గజ్వేల్ పీఠంపై చందన
ప్రజల నమ్మకాన్ని నిలబెడతా
గజ్వేల్: కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అనుకున్నవిధంగానే బీఆర్‌ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కై వసం చేసుకున్నది. సీల్డ్ కవర్‌లో ఈ రెండు పదవులకు ఎంపిక పేర్లను బీఆర్‌ఎస్ అధిష్టానం పంపగా...కౌన్సిలర్లు మద్దతు పలికారు. ఈ ఎన్నికలో అనూహ్యంగా బీజేపీ మద్దతు లభించడం విశేషం. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో స్థానిక ఆర్‌డీఓ వీవీఎల్ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్‌ల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ చైర్‌పర్సన్‌గా గంగిశెట్టి చందనను ఎన్నుకున్నారు. చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఈమె పేరును 18వవార్డు కౌన్సిలర్ శ్రీధర్ ప్రతిపాదించగా, 2వ అభ్యర్థి గోలీ మమత బలపరిచారు. 20మంది కౌన్సిలర్‌కుగానూ చేతులెత్తే విధానంలో ఎన్నిక నిర్వహించగా...అనూహ్యంగా బీజేపీ కౌన్సిలర్ కూడా చేతులెత్తడం విశేషం. మొత్తంగా 11మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో ఓటు కలిగిన ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీజేపీ కౌన్సిలర్ కలుపుకొని మొత్తంగా 14ఓట్లు లభించాయి. ఇదే తరహాలో లభించిన ఓట్లతో వైస్ చైర్‌పర్సన్‌గా 17వార్డు కౌన్సిలర్ కళ్యన్‌కర్ పద్మబాయి ఎన్నికయ్యారు. ఎన్నిక విషయాన్ని ఆర్‌డీఓ వీవీఎల్ చంద్రకళ అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం చైర్‌పర్సన్‌గా నాయిని సత్యలక్ష్మీని, వైస్ చైర్మన్‌గా శేర్‌పల్లి ఉపేందర్‌రెడ్డి పేర్లను ప్రతిపాదించినా...కేవలం ఏడు ఓట్లు మాత్రమే లభించడంతో వారి ఎన్నిక చెల్లలేదు.
‘వంటేరు’కు వ్యతిరేకంగా నినాదాలు
బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి వల్లే తమకు చైర్‌ర్సన్ పదవి దక్కలేదని ఆరోపిస్తూ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న కళ్యన్‌కర్‌పద్మబాయి భర్త నర్సింగరావు అతని మద్దతుదారులు అన్నారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద వంటేరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐ రవికుమార్ అక్కకికి చేరుకొని వారిని సముదాయించి అక్కడినుంచి పంపించారు.
వైస్ చైర్‌పర్సన్‌గా కళ్యన్‌కర్ పద్మాబాయి
కొన్ని రోజుల ఉత్కంఠకు తెర..
బీఆర్‌ఎస్‌కు మద్దతు పలికిన బీజేపీ కౌన్సిలర్
గజ్వేల్ పీఠంపై చందన


