చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం | - | Sakshi
Sakshi News home page

చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

Feb 9 2026 8:52 AM | Updated on Feb 9 2026 8:52 AM

చేర్య

చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం గజ్వేల్‌ గడ్డపై గులాబీ జెండా ఖాయం ఏడుపాయల జన సంద్రం

ఫిషర్‌ మెన్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ సాయికుమార్‌

చేర్యాల(సిద్దిపేట): చేర్యాల పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలంటే మున్సిపల్‌పై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని తెలంగాణ ఫిషర్‌ మెన్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ అన్నారు. రెండో వార్డు అభ్యర్థి ముస్త్యాల తేజకు మద్దతుగా ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను చూసి అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ప్రజలు గుర్తు చేసుకుని, కాంగ్రెస్‌కి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐదేండ్లలో చేర్యాల మున్సిపాలిటీలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు పోతామని చెప్పారు. ఆయన వెంట రెండో వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి ముస్త్యాల తేజ, స్థానిక నాయకులు ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు

గజ్వేల్‌: గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పాలనలో అసౌకర్యాల మధ్య కొట్టుమిట్టాడిన గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా కేసీఆర్‌ నిలబెట్టారన్నారు. కేసీఆర్‌ హయాంలో గజ్వేల్‌ అభివృద్ధికి మంజూరైన రూ.180 కోట్ల నిధులను కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దుచేసిందని మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మర్కంటి వరలక్ష్మి, కల్యాణ్‌ కర్‌ పద్మబాయి, మన్నె రూప తదితరులు పాల్గొన్నారు.

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు దుర్గమ్మ తల్లిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారికి ఒడి బియ్యం పోసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. ఆలయ సిబ్బంది, ఎస్సై శ్రీనివాస్‌ గౌడ్‌ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

వేగంగా జాతర ఏర్పాట్లు

ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న ఏడుపాయల జాతర పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పంచాయతీ వాహనాల ద్వారా చెత్త తరలించాలని సూచించారు.

మద్యం దుకాణాలు బంద్‌

రామాయంపేట(మెదక్‌): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ వరకు మున్సిపాటీల పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈమేరకు ఎకై ్సజ్‌ ఈఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తిరిగి 11న సాయంత్రం 5 గంటల తర్వాత ఓపెన్‌ అవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు.

చేర్యాల అభివృద్ధి  కాంగ్రెస్‌తోనే సాధ్యం 
1
1/3

చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

చేర్యాల అభివృద్ధి  కాంగ్రెస్‌తోనే సాధ్యం 
2
2/3

చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

చేర్యాల అభివృద్ధి  కాంగ్రెస్‌తోనే సాధ్యం 
3
3/3

చేర్యాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement