ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు
● కలెక్టర్ హైమావతి ఆదేశం
● 10న పోలింగ్ సామగ్రి పంపిణీ
చేర్యాల(సిద్దిపేట)/దుబ్బాక: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేటలో, అలాగే.. చేర్యాలలో పోలింగ్ సామగ్రి, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, స్ట్రాంగ్‌రూమ్ కేంద్రాలను, కౌంటింగ్ హాల్ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11న జరిగే పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఎన్నికల సామగ్రి పంపిణీ చేయాలని, 11న పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపర్చాలని చెప్పారు. 13న కౌంటింగ్ నేపథ్యంలో ఒకరోజు ముందే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బందికి భోజనం, తాగునీరు లాంటి సౌకర్యాలు కల్పించాలని, పాస్‌లు ఉన్నవాళ్లను మాత్రమే లోపలికి అనుమతించాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ వెబ్ కెమెరాలలో రికార్డు కావాలని సూచించారు.
లచ్చపేట మోడల్ స్కూల్‌లో స్ట్రాంగ్‌రూమ్
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ హైమావతి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహా రా న్ని అందించాలని కలెక్టర్ హైమావతి అన్నా రు. దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. మధ్యా హ్న భోజన ప్రక్రియను పరిశీలించారు. వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిస్ట్రార్ సక్రమంగా నిర్వహించాలని కోరారు. పొరపాట్లు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు.


