నిధుల కోసం ఒత్తిడి పెంచుతాం
పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రతాప్‌రెడ్డి
గజ్వేల్: నియోజకవర్గం కేసీఆర్ అడ్డానని, ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న తమ పార్టీపై కుట్రలను సహించేదీలేదని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్ పర్సన్ కళ్యన్‌కర్ పద్మాబాయిలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల మద్దతుతో నియోజకర్గంలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలను కై వసం చేసుకోగలిగామన్నారు. తూప్రాన్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ఎంపీ రఘునందన్‌రావు బీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టడానికి కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయంలో తానూ చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. మున్సిపాలిటీలోని సమస్యలు తీర్చకపోతే పోరాడుతామని హెచ్చరించారు. నిధుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. సమావేశంలో నాయకులు ఎన్‌సీ రాజమౌళి, నవాజ్‌మీరా, మధు తదితరులు పాల్గొన్నారు.


