గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు | - | Sakshi
Sakshi News home page

గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

గ్యార

గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు

ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్‌ నేతలను నిలదీయండి

మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే

మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌: ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం నట్టేట ముంచిందని, ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు వస్తే ఎక్కడికక్కడా హామీలపై నిలదీ యాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రెండున్నరేళ్లు కావస్తున్నా.. ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. గజ్వేల్‌ పట్టణంలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మహలక్ష్మీ పథకం కింద మహిళలకు ప్రభుత్వం ఇప్పటివరకు బాకీపడిన రూ.65 వేలు చెల్లించాలన్నారు. బీజేపీకి ఓటేసినంతమాత్రాన ఒరిగేదేమీలేదన్నారు. ఆ పార్టీకి తగువిధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వచ్చేదీ బీఆర్‌ఎస్సేనని, తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేసి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి, బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ ఎన్నికల పరిశీలకుడు రాధాకృష్ణశర్మ, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌, మాజీ జెడ్పీటీసీ మల్లేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హార్వర్డ్‌ పోయినా.. మారలే..

హార్వర్డ్‌ యూనివర్సిటీ పోయినా, అంతరిక్షం పోయినా కుక్క తోక వంకరలాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు మారలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌ తెలంగాణకు జాతిపిత ఎట్లయితడని రేవంత్‌రెడ్డి ప్రశ్నిస్తుండు..కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చునా, ఈ రాష్ట్రానికి నువ్వు సీఎం అయ్యేవారివా? అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. దమ్ముంటే పనిలో పోటీ పడాలని, కేసీఆర్‌ను తిట్టడంలో కాదని చెప్పారు.

ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు

గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు1
1/1

గ్యారంటీల పేరుతో నట్టేట ముంచిండ్రు

Advertisement
 
Advertisement
Advertisement