వామపక్షాలు ఒంటరిగానే.. | - | Sakshi
Sakshi News home page

వామపక్షాలు ఒంటరిగానే..

Feb 4 2026 8:43 AM | Updated on Feb 4 2026 8:43 AM

వామపక్షాలు ఒంటరిగానే..

వామపక్షాలు ఒంటరిగానే..

సాక్షి, సిద్దిపేట: పురపాలికల్లో ఒంటరిగానే వామపక్షాలు బరిలోకి దిగాయి. ఒక్క చేర్యాలలో మాత్రమే బీఆర్‌ఎస్‌–సీపీఎం పొత్తు కుదిరింది. హుస్నాబాద్‌, గజ్వేల్‌, దుబ్బాకలో సీపీఐ, సీపీఎంలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. తమ సత్తాను చాటుతామని నేతలు ముందుకు సాగుతున్నారు. ఈసారి పురపాలికల్లో జనసేన, బీఎస్పీ సైతం పలు వార్డులో పోటీ చేస్తోంది.

కాంగ్రెస్‌–సీపీఐకి కుదరని పొత్తు

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌–సీపీఐ పొత్తుతో ముందుకు వెళ్లారు. బల్దియా ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పై చివరి వరకు చర్చలు జరిపారు. కానీ పొత్తు కుదరలేదు. దీంతో హుస్నాబాద్‌లో సీపీఐ నాలుగు వార్డుల్లో తమ అభ్యర్థులను, గజ్వేల్‌లో నలుగురు, దుబ్బాక చేర్యాలలో ఒక్కరు చొప్పున పోటీ చేస్తున్నారు. మిగతా వార్డుల్లో ఎవరికి మద్దతు తెలుపుతారో ఇంకా ప్రకటించలేదు.

చేర్యాలలో పొత్తు

చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌–సీపీఎం పొత్తుతో పోటీ చేస్తున్నారు. 12 వార్డులుండగా అందులో 11 వార్డుల్లో బీఆర్‌ఎస్‌, ఒక వార్డులో సీపీఎం పోటీ చేస్తుంది. పొత్తులో భాగంగా 3వ వార్డును కేటాయించగా లావణ్య అనే మహిళ పోటీ చేస్తున్నారు. మిగతా గజ్వేల్‌, దుబ్బాకలలో చర్చలు జరిపారు. రెండు చోట్ల బీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉండటంతో సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించి... పొత్తుకు ఒప్పుకోలేదు. దీంతో ఒంటరిగానే.. తమకు బలం ఉన్న చోట సీపీఎం పోటీ చేస్తోంది. దుబ్బాకలో 12, 15, 17 వార్డుల్లో, గజ్వేల్‌లో ఒక చోట పోటీ చేస్తున్నారు.

చేర్యాలలోనే బీఆర్‌ఎస్‌–సీపీఎం పొత్తు

మిగతా మున్సిపాలిటీల్లో

ఒంటరిగా బరిలోకి..

సీపీఐ సైతం 10వార్డుల్లో పోటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement