ఈపీఎఫ్ పెన్షన్ పెంచాల్సిందే
బీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
సిద్దిపేటరూరల్: కార్మికులకు అందిస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్‌ను రూ. 7,500లకు పెంచాలని బీఎంఎస్ జాతీయ అధ్యక్షుడు సుంకరి మల్లేశం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బీఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కార్మికులను నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వేతనాలకు సంబంధించిన జీఓలను వెంటనే అమలు చేయాలని, బీడీ కార్మికుల జీవన భృతి ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తక్షణమే అమలు చేయాలన్నారు. అసంఘటిత కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు.


