సైనిక దుస్తులతో వచ్చి.. బోధించి
బెజ్జంకి(సిద్దిపేట): స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఆంగ్ల ఉపాధ్యాయుడు ప్రవీణ్ సైనిక దుస్తులతో వచ్చి బోధించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాసిన ‘హోమ్ దే బ్రౌట్ హర్ వారియర్ డెడ్’ అనే పద్యాన్ని స్కిట్ రూపంలో బోధించారు. (యుద్ధంలో చనిపోయిన భర్త మృతదేహాన్ని చూసి నిశ్శబ్దంగా ఉండిపోవడం.. తన బిడ్డ కోసం బతకాలనే ఆశతో కన్నీరు పెట్టడం ఈ పద్యం సారాంశం.) పాఠశాలలో సోమవారం జరిగిన కాంప్లెక్స్ సమావేశం సందర్భంగా బోధించి ఆయన మాట్లాడారు. విద్యార్థులకు అభ్యాసంపై ఆసక్తి పెంచాలనే ఇలాంటి స్కిట్‌లను బోధిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ను ఎంఈఓ మహతిలక్ష్మి, హెచ్‌ఎం శ్రీరాములు అభినందించారు.


