వ్యసనాలకు బానిస కావొద్దు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని సీపీ సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. వివరాలు 8లో u
గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
● యుద్ధం ఎఫెక్ట్.. సామాన్యుడిపై భారం
● నెలరోజుల్లోనే టన్నుకు సుమారు రూ.8వేలు పెరుగుదల
● ఆందోళన చెందుతున్న గృహ నిర్మాణదారులు, బిల్డర్లు
నెల స్టీల్ సెకండరీ రకం(కేజీ రూ.) స్టీల్ ప్రైమ్ (కేజీ రూ.)
మార్చి 1 55 నుంచి 58 60 నుంచి 65
ఏప్రిల్ 1 68 నుంచి 74 70 నుంచి 80
కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సొంతింటి కలను నెరవేర్చకుందామనుకున్న వారికి నిరాశే మిగలనుంది. రెండేళ్లుగా నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగం పుంజుకుంటున్న సమయంలో ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఏ భవనం నిర్మించాలన్నా ఐరన్ తప్పనిసరి. స్టీల్, సిరామిక్ బాత్ ఐటమ్స్, విద్యుత్ వైర్లు, తదితర వస్తువుల ధరలు పెరగడంతో నిర్మాణాలు చేసుకునే వారు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోల్చుకుంటే స్టీల్ ధరలు భారీగా పెరిగాయి. నిర్మాణాల పనులు నిలిపివేయాలా?.. కొనసాగించాలా? అని తర్జనభర్జన పడుతున్నారు.
అదనపు ఖర్చు..
సాధారణంగా సింగిల్ బెడ్రూంను రూ.12లక్షల్లో నిర్మాణం చేయాలనుకునే వారికి పెరిగిన ధరలతో రూ.16లక్షలు ఖర్చు అయ్యే అవకాశం ఉందని బిల్డర్లు అంటున్నారు. దీనికి తోడు సిమెంట్ ధరలు సైతం పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. గృహ నిర్మాణంలో ఉపయోగించే వస్తువుల ధరలు పెరగడంతో బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. నిర్మాణం కోసం అగ్రిమెంట్ చేసుకున్న సమయం కంటే దాదాపు 10 నుంచి 20శాతం పెరగడంతో బిల్డర్ల పై అదనపు భారం పడనుంది. ధరల పెరగడంతో కొందరు బిల్డర్లు ఇంటి యజమానులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
పశ్చిమాసియాలో యుద్ధంతో సామాన్యుడిపై ధరల పిడుగు పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం ప్రజలు సతమత మవుతుండగా వంట నూనెలు, నిత్యావసర ధరలు పెరిగాయి. మరోవైపు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి స్టీల్ ధరలు సైతం పెరుగుతుండటంతో నిర్మాణారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు స్టీలుపై టన్నుకు రూ.5వేల నుంచి రూ.8వేలు ధరలు పెరిగాయి. దీంతో గృహనిర్మాణం చేస్తున్నవారు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట


