గజ్వేల్‌రూరల్: మార్జిన్ ధరలను పెంచాలని డిమాండ్ చేస్తూ చికెన్ విక్రయ దుకాణ నిర్వాహకులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం గజ్వేల్ పట్టణంలోని చికెన్ దుకాణాలను మూసివేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను భారీగా తగ్గించి తమ పొట్టకొడుతున్నాయని ఆరోపించారు. పెరుగుతున్న ధరలతో చికెన్ సెంటర్ల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మార్జిన్ ధరలను పెంచే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్–ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమామ్, హుస్సేన్, తిరుపతి, కార్యదర్శులు రాజు, ముస్తఫా, మాజీ అధ్యక్షులు శేఖర్, జహీర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
చికెన్ షాప్‌ల తాత్కాలిక మూసివేత
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో చికెన్ షాప్‌లను నిర్వాహకులు బుధవారం తాత్కాలికంగా మూసివేశారు. హోల్‌సెల్ నిర్వాహకులు కమీషన్ తక్కువ ఇస్తున్నారంటూ చికెన్ షాపు యజమానులు తెలిపారు. సాయంత్రం నుంచి తిరిగి చికెన్ సెంటర్లు తెరుచుకున్నాయి. జిల్లాలో దాదాపు 1000కి పైగా చికెన్ షాపులు ఉన్నాయి. రోజూ ఈ షాప్‌ల నుంచే హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లు, బార్‌లు, వసతి గృహాలకు, గృహ వినియోగానికి సరఫరా అవుతోంది.


