ర్యాలీలు.. రోడ్‌ షోలు | - | Sakshi
Sakshi News home page

ర్యాలీలు.. రోడ్‌ షోలు

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

ర్యాలీలు.. రోడ్‌ షోలు

ర్యాలీలు.. రోడ్‌ షోలు

పుర పోరు.. ప్రచారం జోరు

నెల 9వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మాత్రమే ఎన్నికల ప్రచార సమయం ఉండటడంతో అభ్యర్థులు వేగం పెంచారు. అభ్యర్థులు వారి కుటుంబాల సమేతంగా పొల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఇంటిల్లిపాది తలో దారిలో ఇంటింటికి వెళ్తూ కలుస్తున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థులు.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కౌన్సిలర్‌గా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రణాళికలను రూపొందించుకున్నారు. ప్రచారంలోకి మంత్రులు, ఆయా పార్టీల ముఖ్యులు దిగారు. ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో పార్టీలన్నీ సమావేశాలు, ర్యాలీలు, రోడ్‌షో జోరుగా నిర్వహిస్తున్నాయి. – సాక్షి, సిద్దిపేట

దుబ్బాకలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఎంపీ రఘునందన్‌రావు సైతం జోరు పెంచారు. ‘తమ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. కేంద్రంలో అధికారంలో ఉన్నాం. అక్కడి నుంచి అధికంగా నిధులు కేటాయించేందుకు కృషి చేస్తాం’ అని హామీలు ఇస్తున్నారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రచారం చేపట్టారు. ‘రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. పట్టణం అభివృద్ధికి ఇంకా అధిక నిధులు కేటాయించి, మరింత అభివృద్ధి చేస్తాం’అని హామీల వర్షం కురిపిస్తున్నారు. గజ్వేల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు రోడ్‌ షో నిర్వహించి కార్నర్‌ మీటింగ్‌ పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చడం లేదని.. ప్రజలకు కాంగ్రెస్‌ ఎంత బాకీ పడిందో వివరిస్తున్నారు. ఇప్పటికే దుబ్బాకలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి, చేర్యాలలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హుస్నాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ప్రచారం చేపడుతున్నారు.

రోజూ 16 గంటలు ఓటర్ల మధ్యే..

ఒకరికి మించి మరొకరు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. రోజులో దాదాపు 16 గంటలు ఓటర్ల మధ్యనే ఉంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్ల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలు పంచుతూ తమను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వార్డుల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వాటిని నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. దీంతో పాటు పలు వీధుల్లో ఉన్న వారిలో యువజన, మహిళ, కుల సంఘాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి వారి మద్దతును కూడగట్టేందుకు కృషి చేస్తున్నారు. ఇక ప్రచార రథాలు సైతం ఏర్పాటు చేసి కాలనీల్లో తిప్పుతున్నారు. ఇప్పటికే పలు వార్డుల్లో పులువురు ఇంటింటికి ఒక మారు తిరిగి ఓటును అభ్యర్థించారు. ఒక్కో ఇంటికి రెండు నుంచి మూడు మార్లు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించుకున్నారు.

కాంగ్రెస్‌ కోఆర్డినేటర్లు వీరే..

వేగం పెంచిన అభ్యర్థులు

రంగంలోకి వివిధ పార్టీల నేతలు

దుబ్బాకలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌

గజ్వేల్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు

ప్రచారానికి మరో నాలుగు రోజులే గడువు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని 4 మున్సిపాలిటీలకు కో ఆర్డినేటర్లను నియమిస్తూ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. హుస్నాబాద్‌కు జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌, గజ్వేల్‌కు కూన శ్రీశైలంగౌడ్‌, దుబ్బాకకు వనం శ్రీనివాస్‌ యాదవ్‌, చేర్యాలకు మెట్టు సాయికుమార్‌ను కో ఆర్డినేటర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా కో ఆర్డినేటర్లు సమన్వయం చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement