మల్లన్న పెద్దపట్నం.. భక్తుల తన్మయత్వం
ఉద్యోగి సస్పెన్షన్
శివనామస్మరణతో మారుమోగిన కొమురవెల్లి
కొమురవెల్లి(సిద్దిపేట): కోరమీసాల కొమురవెల్లి మల్లన్న ఆలయం భక్తజనసంద్రమైంది. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివ రాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు, ఒగ్గుపూజారులు పెద్దపట్నం ఘనంగా నిర్వహించారు. తోటబావి వద్ద సోమవారం తెల్లవారుజామున వరకు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అదే సమయంలో గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం తో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈఓ వెంకటేశ్, ధర్మకర్తలు, అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. పెద్దపట్నం వేడుకలను చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలపాటు మహారాష్ట్ర, కర్నాటక నుంచి భారీగా భక్తులు హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయధర్మకర్తలు, ఆలయ ఈఓ వెంకటేశ్ ఏఈఓలు పర్యవేక్షించగా, సీపీ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
మహా అన్నపూజ
స్వామివారికి సోమవారం తెల్లవారుజామున పెద్ద పట్నం ముగిసిన వెంటనే గర్భగుడిలో మహా అన్నపూజ, ఏకదశ రుద్రాభిషేకంతోపాటు ప్రత్యేక పూజలు ఆలయ అర్చకుల నిర్వహించారు.
కొమురవెల్లి(సిద్దిపేట): ఆలయంలో ప్లంబర్ గా విధులు నిర్వహిస్తున్న సార్ల విజయ్ కుమార్‌ను ఆలయ ఈవో వెంకటేశం సోమవారం సస్పెండ్ చేశారు. ఇటీవల హుండీ లెక్కింపులో రూ. 9వేలు అపహరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు అతనిని విధులనుంచి సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఆలయ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మల్లన్న పెద్దపట్నం.. భక్తుల తన్మయత్వం


