ఎల్లమ్మకు మంతిర పూజలు | - | Sakshi
Sakshi News home page

ఎల్లమ్మకు మంతిర పూజలు

Feb 15 2026 12:35 PM | Updated on Feb 15 2026 12:35 PM

ఎల్లమ

ఎల్లమ్మకు మంతిర పూజలు

హుస్నాబాద్‌/ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): హుస్నాబాద్‌ పట్టణం, అలాగే జిల్లా కేంద్రంలోనిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాలలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేయడంతో అమ్మవారికి శనివారం మొక్కులు సమర్పించుకున్నారు. సిద్దిపేటలో ఆలయ నిర్వాహకులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. ప్రజాపాలన, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు భూక్య సంపత్‌ నాయక్‌, చిత్తారి పద్మ తదితరులు పాల్గొన్నారు.

శివుని అనుగ్రహంతో

సంతోషంగా ఉండాలి

మాజీ మంత్రి హరీష్‌ రావు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పరమశివుని అనుగ్రహంతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం మహాఽశివరాత్రిని పురస్కరించుకొని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

దుబ్బాక బీఆర్‌ఎస్‌ అడ్డా..

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

దుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అడ్డా అని మరోసారి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక 17వ వార్డు నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందిన చాంద్‌మియా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మొదటి నుంచి బీఆర్‌ఎస్‌కు అండగా ఉంటుందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో 11 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లుతో పాటు మరో ముగ్గురు సైతం తమ వారే గెలుపొందడం సంతోషకరమన్నారు. దుబ్బాక మున్సిపల్‌పై మరోసారి గులాబీ జెండాను ఎగరవేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా ఖ్యాతిని ఇనుమడించాలి

కలెక్టర్‌ హైమావతి

క్రీడాకారులకు బహుమతుల ప్రదానం

సిద్దిపేటజోన్‌: క్రీడా రంగంలో రాణించి జిల్లా ఖ్యాతిని మరింత ఇనుమడించాలని జిల్లా కలెక్టర్‌ హైమావతి పిలుపునిచ్చారు. శనివారం రాత్రి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సీఎం కప్‌ క్రీడల ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకూ చెందిన క్రీడాకారులు నిరంతరం సాధన ద్వారా అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రమశిక్షణతో క్రీడల్లో పాల్గొని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. అంతకుముందు జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్‌ నర్సయ్య మాట్లాడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఎల్లమ్మకు మంతిర పూజలు1
1/3

ఎల్లమ్మకు మంతిర పూజలు

ఎల్లమ్మకు మంతిర పూజలు2
2/3

ఎల్లమ్మకు మంతిర పూజలు

ఎల్లమ్మకు మంతిర పూజలు3
3/3

ఎల్లమ్మకు మంతిర పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement