దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
‘సాక్షి’తో మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత
దుబ్బాక: మున్సిపాలిటీని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తామని చైర్‌పర్సన్ శ్రీరాం సంగీత తెలిపారు. మున్సిపల్‌కు నూతన చైర్‌పర్సన్‌గా ఎన్నికైన సందర్భంగా మంగళవారం ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. మాది 50 ఏళ్ల నుంచే రాజకీయాలతో పెనువేసుకున్న కుటుంబం. మాకు ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది. ఆ నమ్మకంతోనే ఎమ్మెల్యే కొత్త ప్రభాకరన్న చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ పని చేస్తా. మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. ఇక్కడ ఎక్కువగా చేనేత, బీడీ కార్మికులు, రైతులు, పేద కుటుంబాలే ఎక్కువ. వీరికి ఆపద వేళ అండగా ఉంటా. నా భర్త రవీందర్‌కు ఉన్న రాజకీయ అనుభవంతో ముందుకు వెళ్తా. మౌలిక వసతులతో పాటు రోడ్లు, డ్రైనేజీ, వాటర్, పారిశుద్ధ్యం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ప్రజలు, అన్ని వర్గాల సలహాలు తీసుకొని ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్తాను.
పట్టణ ప్రగతికి ప్రత్యేక ప్రణాళిక
చేర్యాల(సిద్దిపేట): పట్టణంలో ప్రతీ సమస్య పరిష్కారమే లక్ష్యంగా పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ తెలిపారు. చైర్‌పర్సన్‌గా నూతనంగా ఎన్నికై న ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. పట్టణ ప్రగతిపై వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే.. ముందుగా పాలకవర్గసభ్యులతో కలిసి పట్టణంలో పర్యటిస్తాం. వార్డుల్లో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించి పరిష్కారానికి కృషి చేస్తాం. మౌలికవసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యం ఇస్తాం. రాజకీయాలకు అతీతంగా ప్రజాఅవసరాల మేరకు అభివృద్ధి చేసేందుకు అన్నివిధాలుగా కృషి చేస్తా. శానిటేషన్, తాగునీరు. వీధి దీపాలు, అంతర్గత సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం వంటి పలు అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తా. ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తా. మున్సిపాలిటీకి వచ్చే నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహకారంతో అదనపు నిధులు మంజూరు చేయించి పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతీ సమస్య పరిష్కరిస్తా.
‘సాక్షి’తో చేర్యాల మున్సిపల్
చైర్‌పర్సన్ అరుణ
దుబ్బాకను ఆదర్శంగా తీర్చిదిద్దుతా


