కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి

Feb 25 2026 11:34 AM | Updated on Feb 25 2026 11:34 AM

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి

కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలి

చింతమడక బీరప్ప ఉత్సవంలో హరీశ్‌రావు

చింతమడక బీరప్ప ఉత్సవంలో హరీశ్‌రావు

సిద్దిపేటరూరల్‌: బీరప్ప దేవుడి దయతో, గ్రామ ప్రజలందరి దయతో కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని చింతమడక గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప ఉత్సవంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని మాట్లాడారు. కేసీఆర్‌ గ్రామ ప్రజలందరిని అడిగినట్లు చెప్పారని, ఉత్సవాలకు కేసీఆర్‌ సాయం అందించారన్నారు. ప్రజలందరూ మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని కోరుకుంటున్నారన్నారు. అందరి ఆశిస్సులతో తప్పకుండా సీఎం అవుతారన్నారు. ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని, అందరికి మంచి కలగాలని ఆకాంక్షించారు. తనవంతు సాయంగా లక్ష రూపాయలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లతశంకర్‌, ఉపసర్పంచ్‌ శివ, మాజీ సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీదేవిచందర్‌రావు, మాజీ సర్పంచ్‌ హంసకేతన్‌రెడ్డి, నాయకులు ఎర్రయాదయ్య, కిషన్‌రెడ్డి, ప్రభాకర్‌వర్మ తదితరులు తదితర నాయకులు పాల్గొన్నారు. కాగా రూరల్‌ మండల పరిధిలోని బచ్చాయిపల్లికి చెందిన సీనియర్‌ నాయకుడు దుర్గం ఎల్లం తండ్రి మృతి చెందగా వారి కుటుంబాన్ని, సీతారాంపల్లిలో శ్రీకాంత్‌రెడ్డి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని హరీశ్‌రావు పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement