నర్సాపూర్‌లో ఉద్రిక్తత
నర్సాపూర్: మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని 10, 11 వార్డులకు చెందిన బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ మొదలై పెద్దగా కావడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. కాగా అదే రాత్రి పట్టణంలోని 4, 5 వార్డులలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరగగా, పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు. కాగా బుధవారం పోలింగ్ ప్రారంభమైన అనంతరం 15వ వార్డుకు చెందిన బీజేపీ నాయకుడు ఆంజనేయులుగౌడ్, బీఆర్‌ఎస్ నాయకుడు భిక్షపతిలతో పాటు వారి అనుచరుల మధ్య ఘర్షణ జరిగింది. అలాగే 8వ వార్డులో గొడవ జరగగా పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు.


