దుబ్బాకలో ఎగిరేది గులాబీ జెండానే..
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక: ఆరు నూరైనా.. దుబ్బాక మున్సిపల్‌లో ఎగిరేది మాత్రం గులాబీ జెండానే అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్‌లోని పలు వార్డులలో బీఆర్‌ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలోనే దుబ్బాక మున్సిపాల్టీలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. వంద పడకల ఆస్పత్రి, ఐఓసీ భవనం, అధునాతన బస్టాండ్‌తోపాటు వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపిస్తే అన్నిరంగాల్లో మున్సిపాల్టీని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు ఆశీర్వదించి బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదని, యూరి యా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.


