కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
హుస్నాబాద్: కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని, మున్సిపల్ ఎన్నికల్లో విజయ ఢంకా మోగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం ఆర్యవైశ్య భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 20 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్టీలో ఎవరూ అసంతృప్తిలో లేరని, నామినేషన్ వేసిన వారు ఉపసంహరించుకున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాల, 250 పడకల ఆస్పత్రి, ఇండస్ట్రీయల్ కారీడార్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎలాంటి షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయో హుస్నాబాద్‌లో కూడా ఏర్పాటు చేస్తామన్నారు. రూ.8 కోట్లతో మార్కెట్ యార్డులో నీటిని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లును ఇవ్వలేదన్నారు., హుస్నాబాద్ పట్టణంలో 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో కోతుల బెడద ఉందని, చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో
విజయ ఢంకా మోగిస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్


