కొనుగోలు కేంద్రంలోనే విక్రయించండి
గజ్వేల్‌రూరల్: కందులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని డీసీఓ (జిల్లా సహకార అధికారి) వరలక్ష్మి అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కందులకు క్వింటాలుకు మద్దతు ధర రూ.8వేలను చెల్లిస్తుందన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రఘోత్తంరెడ్డి, ఏఎంసీ సెక్రటరీ జాన్‌వెస్లీ, అధికారులు బాలయ్య, రైతులు, సిబ్బంది పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
డీసీఓ వరలక్ష్మి


