మెరుగైన సేవలందించండి
గజ్వేల్: ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని మున్సిపల్ పాలకవర్గానికి మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన, వైస్ చైర్‌పర్సన్ కళ్యన్‌కర్ పద్మాబాయితోపాటు కౌన్సిలర్లు మాజీ మంత్రి హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ఆశయాలకనుగుణంగా పట్టణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. కాగా బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డిలను సైతం పాలకవర్గం కలిసింది. కార్యక్రమంలో గజ్వే ల్ మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివా స్, బీఆర్‌ఎస్ నేత వంటేరు విజయ్‌వర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరమ్ మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు


