మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామిని పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి కుటుంబ సమేతంగా బుధవారం దర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేష వస్త్రాలు, చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఈఓ వెంకటేశ్, ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్ పాల్గొన్నారు.
కంప్యూటర్ స్కిల్స్‌పై
సర్టిఫికెట్ కోర్సు
హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బెసిక్ కంప్యూటర్ స్కిల్స్‌పై సర్టిఫికెట్ కోర్సు రెండో బ్యాచ్ ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ విజయగిరి భిక్షపతి తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు ఇంటర్మీడియెట్, డిగ్రీ చదువుతున్న, పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 5వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. కోర్సులో భాగంగా ఉచితంగా స్టడీ మెటీరియల్, కోర్సు పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్ ఇస్తామని వెల్లడించారు.
రైతులతో సమూహ చర్చ
చిన్నకోడూరు(సిద్దిపేట): గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణలో భాగంగా మండల పరిధిలోని గంగాపూర్‌లో కరీంనగర్ జిల్లా వ్యవసాయ కళాశాల విద్యార్థినులు సమూహ చర్చ నిర్వహించారు. సేంద్రియ ఎరువులతో పంటలకు పోషకాలు అందించవచ్చని వివరించారు. సూక్ష్మ పోషకాల గూర్చి వివరించారు. పంటలను ఆశించే తెగుళ్లు, వాటి నివారణ చర్యల గూర్చి తెలిపారు. కార్యక్రమంలో ఏఓ జయంత్ కుమార్, విద్యార్థినులు హశ్విత, ప్రత్యూష రెడ్డి, మంజూష, శివాని, మేఘన, ఫిర్దోస్, సర్పంచ్ భవాని, రైతులు పాల్గొన్నారు.
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రకృతి వ్యవసాయం చేస్తే సమాజానికి ఆరోగ్యం పంచడంతో పాటు రైతులకు మంచి దిగుబడి వస్తుందని ఏడీఏ పద్మ అన్నారు. మండల పరిధిలోని రామంచలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయనిక ఎరువులు, పురుగులమందుల వినియోగం తగ్గించి, సహజ ఎరువులు వాడాలని సూచించారు. దీనివల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని, భూమిలో సేంద్రియ కర్బనం, వానపాములు పెరిగి భూసారం మెరుగుపడుతుందన్నారు.
400 ఏళ్ల కోనేరు ప్రక్షాళన
దుబ్బాకటౌన్: మున్సిపల్ పరిధి ధర్మాజిపేటలోని 400 ఏళ్ల చరిత్ర గల పురాతన శివాలయంలో కోనేరు శిథిలావస్థకు చేరుకోవడంలో బాగు చేసేందుకు యువత ముందుకు వచ్చింది. వేద సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం కోనేరులో చెత్తాచెదారం, శివాలయం పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. కోనేరు శుభ్రం కావడంతో ఈ ప్రాంతం ఆధ్మాతికంగా రూపుదిద్దుకుంటుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి
మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి
మల్లన్న సన్నిధిలో పాట్నా హైకోర్టు జడ్జి


