అందరూ మెచ్చే బడ్జెట్‌పై విమర్శలా?
గజ్వేల్: ప్రధాని నరేంద్రమోదీ ప్రపంచం మెచ్చే బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. కేటీఆర్, హరీశ్‌రావులకు కనపడకపోగా, విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంపీ రఘునందన్‌రావు మండిపడ్డారు. సోమవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఒకసారి బండకేసి కొట్టిండ్రు, ఇప్పటికై నా ఏదీ పడితే అది మాట్లాడటం మానుకోవాలని హెచ్చరించారు. కేంద్రం ‘ఆత్మనిర్భర్ భారత్’ కోసం ప్రయత్నిస్తున్నదని చెప్పారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడంలో వాస్తవం లేదన్నారు. దక్షిణ భారతదేశానికి కేంద్రం ఏడు హై స్పీడ్ రైళ్లు ఇస్తే...అందులో తెలంగాణకు మూడు కేటాయించారని, అదేవిధంగా గతంతో పోలిస్తే రోడ్లకు అత్యధికంగా నిధులు వచ్చాయన్నారు. సిట్ దర్యాపును సమర్థవంతంగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ రఘునందన్‌రావు ఆగ్రహం
గజ్వేల్‌లో బీజేపీ అభ్యర్థులకు
మద్దతుగా ప్రచారం


