కేసీఆర్‌, హరీశ్‌రావు దిష్టిబొమ్మల దహనం | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, హరీశ్‌రావు దిష్టిబొమ్మల దహనం

Feb 3 2026 9:45 AM | Updated on Feb 3 2026 9:45 AM

కేసీఆర్‌, హరీశ్‌రావు దిష్టిబొమ్మల దహనం

కేసీఆర్‌, హరీశ్‌రావు దిష్టిబొమ్మల దహనం

గజ్వేల్‌రూరల్‌: అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దిష్టిబొమ్మలను అహ్మదీపూర్‌లో దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రభాకర్‌, మల్లేశం, అంజాగౌడ్‌, రామాగౌడ్‌, బాల్‌రాజుగౌడ్‌లు మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ హయాంలో అవినీతి, అక్రమాలకు అంతేలేదన్నారు. తప్పు చేస్తే ఎవరికై నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ చట్ట విరుద్ధమని తెలిసినప్పటికీ ప్రముఖుల ఫోన్లను ట్యాప్‌ చేయడం అతి నీచమైనదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement