ప్రకృతి వ్యవసాయం ఎంతో మేలు
గజ్వేల్: ప్రకృతి వ్యవసాయంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తోర్నాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త సరిత అన్నారు. శనివారం గజ్వేల్ మండలం దాతర్‌పల్లిలో ‘నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్’ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో రసాయనిక ఎరువుల వాడకానికి స్వస్తి పలకవచ్చునని చెప్పారు. పొద్దుతిరుగుడు పంట సాగులో మెలకువలను ఈ సందర్భంగా వివరించారు. కాగా మండలంలోని దిలాల్‌పూర్‌లో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్ సీడ్స్ పథకం ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఏడీఏ బాబునాయక్, వ్యవసాయాధికారి నాగరాజు, దాతర్‌పల్లి సర్పంచ్ దివ్య, దిలాల్‌పూర్ సర్పంచ్ వెంకట్‌రెడ్డి, ఏఈఓ మాధవీ, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.
‘తోర్నాల’ శాస్త్రవేత్త సరిత
దాతర్‌పల్లిలో అవగాహన సదస్సు


