నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు

Feb 18 2026 8:33 AM | Updated on Feb 18 2026 8:33 AM

నిబద్

నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు

నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు చర్లఅంకిరెడ్డిపల్లిలో అధికారుల బృందం శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలి

మిరుదొడ్డి(దుబ్బాక): అధికారులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు సాధ్యపడతాయని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని అల్వాల గ్రామాన్ని గ్రూప్‌–1 అధికారులు సందర్శించారు. గ్రామాన్ని సందర్శించిన అధికారులతో పాటు, బక్కి వెంకటయ్యను గ్రామస్తులు డప్పు చప్పుళ్ళ మధ్య గణంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన నిరుపేద ప్రజలను ఆదరించి, వారి సమస్యలను పరిష్కరించిన అధికారులను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. జిల్లాలో నూతనంగా నిమామకమైన గ్రూప్‌–1 అధికారులు సమష్టిగా విధులు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రూప్‌–1 అధికారులు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల సరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల గణేష్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం లక్ష్మీ నర్సమ్మ, సర్పంచ్‌ ప్రమీలాదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చర్లఅంకిరెడ్డిపల్లి గ్రామాన్ని మంగళవారం గ్రూప్‌ 1 అధికారుల బృందం సందర్శించింది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల తీరును, ప్రజా సమస్యలు, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని రోడ్లు, తాగు నీటి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు సేకరించారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ ద్వారా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం ట్రైనింగ్‌లో కీలక భాగమన్నారు. అధికారులు జెస్సీ పౌల్‌, ఉజ్వల, నరేందర్‌, సాత్విక్‌ నాయక్‌, నిఖిల, నిఖిత రెడ్డి, ప్రణయ్‌ సాయితో పాటు తహసీల్దార్‌ సలీమ్‌, ఎంపీడీఓ జనార్దన్‌, ఏఓ జయంత్‌ కుమార్‌, సర్పంచ్‌ అనిల్‌ కుమార్‌, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

గజ్వేల్‌రూరల్‌: శ్రీరాముని ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని గజ్వేల్‌ ఏసీపీ నరసింహులు అన్నారు. గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు భద్రాచలం నుంచి వచ్చిన వడ్లకు మంగళవారం గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోగల పార్దివేశ్వరస్వామి దేవాలయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆకుల నరేష్‌బాబుతో కలిసి ఆయన మాట్లాడుతూ భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భక్తులు తుమ్మ శ్రీను, భాస్కర్‌, నర్సింలు, సత్యనారాయణ, ఉమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

నిబద్ధతతో విధులు  నిర్వహిస్తేనే  సత్ఫలితాలు 1
1/2

నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు

నిబద్ధతతో విధులు  నిర్వహిస్తేనే  సత్ఫలితాలు 2
2/2

నిబద్ధతతో విధులు నిర్వహిస్తేనే సత్ఫలితాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement