డోంట్‌ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..! | Auto driver's safety message for female passengers wins hearts online | Sakshi
Sakshi News home page

డోంట్‌ వర్రీ..ప్రశాంతంగా కూర్చోండి..! ఆ ఆటో డ్రైవర్‌ సందేశం అదుర్స్‌..

Apr 16 2026 2:26 PM | Updated on Apr 16 2026 2:33 PM

Auto driver's safety message for female passengers wins hearts online

ప్రజా రవాణాలలో ఆటో, క్యాబ్‌లనగానే కాస్త భయం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒంటరిగా వెళ్లేటప్పుడు చాలా భయం ఉంటుంది. నలుగురైదుగురు కలిసి వెళ్తుంటే ఎలాంటి భయం ఆందోళన ఉండదు. కానీ ఈ ఆటో అంకుల్‌ అలాంటి భయలేం వద్దు అంటూ చక్కగా తన సీటు వెనుక రాసిన సందేశం ఎంతలా ఉందంటే..బ్రో నువ్వు గ్రేట్‌ అని మెచ్చుకోకుండా ఉండలేరు.

అసలేం జరిగిందంటే..ఉన్నతి దేవాలియా అనే మహిళ తన ముంబైలో ఒక ఆటో రైడ్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఎదురైన అనుభవాన్ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోని కూడా షేర్‌  చేశారామె. ఆ డ్రైవర్‌ వెనుక సీటుపై ఉన్న సందేశం చూడగానే ప్రజా రవాణాపై ఉన్న అభిప్రాయం మారిపోతుందని పేర్కొంది పోస్ట్‌లో. ఒక చిన్న సానుభూతి చర్య ఎంతగా ప్రభావితం చేస్తుందో అని చెప్పే ఘటన ఇది అని అంటోందామె. 

ఇంతకీ  ఆ డ్రైవర్‌ సీటు వెనుకు ఏం ఉందంటే.."నేను కూడా ఒకరి తండ్రిని , సోదరుడిని. మీ భద్రతే నాకు ముఖ్యం. ఎలాంటి ఆందోళన లేకుండా కూర్చోండి. అలాగే ప్రతి వ్యక్తి ప్రమాదకారి కాదు. కొందరు మీకు సురక్షితమైన ఆశ్రయం ఇస్తారని గుర్తించండి." అని రాసి ఉంది. 

నిజంగా ఆ చిన్న పని ఆ డ్రైవర్‌ మంచి మనుసుని, ఉదారతను తెలియజేస్తుంది. అందరు అతడిలా ఉంటే బావుండేది కదూ..ఈ రోజు రైడ్‌లో వెళ్లడం నా రోజుని ఆనందమయంగా మారించి అంటూ  తన పోస్ట్‌ని ముగించింది ఉన్నతి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు సైతం ఆడ్రైవర్‌ని ప్రశంసిస్తూ  పోస్టుల పెట్టారు.

(చదవండి: 'నాన్న'గా గర్వించే క్షణం..! పిల్లల నుంచి ఆశించేది ఇదేకదా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement