కర్రు కాల్చివాత పెట్టాలి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం
బీఆర్‌ఎస్ అభ్యర్థులను
గెలిపించాలని విజ్ఞప్తి
నర్సాపూర్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బంద్ చేసి హామీలన్నీ ఎగ్గొట్టారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం నర్సాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డి 14 రోజుల పాటు అమెరికాకు పోయినప్పుడు టీవీల్లో శబ్ధ కాలుష్యం తగ్గిందన్నారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ సిగాచీ కార్మిక కుటుంబాలను ఆదుకోలేదని, కంపెనీ ఇచ్చిన డబ్బులే ఇచ్చారన్నారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని విమర్శించారు. ఈ విషయమై ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని, మున్సిపల్ ఎన్నికల్లో ఓడించి కర్రు కాల్చి వాత పెట్టాలని కోరారు. రేవంత్‌రెడ్డివన్నీ తొండి మాటలేనన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో నర్సాపూర్ అభివృద్ధి చెందిందన్నారు. కేంద్రబడ్జెట్‌లో ఏపీకి నిధులు ఇచ్చి తెలంగాణకు మొండి చేయి చూపిందని, ఇక్కడి బీజేపీ ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్‌కు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అణిగి మణిగి ఉండాలని, ఎగిరిపడితే ప్రజలు రాళ్లతో కొడుతారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు సంగీత, అనుసూయ అశోక్‌గౌడ్, నయిమోద్దీన్, సత్యనారాయణగౌడ్, సునీతాబాల్‌రెడ్డి, కండెల రాజు, సమీన బేగం, షేక్‌హుస్సేన్, కళ్యాణి, హమీద్, శ్రావ్య, మంజుల, మోహిన్‌అలీ, వినయ్‌కుమార్, సరిత, లలితలను పరిచయం చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు దేవేందర్‌రెడ్డి, చంద్రాగౌడ్, గోపి, మన్సూర్, శేకర్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


