధల నుంచి రైతు తేరుకోకముందే మళ్లీ ఆదివారం తెల్లవారుజామున, రాత్రి వేళ దుబ్బాక పట్టణంతోపాటు పలు గ్రామాల్లో గంటకు పైగా వాన దంచికొట్టింది. దీంతో మార్కెట్ యార్డులో ధాన్యం మళ్లీ తడిసిముద్దయింది. పెద్దఎత్తున వరదలో కొట్టుకుపోయింది. కష్టమంతా నీటిపాలుకావడంతో రైతులు దిక్కుతోచనిస్థితికి గురయ్యారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గంటపాటు ఏకధాటిగా వాన కురవడంతో సుమారు మార్కెట్‌యార్డులో ఉన్న పదివేల క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిముద్దయినట్లు తెలుస్తోంది. ఆరబెట్టుకున్న వడ్లలో భారీగా నీరు నిలవడంతో రోజంతా రైతులు నీళ్లు ఎత్తుపోసేందుకు నరకయాతనపడ్డారు. ధాన్యం మళ్లీ తడిసిపోవంతో మొలకలొచ్చే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జాడలేని అధికారులు... వానలకు తీవ్రంగా నష్టపోయి ఆందోళన చెందుతున్నా కనీసం అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. మ్యాచర్ పేరిట ఇబ్బందులు పెడుతున్న అధికారులు ఇటువైపు వస్తే తమ బాధలేమిటో తెలుస్తాయని రైతులు మండిపడ్డారు. దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది. రైతుల ఆందోళన తడిసిన ధాన్యం కొనాలంటూ డిమాండ్ దుబ్బాకలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనాలంటూ డిమాండ్ చేశారు. వర్షంతో తమ ధాన్యం అంతా తడిసిముద్దయినా పట్టించుకోవడం లేదంటూ పీఏసీఎస్ కు చెందిన కరుణాకర్, ఏఎంసీ సిబ్బంది గణేశ్, పలువురి సిబ్బందిని రైతులు చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. ఓ దశలో రైతులు అక్కడికి వచ్చిన సిబ్బందిని మార్కెట్ కార్యాలయంలో ఉంచి తాళం వేసేందుకు ప్రయత్నించారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామంటూ చెప్పడంతో వారిని వదిలిపెట్టారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తడిసి ముద్దయిన ధాన్యం దుబ్బాక మార్కెట్‌యార్డు అంతా అతలాకుతలం -
వరద కాలువల నిర్మాణం కోసం సర్వే
హుస్నాబాద్: పట్టణంలో శాశ్వత వరద కాలువల నిర్మాణం కోసం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం సర్వే నిర్వహించారు. వర్షాలు కురిసిన ప్రతిసారీ వరదలు వివిధ కాలనీలు, మెయిన్ రోడ్డును ముంచెత్తుతున్నాయి. వరదలను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పట్టణంలో సర్వే చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డు, పోలీస్ స్టేషన్ ఏరియాలను పరిశీలించారు. మరో సారి సర్వే చేసి దాని ఆధారంగా డీపీఆర్ తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, పబ్లిక్ హెల్త్, మున్సిపల్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు, డీఈలు తిరుపతి, మహేష్, ఎంఏఈలు పృద్విరాజ్, మహేష్‌లు ఉన్నారు. వైవిధ్యం.. కాంతిమంతం వర్గల్(గజ్వేల్): వైవిధ్యమైన ఆకృతులలో వెలుగులు చిమ్ముతున్న కార్తీక జ్యోతులు నాచగిరిని శోభాయమానం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఈఓ విజయరామారావు పర్యవేక్షణలో అర్చక, సిబ్బంది కార్తీక సామూహిక సహస్ర దీపోత్సవానికి తగు ఏర్పాట్లు చేశారు. భక్తజనులు నక్షత్ర ఆకృతిలో దివ్వెలను వెలిగించి తరించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. 2న మల్లకంబ్ క్రీడాకారుల ఎంపిక ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా మల్లకంబ్ క్రీడాకారుల ఎంపిక ఈ నెల 2న నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సౌందర్య శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారాయణరావుపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం 9.30గంటల నుంచి అండర్–14, 17 విభాగాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు స్థానిక పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సతీష్ (99481 10433)ను సంప్రదించాలన్నారు. కుల వివక్ష నేరం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య కొండపాక(గజ్వేల్): కులాల పేరుతో చిన్న చూపు చూడటం చట్టరీత్యా నేరమని ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య అన్నారు. మండల పరిధిలోని రాంపల్లిలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవ గ్రామ సభ నిర్వహించారు. భవ్య మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా రెండు గ్లాసుల పద్ధతులు పాటిస్తే వెంటనే పోలీస్టేషన్‌కు సమాచారం అందించాలన్నారు. సమష్టి కృషితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కులాలు, మతాల పేరిట ప్రవర్తిస్తూ ఇతరులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండా రెవెన్యూ, పోలీస్ శాఖలు చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్‌రెడ్డి, ఆర్ఐ బాలకిషన్, నాయకులు సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. మామిడాలకు ‘మహిళా సేవా రత్న’ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సమాజ సేవలో విశేషమైన కృషి చేస్తున్న ఎన్ఎస్యూఐ జిల్లా సోషల్ మీడియా చైర్పర్సన్ మామిడాల స్రవంతికి మహిళ సేవా రత్న అవార్డు వరించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని త్రివేణి సంగమ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సేవా రత్న అవార్డులు అందించారని, ఇందులో భాగంగా తనకు మహిళా సేవా రత్న అవార్డును ప్రదానం చేశారని స్రవంతి తెలిపారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు
హుస్నాబాద్: మోంథా తుపాన్ ప్రభావంతో మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ కమిషనర్, కలెక్టర్ హైమావతి మార్గదర్శకత్వంలో అధికారులు శుక్రవారం మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులు నష్టపోకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగొలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా 18 లారీలను ఏర్పాటు చేసి 100 మందికి పైగా హమాలీ కార్మికులను రంగంలోకి దింపారు. 100 మందికి పైగా రైతుల నుంచి సుమారు 526 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగొలు చేసిన ధాన్యాన్ని జిల్లాలోని రైస్ మిల్లులకు ఒక్కో లారీ చొప్పున తరలించారు. రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కమిషనర్ ఆఫీస్ నుంచి డిప్యూటి కమిషనర్ కొండల రావు, ప్రొక్యూర్మెంట్ జీఎం నాగేశ్వర్ రావులు పాల్గొన్నారు. -
హుస్నాబాద్‌లో సీఎం ఏరియల్ సర్వే
శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025● వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన ● రైతులను ఆదుకోవాలంటూసీఎంకు మంత్రి పొన్నం వినతిహుస్నాబాద్: మోంథా తుపాన్‌కు దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో 42 సెం.మీ. వర్షపాతం, హుస్నాబాద్ మండలంలో 35 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వేలాది ఎకరాల పంటలు నీటి మునిగాయి. భారీ వరదతో వ్యవసాయ మార్కెట్ యార్డు, ఐకేపీ సెంటర్లలో వందలాది మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, భీమదేవరపల్లి మండలాల్లో సీఎం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఏరియల్ వ్యూ ద్వారా నీటి మునిగిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, కూలిన కల్వర్టర్లు, భారీ వరదలకు వ్యక్తులు గల్లంతైన ప్రదేశాలను సీఎం పరిశీలించారు. హుస్నాబాద్ నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. -
మక్కకు మొలకలు.. ఆవిరైన ఆశలు
రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన మక్క దిగుబడులతో గట్టెక్కుదామనుకున్న రైతులకు మోంథా తుపాన్ అశని పాతంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో మక్క కుప్పలు తడిసి ముద్దయ్యాయి. కుప్పల్లో మొలకలు వచ్చి రైతుల ఆశలను ఆవిరి చేసింది. నాణ్యత తగ్గడమే కాకుండా తేమ శాతం పెరగడంతో రైతులు మనోవేదనకు గురవుతున్నారు. వచ్చిన అరకొర దిగుబడులు సైతం తుపాను రూపంలో నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిసిన మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. – మిరుదొడ్డి(దుబ్బాక) -
అభివృద్ధి పనులు వేగిరం చేయండి
సిద్దిపేటజోన్: బల్దియాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల సూచించారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా మున్సిపల్ యంత్రాంగం చొరవ చూపాలన్నారు. బహిరంగ ప్రాంతాల్లో చెత్త లేకుండా చూడాలన్నారు. మున్సిపల్ వాహనాలకు చెత్త ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై రూపొందించిన ఏజెండాను ఏకగ్రీవంగా ఆమోదించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, కమిషనర్ ఆశ్రిత్, కౌన్సిలర్లు సుందర్, యోగి, వినోద్, సాయి, మల్లికార్జున్, విఠోభ, రవి, బ్రహ్మం, రియాజ్, బాల్ లక్ష్మి, శోభారాణి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల -
సస్యరక్షణ చర్యలు తప్పనిసరి
హుస్నాబాద్‌రూరల్: వర్షాలతో పంటలు దెబ్బతినకుండా రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ మండలంలో పర్యటించి వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. నేలవాలిన వరిని కట్టలు కట్టి నీటిలో వరి గొలుసులు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోతకు సిద్ధంగా ఉంటే లీటరు నీటిలో 5శాతం ఉప్పుద్రావం కలిపి చల్లాలని చెప్పారు. ఏరిన పత్తి పొడి ప్రదేశంలో ఆరబెట్టి నిల్వ చేయాలని సూచించారు. తడిపత్తినే కుప్పవేస్తే బూజు పట్టే ప్రమాదం ఉందన్నారు. అధిక తేమ ఉంటే కాయలు కుళ్లిపోతాయన్నారు.జిల్లా వ్యవసాయశాఖ అధికారి స్వరూపరాణి -
అడ్డగోలుగా పనులు.. అంతా తప్పిదాలు
గజ్వేల్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే తాను సీఎంగా పనిచేసిన పదేళ్లల్లో నిధుల వరద పారించారు. కానీ అధికారులు అడ్డదిడ్డమైన డిజైన్లతో కీలకమైన పనుల లక్ష్యాన్ని దెబ్బతీశారు. బస్టాండ్ల నిర్మాణమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. కొన్నేళ్ల క్రితం ఎస్డీఎఫ్ ద్వారా మున్సిపాలిటీ పరిధిలోని తూప్రాన్ రోడ్డువైపున మోడ్రన్ బస్టాండ్ నిర్మాణానికి రూ.5.47కోట్లు, గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన మూవింగ్ బస్టాండ్ నిర్మాణానికి రూ.2.86కోట్లు, ప్రజ్ఞాపూర్ చౌరస్తాలో బస్టాండ్ నిర్మాణానికి రూ.3.81కోట్లు మంజూరు చేశారు. రెండేళ్ల క్రితం తూప్రాన్ రోడ్డు వైపున ఉన్న బస్టాండ్ పూర్తికాగా వినియోగంలోకి రాకుండా నిరుపయోగంగా మారింది. పట్టణానికి దూరంగా ఉండటం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన నిర్మిస్తున్న బస్టాండ్ పనులు పూర్తికావస్తున్నాయి. ట్రాఫిక్ సమస్యలను నిర్మూలిస్తుందని భావించి నిర్మించిన ఈ బస్టాండ్.. వినియోగంలోకి వస్తే ట్రాఫిక్ సమస్య మరింతగా జఠిలం కాబోతున్నది. అడావుడిగా నిర్మించిన ఈ బస్టాండ్‌లో బస్సులు నిలిపే అవకాశమే లేదు. ఒకవేళ బస్సులు నిలిపితే తర్వాత వచ్చే బస్సులతో ప్రయాణికులు, బస్సులతో మరింతగా కిక్కిరిసిపోనున్నది. అంతేకాకుండా ఇన్, అవుట్ బస్సులు వెళ్లడానికి తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఇది తెలిసీ కూడా అధికారులు ఈ బస్టాండ్‌ను ఎలా డిజైన్ చేశారో అర్థంకానీ పరిస్థితి. మరో ముఖ్యవిషయమేమిటంటే ఆర్టీసీకి చెందిన ఇంజినీర్ల పాత్ర లేకుండా బస్టాండ్ నిర్మాణాలను డిజైన్ చేయడం గమనార్హం. ప్రజ్ఞాపూర్‌లో ఇలా... ప్రజ్ఞాపూర్‌లో ఎకరం స్థలంలో నిర్మించిన బస్టాండ్‌లోనూ డిజైన్ లోపాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.3.81కోట్లతో పనులు సాగుతుండగా, ఈ నిధులు సరిపోక మరో రూ.1కోటి అదనంగా కావాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఈ బస్టాండ్ ముందు భాగంలో వరద కాల్వ ఉంది. దీనిపై బస్సులు ఇన్, అవుట్ కోసం కల్వర్టు నిర్మాణం కోసం సరైన డిజైన్ లేదు. అంతేకాకుండా భువనగిరికి వెళ్లే బస్సు ఈ బస్టాండ్‌లో ఆగితే తిరిగి రాంగ్ రూట్లోనే వెళ్లేలా డిజైన్ ఉంది. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో ఈ బస్టాండ్లు వినియోగంలోకి వస్తే తలెత్తే సమస్యలపై ఆందోళన నెలకొన్నది. గజ్వేల్ మూవింగ్ బస్టాండ్ వద్ద ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) అనుమతితో డివైడర్ తగ్గిస్తే.. బస్సులు కొంతమేర తిరిగే అవకాశం ఉంది. ప్రజ్ఞాపూర్ బస్టాండ్‌లోని లోపాలను సైతం సరిచేస్తే కొంత ఉపయోగకరంగా మారే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో అధికారుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది వేచి చూడాల్సిందే. రాష్ట్రానికే నమూనాగా ఊదరగొట్టిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో అధికారుల తప్పిదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ రూ.12.14కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు ఆర్టీసీ బస్టాండ్ల నిర్మాణాల్లో చోటుచేసుకున్న డిజైన్ లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తప్పిదాల వల్ల రాబోయే రోజుల్లో సమస్యలు మరింత జఠిలం అవుతుండగా, అధికారుల అడ్డదిడ్డమైన పనులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్టాండ్ల నిర్మాణాల్లో డిజైన్ లోపాలు -
నష్టం వివరాలు సేకరించండి
● కలెక్టర్ హైమావతి ● తడిసిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలోపరిశీలనహుస్నాబాద్: వ్యవసాయ మార్కెట్లో తడిసిన, కొట్టుకుపోయిన, మొలకెత్తిన ధాన్యం వివరాలు నమోదు చేయాలని కలెక్టర్ హైమావతి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోతారం (ఎస్) గ్రామం నుంచి వరద మార్కెట్లోకి రావడంతో ధాన్యం తడిసిందన్నారు. ఆర్టీఓ రామ్మూర్తి, మా ర్కెట్ అధికారులు అప్రమత్తమై ప్రహరీని కూల్చి నీటిని బయటకు పంపించారన్నారు. ప్రాథమిక సమాచారం మేరకు 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని తెలిపారు. ఈ సమాచారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియ చేపడతామన్నారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న రైతులు ధాన్యాన్ని పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ హైమావతి వాహనాన్ని రైతులు అడ్డుకున్నారు. మార్కెట్ నిండా నీళ్లు ఉన్నాయని, ఎక్కడ ఆరబెట్టుకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు న్యాయం చేయాలని దండం పెట్టి వేడుకున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
వానొస్తే.. బస్టాండ్ మునకే
హుస్నాబాద్: వానొస్తే వాగులు, వంకలు, డ్రైనేజీలు పొంగుతాయి.. కానీ ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ సైతం మునుగుతోంది. భారీ వర్షం కురిసిన ప్రతీసారి ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. హుస్నాబాద్ పట్టణంలో దాదాపు 35 ఏళ్ల క్రితం ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించారు. బస్టాండ్‌ను ఆనుకొని ఉన్న రహదారి అభివృద్ధి కోసం అనేక సార్లు ఎత్తు పెంచి రహదారులను నిర్మించారు. దీంతో రోడ్డు కంటే బస్టాండ్ ఎత్తు తగ్గడంతో ప్రతి వర్షానికి బస్టాండ్ ప్రాంగణం నీటిలో మునుగుతోంది. బస్టాండ్‌కు వచ్చే నీరు బయటకు వెళ్లే దారి లేదు. జాతీయ రహదారి పేరిట ఈ రోడ్డు ఎత్తును మళ్లీ పెంచారు. బస్టాండ్ ఎత్తును పెంచలేదు. వర్షం కురిసినప్పుడల్లా బస్టాండ్ జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో ఆర్టీసీ బస్టాండ్ వరద నీటితో తల్లడిల్లుతోంది. ఇటీవల రూ.2 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన బస్టాండ్‌ను మంత్రి ప్రారంభించారు. బస్టాండ్ ఎత్తు పెంచకుండా ఆధునీకరణ పనులు చేపట్టారు. కొత్తగా ప్లాట్ ఫాంలు, మూత్రశాలలు, ప్రాంగణాన్ని సీసీతో నింపి వేసి చేతులు దులుపుకున్నారు. బస్టాండ్ పై కప్పు నుంచి వర్షం నీరు కారుతోంది. బస్టాండ్‌ను వరద నీటి నుంచి కాపాడాలని అధికారుల వద్ద ఎలాంటి ప్రణాళికలు లేకపోవడం శోచనీయం. ఇటీవలనే బస్టాండ్‌లోకి వచ్చే నీటిని బయటకు పంపించేందుకు పైపు లైన్లు వేసినా ఫలితం శూన్యం. పట్టణంలోని మెయిన్ రోడ్‌పై ప్రవహించే వరద, నాగారం రోడ్డు నుంచి వచ్చే మురికి కాలువల నీరంతా బస్టాండ్‌లోకి వస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాంగణమే కాకుండా సైకిల్ స్టాండ్ కూడా మునిగి పోతోంది. ప్రయాణికులకు నరకమే.. ప్రయాణికులు బస్టాండ్‌కు రావాలన్నా.. బస్సు నుంచి దిగాలన్నా వరద నీటి నుంచే వెళ్లాల్సిన పరిస్థితి. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో బస్టాండ్‌ను వరద నీటిలో చిక్కుకుంది. బస్టాండ్ చెరువును తలపించింది. వరద నీరు ప్లాట్ ఫాం దాటి బస్టాండ్ లోపలికి చేరుకుంది. నీటిలోనే ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గురువారం కూడా బస్టాండ్ ప్రాంగణం నీటితో నిండి పోయింది. బస్సులు లోపలికి రాకుండా రోడ్డు పైనే ఆపి ప్రయాణికులను ఎక్కించుకోవడం గమనార్హం. వరద నీటికి అడ్డుకట్ట వేయకుండా బస్టాండ్‌కు ఎన్ని రూ.కోట్లు వెచ్చించినా ప్రజా ధనం వృధా అవడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని పలువురు చెబుతున్నారు.మంత్రి ఇలాకాలోప్రయాణికులకు తప్పని తిప్పలు -
30ఏళ్లు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు
డీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: ముప్పై ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్లో పీహెచ్‌సీల సూపర్వైజర్లతో డీఎంహెచ్ఓ గురువారం సమావేశం నిర్వహించారు. వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మాతా శిశు సంక్షేమం, వ్యాధి నిరోధక టీకాలు, సంక్రమిత వ్యాధుల వంటి కార్యక్రమాల అమలును పరిశీలించారు. పలు విభాగాల్లో తక్కువ ప్రగతి నమోదైన వారి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 12 వారాల్లోపు గర్భిణులను తప్పనిసరిగా నమోదు చేయాలని, హైరిస్క్ వారిని గుర్తించి 102 వాహనం ద్వారా సమగ్ర వైద్య సదుపాయాలున్న ఆస్పత్రులకు తరలించాలన్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సమయపాలన పాటించాలని ఆదేశించారు. సమావేశంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి వరద
రైతన్నను నట్టేట ముంచిన మోంథా మోంథా తుపాన్ రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికి అందే సమయంలో నోటికాడి బువ్వను లాక్కున్నట్లయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో వడ్లు, మక్కలు నీటిపాలయ్యాయి. కళ్లెదుటే చేతికొచ్చిన పంట నీటిపాలవుతుంటే రైతులు గుండెలు బాదుకున్నారు. జిల్లాలో అత్యధికంగా హుస్నాబాద్‌లో 30.04 సెంటీమీటర్లు, అక్కన్నపేట మండలం కట్కూరులో 28.25 సెంటీమీటర్ల వర్షం కురిసింది. –సాక్షి, సిద్దిపేట నేడు సీఎం ఏరియల్ సర్వే హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో పంట నష్టంపై శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేను నిర్వహించనున్నారు. సీఎం వెంట మంత్రులు సైతం ఉండనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 1,666 మంది రైతులకు చెందిన 2,515 ఎకరాల పంటలకు నష్టం జరిగింది. వరి 2,214, పత్తి 301 ఎకరాల్లో తీరని నష్టం చోటుచేసుకుంది. అందులో అత్యధికంగా కోహెడ మండలంలో 855, నంగునూరు మండలంలో 706 ఎకరాలు, అక్కన్నపేటలో 530 ఎకరాల్లో నష్టం జరిగింది. ఈ ఏడాది పత్తి రైతులను భారీ వర్షాలు నిండా ముంచాయి. పత్తిపంట పూర్తిగా దెబ్బతిని చేతికి అందకుండా పోతోంది. తరచూ వర్షాలు, మబ్బులకు తోడు సరిపడా ఎండపడక పత్తికాయలు విచ్చుకోవడం లేదు. కొన్ని చోట్ల చెట్ల మీదనే కుళ్లిపోయి రాలిపోతున్నాయి. వరద ప్రవాహం తగ్గిన తర్వాత పంటల పరిస్థితి ఏమిటి? తర్వాత కోలుకుంటాయా? లేకపోతే మొత్తం నష్టపోయినట్లేనా? పంట నష్టం ఎంత శాతం జరిగింది? అనే దానిపై మరో మారు వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించనున్నారు. 88 మెట్రిక్ టన్నుల ధాన్యం వరదపాలు హుస్నాబాద్ మార్కెట్ యార్డులో నడుము లోతు వరద నీటి ప్రవాహానికి ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లా వ్యాప్తంగా 23 మంది రైతులకు చెందిన 88 మెట్రిక్ టన్నుల ధాన్యం నీటిపాలైంది. అలాగే 83 మంది రైతులకు చెందిన 150 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. నిలిచిన రాకపోకలు జిల్లాలో పలు చోట్ల రోడ్లపై నుంచి భారీగా వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముస్త్యాల వద్ద రాగికుంట పొంగిపొర్లడంతో చేర్యాల నుంచి హుస్నాబాద్‌కు రాకపోకలు నిలిచిపోయాయి. కోహెడ మండలం బస్వాపూర్ పోరెడ్డిపల్లిలో వరద ఉధృతికి రోడ్లు తెగిపోయాయి. కల్వర్టు కొట్టుకుపోయింది. కష్టమంతా నీటిపాలాయె.. ఆరుగాలం పడిన రెక్కల కష్టమంతా నీటిపాలైంది. మార్కెట్‌కు ఆరు ట్రాక్టర్ల ధాన్యం తెస్తే నాలుగు ట్రాక్టర్ల ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్‌కు వెళ్తే ఎలాంటి సౌలతులు ఉండవని చెప్పినా మా ఆయన వినలేదు. తడిసిన ధాన్యం తీసుకోకపోతే చనిపోవడమే దిక్కు. ప్రభుత్వమే ఆదుకోవాలి. – భూక్య లీల, జిల్లెల్లగడ్డ, హుస్నాబాద్ పత్తి తడిసిపోయింది వర్షాలకు పత్తి తడిసి ముద్దయింది. రెండెక రాలలో పత్తి పంట సాగు చేశా. ఎదిగే సమయంలో వర్షం పడటంతో దెబ్బతిన్నది. తడిచిన పత్తిని చూస్తే కూలీల ఖర్చు కూడా వచ్చేటట్లు లేదు. ఇప్పటి వరకు రూ.80వేల పెట్టుబడి పెట్టాను. ప్రభుత్వం ఆదుకోవాలి. – బునారి భాస్కర్, తిగుల్, జగదేవ్‌పూర్ మార్కెట్‌ను ముంచెత్తిన వాన వరదలో కొట్టుకుపొయిన ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం.. రైతులకు శాపం హుస్నాబాద్: మోంథా తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యమంతా నీటిపాలైంది. ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పినా ఫలితం లేకుండాపోయింది. ఫ్లాట్ ఫామ్‌లపై ఆరబోసిన ధాన్యం కూడా తడిసి పోయింది. వర్షం ధాటికి వ్యవసాయ మార్కెట్ అతలాకుతలమైంది. మార్కెట్‌ను కుంటలో నిర్మించారు. దీంతో పోతారం (ఎస్) గ్రామం నుంచి వచ్చే వరద నీరు మార్కెట్‌ను ముంచెత్తడం, వరద నీటి కాలువలు సరిగా లేకపోవడంతో ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. దాదాపు 15 రోజుల నుంచి ఆరబోసిన ధాన్యానికి తేమ 12 శాతం ఉంటేనే కాంటా పెడతామని అధికారులు కొర్రీలు పెట్టడం రైతులకు శాపంగా మారింది. రాత్రి సమయంలో చిమ్మరి చీకటిలో వరద నీరు ఉదృతంగా ప్రవహించింది. అధికారులు మార్కెట్ ప్రహారీ గోడను పగుల గొట్టి ఽనీటిని బయటకు వదిలారు. అప్పటికే జరిగిన నష్టం జరిగిపోయింది. కొట్టుకుపోయిన 1500 క్వింటాళ్ల ధాన్యం మార్కెట్లో రైతులు 106 ధాన్యం కుప్పలు పోశారు. ఇందులో 1500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని అధికారులు చెబుతున్నారు. వరద నీరు బయటకు వెళ్లే మార్గం లేక, మురికి కాలువల్లో చెత్త పోరుకుపోవంతో నీరంతా ధాన్యం కుప్పలు తడిపి వేస్తున్నాయి. మార్కెట్లో నిర్మించిన గోధాముల్లో ధాన్యం ఆరబెట్టుకునే అవకాశం కల్పిస్తే ఇంత నష్టం జరిగేది కాదు. ఆరబెట్టిన ధాన్యం మధ్యాహ్నం వరకు ఎండటం, రాత్రి అయిందంటే మంచు కమ్ముకోవడం, అనుకున్న తేమ శాతం రాకపోవడంతో రోజుల తరబడి మార్కెట్లోనే ఉంటున్న పరిస్థితి. మురికి కాలువల నుంచి ధాన్యం ఎత్తి.. ధాన్యమంతా మురికి కాలువల్లోకి కొట్టుకుపోయాయి. దీంతో కాలువల్లో ఉన్న ధాన్యాన్ని జేసీబీ సహాయంతో, తట్టలతో ఎత్తిపోసుకుంటూ రైతులు అరిగోస పడ్డారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి వ్యవసాయ క్షేత్రం వద్ద స్థలం లేదని మార్కెట్‌కు వస్తే వరుణుడు పగబట్టినట్లు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొట్టుకుపోయిన 10 ట్రాక్టర్ల ధాన్యం కోహెడరూరల్(హుస్నాబాద్): మోంథా తుపాన్ రైతులను నిండా ముంచింది. కోహెడ మండలం పోరెడ్డిపల్లిలో వంతెనపై ఆరబోసిన పది ట్రాక్టర్ల ధాన్యం మోయతుమ్మెద వాగు వరదలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ధాన్యం కొట్టుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు.అక్కన్నపేట మండలం జనగామలో దుస్థితిహుస్నాబాద్ మార్కెట్ యార్డులో నీట మునిగిన ధాన్యం కుప్పలు -
అధైర్యపడొద్దు.. ఆదుకుంటాం
● రైతులకు మంత్రి పొన్నం భరోసా ● వరద ప్రాంతాల్లో పర్యటనకోహెడరూరల్(హుస్నాబాద్): అకాల వర్షంతో నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గురువారం మండలంలోని బస్వాపూర్, పోరెడ్డిపల్లి గ్రామాల్లో వరద ఉధృతికి కొట్టుకుపోయిన వరి ధాన్యాన్ని, తెగిపోయిన రహదారులను పరిశీలించారు. ఈ సందర్భంగా వరదలతో మునిగిన వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు. నష్టపోయిన పంటలను పరిశీలించి రికార్డు చేయాలని అధికారులను ఆదేశించారు. చేతికి వచ్చిన పంటలు వర్షార్పణం కావడం బాధాకరమని అన్నారు. పూర్తి స్థాయిలో వివరాలను తెలుసుకొని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొంటాం హుస్నాబాద్‌రూరల్: ఎన్నడూ లేని విధంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో వర్షం కురిసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం వ్యవసాయ మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం ఆర్థిక సహాయం చేయాలన్నారు. రైతులను ఆదుకోవడంలో రాజకీయాలను పక్కన పెట్టి రైతుకు భరోసా కల్పించాలన్నారు. మార్కెట్లో వందల క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయిందని, వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందన్నారు. రైతులకు జరిగిన నష్టంపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సీఎంకు వివరించినట్లు చెప్పారు.కోహెడ మండలంలో దెబ్బతిన్న రోడ్డును, తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం -
రక్తదానం మహాదానం
అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్సిద్దిపేటకమాన్: పోలీసులు శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా ముందు వరుసలో ఉంటారని అదనపు డీసీపీ అడ్మిన్ సీహెచ్ కుశాల్కర్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం పోలీసులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం ఆపద సమయంలో మనిషి ప్రాణాలను కాపాడే పవిత్రమైన కార్యమన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణి, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్నారు.రక్తదానం చేస్తున్న పోలీస్


