కోటి ఆశలు
కొత్త పాలకవర్గాలపై
●పుర ప్రగతి పరుగులు పెట్టేనా? ●పెండింగ్ సమస్యలు పరిష్కారమయ్యేనా?
●పారిశుద్ధ్యం మెరుగుపడేనా? ●ఏళ్లుగా పట్టణ ప్రజల అవస్థలు
దుబ్బాకలో ఏళ్లుగా యాతన..
● దుబ్బాక మున్సిపాలిటీలో 27,496మంది జనాభా ఉండగా, 21,341మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలు పట్టణ ప్రజలను వేధిస్తున్నాయి.
● డంపు యార్డు నిర్మించినా...సక్రమంగా వినియోగించడం లేదు. తడి, పొడి చెత్తను వేరు చేసే ప్రక్రియ శాసీ్త్రయంగా సాగటం లేదు.
● అంతర్గత రోడ్లు సక్రమంగా లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.
● డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక మురుగునీరు చెరువుల్లోకి వదులుతున్నారు. దీనివల్ల పట్టణంలో దుర్గంధం వ్యాపిస్తోంది.
కొత్త పాలకవర్గాలు కొలువుదీరిన వేళ.. మున్సిపాలిటీల్లో పెండింగ్ సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఏళ్లతరబడి ఇబ్బందులతో సతమతమవుతున్న పట్టణ ప్రజలు ఇకనైనా తమ పరిస్థితి మారుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ పరిశీలన ఇది..
గజ్వేల్: జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్–ప్రజ్ఞాపూర్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉండగా.. సిద్దిపేట మినహా మిగతా చోట్ల ఎన్నికలు జరిగి ఈనెల 16న కొత్త పాలకవర్గాల కొలువుదీరిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలోనే ఆయా మున్సిపాలిటీల్లో ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
కోటి ఆశలు


