పద్మశాలీల సంక్షేమం మరిచిన సర్కార్‌ | - | Sakshi
Sakshi News home page

పద్మశాలీల సంక్షేమం మరిచిన సర్కార్‌

Apr 2 2026 12:06 PM | Updated on Apr 2 2026 12:06 PM

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలీల సంక్షేమాన్ని విస్మరించిందని, వారికి అన్ని రకాల ప్రభుత్వ పథకాలను నిలిపివేసిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో 50 మంది పద్మశాలి మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సంఘంలో సమాజ శ్రేయస్సుకు పాటు పడటంలో పద్మశాలి సమాజం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వృత్తిపై ఆధారపడే వారిని అన్ని విధాలుగా ఆదుకున్నామని, పద్మ శాలీలకు చేనేత బంధు వంటి ఎన్నో పథకాలతో సహాయం చేశామన్నారు. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అన్ని కులాలకు అన్ని రకాల బంధులు బంద్‌ పెట్టిందన్నారు. గతంలో పద్మశాలీలకు 50 కుట్టు మిషన్లు, ఇప్పుడు మరో 50 అందిస్తున్నానన్నారు. రూ.75లక్షలతో పద్మశాలి భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కస్తూరి సతీష్‌, ప్రచార కార్యదర్శి ముదిగొండ శ్రీనివాస్‌, జోగు భిక్షపతి, మల్లేశం, దయాసాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు

మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement