గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి

Feb 6 2026 7:14 AM | Updated on Feb 6 2026 7:14 AM

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి

గృహ నిర్మాణాల్లో వేగం పెంచాలి ● కలెక్టర్‌ హైమావతి ● ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష ఇవేం కూరలు..? పాఠశాలల్లో పనులు పూర్తిచేయండి సిద్దిపేటరూరల్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీలు, అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణాలను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్‌ హైమావతి పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పనుల్లో ప్రహరీలకు, మరుగుదొడ్ల నిర్మాణాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన ఈజీఎస్‌ పనులు పూర్తి చేసి నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్డిఓ జయదేవ్‌ ఆర్య, పంచాయతీరాజ్‌ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి పవన్‌ కుమార్‌, ఏఈ తదితరులు పాల్గొన్నారు.

● కలెక్టర్‌ హైమావతి ● ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్ష

దుబ్బాక: జిల్లాలోని అన్ని మండలాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగిరం చేయాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం దుబ్బాక మండలం బల్వంతాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో 45 ఇళ్లు మంజూరు కాగా కేవలం 15 మాత్రమే గ్రౌండింగ్‌కావడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులతో మాట్లాడి నిర్మించుకోవడానికి సుముఖంగా లేనివారి నుంచి లెటర్‌ తీసుకొని డిలీట్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం దుబ్బాక, భూంపల్లి–అక్బర్‌పేట మండల కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

మండలంలోని హబ్షీపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, మండల పరిషత్‌ పాఠశాలలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటలను పరిశీలించి కూరలు పలుచగా ఉండడం చూసి అసహనం వ్యక్తం చేశారు. అన్ని పాఠశాలల్లో వంటలు నాణ్యతగా రుచికరంగా ఉండకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు ప్రకారం ఆహార పదార్థాలు వండాలని సూచించారు. అలాగే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement