ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 18 2026 8:33 AM | Updated on Feb 18 2026 8:33 AM

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

సిద్దిపేటరూరల్‌: జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ హైమావతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులతో జూమ్‌ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్మీడియెట్‌ పరీక్షలు జరగనున్నాయన్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 9,946, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 10,095 మంది ఉండగా 42 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. దీనికై అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల పనిచేసేలా చూడాలని, విద్యుత్‌ కొరత, లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామాలు ప్రతిరూపం..

ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామాలు ప్రతిరూపమని కలెక్టర్‌ కె. హైమావతి అధికారులకు సూచించారు. క్షేత్ర పర్యటన చేస్తున్న 37 మందితో కూడిన గ్రూప్‌–1 మొదటి బ్యాచ్‌ అధికారులకు వివిధ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవలపై ప్రొజెక్టర్‌ ద్వారా అవగాహన కల్పించారు. మల్లన్న సాగర్‌ వద్ద మంగోల్‌ లో వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంటును, మహానగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించాలని సూచించారు.

కలెక్టర్‌ హైమావతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement