నాడు చైర్‌పర్సన్.. నేడు కౌన్సిలర్‌గా
హుస్నాబాద్: మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఐదేళ్లు సమర్థంగా పాలన కొనసాగించిన ఆమె.. నేడు కౌన్సిలర్‌గా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఆకుల రజిత 15వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. నాడు చైర్మన్ పదవిని జనరల్ మహిళకు కేటాయించగా, రజితను చైర్ పర్సన్‌గా ఎన్నుకున్నా రు. ఈ సారి మున్సిపల్ చైర్మన్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. దీంతో చైర్మన్ పదవి దూరమైంది. అయినప్పటికీ ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో మళ్లీ 15వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందారు. నాడు అధ్యక్షా అని పిలిపించుకున్న ఆమె.. నేడు తానే అధ్యక్షా అని పిలవాల్సిన పరిస్థితి.


