నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు

Feb 25 2026 11:34 AM | Updated on Feb 25 2026 11:34 AM

నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచే ఇంటర్‌ పరీక్షలు

ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి

సిద్దిపేటఎడ్యుకేషన్‌: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల నుంచి ప్రథమ, ద్వితీయ మొత్తం 20,035 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం జిల్లాలో 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యుత్‌, ఆర్టీసీ, పోలీస్‌ తదితర శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షలను సజావుగా నిర్వహిస్తామని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రవీందర్‌రెడ్డి చెప్పారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సీఎస్‌, డీఓలకు సూచించారు. గతంలో ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమంతించని నిబంధన ఉండేది. అయితే ఈ సారి 5 నిమిషాల వరకు అవకాశం కల్పించారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనల మేరకు బందోబస్త్‌ ఏర్పాటు చేయనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్‌

సిద్దిపేటరూరల్‌: ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హైమావతి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇంటర్‌ పరీక్షల నిర్వ

హణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌, అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరగనున్నాయన్నారు. సమన్వయంతో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని జయించేందుకు టెలీమానస్‌ నంబర్‌ 14416కు ఫోన్‌ చేయాలని, సమస్యలను నివృత్తి చేసుకునేందుకు కంట్రోల్‌ రూం 9949330191 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఐపీఎస్‌ ఆయేషాఫాతిమా, డీఐఈఓ రవీందర్‌రెడ్డి, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ ధనరాజ్‌, డీపీఓ రవీందర్‌, పాల్గొన్నారు.

స్టూడెంట్స్‌ ఆల్‌ ది బెస్ట్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు

సిద్దిపేటఎడ్యుకేషన్‌: ఇంటర్‌ విద్యార్థులకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలను విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. కష్టపడి చదివి పరీక్ష బాగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఇంటర్‌ మీ భవిష్యత్తుకు పునాదిలాంటిదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement