పారదర్శకంగా యూరియా పంపిణీ
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి స్వరూపరాణి తెలిపారు. బుధవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా రైతులకు అవసరానికి అనుగుణంగా, పారదర్శకంగా, సమయానికి పంపిణీ జరుగుతోందన్నారు. యాప్‌లో నమోదైన వివరాల ప్రకారం 9,136 మంది రైతులు 29,732 యూరియా బస్తాలు బుక్ చేయగా, ఇప్పటివరకు 20,829 బస్తాలు పంపిణీ చేశామన్నారు. యూరియా బుకింగ్ యాప్ ద్వారా ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంతో పాటు పంట అవసరాలకు అనుగుణంగా సమాన పంపిణీ సాధ్యమవుతుందని తెలిపారు. కౌలుదారుల రైతులకు కూడా ప్రాధాన్యత ఇస్తూ, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ జరుగుతోందన్నారు. రైతులు యూరియాను యాప్ ద్వారానే బుకింగ్ చేయాలని, ఫీల్డ్ స్థాయి సిబ్బందితో సహకరిస్తూ డిజిటల్ విధానాన్ని వినియోగించుకోవాలన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి


