చేర్యాలలో 44 మంది అభ్యర్థులు
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపల్ బరిలో 44 మంది నిలిచారు. 12 వార్డులకు మొత్తం 57 మంది 85 నామినేషన్లు వేశారు. వీరిలో 13 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా 44 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ నాగెందర్ తెలిపారు. 1, 2, 3, 5, 7, 8, 10, 12 వార్డుల్లో ముగ్గురు చొప్పున, 4, 9 వార్డుల్లో నలుగురు చొప్పున, 6, 11 వార్డుల్లో అత్యధికంగా ఆరుగురు చొప్పున అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, ఏఐఎఫ్‌బీ పార్టీల అభ్యర్థులు తమ బీ ఫాంలను అందజేశారు. మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తులు కేటాయించారు.


