కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు

Feb 6 2026 11:45 AM | Updated on Feb 6 2026 11:45 AM

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను నమ్మొద్దు

దుబ్బాక: కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కృషితోనే తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దుబ్బాక పట్టణంలో ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు ఆధ్వర్యంలో మున్సిపల్‌ ఎన్నికల శంఖారావం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అఽధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా కనీసం గుంతలు పడిన రోడ్లను కూడా బాగుచేయలేని దుస్థితిలో ఉండటం సిగ్గుచేటన్నారు. మెదక్‌, సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు జాతీయ రహదారి నిర్మాణం ఎంపీ రఘునందన్‌రావు కృషితోనే జరుగుతోందన్నారు. డబ్బులు లేవని సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దోచుకున్న డబ్బులను దాచుకునేందుకు కేసీఆర్‌ కుటుంబం రోడ్డున పడి గొడవలు చేసుకుంటుందన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేంద్రం నిధులతోనే జరుగుతుంది తప్పా రాష్ట్రప్రభుత్వంతో కాదన్నారు. దుబ్బాకలో రఘునందన్‌రావు ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారని అదే తరహాలో మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి మరోసారి చరిత్ర సృష్టించాలన్నారు.

కాషాయ జెండా ఎగురవేద్దాం

దుబ్బాక మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాషాయం జెండాను ఎగురవేద్దామని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు.కాంగ్రెస్‌కు దుబ్బాకలో స్థానం లేదని ఆ పార్టీకి ఓట్లువేస్తే గంగలో వేసినట్లవుతుందని ఇక బీఆర్‌ఎస్‌కు వేస్తే ఏం లాభం ఉండదన్నారు.బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు.

ఎన్నికల సభలో సంఘీభావం చాటుతున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ రఘునందన్‌రావు, బీజేపీ అభ్యర్థులు

మోదీ కృషితోనే జాతీయ రహదారుల నిర్మాణం

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

దుబ్బాకలో బీజేపీ మున్సిపల్‌ ఎన్నికల సభ

Advertisement
 
Advertisement
Advertisement