ఏడుపాయల హుండీ ఆదాయం రూ.39.87 లక్షలు
పాపన్నపేట(మెదక్): ఏడుపాయల హుండీ ఆదాయం రూ.39,87,178 వచ్చినట్లు ఆలయ ఈఓ వీరేశం తెలిపారు. బుధవారం 29 రోజుల కానుకలు లెక్కించారు. కాగా వివిధ సేవల ద్వారా రూ. 47,69,090 వచ్చిందన్నారు. మొత్తం కలిపి రూ. 87,56,268 వచ్చినట్లు చెప్పారు. ఒడిబియ్యం టికెట్ల ద్వారా రూ.69,200, కేశఖండనం రూ.56,600, స్పెషల్ దర్శనం (రూ.20 టికెట్) ద్వారా రూ.3,59,420, స్పెషల్ దర్శనం (రూ.100 టికెట్) ద్వారా రూ.10,09,600, లడ్డూలకు రూ. 22,48,640, పులిహోర రూ.10,25,630 వచ్చినట్లు వివరించారు. కాగా మిశ్రమ బంగారం 0.32, వెండి 730 గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా గత జాతరతో పోలిస్తే రూ.26,06,031 ఆదాయం అధికంగా వచ్చిందని ఈఓ తెలిపారు.


