గతేడాది రెమ్యూనరేషన్‌ చెల్లించండి | - | Sakshi
Sakshi News home page

గతేడాది రెమ్యూనరేషన్‌ చెల్లించండి

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

డీటీఎఫ్‌ జిల్లా నాయకుల వినతి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): గతేడాది 10వ తరగతి మూల్యాంకన రెమ్యూనరేషన్‌ను వెంటనే చెల్లించాలని డీటీఎఫ్‌ జిల్లా నాయకులు కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న టెన్త్‌ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద డీఈఓ శ్రీనివాస్‌రెడ్డికి డీటీఎఫ్‌ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా డీటీఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ గత విద్యాసంవత్సరంలో పదవ తరగతి జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి సంవత్సరమైనా నేటి వరకు టీఏ, డీఏలు, రెమ్యూనరేషన్‌లు ఇవ్వలేదన్నారు. వెంటనే అందించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడు చంద్ర భాను, కార్యదర్శి మల్లయ్య, ఆడిట్‌ కమిటీ సభ్యులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

హక్కులను కాలరాస్తున్న కేంద్రం

సిద్దిపేటకమాన్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర జేఏసీ కన్వీనర్‌ ఎండీ మౌలానా డిమాండ్‌ చేశారు. సిద్దిపేట ఆర్టీసీ డిపో ఎదుట జేఏసీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ మల్లేశం, నాయకులు రవీందర్‌, రాజేందర్‌, రాజయ్య, పరశురాములు, హేమలత తదితరులు పాల్గొన్నారు.

దుబ్బాక డిపో ఎదుట

దుబ్బాక: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ బుధవారం దుబ్బాక బస్‌డిపో ఎదుట కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

అసంక్రమిత వ్యాధుల నివారణకు చర్యలు

కొండపాక(గజ్వేల్‌): అసంక్రమిత వ్యాధుల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని డీఎంహెచ్‌ఓ ధన్‌రాజ్‌ తెలిపారు. కొండపాక మండలం దుద్దెడలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆరోగ్య సంబంధిత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శివకుమార్‌, పంచాయతీ కార్యదర్శి చక్రపాణి, డాక్టర్‌ వినోద్‌, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌ బాబ్జీ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మహేందర్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్‌ శ్రీకాంత్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement