‘హరిద్ర’ మనోహరం..
పొంగిపొర్లుతున్న ‘హల్దీ’ చెక్‌డ్యాం
నాచగిరి ‘హరిద్ర’ ఉప్పొంగింది. కాళేశ్వరం గోదావరి జలాలతో హల్దీ జీవకళ సంతరించుకుంది. సుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహ క్షేత్రం కొలువైన హరిద్రా తీరం భక్తజనావళికి ఆహ్లాదం పంచుతోంది. జాలువారుతున్న నీటి ప్రవాహం నేత్రపర్వం చేస్తున్నది. ఇటీవల కొండపోచమ్మసాగర్ నుంచి హల్దీవాగులోకి గోదావరి జలాలు విడుదల చేసిన విషయం తెల్సిందే. ఒక్కో జలాశయాన్ని దాటుతూ మంగళవారం పుణ్యక్షేత్రం వద్ద చెక్‌డ్యాం వద్ద గోదావరి జలాలు పొంగిపొర్లుతుండడంతో భక్తజనులు మురిసిపోతున్నారు. మరో పక్షం రోజులలో బ్రహ్మోత్సవాల తరుణంలో జలకళతో జాతర జనానికి ఆనందం, ఆహ్లాదం, నదీస్నానం సౌకర్యం సమకూరింది. – వర్గల్(గజ్వేల్)


