దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిది | - | Sakshi
Sakshi News home page

దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిది

Feb 17 2026 8:51 AM | Updated on Feb 17 2026 8:51 AM

దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిది

దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిది

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక: మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచి గెలిపించిన దుబ్బాక ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో పాల్గొన్న అనంతరం నూతనంగా ఎన్నికై న చైర్‌పర్సన్‌ శ్రీరాం సంగీత, వైస్‌ చైర్‌పర్సన్‌ ఆస సులోచన, కౌన్సిలర్లను అభినందించారు. ఈ సందర్భంగా వారితో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా కుటిల ప్రయత్నాలు చేసినా 14 మంది కౌన్సిలర్లను గెలిపించి బీఆర్‌ఎస్‌కు అండగా నిలవడం సంతోషకరమన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement