యుద్ధం ఎఫెక్ట్ నిర్మాణ రంగంపై పడుతోంది. ఐరన్, వివిధ వస్తువుల ధరలు పెరిగినప్పటికీ నాణ్యతలో తగ్గకుండా నిర్మాణం చేపడుతున్నాం. కస్టమర్‌కు అనుకున్న సమయానికి ఇంటిని నిర్మించి అందించేందుకు కృషి చేస్తున్నాం.
– కోల నర్సింహాగౌడ్, బిల్డర్
వ్యాపారం చాలా తగ్గింది
ఐరన్ వ్యాపారం గతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం కొంత పుంజుకుంటున్న సమయంలో ధరలు మండుతున్నాయి. వ్యాపారం జరగక వర్కర్లకు జీతాలు ఇవ్వడం సైతం ఇబ్బంది అవుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు.
– జియోద్దీన్, ఐరన్, వ్యాపారి


