బాల్య వివాహాలు చేస్తే చర్యలు
గజ్వేల్‌రూరల్: బాల్య వివాహాలు జరిపిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, సీడీపీఓ సరిత అన్నారు. గజ్వేల్ మండలంలోని ఓ గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారని సమాచారం తెలుసుకున్న సంబంధిత శాఖల అధికారులు బుధవారం పట్టణంలోని ఐవోసీలో బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహం చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా బాలికలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం బాలికలకు 18ఏళ్లు, బాలురకు 21ఏళ్లు నిండాలన్నారు. ఈ చట్టాన్ని అతిక్రమిస్తే పోక్సో చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే వ్యక్తిపై, సహకరించిన వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, చైల్డ్‌లైన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


