అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌

Feb 11 2026 8:47 AM | Updated on Feb 11 2026 8:47 AM

అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌

అన్ని ఏర్పాట్లు చేశాం: కలెక్టర్‌

దుబ్బాక: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ హైమావతి అన్నారు. మంగళవారం దుబ్బాక మున్సిపల్‌లోని లచ్చపేట మోడల్‌ స్కూల్‌లో పోలింగ్‌ మెటీరియల్‌, డిస్ట్రిబ్యూషన్‌ ప్రక్రియను జిల్లా మున్సిపల్‌ ఎన్నికల సాధారణ పరిశీలకులు ఆయేషా మస్రత్‌ ఖానంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్‌ సిబ్బంది అందజేసిన సామగ్రిని చెక్‌ చేసుకోవాలని బ్యాలెట్‌ పేపర్‌ కౌంట్‌ చేసుకోవాలన్నారు. ఉదయం మాక్‌ పోలింగ్‌ పూర్తి చేసుకొని 7 గంటలకు పోలింగ్‌ ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఓటర్‌ స్లిప్‌లు పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల బయట పంపిణీ చేయాలన్నారు. పోలింగ్‌ స్టేషన్‌లలో ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కరించుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement