బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Feb 10 2026 9:48 AM | Updated on Feb 10 2026 9:48 AM

బీజేప

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం కాంగ్రెస్‌, బీజేపీలను నమ్మి మోసపోవద్దు పౌర హక్కులకు భంగం కలిగించొద్దు ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్లు కేటాయించాలి

ఎంపీ రఘునందన్‌రావు

దుబ్బాకటౌన్‌: అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా సోమవారం దుబ్బాక, చెల్లాపూర్‌, దుంపలపల్లి, లచ్చపేట, చేర్వాపూర్‌ వార్డుల్లో బీజేపీ అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి నిరోధకుడు మాజీ మంత్రి హరీశ్‌రావు అని, గత బీఆర్‌ఎస్‌ హయాంలో దుబ్బాక అభివృద్ధిని అడుగడునా అడ్డుకొన్నారన్నారు. నియోజకవర్గానికి సంబంధించిన కోట్ల రూపాయల నిధులను సిద్దిపేటకు మళ్లించుకున్నారని ఎంపీ మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకేతాను ముక్కలని, వారికి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటు వేస్తే మురుగు కాల్వలో వేసినట్లేనన్నారు. పదేళ్ల పాటు మెదక్‌ ఎంపీగా ఉండి, ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక అభివృద్ధికి చేసిందేమీలేదన్నారు. హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్‌ పేరుతో భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. దుబ్బాక అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

గజ్వేల్‌: హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌ను, అబద్దాలు చెప్పే బీజేపీనీ ప్రస్తుత మున్సిపల్‌ ఎన్నికల్లో నమ్మి మోసపోవద్దని బీఆర్‌ఎస్‌ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి స్వప్న, 14వవార్డు అభ్యర్థి శీరిషలకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీలపై తీరుపై మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలిచ్చిందని ఆరోపించారు. మరోవైపు బీజేపీ నేతలు తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు.

చిన్నకోడూరు(సిద్దిపేట): సమాజంలో మానవ హక్కులకు భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జాతీయ మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పల్లె రాజు అన్నారు. సోమవారం చిన్నకోడూరులో ఎన్‌హెచ్‌ఆర్‌సీ క్యాలెండర్‌ను ఎస్‌ఐ చంద్రమోహన్‌తో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రజలు వారి హక్కులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు ప్రజలు, ప్రభుత్వ అధికారులు సంస్థ ద్వారా న్యాయం పొందగలుగుతారన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య

తొగుట(దుబ్బాక): ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15వేల కోట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ డిమాండ్‌ చేశారు. మండలంలోని తుక్కాపూర్‌లో ఎమ్మార్పీఎస్‌ జిల్లా సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందించాలని కోరారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించిందని ఆరోపించారు. లిడ్‌క్యాప్‌ భూములు లీజుపేరుతో అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లిడ్‌క్యాప్‌కు రూ.10వేల కోట్లు కేటాయించాలన్నారు. లిడ్‌క్యాప్‌ సంస్థకు చైర్మన్‌ను నియమించి మాదిగలకు జీవనోపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుర్రాల శ్రీనివాస్‌, మోహన్‌, వెంకట్‌, రాజమల్లయ్య పాల్గొన్నారు.

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
1
1/2

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం 
2
2/2

బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement